వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘దంతి’ అంటే ఏనుగు అనే అర్థం. వినాయకు డన్న అర్థం లేదు. ‘అలసితె గణపతీ’ అందామా? ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘మున్గుదురు+అందరి’ అని విసంధిగా వ్రాసారు. ‘మున్గెదరె యందరి’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘నీటిలోపల’ అనండి. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘జలధిలా’ అనడం సాధువు కాదు. ‘జలధియై’ అనండి. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘...నొనరించి యక్కట’ అనండి. ***** ఊకదంపుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పంచ భూతము లందున నంచితముగ
రిప్లయితొలగించండికలియు మహనీయు లైనను కడకు ననెడి
మహిత సత్యమ్ము జాటుచు మహిని జరుగు
నీనిమజ్జనమును జూడ నెమ్మి గాదె!!!
అందరు నైకమత్యముననాదర ణంబున జాతులన్నియున్
రిప్లయితొలగించండిపందెము వేసినట్లు తమపట్టునుబెంచి నిమజ్జ నంబునన్
ముందుగ ముఖ్యులై జరుప?మూర్ఖత మాన్పుగణేషు డన్న ఆ
నందము నందు మున్గుదురు |అందరిబాధ్యతలన్నరీతిగా
రిప్లయితొలగించండిచిత్ర మయ్యది జూడగ జిన్న పెద్ద
లంద ఱచ్చట గుమిగూడి యందముగను
నీటి లోనన గణపతి నిబ్రమ దమున
ముంచ నుద్యుక్తు లయ్యిరి మూర్తి ! చూడు
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి కవి మిత్రులకు నమస్కరిస్తు
అఖిల భక్తజనుల పూజ
ల౦దు కొనుచు
నిలను దేదీప్యమానమై
వెలుగు నొ౦ది
నేడు నీ పిన-తలి చల్లని
యొడి లోన
కరగి పోవ. గణేశ్వరా
కదలి తౌర. !!
సాగుచుండ్రి జనులు సంతోష జలధిలా
రిప్లయితొలగించండిబొజ్జదేవరగొని మజ్జ నమ్ము
సలుపు కాంక్షతోడ సాగరమ్ము కడకు
చెప్పతరమె స్వామి గొప్పతనము
భక్తి యతిశ యిం పగఁ దమ
రిప్లయితొలగించండిశక్తి గొలది పూజలన్ని శాస్త్రపు రీతిన్
రక్తి నొనరించి నక్కట
ముక్తుని జేయగ తటాక మున గూడి రటన్
నిత్య పూజ లన్ని నియమానుసారము
రిప్లయితొలగించండిసలుప లేక జనులు సాగనంపు
పర్వ మద్దె పెద్ద పండువగా మారెఁ
గాంచుడిద్దియె కలికాల మహిమ.
మీయందంచిత భక్తితత్పరతచే మేమిచ్చు భోజ్యంబులన్ మాయాథిత్యములన్ గ్రహించితివి ప్రేమన్ మమ్ములన్ బ్రోచితే
రిప్లయితొలగించండిమాయాతీతుడునార్త రక్షణకళామాన్యుండు నీవే లస
త్స్వాయంభూద్భవ కాణిపాక గణనాథా నిన్ను నే కొల్చెదన్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దంతి’ అంటే ఏనుగు అనే అర్థం. వినాయకు డన్న అర్థం లేదు. ‘అలసితె గణపతీ’ అందామా?
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మున్గుదురు+అందరి’ అని విసంధిగా వ్రాసారు. ‘మున్గెదరె యందరి’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నీటిలోపల’ అనండి.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘జలధిలా’ అనడం సాధువు కాదు. ‘జలధియై’ అనండి.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...నొనరించి యక్కట’ అనండి.
*****
ఊకదంపుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిసజ్జన జాతిని బ్రోచుచు
ముజ్జగముల నేలుచుండు మూషికరథుడౌ
యొజ్జ గనేశుని గొలచుచు
మజ్జన మొనరించుచుండ్రి మమకారముతోన్
సేమమ్ము నీయ జేయగ
రిప్లయితొలగించండికామాక్షీసుతుని చవితి కనువిందాయెన్!
ప్రేమగ గంగను జేర్చగ
ద్వైమాత్రేయుడను పేరు దక్కెను తనకున్ !
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిశ్రీగణనాథునిఁ గొలిచితి
మేగఁగ వలె స్వీయనిలయ మిప్పుడటంచున్
వేగమె నిమజ్జనమ్మును
సాగరమునఁ జేయఁ గోరి సాఁగ నిడి రటన్!
చవతి నాడు పుట్టె చక్కని గణపయ్య
రిప్లయితొలగించండికుక్షి నిండ దినియె కుడుము లెన్నొ
వాడ వాడలందు వాసిగ కొలువుండి
యరుగ చుండె తాను నమ్మ కడకు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.