25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కవిమిత్రుని కానుక

iBalliBall Slide 3G 1026-Q18 tablet with 10.10-inch 600x1024 display powered by 1.3GHz processor alongside 1GB RAM and 5-megapixel rear camera.

          పదిరోజుల క్రితం ఒక కవిమిత్రుడు నాకు ఫోన్ చేసి “గురువు గారూ! ఈమధ్య మీరు తరచూ ప్రయాణాలలో ఉండి మా పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోతున్నారు కదా! నేను మీకొక 9 అంగుళాల టాబ్‍లెట్ పంపిస్తున్నాను. దానితో మీరు ఎక్కడున్నా బ్లాగును చూడవచ్చు. మా పద్యాలను సమీక్షించవచ్చు” అన్నారు. నా అభ్యంతరాలన్నిటినీ పక్కకు పెట్టి “ఇది నే నొక్కడినే చేయటం లేదు. పద్యాలను వ్రాయకున్నా మన బ్లాగును తప్పకుండా చూసే మరో ఇద్దరు నా స్నేహితులు కూడా కలిసారు. మీరు కాదనకండి” అనికూడా చెప్పారు. 
        ఐదు రోజుల క్రితం ఆ మిత్రుడు మళ్ళీ ఫోన్ చేసి “గురువు గారూ! ట్యాబ్‍లెట్ పంపడం లేదు. నేను హైదరాబాదు వస్తున్నాను. మీరు అక్కడ నన్ను కలిస్తే మీకు నచ్చిన ట్యాబ్‍లెట్ తీసుకోవచ్చు” అన్నారు. 
      వారు మొన్న మంగళవారం నాడు నన్ను సికింద్రాబాద్ చెన్నై (షినాయ్?) ట్రేడింగ్ సెంటర్ దగ్గరికి రమ్మన్నారు. నాకు టాబ్‍లెట్ల గురించి తెలియదు కనుక నా వెంట నా మనుమణ్ణి తీసుకువెళ్ళాను. వాడు టాబ్‍లెట్లను పరిశీలించి చివరికి ‘ibaal slide' తీసుకొమ్మన్నాడు. అది 10.1 అంగుళాల నిడివి ఉండి, ఉత్తమ సాంకేతిక సౌకర్యాలున్నది. కవిమిత్రుడు అనుకున్నది పదివేలు, కాని అది పదకొండు వేలు.  ఐనా మొత్తం తానే చెల్లించి ఆ టాబ్లెట్‍ను నాకు కొనిచ్చారు.
              తన గురించి కాని, తాను టాబ్లెట్ కొనిచ్చిన విషయం కాని బ్లాగులో ప్రస్తావించవద్దని కోరారు. అందుకే రెండు రోజులు ఆగాను. కాని నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. 
      ఆ కవిమిత్రునకు, వారి స్నేహితులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భగవంతుడు వారికి సుఖసంతోషాలను, శుభసంపదలను, ఆయురారోగ్యాలను, సర్వతోముఖాభివృద్ధిని ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. స్వస్తి!

12 కామెంట్‌లు:

 1. గురువు గారికి అభినందనలు
  సాహితీమిత్రులు సాహిత్యాభిమాని అయిన అజ్ఞాత మిత్రుల ఔదార్యము ప్రశంసనీయము ....వారికి ప్రత్యేక ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 2. గురువుగారికి వందనములు.
  ఇందరి యభిమానాని చూరగొన్న మీ వ్యక్తిత్వము కవుతా నపుణ్యములు బహుదా ప్రశంసనీయములు.

  గురువుగారికి టాబ్లెట్ ను బహూజరించిన కవిమిత్ర బృందానికి నా కృతజ్ఞతాభినందనలు.

  వందనములు కవిమిత్రుల
  బృందమునకు గురువు గారి ప్రియతమ సేవా
  నందులకు సుకవితా ని
  ష్యందులకున్ సాహితీ విశారదతతికిన్

  రిప్లయితొలగించండి

 3. మిత్రు డొక్కడు ప్రేమతో చిత్ర మైన
  టా బ్లెటు నునీయ సంతసంబ బ్బె మామ
  నంబునకు నార్య ! మఱి వందనంబు జేతు
  వంద లాదిగ నతనికి కంది వర్య !

  రిప్లయితొలగించండి
 4. మా ఆరోగ్యము కోసం మీకు " టాబ్లెట్ " నిచ్చిన డాక్టర్ (పండితు) లకు ధన్యవాదములు మరియు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. గురువు గారు ! టాబ్లెట్ బహు చూడముచ్చటగా ఉన్నది..ఆ కవిమిత్రులకు వందనములు

  రిప్లయితొలగించండి
 6. గురువు గారు ! టాబ్లెట్ బహు చూడముచ్చటగా ఉన్నది..ఆ కవిమిత్రులకు వందనములు

  రిప్లయితొలగించండి
 7. నమస్కారములు
  మీ యోగక్షేమములను కోరుకునే ఇందరి ఆదరాభి మానుల అండ దండలు మీకుండగా మీ ఆయురారోగ్యములు ద్విగుణీ కృతములు కాగలవని దీవించి అక్క .
  టాబ్లెట్టును అందించిన మహాను బావునకు శిరసాభి శత వందనములు .

  రిప్లయితొలగించండి
 8. Tab చాలా బాగుంది గురువుగారు... ఇది మీకు ఇచ్చిన కవిమిత్రులకు ధన్యవాదములు..

  రిప్లయితొలగించండి
 9. మిత్రులు శంకరయ్యగారూ! మీ పట్ల ఆ కవిమిత్రులకు గల ఆదరాభిమానములు, ప్రేమానురాగములు అంతటివి! ఎంతైనను మీరు ధన్యులు! మీరు శంకరాభరణం బ్లాగు మూలమున చేయు సాహితీ సేవకు సార్థకత లభించి, మీ గురుత్వమును హిమవన్నగోన్నతమునకుం దీసికొనిపోయినది. మీకు నా శుభాభినందనలు!

  రిప్లయితొలగించండి