4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


11 కామెంట్‌లు:

  1. అజ్ఞానమును బాపి విజ్ఞానమును బెంచి
    ............ ప్రజ్ఞాతములుగాగ బరగఁ జేసె
    ద్వేషాదిభావముల్ విఛ్ఛిన్నమొనరించి
    ........... ప్రేమానురాగమ్ము పెంపుజేసె
    నసమర్థ భావంబులడుగంటగాజేసి
    ........... కార్యసాధకులంచు ధైర్యమొసఁగె
    కాఠిన్యమును ద్రుంచె గౌరవంబును బెంచె
    ........... జీవితాశయమందజేసె గాచె

    నట్టిమహనీయ గణణీయులగు బుధాళి
    దివ్యపాదాబ్జముల సేవ స్థిరముగాగ
    చేయగలిగిన చాలునీ జీవితమున
    నట్టిగురువుకు నర్పింతునతుల నతులు.

    రిప్లయితొలగించండి
  2. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    నా సెల్ ఫోన్ నుండి బ్లాగులో వ్యాఖ్యలు పోస్ట్ చేయగలుగుతున్నాను. కాని క్రొత్త పోస్ట్ పెట్టగలనో లేదో పరీక్షించాలనుకున్నాను. తీరా ఏం పోస్ట్ చేయాలో తోచక ‘ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’ అని పెట్టాను. ఆ ప్రయత్నం సఫలమయింది. అసలైన ఉపాధ్యాయ దినోత్సవం రేపు కదా!

    రిప్లయితొలగించండి
  3. గురు బ్రహ్మలకు వందనం అభివందనం
    **********************************

    ఏజాతి రాణించె ఎమ్మహాత్ము వలన?

    ఏజాతి పులకించె నెవనిచేత ?

    ఏజాతి చేసెనో యెనలేని సేవల ?

    ఏజాతి విలసిల్లె నివ్వసుధను ?

    ఏజాతి బోధనల్ ఇజ్జాతి ప్రగతికి ?

    బంగారు బాటలై పరిఢ విల్లె ?

    ఏజాతి కాపాడె ఇజ్జాతి సంస్కృతుల్?

    జాతి రతనాల సృజియించు జాణ యితడు,

    జాతి యావత్తు గర్వించు ఖ్యాతి దెచ్చె ,

    అట్టి గురుబ్రహ్మ కులమునే యభినుతింతు ,

    జాతి వెలిగించు గురులకు జయము జయము.

    విద్వాన్,డాక్టర్ . మూలే రామముని రెడ్ది ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు "ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!"

    ఇది యొకనాఁటి రాష్ట్రపతి కిష్ట మొసంగిన యట్టి దివ్యమౌ
    సుదినము! తత్త్వశాస్త్ర ఘన శోభిత కీర్తి మహత్త్వపూర్ణ స
    ద్వదనుఁడు పుట్టినట్టి గురు పర్వదినమ్ము! గురూత్తమాళికిన్‍
    సదమల దివ్య సత్కృతుల సన్నుతు లిచ్చెడి వేళయే కదా!!

    రిప్లయితొలగించండి

  5. శ్రీగురుభ్యోనమ:

    గీతామృతమును పంచిన
    నీ తత్వమె మేటి యౌను నేటికి జూడన్
    నీతిని నేర్పిన నేతవు
    జాతిని నడిపించినావు జగతికి గురువై

    రిప్లయితొలగించండి
  6. గురువున కిత్తును నతులను
    గురువుయె కద తల్లి దండ్రి గురువుయె దైవం
    గురువునె మఱి పూజించిన
    గురువుయె యిక నిచ్చు మనకు గూరిమి ,దెలివిన్

    రిప్లయితొలగించండి
  7. శంకరుడు మొద లుకొనుచు శంక రార్యు
    లనడుమగలుగు గురువు ల లహరి నుండి
    నాదు గురుపరం పరలకు నతుల నిడుదు
    శతము కొలదిని భక్తిని సవిన యముగ

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    కృష్ణ జయంతికి రాధా
    కృష్ణుని నర్చింతు నుతుల గీర్తనములతో
    నుష్ణీషమునున్ దాల్చగ
    విష్ణువు తానవతరించె విశ్వగురుండై

    (నావిష్ణు: పృథ్వీపతి:)

    రిప్లయితొలగించండి
  9. గురుదేవులకు ప్రణమిల్లుతూ...


    గురుపూజోత్సవ దినమున
    గురుదేవో భవ యనుచును కూరిమితోడన్
    గురువులను గౌరవించుట
    గురుతర భాద్యతగ నెఱిగి గొలువుము పాఠీ!!!

    రిప్లయితొలగించండి
  10. భ్రమలు తొలగించు విద్యల
    రమణీయముగన్ త్రిమూర్తి లక్షణయుతుడై
    కమనీయపు బాల్యమ్మున
    ప్రమోదమున్ గూర్చు గురువు, ప్రార్థించుమురా!

    రిప్లయితొలగించండి