2, సెప్టెంబర్ 2015, బుధవారం

పద్య రచన - 996

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

  1. సడి జేయక రారండిటు
    కడు ప్రీతిగ తినగనెంచి కారపు దినుసుల్
    విడువరు మసాల రుచులగు
    వడలండి విదొరక వెచట బ్లాగున కంటెన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ఘుమఘుమల మసాల గుప్పించి వండిన
      వడలు రుచికరంపు వంటకమ్ము
      కంటి కింపొసంగు పంటికింపు నొసగు
      బలము నిచ్చునట్టి వడల ననివె

      తొలగించండి

  4. దోరగ వేచిన వడలవి
    నోరూ రెను వాటి జూడ నోముల పద్మా !
    బేరము లాడక నాకై
    కారము గాలేని దొకటి క్రచ్చర దెమ్మా !

    రిప్లయితొలగించండి
  5. శ్రీ కంది శంకరయ్యగురువర్యులకు వందనాలతో
    ఉత్పల మాలయందు తేటగీతి ప్రయత్నము
    చూడ మాసాలతో “వడలు మక్కువ నింపగ వాలి యుండెగా
    జోడుగ చెట్నితో “దినగ చోద్యముగారుచిదెల్పు చుండ?ఆ
    వేడి గలట్టివే “మనసు వేగమునన్ జను మౌన కోర్కెయే
    నాడగ నాశగా”దలచ ఆత్రుత జూపుట ధర్మమేగదా.

    రిప్లయితొలగించండి
  6. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    సంధిదోషాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పద్యానికి నా సవరణ.....
    ఘుమఘుమల మసాల గుప్పించి వండిన
    వడలు రుచికరంపు వంటకమ్ము
    కంటి కిం పొసంగు పంటికింపు నొసంగు
    బలము నిచ్చునట్టి వడ లన నివె.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ గీత గర్భిత ఉత్పలమాల చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    25 ఏళ్ళ క్రితం నేను చందస్సు నేర్చుకొని పద్యములు వ్రాయాలనే ప్రయత్నంచేస్తున్నప్పుడు, మా ఊరిలో "సూరే" అని ఇంటిపేరు గలవారు ప్రతిరోజూ సాయయంత్రము మిరపకాయ బజ్జీలు, వడలు చేసి అమ్మేవారు. అప్పుడు వ్రాసిన పద్యము

    సూరేవారంగడి యది
    రారమ్మని పిలచుచుండ రయమున రారే
    సూరీడు పడమరేగిన
    నోరూరగ వడలు గాచి నోటికి నీయన్

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతి శాస్త్రి గారూ,
    అప్పటికే చక్కని ధార అలవడింది. బాగుంది మీ పద్యం.అభినందనలు.

    రిప్లయితొలగించండి

  9. శనగ పిండితోడ నుల్లి చాలినంత నల్లమున్
    ఘనము గాను పచ్చిమిర్చి కాస్త తెల్లగడ్డయున్
    యెనిపి నూనెలోనవైచి ఎఱ్ఱగాను వేచినన్
    జను మసాల గారెలగును,చక్కని తినుబండముల్!!!


    వరమగు మసాల గారెలు
    కరకరమను నోటబెట్ట కమ్మని రుచితో
    మరిమరి తినుచుంద్రు జనులు
    మురియుచు సాయంసమయము ముచ్చట దీరన్!!!

    రిప్లయితొలగించండి
  10. కుడుముల తో పోటీ బడ
    వడలను నాశించు వారి వంతే బెరుగున్
    పడతుల కిష్టము తినుటకు
    అడుగులు తడబడక వెళ్లు ఆనందమునన్.

    రిప్లయితొలగించండి

  11. పచ్చి సెనగ పప్పు తెచ్చి నాన బెట్టి
    కచ్చ పచ్చ రుబ్బి కలిపి యుప్పు
    మిర్చియుల్లి చెక్కు చేర్చి వేయి౦చగ
    వేడివేడి వడలు వి౦దొనర్చు

    రిప్లయితొలగించండి
  12. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    నా సూచన పాటించి సవరించినందుకు సంతోషం!
    *****
    శైలజ గారూ,
    మీ పద్యాలు రుచికరంగా ఉన్నాయి. అభినందనలు
    ‘...యెనిపి’...? ఒకవేళ అది ‘ఎనిపి’ అయితే అటువంటి పదం నిఘంటువులో దొరకలేదు. అంతేకాదు యడాగమం రాదు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. 1ఆ.వె:పెసర సెనగ కంది బేడల నుకలిపి
    నాన బోసి రుబ్బి నాణ్యముగను
    ఉల్లి పచ్చిమిర్చి యుప్పును చేర్చుచు
    వడలు చేయ తినరె బాగు యనుచు.
    2.ఆ.వె:పప్పు లెల్లరుబ్బి వడలుగా జేయుచు
    అల్లము మిరపలను యుల్లి తోడ
    కలిపి యుప్పు వేసి కమ్మగా వండిన
    తినని వారు యెవరు దేశ మందు.
    3కం:ఆహా యేమి రుచి యనుచు
    బాహాటముగా పొగడుచు వడలన్ మెచ్చన్
    మోహము నగాంచు చెల్లరు
    పాహారంబుగ సకలురు పంచుకు తినరే.

    రిప్లయితొలగించండి
  14. ధన్యవాదములు గురువుగారు...ఎనుపు అన్న పదం ఆంధ్రభారతి నిఘంటువులోవుంది..సాధారణంగా మనం ఇంట్లోకూడా పప్పు ఎనిపీసేను అని మాటల్లో వాడతాముకదా, అని అది ఎంచుకున్నాను... తప్పయితే మన్నించండి.... యెనిపి కాకుండా, నెనిపి అంటే సరియేనంటారా..వివరించ ప్రార్ధన..

    ఎనుపు : తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 Report an error about this Word-Meaning
    చూ. ఎనుచు ప్రేరణార్థకం.
    స.క్రి.

    కలుపు, కలియు బెట్టు.

    రిప్లయితొలగించండి
  15. పప్పుల రకముల రుబ్బుచు
    గొప్పనగు మసాలఁ జేర్చ కుదిరిన పిండి
    న్నప్పుడె గాల్చు వడలతో
    చప్పిడి కూడైన గొంతు చప్పున జారున్.

    రిప్లయితొలగించండి
  16. ఎనుపు అంటే ఉడికించిన పప్పును మెత్తగా చేయటం. మసాలా వడలకు కచ్చా పచ్చాగా పిండిని రుబ్బుతారు కాని ఎనుపరు.

    రిప్లయితొలగించండి
  17. పచ్చి మిర్చిలోన శనగపప్పు పొదిన
    నుల్లిపాయలు కొతిమీర నుప్పు చేర్చి
    రోటిలోవేసి బిరుసుగా రుబ్బి తీసి
    చేతితోనొక్కి వడలను చేసి చక్క
    గాను నూనెలో దేవిన, కాంచ వచ్చు
    మధురమగు మసాల వడలు మనగృహమున

    రిప్లయితొలగించండి