16, సెప్టెంబర్ 2015, బుధవారం

పద్య రచన - 1009

కవిమిత్రులారా,
“వలదు వలదన్న వినక యీ పను లొనర్చి.....”
ఇది తేటగీతి మొదటిపాదం. 
దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి.

25 కామెంట్‌లు:

  1. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    జనుల చైతన్యులను చేయ సాహసించి
    వారిచేతనె వెలివేయ బడుటకన్న
    కొఱవితోడను దల గోకికొనుట మేలు

    రిప్లయితొలగించండి
  2. వలదు వలదన్న వినక యీపను లొనర్చి
    మాటి మాటికి విసిగించి మభ్య పెడుచు
    చిత్త మేరీతి తెలుపక విత్త మనక
    కొఱవి తోడను దలగోకి కొనుట మేలు

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    (తన మాట వినక సీతనుఁ జెఱపట్టిన రావణునితో విభీషణుఁడు పలికిన పలుకులు)

    వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
    మాత సీతను దెచ్చి, రామయ్య కీవు
    శత్రుఁ డైతివి, యగ్రజా, ౘాలు నింక!
    సీత నిడి, రాముతో నీవు స్నేహముఁ గని,
    వంశ నాశమ్ముఁ గాకుండ వఱలు మయ్య!!

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మభ్యపెడుచు > మభ్యపెట్టి’
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. భీముఁడు యుద్ధానంతరము దుర్యోధనుడితో.........

    వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    కోరి చావును కొని తెచ్చుకొంటివికద
    పాండవులతోడ వైరమ్ము ప్రథమ తప్పి
    దము యటంచునెఱుంగుమా దైత్యబుద్ధి

    రిప్లయితొలగించండి
  6. వలదువలదన్నవినక యీపనులొనర్చి
    ఋణపు గ్రస్తుఁజేసితివయ్య రూడిగాను
    మరచిపోలేను నీమేలు మాన్య చరిత
    అందుకొనుమయ్య సతమునా వందనములు

    రిప్లయితొలగించండి
  7. వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
    బాధ పెట్టెద వేలనో బాల కృష్ణ !
    పాలు వెన్నయు మనయింట చాలనున్న
    నిరుగు పొరుగుల నిండ్లకు పరుగులేల
    చాలు చాలిక యికనిన్ను మేలు గాను
    కట్టి వేయుదు రోటికి గట్టి గాను
    యనుచు బంధించె త్రాటితో నాయశోద
    బ్రహ్మ మతడని దెలియక బాలుడనుచు
    చిన్ని కృష్ణుని లీలల నెన్న తరమె !!!!

    రిప్లయితొలగించండి
  8. హిరణ్యకశ్యపుడు తన కొడుకైన ప్రహ్లాదునితో పలికిన పలుకులుగా నూహించిన పద్యమిది

    వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
    ఆగ్రహమునకు లోనైతి వర్భకుడవు
    స్మరణఁ జాలించు మికనైన హరిని మరిచి
    నన్ను శరణువేడినఁ జాలు నిన్ను గాతు.

    రిప్లయితొలగించండి
  9. “వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    కన్నె వలపుల గాజేసి మిన్నకుండి
    విడచి బృందావనమ్మును వీడి మమ్ము
    మధుర కేగుట న్యాయమా మధురహృదయ!

    రిప్లయితొలగించండి
  10. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    ధనము పొలములు మానమ్ము దరలి పోవ
    బ్రతుకు భారమయ్యె గదయ్య వలదు మనకు
    పేక యాటలు గుఱ్ఱపు వేడుకలును

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తప్పిదము+అటంచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పి| దమ్మటంచును నెఱుగుమా’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ఇంతకీ వలదన్నా చేసిన పనులేమిటి? చేసిందెవరు? ఋణగ్రస్తు డయిందెవరు? సందిగ్ధార్థం... పద్యం నేపథ్యాన్ని కూడ తెలిపితే బాగుంటుంది.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘గట్టిగాను+అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘గట్టిగా న|టంచు...’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులందరకు నమస్కారములు.

    సీతాపహరణకు సహాయపడుమనికోరగ రావణాసురునితో మారీచుడన్న మాటలు.
    వలదు వలదన్న వినకనీపనులొనర్చి,
    చేటుకోరుదువెందుకు;చెప్పుచుంటి
    రావణాసుర వినుమిది, రాముసతిని
    పడతిసీతనుఁదెచ్చుట పాడిఁగాదు.

    రిప్లయితొలగించండి
  13. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    తల్లి చేతికి దొరకక దాగినావ,
    చిన్ని కన్నయ్య! నా తండ్రి! చిలిపి చేష్ట
    లింక మాని రావయ్య, నా వంకకిటుల.

    రిప్లయితొలగించండి
  14. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    తల్లి చేతికి దొరకక దాగినావ,
    చిన్ని కన్నయ్య! నా తండ్రి! చిలిపి చేష్ట
    లింక మాని రావయ్య, నా వంకకిటుల.

    రిప్లయితొలగించండి
  15. శ్రీగురుభ్యోనమః

    వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    నిందితుడనైతి నిజముగ నిష్ఠురముగ
    తనకు మాలిన ధర్మము ధరణిలోన
    చేటు కలిగించు సర్పమై కాటు వేయు.

    రిప్లయితొలగించండి

  16. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    నీవె నీవుగానర్పించి నావు పూవ!
    వాడిపోయిన నీవైపు జూడరాడు
    వాడు షట్పాదరాజు నీ గోడు వినడు

    రిప్లయితొలగించండి
  17. భూసారపు నర్సయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వినక’ కళ. కనుక ‘వినక యీ పనులు...’ అవుతుంది.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
    రాష్ట్ర విభజన నష్టమ్ము ప్రజలు దెలిసి
    దెబ్బ తీయంగ తలచినసదిగులు కన్న
    కొఱవి తోడను దల గోకికొనుట మేలు!

    రిప్లయితొలగించండి
  19. వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
    చింత చేయుచు నుండుట వింత గాదె
    కాన నవసర పడినచో కార్య భంగ
    మగును నాత్రపడక జేయ నందు శుభము.

    రిప్లయితొలగించండి
  20. వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
    ముందు జాగ్రత్త సూచనల్ నందుకొనక
    అహము నందున జేసెడి యప్పు బెరుగ
    ఆత్మ హత్యను నాశించ నధమమేగ?

    రిప్లయితొలగించండి
  21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సూచన లందుకొనక, ...నధమమె గద’ అనండి.

    రిప్లయితొలగించండి
  22. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యాన్ని భూసారపు నర్సయ్య గారు విశేషంగా ప్రశంసించారు. మీ పద్యంలోని భావం వారిని ముగ్ధులను చేసిందన్నారు. భగవంతుడు తన ప్రేమను అందరికీ అందించడానికి తల్లి రూపాన్ని ధరించాడనీ, తల్లి మనసు తల్లికే తెలుస్తుంది కనుక మీరు తాదాత్మ్యతతో ఆ పద్యాన్ని రచించారనీ చెప్పారు. మీకు అభినందనలు తెలియజేయమన్నారు.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు,
    ఈ వ్యాఖ్యను ఇప్పుడే చూస్తున్నాను.
    సత్కవులు, తత్త్వసారం తెల్సినవారు అయిన భూసారపు నర్సయ్య గారి ఆత్మీయ ఆశీర్వాదములు నన్ను ధన్యురాలను చేశాయి. పద్యాలు వ్రాయగలుగుతున్నందుకు ఆధారం గురుదేవులైన మీ అపార కరుణాదృష్టి తప్ప మరేమీ కారణం కాదు. వలదు వలదన్న అనగానే యశోదమ్మే గుర్తుకు వచ్చిందంటే అది నా అదృష్టంగా భావించి వ్రాశాను.
    నమస్కారములతో
    లక్ష్మీదేవి.

    రిప్లయితొలగించండి
  24. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    కడకు భాజపా తోడను పడక వీడి
    తుడిచి పోయెద వీవుర ముడిచి తోక
    చంద్ర బాబిక చాలించు చింద్ర వంద్ర

    రిప్లయితొలగించండి


  25. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
    కలదు కలదని చెప్పుచు కందములకు
    చెలువముల నద్దుచు జిలేబి చెంగు చెంగు
    నలరె కవులకొలువులోన నవ్యమగుచు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి