30, సెప్టెంబర్ 2015, బుధవారం

పద్య రచన - 1020

కవిమిత్రులారా,
“ఇనుము సూదంటురాయికై యెగయునట్లు....”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

35 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
      పడతి పొంకాల గాంచినన్ పరవశించి
      పురుషు డాకర్షితుడు గాడె పుడమి యందు
      ప్రకృతి ధర్మమ్ము నెదురించు వాడెవండు?

      తొలగించండి
  2. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    దినకరుని చుట్టు ధరణితా దిరుగు నట్లు
    సంపదల్ గోరి మనుజుండు సంచరించి
    ధనము చుట్టును నిరతమ్ము తాను దిరుగు

    రిప్లయితొలగించండి
  3. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    సుదతి నాజూకు సుందర సోయ గములు
    పరవ శించక యున్నెతా పరమ శివుడు
    బ్రమ్మ కైనను దిరుగును రిమ్మ తెగులు

    రిప్లయితొలగించండి
  4. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘వాడు+ఎవడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వా డెవండు’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘బమ్మ కైనను’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    నాదు మనంబు నీపైనె నాటు కొనెను
    వేగ కావుమో మాధవా వేద వేద్య
    నిన్ను గాక నన్యుల వేడ నీరజాక్ష.

    2.ఇనుము సూదంటు రాయికై మొగయునట్లు
    బాల ప్రహ్లాదు డనయము వసుధ లోన
    హరిని ధ్యానించి సహించె యాతనెల్ల
    మురహరుని కొల్చి శీఘ్రమే ముక్తుడయ్యె.


    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యం రెండవపాదంలో గణదోషం. ‘నా మనంబు నీపైననె/ నాదు మనము నీపైననె...’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    ధూమకేతువున మిడుత దూకునట్లు
    మగువపై పురుషుల చూపు తగులుకొనును
    ప్రకృతి జన్య గుణంబది భరణిలోన

    రిప్లయితొలగించండి
  8. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    మేన క సొగసు జూచియు మిగుల వగలు
    జెంది యా విశ్వ మిత్రుడు చేరి దనను
    భంగ మొనరింప జేసెను దనత పసును

    రిప్లయితొలగించండి
  9. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    పూవుపై వ్రాలు భృoగమ్ము బోలుభంగి
    నీరుపల్లపు దిక్కున పారు తీరు
    సజ్జనుడు ధర్మపథమున సాగుచుండు !!!

    రిప్లయితొలగించండి

  10. శ్రీగురుభ్యోనమః

    ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    ప్రాణి కోర్కెల కొరకు తా బ్రాకులాడు
    బలము బలహీనతల్ సృష్టి బంధమాయె
    బలము కలిగిన వారికే కలిమి కలుగు

    రిప్లయితొలగించండి
  11. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    దీప శిఖిజేరు శలభమ్ము తీరు గాను
    ఎరను జూడగ పరుగిడు యెలుక రీతి
    పడుపు పడతికి శృంగారి వశుడు గాడె

    రిప్లయితొలగించండి
  12. ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    నినుని విడువక ధరియిత్రి యేగునట్లు
    కనిన వెన్వెంటనె సమస్య గరిమ గలుగు
    పూరణమ్మునుఁ జేయగ పొంగు మనము.

    రిప్లయితొలగించండి
  13. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు!
    ఈగ బెల్లము చుట్టును మూగు నట్లు!
    భ్రమరమది తేనెకై పూల వాలి నట్లు!
    పదవినంద నాయకుడహో! ప్రజల మ్రొక్కు!

    రిప్లయితొలగించండి

  14. ఇనుము సూదంటు రాయికై యెగయు నట్లు
    భార్య పొందుకై తపియించు భర్త యెపుడు
    క్రొత్త గాబెండ్లి యగుటన కోర్కె లుండు
    సహజ మయ్యది క్రొ త్త దౌ జంట కిలను

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘విశ్వామిత్రుడు’ అనవలసింది ‘విశ్వమిత్రుడు’ అన్నారు. అక్కడ ‘గాధితనయుడు’ అనండి.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్న్దది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పద్యరచన
    గురుమూర్తి ఆచారి

    ఇనుము సూద౦టురాయి
    పైకెగయు నట్లు

    సర్వసామాన్యముగ. మన
    స్వా౦త మెపుడు

    భాగ్యము కడకు సుళువుగ
    భ్రా౦త మగును

    కాని స౦పదలో శా౦తి
    కాన రాదు

    రిప్లయితొలగించండి
  17. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులందరకు నమస్కారములు.

    ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    దేశికేంద్రునికొరకునభ్యాసి వెతుకు;
    పూర్వజన్మసుకృతమగు పుణ్యమున్న
    దేశికునిజేరు; నెరవేరునాశయమ్ము.

    రిప్లయితొలగించండి
  19. భూసారపు నర్సయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  20. ఇనుము సూదంటు రాయికై ఎగయు నట్లు
    గ్రహములన్ని రవిని తిరుగాడునట్లు
    పగలు రేయికై ఆరాట పడిన యట్లు
    వయసు వలపును గోరుచు పరుగు లిడును

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    (హరినామస్మరణమ్ము మానుమని బోధించు తండ్రితోఁ బ్రహ్లాదుఁడు పలికిన సందర్భము)

    "ఇనుము సూదంటురాయికై యెగయునట్లు;
    చంచరీకమ్ము తేనెకై సమకొను విధి;
    ముక్తసంగుఁడు ముక్తికై పూను పగిది;
    నాదు మదికోరెఁ దండ్రి శ్రీనాథుఁ జేర!"


    రిప్లయితొలగించండి
  22. ఇనుము సూదంటు రాయికై యెగయు నటుల
    పద్యరచనను జేయగ నుద్యమించి
    శంకరార్యుల చలువతో సంతసముగ
    పట్టు వదలక నేర్చితి పద్యవిద్య!!!

    రిప్లయితొలగించండి
  23. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  24. హిరణ్యకశిపునితోఁ బ్రహ్లాదుఁ డాడిన మాటలు:

    "ఇనుము సూదంటు ఱాయికై యెగయు నటుల
    నా హృషీకేశు సన్నిధి నా విధమునఁ
    గఱఁగుచున్నది దైవయోగమునఁ జేసి,
    పఱఁగ నో తండ్రి! చిత్తంబు భ్రాంత మగుచు!!"

    రిప్లయితొలగించండి
  25. నిన్నటి పద్యరచన:

    చనుఁ బాలు ద్రాగు బిడ్డఁడు
    మనసు పడడె పాలఁ ద్రాగ? మడియించగ పూ
    తన చిన్ని కృష్ణు నొడిలో
    చనునందించ సురవైరి సర్వముఁ బీల్చెన్!

    రిప్లయితొలగించండి
  26. యవ్వనంబున మనసు సయ్యాటలందు
    రువ్వబోయెడిభావాలు రూపురేఖ
    ఇనుము సూదంటు రాయికైయెగయునట్లు
    తనువు తత్వమ్ము మారులేతపన చేత|

    రిప్లయితొలగించండి
  27. గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నిన్నటి శీర్షికకు మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. కవిమిత్రులు పద్యప్రారంభమన్నను, ఇచ్చిన పద్యపాదమును స్థానభ్రంశము చేయతగునా?

    రిప్లయితొలగించండి
  29. “ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    తెల్లవారిన దాదిగ నుల్లము మన
    శంకరాభరణము గన సలుపు పోరు
    నరయ పూరణపై నది యతుకుకొనును.

    రిప్లయితొలగించండి
  30. ఉమాదేవిగారూ 'నిన్ను గాక నన్యుల ' అన్నచోట "గాక యన్యుల" అని ఉండాలి. దానికి వ్యాకరణసూత్రాన్ని గురువుగారు చెప్తారు.

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ,
    _/\_
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మిస్సన్న గారి వ్యాఖ్యను గమనించారు కదా! ‘అక ప్రత్యయము అంతమందుండు అవ్యయము కళ’ అని సూత్రము. అది ద్రుతప్రకృతికము కాదు కనుక ‘నిన్ను గాక యన్యుల’ అనడమే సాధువు.

    రిప్లయితొలగించండి
  32. ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    కోడె దూడను వెంటాడు గోవు వోలె
    నొల్లి కూనను వెంటాడు పిల్లి వోలె
    శివుని వెంటాడు శైలజ శ్రీకరమున

    రిప్లయితొలగించండి


  33. ఇనుము సూదంటురాయికై యెగయునట్లు
    మనము శంకరాభరణ‌పు మధురిమలక
    ను దినమున్ ప్రాకు చుంటిమి నూత్న మైన
    కైపదములకెల్ల జిలేబి, కవితలల్ల !

    జిలేబి

    రిప్లయితొలగించండి