23, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణం - 1797 (కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.
(ప్రయాణంలో ఉండి పద్యరచన శీర్షిక ఇవ్వడం లేదు. మన్నించండి)

36 కామెంట్‌లు:

  1. తండ్రి యాత్మయె జనియించు తనయు డనగ
    నాదు గుండెలు నిండిన నంద నుండు
    నీదు వలపులు పండగ నీకు సుతుడు
    కోడలా నాపతియె నీకు కొడుకు గాదె

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. మనుమడై తనదు మగడు మరల పుట్టె
      ననుచు విశ్వసించిన యొక అతివ పలికె
      నిట్లు మురిపాలు పండించు నిట్టి శిశువు
      కోడలా నా పతియె, నీకు కొడుకు గాదె

      తొలగించండి
  3. అత్త యాలకించెను కోడలా గ్రహమున
    తనదు కొడుకును కోపింప తాళలేక
    బాధ తోడబలికెనిట్లు , బాలుడితడు
    కోడలా నా పతియె నీకు కొడుకు గాదె

    రిప్లయితొలగించండి
  4. పుత్రునకొక సుతుడుఁ బుట్ట భూరి గాను
    సంబ రాల్జేసె నొకయింతి సంతసమున
    కోడలా నాపతియె నీకు కొడుకు గాదె
    యనుచు పలుకుచు మురిసెనా యత్త యంత

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి నమస్కారం. పెద్దవారు చిన్న పిల్లలతో సమానం అవుతారన్న అభిప్రాయంలో నాకు చేతనయిన పూరణ చేశాను. పరిశీలించి తప్పులు చెప్పగలరు.

    బలము గల్గిన వయసున బరువు మోసి
    వయసు మేనికి సోకగ వడుపు తగ్గి
    మరపు మీరిపా పడయినీ మామ నేడు
    కోడలా నా పతియె, నీకు కొడుకు గాదె

    రిప్లయితొలగించండి
  6. కీలుగుర్రపు టాటలో క్రింది వారు
    కోడలా! నా పతియె, నీకు కొడుకు గాదె
    యుత్తరీయమున్ మెడఁజుట్టి యూపువాడు!
    పుపులకరింతలఁ దేలగా మునిగినారు
    కోపగించకు వారిపై కోమలాంగి!

    రిప్లయితొలగించండి

  7. మామయగునమ్మ మఱి నీకు మఱచి తీవ ?
    కోడలా! నాపతియె, నీకు కొడుకు గాదె
    సోమ శంకర నా ముండు సుచరి తుండు
    మఱపు వచ్చిన దోయమ్మ ! మందు వాడు

    రిప్లయితొలగించండి
  8. ముదమున మనుమడనియెత్తి ముద్దుఁ సేయఁ
    వలదు వలదంచు వారించు వనిత తోడ
    ఆగ్రహమ్మున వచియించె నత్త యిట్లు
    కోడలా నాపతియె నీకు కొడుకు గాదె.

    రిప్లయితొలగించండి
  9. మరణించిన తన భర్త తిరిగి తనకు మనవడిగ్ జన్మించాడని భావించి ఒక తల్లి కోడలితో పలికనట్లుగా
    తే.గీ:అల్ప యాయుష్కు డై పతి యస్త మింప
    వున్న నొక్క సుతుని రెప్ప వోలె పెంచి
    పెద్ద చేసి యుక్తుడవగ పెండ్లిఛెసి
    కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.

    రిప్లయితొలగించండి
  10. పలుకుదువు నా పతిని జేసి పలుచనగను
    నాలి కొంగును బట్టుక నాడునంచు
    నుండునే మామ నినువీడి యొక్కనాటి
    కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులందర నమస్కారములు.

    అమ్మా!సుభద్రగారు..మీభావనచాలా బాగున్నది.సంస్కారవంతమైనపూరణచేసినారు.

    రిప్లయితొలగించండి
  12. దక్ష యజ్ఞవాటిక యందు దక్షు శిరము
    తెగిపడ ప్రసూతి దక్షు సతి విలపించి
    వాణిఁ దలచి కడుఁ గలతఁ బలికె పద్మ
    కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.

    (పద్మ = లక్ష్మి , లచ్చి)

    రిప్లయితొలగించండి
  13. పద్యరచనలో తొలి అడుగులు వేస్తున్నదాన్ని, నాకు చేతనయిన పూరణ చేశాను. మీ ప్రశంస అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్..

    రిప్లయితొలగించండి

  14. శ్రీగురుభ్యోనమః

    మేనమామను పెండ్లాడి మీకు తోడి
    కోడలైతి, మీ పెనిమిటి గోడలు గద
    నేను, వరుసలన్ జూడుము నీవు, తోడి
    కోడలా! నా పతియె నీకు కొడుకు గాదె

    రిప్లయితొలగించండి
  15. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. భలే రాశారు సార్ శ్రీపతి శాస్త్రి గారు. మా అత్తగారు, మా పెద్దత్తగారు మేనత్తా మేనకొడళ్ళు. మీరు రాసిన ఈ పద్యం వారికి కూడా సరిపోతుంది..

    రిప్లయితొలగించండి
  17. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    వేదుల సుభద్ర గారూ,
    కరుణరసాన్ని ఆవిష్కరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'అల్ప+ఆయుష్కు'డన్నప్పుడు యడాగమం రాదు. 'వున్న' అనరాదు. తెలుగులో వు వూ వొ వో లతో మొదలయ్యే పదాలు లేవు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    సుభద్ర గారి పూరణను సముచితంగా ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రిగారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  18. నీ ముసలి మామ నాపతి,నేడు శక్తి
    హీనుడై పడినాడు మ౦చాన,యతని
    చంటి పాపగ తలపోసి సాకుమమ్మ
    కోడలా!నాపతియె నీకు కొడుకు గాదె

    రిప్లయితొలగించండి
  19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ ప్రశంస నాకు స్ఫూర్తి దాయకము. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  21. వేదుల సుభద్ర గారికి ధన్యవాదములు.
    ఈనాటి మీ పద్యము మిక్కిలి ప్రశంశనీయము.
    మమహామహులైన కొందరు కాకుండా, మనవంటి సామాన్య పద్యరచనాసక్తులను ఈ శంకరాభరణం బ్లాగు ఎంతో బాగ ప్రోత్సహిస్తున్నది. తొలుత కొన్ని తప్పులు చేస్తున్నా క్రమేపి సంతృప్తికరమైన పద్యములను వ్రాయగలుగుతున్నరు. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి కృషికి కృతజ్ఞతాభివందనములు.

    రిప్లయితొలగించండి
  22. వరుణ్ గాంధీ భార్య సోనియా గాంధీతో:-

    వేరు పార్టీలలోనున్న వారె యైన
    నొంటిలోనున్న యారక్తమొకటియేగ
    వరుణు ద్వేషించనేల యిందిరకు పెద్ద
    కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.

    రిప్లయితొలగించండి
  23. నాదు తల్లి అత్తమ్మకు నచ్చినట్టి
    కోడలా నాపతియె నీకు కొడుకు గాదె
    మంచికొడుకును గన్నట్టి మాన్య చరిత
    నీవునూరేండ్లు బ్రతుకుము నీటుగాను

    రిప్లయితొలగించండి
  24. కోడలా నాపతియె నీకు కొడుకు గాదె
    పోలికల జూడ నన్నియు పుణికి పుచ్చు
    కొనుచు మురిపించు చున్నాడు కోర్కె దీరె
    మనవడై మరలవగపు మాన్పి నాడె.

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    (సాగరునకు భార్యయైన గంగకుఁ జంద్రుఁడు, శివుఁడు నిద్దఱునుం గొడుకు వరుస యౌదురు. విష్ణు పాదోద్భవయైన గంగ పార్వతికిం గోడలు వరుస కావలెను. ఈ వరుసల ననుసరించి పార్వతి గంగతోఁ జమత్కరించు సందర్భము)

    "సాగరున కీవు వలచిన సతివి; మఱియుఁ
    జంద్రుఁడే నాకు మఱఁది; యా శంకరునకు
    నతఁడు తమ్ముఁడు; విష్ణువౌ నన్న నాకుఁ;
    గోడలా! నాదు పతి నీకుఁ గొడుకు గాదె!!"

    రిప్లయితొలగించండి
  26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    భర్త మరణించి మనుమడై భాగ్యమబ్బ
    నత్తకోడలితో నొక్క హాస్యమాడె
    నాదు భర్తయె మనుమడైనాడుగనుక
    కోడలా! నా పతియె నీకు కొడుకు గాదె.

    రిప్లయితొలగించండి
  27. .కలనుగాంచితి మీమామె |గాంచు వాడె
    కోడలా నాపతియె| నీకుకొడుకుగాదె
    సత్య మిదియైన నామది సంతసాన
    ముద్దు ముచ్చట సలుపగ వద్దజేర|

    రిప్లయితొలగించండి
  28. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ఆరంభం లోనే అందరి ప్రశంసల నందుకొనేలా పద్యాన్ని వ్రాసిన వేదుల సుభద్ర గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి