13, సెప్టెంబర్ 2015, ఆదివారం

పద్య రచన - 1007

కవిమిత్రులారా,
“వర మయ్యొ శాప మయ్యెను.....”
ఇది కందపద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి.

41 కామెంట్‌లు:

 1. వర మయ్యొ శాప మయ్యెను
  చరణములకు పూసె నొక్క సాధువు రసమున్
  మరి వచ్చితి హిమగిరికిన్
  తిరిగి పురమునకు వెడలగ తెలియదు పథమున్!!

  రిప్లయితొలగించండి
 2. వరమయ్యె శాపమయ్యెను
  వరగర్వముతో డశివుని వధియించచనన్
  హరిభస్మాసురునిఁదునుమె
  ధరియించి లతాంగిరూపు త్రక్ష్యునిఁగావన్

  రిప్లయితొలగించండి
 3. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వరమయ్యొ’ టైపాటు వల్ల ‘వరమయ్యె’ అయింది.

  రిప్లయితొలగించండి
 4. వరమయ్యె శాపమయ్యెను
  తరుణీమణి కుంతి కచట తనయుని గాంచన్
  కరచరణంబులు వణకన్
  అరమనమున వదిలె తాను నాపగ మందున్.

  రిప్లయితొలగించండి
 5. శ్రీగురుభ్యోనమః

  వర మయ్యొ శాప మయ్యెను
  గురుదేవున కనృతమాడ కుటిలపు యుక్తిన్
  మరచెను మంత్రము గర్ణుడు
  శరమును సంధించలేక చతికిలబడుచున్

  రిప్లయితొలగించండి
 6. వర మయ్యొ శాప మయ్యెను
  సరితకు తామెచ్చు సీటు సరగున వచ్చెన్
  మరియేమి ఘోరమోయన
  సరి ర్యాగింగుల వలననె చనిపోయెకదా !

  రిప్లయితొలగించండి
 7. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వర మయ్యొ’ను ‘వర మయ్యె’ అన్నారు. ‘వణకన్+అరమన’మని విసంధిగా వ్రాసారు. ‘కరచరణములు వడఁకఁ దా| నరమనమున..’ అనండి.
  ‘అరమనము’=?
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కుటిలపు టుక్తిన్’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. వరమయ్యొ శాపమయ్యెను
  దొరకెను గద మంత్రిపదవి దొర బాబులకున్
  స్థిరమగు నిధులను గానక
  పరిపాలన జేయు నెటుల ? పంకజనాభా!!!

  రిప్లయితొలగించండి
 9. కొడుకును రాజును చేయాలని తలచిన కైకేయి పరిస్థితిని ఊహించి వ్రాసిన పద్యము

  వరమయ్యొ శాపమయ్యెను
  భరతునికే రాజ్యమొసగ పంతము తోడన్
  వరమడిగిన నేమి ఫలము?
  విరాగిగన్ మారి పదవి వీడెన్ సుతుడున్

  రిప్లయితొలగించండి
 10. వర మయ్యొ శాప మయ్యెను
  నిరవుగ భస్మాసురుండు నీశుని వరము
  న్దిరమగు బుద్ధిని దలపక
  వర గర్వము జేత నతడు భస్మం బగుటన్

  రిప్లయితొలగించండి
 11. వరమయ్యొ శాపమయ్యెను
  తరుణీమణి కుంతి కచట తనయుని గాంచన్
  కరచరణంబులు వణకగ
  తరణియె సంగిన శిశువును దకమున వదిలెన్.
  దకము =గంగ,నీళ్ళు.
  నమస్కారములండీ సవరించి వ్రాశాను.పరిశీలించ గలరు.
  ఇంతకు మునుపు అరమనము అంటె అర్ద(అర)మనసు అని వూహించి వ్రాశాను.

  రిప్లయితొలగించండి
 12. వరమయ్యొ శాప మయ్యెను
  నరజాతిని మఱచు రావణాఖ్యునకును; దా
  మఱచిన జాతిని విష్ణుఁడు
  వరపుత్రుండై జనించి ప్రాణముఁ దీసెన్.

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱకు నమస్సులు!

  (గజాసు రోదరస్థుఁ డైన హరుని బహిర్గతుఁ జేయనెంచి హరి నందీశ్వరునిచే యాటలాడించి, వాని మెప్పులంది, శివుని బయటికి రప్పించు నెపమున వాని మరణమునకుం గారకులైన కథ నిట ననుసంధానించుకొనునది)

  "వర మయ్యొ, శాప మయ్యెను!
  హరు నుదరగతున్, బహిర్గ తాస్థత, నందీ
  శ్వరు హరి యాడింపఁగ, నే
  నురుగతి వరమిడి, మరణము నొందితి, నకటా!!"

  రిప్లయితొలగించండి
 14. వర మయ్యొ, శాప మయ్యెను!
  సురనారీమణుల మించు సుంద రహల్యా
  తరుణీమణికిఁ దానొక
  తఱి తప్పొప్పులుగనుటను తడబాటుబడన్

  రిప్లయితొలగించండి

 15. వరమయ్యొ శాప మయ్యెను
  కురిపించగ వాన క్రతువు కూర్మిని సేయన్
  వరమీయ వరుణ దేవుడు
  వరదలలో మునిగె పల్లె ప్రాంతము లెల్లన్

  రిప్లయితొలగించండి
 16. వరమయ్యొ శాపమయ్యెను
  నరునల నూర్వశి శపింప నటరాజయ్యెం
  బరికింప మహాత్ములనె
  వ్వరు హింసింప గలరయ్య వసుధం గలరే

  రిప్లయితొలగించండి

 17. 1.విరిసిన మల్లియ గంధము
  మరులను గొల్పేటి విద్య మహిమాన్వితమౌ
  వరమయ్యె|”శాపమయ్యెను
  తరుణుల తలయందునలుగు తల్లడ మందున్|
  2.వరమయ్యె|శాపమయ్యెను
  వరకట్నముకొరకు ,పెళ్లి వాంచలు బెరుగన్
  తరుణియు శక్తిగ మారగ
  తరుణమె నాయింటి యందు తగవులు బెరుగన్.
  3.తరచుగ చదువులు జదివియు
  మరచిన సంస్కార మందు మమతలు దరుగన్
  వరమయ్యె శాపమయ్యెను
  కరుణయు నసియించి నపుడు కల్మష మదితోన్

  రిప్లయితొలగించండి
 18. వరమయ్యొ శాపమయ్యెను
  స్పురదరుణప్రాభవుఁడగు పుత్రుని బడయన్
  మరి యా హిరణ్యకశిపున
  కరయఁగ ప్రహ్లాదుఁడంత హరి భక్తుండై

  రిప్లయితొలగించండి
 19. వరమయ్యొ శాపమయ్యెను
  విరివిగ యంత్రములు నేడు విధులను గూర్చన్
  కరువయ్యెను ఆరోగ్యము
  శరణయ్యెను ఆసుపత్రె చక్కెరబెరుగన్

  రిప్లయితొలగించండి
 20. వరమయ్యొ శాపమయ్యెను!
  పరాత్పరుని జయవిజయులు వైరముఁ గోరన్
  దరిజేరిన ముజ్జన్మల,
  గురుతుండగ లోక కంటకులనన్ జగమే!

  రిప్లయితొలగించండి
 21. వరమయ్యె శాపమయ్యెను
  భరతుడు జనియించె తనకు భాగ్య మటంచున్
  కరుణించని దుష్యంతుడు
  మొరవిన కనువిడచి వైచె మూర్కత్వమునన్

  రిప్లయితొలగించండి
 22. క్షమిచాలి
  చివరిపాదం " మొరవినకను విడువ నెంచె " అంటే సరిపోతుందేమొ "

  రిప్లయితొలగించండి
 23. వరమయ్యొ శాపమయ్యెనొ
  నరంగ నిచ్ఛామరణము నాభీష్మునకున్;
  చిరకాలము జీవించియు,
  శరశయ్యనుచేరిబాధ సైచుట చూడన్.

  రిప్లయితొలగించండి

 24. దురాశపరుని వర౦ శాప మగును కదా !

  వరమయ్యె శాపమయ్యెను :----

  " పరమేశా నేను తాకు ప్రతి వస్తువు బ౦

  గరు కావలె " నని కోరిన

  దురాశ. పరుడు తిన లేక. దు:ఖితు డయ్యెన్

  రిప్లయితొలగించండి
 25. పద్యరచన
  దురాశపరుని వర౦ శాప మగును కదా !

  వరమయ్యె శాపమయ్యెను :----

  " పరమేశా నేను తాకు ప్రతి వస్తువు బ౦

  గరు కావలె " నని కోరిన

  దురాశ. పరుడు తిన లేక. దు:ఖితు డయ్యెన్

  రిప్లయితొలగించండి
 26. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘నిరవుగ’ అన్న శబ్దం లేదు. ‘అయ్యెను+ఇరవుగ’ అయ్యె నిరవుగ అవుతుంది.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  ఊకదంపుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘సుందరి+అహల్య’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘సుదతి యహల్యా...’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘తరుణీమణికిం దానొక’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  రవికాంత్ మల్లప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘అయ్యెను+ఆరోగ్యము, అయ్యెను+ఆసుపత్రి’ అని విసంధిగా వ్రాసారు. నా సవరణ...
  కరువైనది యారోగ్యము
  శరణం బయె నాసుపత్రె చక్కెర బెరుగన్.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. ఉరగపు బుట్టను దూరిన
  కరిముఖు వాహన మెలుకకు మరణము గల్గన్;
  వరమయ్యొ శాప మయ్యెను
  సిరినాథుని చిత్తమెరుగ నరులకు తరమే.

  విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు కడపజిల్లా 7396564549

  రిప్లయితొలగించండి
 28. డా. మూలె రామముని రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవ, నాల్గవ పాదాలలో యతి తప్పింది.
  ‘వర మయ్యొ శాప మయ్యెను’ అనేది పద్యప్రారంభం. మీరు దానిని మూడవపాదంగా పెట్టారు. ఆ పద్యాన్ని ఇలా వ్రాస్తే సరి....
  వరమయ్యొ శాప మయ్యెను,
  సిరినాథుని చిత్తమెరిగి చెప్పగ తరమే?
  ఉరగపు బుట్టను దూరిన
  కరిముఖు వాహన మెలుకకు కలిగె మరణమే.

  రిప్లయితొలగించండి

 29. 1007వ పద్య రచన
  విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు కడపజిల్లా 7396564549
  +++++++++++++==========+++++++++++=========++++++++++++
  ఉరగపు బుట్టను దూరిన
  కరిముఖు వాహన మెలుకకు మరణము గలగన్;
  వరమయ్యొ శాప మయ్యెను
  సిరినాథుని లీలలెట్లు నరులకు దోచున్.

  రిప్లయితొలగించండి
 30. గురువుగారూ, సవరణలు తెలిపినందుకు దన్యవాదములు. విసంధి గూర్చి మరికొంత తెలిసికొనుటకు ఏదైనా మేలైన reference సూచింపగలరు

  రిప్లయితొలగించండి
 31. వర మయ్యొ శాప మయ్యెను
  నరసింహారావు గారు నాయకుడవగా
  బరబర యీడ్చుచు సోనియ
  కురిపెంచెను వానగండ్లు కుత్సిత రీతిన్

  రిప్లయితొలగించండి


 32. వరమయ్యొ శాపమయ్యెను
  పరమాత్ముడి లీలగాను బ్రతుకు జిలేబీ
  అరె!మాయవీడదు కదా!
  తెరతీయగ రాద స్వామి తిరుమల వాసా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 33. వరమయ్యొ శాపమయ్యెను
  బరువది మెండుగను లేని భామను గొనగన్
  తరచుగ బరువును జూచుచు
  కరవున్ జేసెను గృహమున కాజాల్ లడ్డుల్!

  రిప్లయితొలగించండి