కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న వేములవాడకు వెళ్ళి రాజరాజేశ్వరసామిని, భీమేశ్వరస్వామిని, నగరేశ్వరస్వామిని, బద్ది పోచమ్మను దర్శనం చేసుకున్నాను. రాత్రి అక్కడే. ఉదయమే బయలుదేరి మొదట కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నాను. అక్కడినుండి ధర్మపురి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, ఉపదేవాలయాల దేవుళ్ళను దర్శించి బయలుదేరి ఇంతకుముందే ఇల్లు చేరాను. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగింది. దేవాలయాలలో కూడా దర్శనానికి ఇబ్బంది కలుగలేదు. కాని ప్రయాణంలో ఉండి బ్లాగును ఎప్పటికప్పుడు చూడలేకపోయాను. నిన్న రాత్రి నా ఫోన్ ద్వారా సమస్యలను సమీక్షించాను కాని ఆ వ్యాఖ్యలను టైపు చెయ్యడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. అందువల్ల నిన్నటి పద్యరచన శీర్షికను సమీక్షించలేకపోయాను. మన్నించండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. సమాసంలో ‘రుక్మిణీ మనోభిరాముడు’ అనవలసి ఉంటుంది. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. ‘వలపు+అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వలప|టంచు’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కాకుంటే కొన్ని టైపాట్లు, అన్వయదోషం కనిపిస్తున్నవి. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసాధ్వి సీతయె ప్రియమైన సహన శీలి
రిప్లయితొలగించండిరామునకె చెందు నెల్లప్డు , రాధ వలపు
పొంద గోరుచు కన్నయ్య పొంచి యుండి
రాస క్రీడల చెలిచెంత భాసు రమ్ము
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
'భాసురమ్ము'....?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపుడమి పుట్టువు యనురక్తి పూర్తిగాను
రిప్లయితొలగించండిరామునికె చెందు నెల్లప్డు, రాధ వలపు
శంఖ పాణికి చెందును సంతతమ్ము
వాణి వలపంత పొందును పద్మయోని
అవని పుత్రిక సీతమ్మ యార్య ! వినుము
రిప్లయితొలగించండిరామున కెచెందు నెల్లప్డు ,రాధ వలపు
చెందు నాకృ ష్ణ పరమాత్మ డెంద మునకు
వలపు గలిగించు నాతడె వలచు మఱియు
అర్ధ నారీశ్వరుడన కపర్ది యొకడె
రిప్లయితొలగించండిజనకునాజ్ఞ నౌదల దాల్చె ననెడు కీర్తి
రామునకె చెందు ;నెల్లప్డు రాధ వలపు
మాధవునికేను పదివేల మగువలున్న !!!
అంతరాత్మకే యశరీర మబ్బఁజేసి
రిప్లయితొలగించండిచెలగి విద్యుక్త ధర్మముల్ చేసికొనెడి
నీల మేఘదేహుడు రుక్మిణీమనోభి
రామునికెచెందు నెల్లప్డు రాధ వలపు
కవిమిత్రులకు నమస్కారములతో
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి
వలపు గాలిని మురళిలో నిలిపివైచి
ప్రణయ సుస్వర గీతిక పలుకజేసి
నందమున దేల్చునట్టి-నందవ్రజాభి
రామునకె చెల్లు నెల్లపుడు రాధ వలపు
(నందమున = ఆనందమున)
పరమ పావని భూపుత్రి పడతి సీత
రిప్లయితొలగించండిరామునకె చెందు నెల్లప్డు, రాధ వలపు
దోచి నందగోపాలుడు తుష్టి తోడ
రాసలీలల దేలెను రమ్యముగను!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅచట గోలోక మ౦దున ననవరతము
రిప్లయితొలగించండిఅమలినమ్మైన శృంగార మనుభవి౦త్రు
ఆత్మ రాధగా పరమాత్మ యదు కులాభి
రామునకె జెందు నెల్లప్డు రాధ వలపు
గోవులన్ గాచుచున్ బ్రోచె గోపికలను
రిప్లయితొలగించండివిశ్వ మోహనా కారుండు వేణు ధరుడు
గిరిధరుడు వాడు పడతి రుక్మిణి మనోభి
రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు
కంజ దలనేత్రు సుందరా కారుఁ గృష్ణు
రిప్లయితొలగించండిగరుడ గమనుఘో రతరబ కాసు రారుఁ
గంస సంహారు నాగోపి కామ నోభి
రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు.
రాముడున్ రాధజంటగా రంజుకొనగ
రిప్లయితొలగించండి'రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు'
యనుచు ప్రేక్షక వ్యాఖ్యలు జనులఁజేర
కొత్త చిత్రముల్ వారితో కుదురు చుండె.
రాధ,రాముని ప్రేమపరాచకాలు
రిప్లయితొలగించండిఎన్న?నాటంక మందునే మన్నికవగ
రామునికె చెందు నెల్లప్డు రాధ వలపు
తాళి గట్ట?వీడెగ నెగతాళినాడె|
2.పెంచి తలిదండ్రి పోషించ?ప్రేమనేడు
కంచదాటగ కామాన కంటిచూపు
అంటి నంటని దయ్యెను వెంటరాక
రామునికి చెందునెల్లప్డు రాధవలపు
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిదేవుడైనను మానవ జీవితమున
బ్రతుక పడరాని పాట్లను పడుటదొక్క
రామునకె చెందు; నెల్లప్డు రాధ వలపు
ధరను నరుడయ్యు గిరినెత్తు హరికె చెందు
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
ధర్మ మార్గము వీడని ధార్మికుండు
తండ్రి మాటను మీరని తనయు డనుట
రామునకె చెందు నెల్లప్డు, రాధ వలపు
లెల్ల భక్తిని బోధించు నెల్లరకును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిప్రణయి రాధకుం గృష్ణుండు వశ్యుఁడయ్యె!
భక్తి నమలిన శృంగార సక్తత మదిఁ
దనరుచుండెడు సద్భక్తజన మనోఽభి
రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు!!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న వేములవాడకు వెళ్ళి రాజరాజేశ్వరసామిని, భీమేశ్వరస్వామిని, నగరేశ్వరస్వామిని, బద్ది పోచమ్మను దర్శనం చేసుకున్నాను. రాత్రి అక్కడే. ఉదయమే బయలుదేరి మొదట కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నాను. అక్కడినుండి ధర్మపురి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, ఉపదేవాలయాల దేవుళ్ళను దర్శించి బయలుదేరి ఇంతకుముందే ఇల్లు చేరాను. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగింది. దేవాలయాలలో కూడా దర్శనానికి ఇబ్బంది కలుగలేదు.
కాని ప్రయాణంలో ఉండి బ్లాగును ఎప్పటికప్పుడు చూడలేకపోయాను. నిన్న రాత్రి నా ఫోన్ ద్వారా సమస్యలను సమీక్షించాను కాని ఆ వ్యాఖ్యలను టైపు చెయ్యడానికి దాదాపు రెండు గంటలు పట్టింది. అందువల్ల నిన్నటి పద్యరచన శీర్షికను సమీక్షించలేకపోయాను. మన్నించండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమాసంలో ‘రుక్మిణీ మనోభిరాముడు’ అనవలసి ఉంటుంది.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
‘వలపు+అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వలప|టంచు’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాకుంటే కొన్ని టైపాట్లు, అన్వయదోషం కనిపిస్తున్నవి.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పడతి సీతమ్మ మదిలోని ప్రణయమెపుడు
రిప్లయితొలగించండిరామునకె చెందు నెల్లప్డు ;రాధ వలపు
పిలుపు నందు కొనుచు శౌరి పిల్ల గాలి
వోలె మెలమెల్లగా వచ్చి పొందు గోరె.
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిరాముడున్ రాధ జంటగా రంజుకొనగ
' రామునకె చెందు నెల్లప్డు రాధ వలప'
టంచు ప్రేక్షక వ్యాఖ్యలు మించి నంత
కొత్త చిత్రముల్ వారితో కుదురు చుండె.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.