29, సెప్టెంబర్ 2015, మంగళవారం

పద్య రచన - 1019

కవిమిత్రులారా,
“చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

32 కామెంట్‌లు:

  1. చనుఁబాలు ద్రాగు బిడ్డడు
    కనుగొనె పూతన యటంచు కటకట కొరికెన్
    తనువంత విషము నిండిన
    దనుజుల రక్కసి చనుల దారుణ హత్యన్
    ---------------------------------------
    చనుఁబాలు ద్రాగు బిడ్డడు
    కనువిందుగ నవ్వినంత కలతలు మరచున్
    తనరుచు పులకించు తల్లియె
    తనగుండెలు తడిమి నంత తన్మయ మొందున్

    రిప్లయితొలగించండి
  2. కం:చనుబాలు త్రాగు బిడ్డడు
    జనని యొడిం వీడి చనుచు చల్ల ఘటములన్
    ననయము పడద్రోసి ముసిముసి
    సి నగవులు నగి యెడి శౌరి సిరులను యెసగున్.
    2.కం:చనుబాలు ద్రాగు బిడ్డడు
    జనని మొగంబును గనుచును చక్కగ నవ్వన్
    కనువిందుగ జూచి మురిసి
    తనవారికి జూపి తాను తన్మయ మెందున్.

    రిప్లయితొలగించండి
  3. చనుఁ బ్రాలుదాగు బిడ్డడు
    ఘన రక్కసిఁదాను తునిమి కాటికి పంపన్
    కనువారలందరడరగ
    వినువారలు మదిచలించి విస్మయ మొందెన్

    రిప్లయితొలగించండి
  4. చను బాలు ద్రాగు బిడ్డడు
    ఘనమగు రక్కసుల జంపె గనుగొను చుండన్
    వినయముగా నే జేతును
    వన మందలి పూల దెచ్చి భక్తిని బూజన్

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుభ్యోనమః

    చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    తన నోటన్ జూపినాడు తన్మయ మొందన్
    ఘనమగు బ్రహ్మాండమ్మును
    వినిపిoనిచెను దివ్య గీత విష్ణుండగుచున్

    రిప్లయితొలగించండి
  6. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మాణిక్యమ్’ అని హలంతంగా ప్రయోగించారు. అక్కడ ‘మాణిక్య మగున్’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపద్యం చివరిపాదంలో కొంత గందరగోళం... ‘దనుజమహిళ యుసురు దీసె దారుణలీలన్’ అనండి.
    రెండవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘తనువు పులకించు తల్లియె’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘ఒడిన్+వీడి’ అన్నప్పుడు ద్రుతానికి అనుస్వార రూపం రాదు. ‘ఘటములన్+అనయము= ఘటముల ననయము’ అవుతుంది. మూడవపాదం చివర టైపాటు వల్ల ‘సి’ అదనంగా వచ్చింది. ‘సిరులను+ఒసగున్’ అన్నప్పుడు యడాగమం రాదు. మీ పద్యానికి నా సవరణ.....
    చనుబాలు త్రాగు బిడ్డడు
    జనని యొడిన్ వీడి చనుచు చల్ల గల ఘటం
    బనయము పడద్రోసి ముసిము
    సి నగవులు నగి యెడి శౌరి సిరుల నొసంగున్.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చనుబాలు త్రాగు బిడ్డడు ;
    నును నవ్వుల కా౦తులీను ; నొప్పి౦ప. గలా
    డె నినున్ ? దయతో నీ య
    ల్లుని విడుమని దేవకి
    కడు రోది౦చుచు + అనెన్

    రిప్లయితొలగించండి
  9. చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    వనరుహపద బాలకృష్ణు వనితాధమ పూ
    తన విషకుచ గని వేగమ
    చనుగుడు పచనియె సుతారి చపలత్వమునన్

    రిప్లయితొలగించండి

  10. చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    తన యుసురులు దీయు ననుచు తలపక నా పూ
    తన విష కుచములలో పా
    లను కుడిపెను శిశువునకు,మరణమును బొందెన్

    రిప్లయితొలగించండి
  11. చనుబాలు ద్రాగు బిడ్డడు
    కని తల్లిని నేర్చురీతి, కైతలు నేర్వన్
    వినుమిది శంకరగురువుల
    ఘనమగు బ్లాగును గణింప కలుగును నేర్పుల్.

    రిప్లయితొలగించండి
  12. గురుమూర్తి ఆచారి మనవి
    నిన్నటి దత్తపది, :-
    ఈగ దోమ నల్లి పేను
    శకుని దుర్యోధనుని తో,*

    వలపేను ప౦చెద వగకత్తెలై వచ్చి
    నావె౦ట దిరుగుచు
    నటనమాడ

    అమృతపురాగాల
    నల్లి వేణువు లోన
    ననురాగ సురలోక
    మ౦దజేతు

    విరహాన క్రు౦గు
    గోపికలకు వలపు, + అను
    దోమటిని ( ఆహారమును )
    కరుణ తోడ నిత్తు

    ఈ గలాడను చీర లిక
    సిగ్గు విడి చేతు
    లెత్తి , మీరెల్ల
    ప్రార్ధి౦చి నపుడు

    అనుచు కా౦తావిలోలుడై
    యనవరతము
    తిరుగు శౌరికి
    పసులకాపరికి మనము
    జ౦కనేల. ? పా౦డవులను
    చ౦పగలము
    శకుని గలడు సుయోధనా
    చా లు నీ కు

    రిప్లయితొలగించండి
  13. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘రోదించుచు+అనెన్= రోదించుచు ననెన్’ అవుతుంది. అక్కడ మీరు ‘రోదించి యనెన్’ అనండి.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సుతారి’...?
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    _/\_
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    నిన్నటి దత్తపదికి మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురుమూర్తి ఆచారి గారూ,
    ‘కృతఘ్నతలు/ కృతజ్ఞతలు’...?

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సుత + అరి, పూతన అనే అర్ధము లో వాడాను. పల్లెలు పట్టణాల లో ఎక్కడ పిల్లలు ( అందరి సుతులను) కనిపించినా చంపుతూ వ్రేపల్లి వస్తుంది. బాల ఘాతిని.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి నమస్కారం. చిన్నపిల్లలు, ప్రేమించే ఇల్లాలు, ఆమెను అపురూపంగా చూసుకొనే పెనిమిటి ఉన్న ఇంట ప్రేమ అల్లుకొని ఉంటుంది అన్న భావనలో రాయాడానికి ప్రయత్నం చేశాను. దోషాలు చెప్పగలరు.

    కం: చనుఁబాలుద్రాగుబిడ్డఁడు...
    అనునయమునమెలగునాలి, యనుగున నామే
    తనకనుపాపగకనుగొను
    పెనిమిటియున్నగృహముననెపెనుకొనువలపే!!
    ( పెనుకొను= అల్లుకొను)

    రిప్లయితొలగించండి
  17. చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    కనుచుండును తల్లి మోము కడుమోదమునన్
    తన కరమున నెద తాకుచు
    నను దినమున పొందుచుండు నగణిత ప్రేమన్.





    రిప్లయితొలగించండి
  18. అయ్యో గురువుగారు అది కృతజ్ఞతలు..

    మన్నించగలరు

    రిప్లయితొలగించండి
  19. చనుబాలు దాగు బిడ్డడు
    ధనవంతుని వోలె మంచి ధైర్యము చేతన్
    మనుగడ సాగును|రోగము
    తనబారిన బడక జేయు తల్లియు పాలే|
    2.చనుబాలు దాగుబిద్దడు
    అనవరతము సంతసాన హాయిగ నుండున్
    మనుగడ కెప్పుడు దోషము
    గనుపించదు తల్లిపాలుఘనతను బెంచున్

    రిప్లయితొలగించండి
  20. గురుమూర్తిఆచారి

    మాకూతురు type చేయడానికి రాక కృతఘ్నతలు అని type చేసినది
    నాదొక స౦దేహము
    రోది౦చుచు+అని
    రోది౦చు చని
    రోది౦చుచు నని ఇట్లు
    రె౦డురూపాలు కలవని
    అనుకు౦టాను ఇ౦తకు ఆ
    స౦ధి పేరు స౦ధి సూత్రము దయ చేసి వివరి౦చ౦డి

    రిప్లయితొలగించండి
  21. పోచిరాజు కామేశ్వరరావు గురూ,
    నేనూ సత+ అరి అనే అనుకున్నాను. కాని ఎవరి సుతునకు శత్రువు? అనే సందేహం వస్తుంది.
    *****
    వేదుల సుభద్ర గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    బిడ్డడు +అనునయమున అని విసంధిగా వ్రాయరాదు. 'ఆమే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'బిడ్డం|డనునయమున మెలగు నాలి యనుగున నామెన్' అనండి.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    నేనే పొరపాటు పడ్డాను. 'శత్రర్థక చువర్ణంబు లందున్న ఉత్తునకు సంధి వైకల్పిక' మన్న సూత్రం చేత అక్కడ రెండు రూపాలు వస్తాయి.

    రిప్లయితొలగించండి
  22. ధన్యవాదాలు గురువుగారు. తప్పక సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పూతన , విష కుచ అని ప్రస్తావించాను కదా అందుకని సుతారి కూడ ఆమె కే చెందుతుందని నా భావన.

    రిప్లయితొలగించండి
  24. గురుమూర్తి ఆచారి

    గురువర్యులు నా స౦దేహనివృత్తి చేసిన౦దులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
    తన కటినిం గట్టు ఱోటి త్రాటిం దిగువన్
    బెను మ్రాఁకులుఁ గూల నపుడు
    ఘన విస్మితులయి నిలిచిరి గంధర్వులటన్!(1)

    "చనుఁబాలు ద్రావు బిడ్డఁడె?
    ఘన దైవమ్మగును కాని, కాఁడయ శిశువే"
    యని వల్లవు లత్తఱిఁ దమ
    మనవినిఁ దెల్పంగఁ జనిరి మాతఁ బిలువఁగన్!!(2)

    చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
    ఘనులౌ వేల్పులకు ముక్తిఁ గల్పింపంగన్
    మనమునఁ బొంగి యశోదయె
    తన యెదకును హత్తుకొనియె దబ్బున శిశువున్!!(3)

    "చనుఁబాలు ద్రావు బిడ్డఁడె
    కనఁగను విష్ణుండు నృహరి ఘనుఁడౌ మధుసూ
    దనుఁ" డని రట గంధర్వులు
    చనఁ బురికిని గృష్ణు నెదుటఁ జాగిలపడుచున్!!(4)

    చనుఁబాలు ద్రావు బిడ్డఁడు
    జన మనముల దోచి వెల్గె శాశ్వతుఁ డనఁగన్
    విన వేడుకయ్యెఁ దల్లికిఁ
    దనువే పులకించి జన్మ తరియించె వెసన్!!(5)


    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. గుండు మధుసూదన్ గారూ,
    ఐదు పద్యాలు వ్రాసినా వాటి ఏకసూత్రత ప్రశంసనీయం. చక్కని పద్యాలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    మనసుపడడె పాలఁ ద్రాగ? మడియించగ పూ
    తన చిన్ని కృష్ణు నొడిలోఁ
    జనుగుడుపగ సురవైరి సర్వము పీల్చెన్!

    రిప్లయితొలగించండి
  28. చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    చనుబాలు వెలితి పడగనె చన్నును కఱచున్...
    పనికాగనె పూరుషుడిల
    తన తల్లిని వీధి లోన తరుమును వడిగా

    రిప్లయితొలగించండి
  29. చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు
    కనుగొని బాటిలున పాలు గడగడ త్రాగన్
    కినుకను గొనకయె వారిజ
    పనిలో జొరబడుచు గెలిచె పన్నుగ నోబెల్!

    రిప్లయితొలగించండి