పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, ఇదెప్పుడో పద్యరచనకు ఇచ్చిన చిత్రం పై వ్రాసిన పద్యం అనుకుంటాను. పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సత్యమ్ము+ఆడువారు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సత్యమౌ| నాడువారు...’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. అక్కడ సంధి చేస్తే తెలుప దలుచుకున్న విషయం తేలి పోవడమే కాకుండా అన్వయం సరిపోదేమో ననిపిస్తుంది. సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన : అమ్మ! జాతి పితకు నంతయు గుండేల? నిక్కమాడునట్టి నేత కాన! సత్యమెరిగి తమ్మ! జడవేయు జుట్టుతో నాడువారు బొంకులాడు వారు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ సవర్ంచిన పూరణ బాగుంది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మహిళ లందు గూడ మమతల పెన్నిధుల్ చాల గలరు చూడ జగతి యందు ; నాగ మాంబ వంటి నాయకు రాన్డ్రైన యాడువారు బొంకులాడువారు . నాగమ్మ అనగా అన్న దమ్ములైన నలగామ రాజాదులకు యుద్ధము కల్పించిన నాయకురాలు నాగమ్మ విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినీతి వంతులైన నేతలెవ్వరు లేరు
రిప్లయితొలగించండినేడు దేశమందు నిక్కముగను
తుదకు నేతలయ్యె దొంగనాటకముల
నాడువారు బొంకు లాడువారు
రిప్లయితొలగించండి1.ఆ.వె:వేదికలను యెక్కి విశదముగా పల్కి
బాసలెన్నొ యొసగి బలిమి పెంచి
యేరు దాటగానె తీరుమార్చుచు మాట
లాడువారు బొంకు లాడు వారు.
2ఆ.వె: అవసరంబు కొరకు నతిశయోక్తులనాడి
పనులు జరుపు కొనుచు బడుగు బీద
వారి కెల్ల మంచి వాగ్ధాటి జూపుచు
నాడు వారు బొంకు లాడు వారు.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తుదకు నేతలైరి...’ అనండి.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘వేదికలను+ఎక్కి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వేదికలను నిలిచి’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపురుషు లందు పుణ్య పురుషులై కొందరు
తొలగించండివెలుగు చుండు విధము విశ్వ మందు
తరుణు లందు తరచి పరికింపగా కొంద
రాడు వారు బొంకు లాడు వారు
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదం చివర గణదోషం. ‘పరికించగా కొంద...’ అనండి.
గురువుగారికి ధన్యవాదములు
తొలగించండిఆట లన్ని నీతి కాలవాలంబన
రిప్లయితొలగించండినొప్పు పగలు వీడి యుండ వలయు
గాని యిపుడు విజయ కాంక్ష యధికము నే
డాడువారు బొంకు లాడువారు.
ఆడువారు బొంకు లాడువారు గలరు
రిప్లయితొలగించండినియమమేమి లేక నిందలుంచు
బాలురిందు కొంత బాధ్యత మరచిన
ఆటలాడి ఫలమ? ఆయసంబె
రిప్లయితొలగించండిదినకరు కిరణ తాపము తీవ్ర మాయె
గంగ! కాలుచున్నది నేల కాలు మోప
పగుల గొట్టగ రాళ్ళను పగటి పూట
వెళ్ళు చుంటివి చెప్పులు వేసుకొనుము.
ఆడు వారు బొంకు లాడు వారనుటను
రిప్లయితొలగించండిమంచి కాదు మనకు మాన నీయ !
తిరగ బడుదు రుమఱి దినముది నమ్మును
కూడు దొరక దండి కొంచె మైన
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమగువ లైన నేమి మగవారయిన నేమి
రిప్లయితొలగించండిసత్య వంతు లవరు సకల జనులు
వాంఛితముల నొంద వసుధలో పురుషులు
ఆడు వారు బొంకు లాడు వారు
అమ్మ! జాతి పితకు నంతయు గుండేల?
రిప్లయితొలగించండినిక్కమాడునట్టి నేత కాన!
తెలిసె నమ్మనాకు తీరైన సత్యమ్ము!
యాడు వారు బొంకులాడువారు!
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
ఇదెప్పుడో పద్యరచనకు ఇచ్చిన చిత్రం పై వ్రాసిన పద్యం అనుకుంటాను. పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సత్యమ్ము+ఆడువారు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘సత్యమౌ| నాడువారు...’ అనండి.
గురువు గారికి నమస్సుమాంజలులు నా మూడవ పూరణము
రిప్లయితొలగించండిపేదతనము చేరు జూదమాడెడువారిఁ
జూడ సానుభూతి శూన్య మగును
వ్యసన పరుని బతుకు వ్యధలుజేరగ జూద
మాడు వారు బొంకు లాడు వారు
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడవపూరణ బాగుంది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅక్కడ సంధి చేస్తే తెలుప దలుచుకున్న విషయం తేలి పోవడమే కాకుండా అన్వయం సరిపోదేమో ననిపిస్తుంది.
సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన :
అమ్మ! జాతి పితకు నంతయు గుండేల?
నిక్కమాడునట్టి నేత కాన!
సత్యమెరిగి తమ్మ! జడవేయు జుట్టుతో
నాడువారు బొంకులాడు వారు!
సీనిమాలలోన చిత్ర విచిత్రమౌ
రిప్లయితొలగించండిపాత్ర లెన్నొ వేసి ప్రజల మనసు
రంజిలగను జేయ రంగువేసుకొనియు
ఆడువారు బొంకు లాడువారు.
సంతతమ్మునెదుటి శాలలో సరసమ్ము
రిప్లయితొలగించండిలాడువారు, బొంకులాడువారు
పడుపు వృత్తినున్న పంకజాక్షులు సుమ్మ
పాడువృత్తి నాపు ప్రభువులేడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసాదమొందు చుంద్రు సంతతమ్మును వాదు
రిప్లయితొలగించండిలాడువారు బొంకులాడువారు
సాధు గుణము గల్గు సాత్విక జీవులు
మోక్షమార్గమందుఁబోవుచుంద్రు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ సవర్ంచిన పూరణ బాగుంది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మాటరాని మూగ నోట పశుగణమ్ము
రిప్లయితొలగించండినాడలేదు బొంకు లాడబోదు.
మాటలాడగలుగు మగవారును మరియు
నాడువారు బొంకు లాడువారు.
దొంగ పనులు జేసి దొరవోలె నటియించి
రిప్లయితొలగించండిమభ్య బెట్టి జనుల మాట మార్చి
పాప భీతి లేక పలునాట కముల
నాడు వారు బొంకు లాడు వారు
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండినీతి సూత్రములను నేర్పుగా వల్లించి
ప్రజల మభ్య పెట్టి ,ప్రభుత యందు
తమ పలుకుబడి యధికమనుచు నటన
మాడువారు బొంకు లాడువారు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఉర్వికింత గూడ నుపయోగ పడబోరు
జీవితమున పైకి చేరిపోరు
పైకి మంచి తనము పాటించి నాటకా
లాడువారు బొంకు లాడువారు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
కల్ల లాడు గుణము కలవారు మహిళలు;
ఎల్ల వేళ లందు నెగ్గులేక
సత్య భామ దాసి చక్కని దృష్టాంత
మాడువారు బొంకులాడువారు .
విద్వాన్ ,డాక్టర్ ,మూలె రామమునిరెడ్డి ,ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549
మూలె రామముని రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మహిళలు+ఎగ్గులేక’ అన్నచోట విసంధిగా వ్రాసారు. ‘కల్ల లాడు గుణము గలవారు కద కాంత| లెల్లవేళలందు...’ అందామా?
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండిపొగను త్రాగరాదు పోవు నారోగ్యము
లని పొగాకు పంటలనుమతించి
మద్య మమ్మకముల మాన్పెద మను మాట
లాడువారు బొంకు లాడువారు.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మహిళ లందు గూడ మమతల పెన్నిధుల్
రిప్లయితొలగించండిచాల గలరు చూడ జగతి యందు ;
నాగ మాంబ వంటి నాయకు రాన్డ్రైన
యాడువారు బొంకులాడువారు .
నాగమ్మ అనగా అన్న దమ్ములైన నలగామ రాజాదులకు యుద్ధము కల్పించిన నాయకురాలు నాగమ్మ
విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
దూరవాణి లొన దొరవోలె మాటాడి
నిల్వయున్న ధనము నెలవు మార్చు
మోసగాండ్ర నెన్న బోకిరుల్, కపటమ్ము
నాడువారు, బొంకు లాడువారు.
డా. మూలె రామముని రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్రేలి కొసల బెట్టి బోలెడు దారాలు
రిప్లయితొలగించండిదైవమాడు చుండె పావు లాట
సత్య సంధులైన, సర్వేశు నాటలో
నాడువారు, బొంకు లాడువారు!!!
వెదకి జూడ గలమె వేదభూమిన మనము
నిత్యసత్య వ్రతుని నిజముగాను
కంకిభట్టుకైన బొంకక తప్పెనా
నాడువారు బొంకు లాడు వారు !!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణలో ‘వేదభూమిని’ అనండి. ‘కంకుభట్టు’ను ‘కంకిభట్టు’ అన్నారు.