25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

పద్య రచన - 1015

కవిమిత్రులారా,
“తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

25 కామెంట్‌లు:

  1. తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె
    త్రాగుబోతువై డబ్బంత తగులబెట్టి
    యప్పు లేజేసి యూరిలోనందరికడ
    యింటి పరువంత బాజారుకీడ్చదగునె

    రిప్లయితొలగించండి
  2. తమ్ముఁడా యిట్లొనర్చుట ధర్మ మగునె ?
    భర్త లేవురు గంధర్వ బలిమి యున్న
    సాధు శీలగు సైరంధ్రి పొందు కొఱకు
    మంకు దనమేల వీడుము మంచి గొనుము

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమః

    తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె
    తండ్రి యానతి జవదాట తగునె మనకు
    నాదు ప్రతినిధి నీవయ్య వేదనేల
    ననుచు నోదార్చె భరతుని యగ్రజుండు

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    'శీల+ అగు' అన్నప్పుడు యడాగమం వస్తుంది. శీలయౌ అనండి.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు

    రిప్లయితొలగించండి
  5. తల్లి దండ్రులన్ బంధుల ధర్మసతిని
    వీడి బుద్ధిహీనుండవై విచ్చలవిడిఁ
    తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె
    యనుచు ప్రశ్నించె సోదరి యాదరమున.
    (నిగమశర్మఅక్క)
    2.చెడ్డ పనులను చేయుచు జీవితమును
    పాడు చేసుకొనగ నేమి ఫలము కల్గె
    తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె
    యనుచు నగ్రజుండ నుజును ననునయించె.

    రిప్లయితొలగించండి
  6. పూట పూటకు ద్రాగుచు పొట్ట నిండ
    యిం టి నిల్లాలి బిల్లల నొంటి జేసి
    యిలబ లాదూ రు గదిరుగ నెగ్గు లేదె ?
    తమ్ముడా ! యిట్లొనర్చుట ధర్మ మగునె.....

    రిప్లయితొలగించండి
  7. రాముని శరణుజొచ్చిన విభీషణుని తలచుకొని రావణుడు స్వగతమందు తలచినాడని ఊహించి వ్రాసిన పద్యము

    తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె
    పరమ వీరుడంచు తలచి భయము తోడ
    అధముడైన రాముఁ శరణ మంచు వేడి
    భాతృ ద్రోహమున్ దలపెట్ట భావ్య మగునె

    2. కీచకునితొ అతని సోదరి పలికిన పలుకులుగా నూహించి వ్రాసీన పద్యము

    తమ్ముడా యిట్లనొర్చుట ధర్మమగునె
    కర్మపశమున నిటజేరె కలికి యైన
    ఉత్తమోత్తమ వంశపు వువిదనిటుల
    గోరఁ దగదు నీ యంతటి వీరునకును

    రిప్లయితొలగించండి
  8. రామభాణము సోకి వాలి నేలబడినపుడు వాలి సుగ్రీవుల మధ్య జరిగిన సంభాషణ:
    తమ్ముఁడా యిట్లొనర్చుట ధర్మమగునె?
    నన్ను జంపగ రఘురాము నెన్నినావె?
    తమ్ముడాలిని చెరబట్ట ధర్మమగునె?
    మోదమది రామభాణము ముక్తినొసఁగు!

    రిప్లయితొలగించండి
  9. తమ్ముఁడా !యిట్లొనర్చుట ధర్మమగునె
    ఘోర రక్కస మృగములు దోరు నట్టి
    వనము నందున వదినను వంటరిగను
    వదలి వచ్చితి వేమని?బాధ పడుచు
    రామ చంద్రుడు గద్దించె లక్ష్మణుడను!!!


    దోరు = సంచరించు


    తమ్ముడా! యిట్లొనర్చుట ధర్మమగునె
    కన్న వారిపై నొక్కింత కరుణలేక
    కాల దన్నిన కలుగదే మేలు నీకు
    యనుచు నగ్రజ నిందించె నాగ్రహముగ!!!


    రిప్లయితొలగించండి
  10. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    ఆ పద్యపాదాన్ని ఇచ్చినప్పుడే ఎవరో ఒకరు నిగమశర్మ అక్కను గురించి ప్రస్తావిస్తారనుకున్నాను. సాయంత్రం వరకు చూసి ఎవరూ వ్రాయకుంటే నేను వ్రాద్దామనుకున్నాను.
    కాని మీరు ఆ ప్రస్తావనతో చక్కని పద్యాన్ని వ్రాసారు. మీ రెండవ పద్యం కూడ బాగున్నది. అభినందనలు.
    ‘అనుజుని ననునయించె’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఇంటి యిల్లాలు’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘వంశపు టువిద’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్య్తాలు బాగున్నవి. అభినందనలు.
    ‘లక్ష్మణు నట’ అనండి. అలాగే ‘కలుగు మేలు నీకు| ననుచు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  11. తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె
    యెగ్గు దలపకు మురిపంపు నింతి నకట
    పొలమ దియునొక్క యెకరము పుట్టినింటి
    యరణ మయ్యది నాకియ్య వయ్య యింక

    రిప్లయితొలగించండి
  12. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పేదవర్గాలు ముదముతో వేయ నోట్లు
    నారునెలలలో నధికార మందుకొంటి
    వెన్నుపోటుతో ననుదింపి పీఠమెక్క
    తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె?

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులందరకునమస్కారములు.
    డా:ఉమాదేవిగారు మీపూరణచాలాబాగున్నది.చక్కటి అన్వయము.చిన్నవాడు కాబట్టి బూద్ధిహీనుడవంటుమందలించుచు,విచ్చలవిడిగాతిరుగనేర్చినవాడుకోపముతోచెప్పినడువినడని నిగమశర్మకు అక్కతోఆదరమునచెప్పించిన విధానము బాగున్నది.చిన్ననాడు మాకీపాఠముచెప్పినపరమశాంతుడు మాగురువుగారు ముదిగొడరామలింగశాస్తిగారు గుర్తుకువచ్చినారు.మీపూరణ మాగురువుగారిని సాక్షాత్కరింపచేసింది మీకుధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె
    అన్నమాటలు పెడచెవి కున్న మేలె
    మంచి జెప్పిన వినబోరు వంచనంబు
    నమ్ముకున్నట్టి వారికి సొమ్ముగాన
    2. తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె
    ప్రేమగుడ్డిది |తలిదండ్రి పెంపుజేయ
    చదివి సంస్కార మే వీడి చపలమనసు
    ప్రేమ పెళ్ళిళ్ళ పేరిట వేరుబదుట?

    రిప్లయితొలగించండి
  16. తమ్ముడా యిట్లొనర్చుట ధర్మమగునె
    యనుచు దలపోయు దుస్థితి యక్కటకట
    కలుగరా దెవరికి నని కరివదనుని
    వేడుకొనెద, విఘ్నపతిని, విమల మతిని.

    రాజేశ్వరమ్మ గారి పద్యం లో మూడవపాదం లో యతి చెల్లలేదేమోనని అనుమానమండీ.
    శైలజ గారి పద్యం లో ఘోర రక్కస మృగములు కాక రాక్షస మృగములు అనవలెనేమో

    రిప్లయితొలగించండి
  17. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    ధన్యవాదాలు. మీరు గుర్తుకు తెచ్చుకొనడమే కాదు, గురువు గారిని నాకూ గుర్తుకు తెచ్చారు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    ఊకదంపుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    అక్కయ్య గారి పద్యంలో యతిదోషాన్ని నేను గమనించలేదు.
    శైలజ గారి సమాస దేశాన్ని గమనించాను. కానీ వ్యాఖ్య వ్రాసే సమయంలో మరిచిపోయాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. రావణుడు విభీషణుడితో..............

    తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె
    రామునకునా రహస్యమ్ములను వచించి
    దైత్య సామ్రాజ్య పతన సంధాతవైతి
    వేమి సెప్పుదు కనికర మెల లోదొ?

    శ్రీరాముఁడు భరతునితో..................

    తమ్ముఁడా యిట్లొనర్చుట ధర్మమగునె
    తల్లిదండ్రులఁ వీడి చింతాపరుండు
    గాఁగ నాదరికేల, శీఘ్రముగ నీవు
    రాజ్యమును జేరి పాలించి రహి వహింపు.

    రిప్లయితొలగించండి
  19. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారూ,
    ధన్యవాదములు,

    సంపత్కుమార శాస్త్రి గారూ,
    తల్లిదండ్రుల కాక తల్లులందఱ అనవలెనేమో.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ మీరిచ్చిన పద్యభాగాన్ని పద్యారంభంలోనే వాడాలనే నిబంధన లేదా?

    రిప్లయితొలగించండి
  22. తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె
    ధరణిజావిరహాగ్ని నే దగ్ధ మవక
    బ్రతికి యుండుట నీతోడు వలన గాదె
    నన్ను విడనాడి పోవుట న్యాయ మగునె?

    (లక్ష్మణమూర్చకు దుఃఖిస్తూ రాముడన్నట్లు)

    రిప్లయితొలగించండి
  23. ఊకదంపుడు గారూ,
    మీ నిశిత పరిశీలనకు, సూచనలకు ధన్యవాదాలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ఊకదంపుడు గారి సవరణను స్వీకరించండి.
    *****
    మిస్సన్న గారూ,
    నేనిచ్చిన పాదాన్ని పద్యప్రారంభంలోనే ఉంచాలి. స్థానభ్రంశం అయితే అది సమసాపూరణ మవుతుంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. కొందరు మిత్రులు పాదాన్ని ప్రారంభంలో ఉంచని విషయాన్ని నేను గుర్తించలేదు. ధన్యవాదాలు.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీరు నేనిచ్చిన పద్యపాదాన్ని స్థానభ్రంశం చేసారు. ‘పద్యప్రారంభం’ అని మొదటే ఇచ్చాను. మీరు గమనించినట్టు లేదు.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారికి వందనములు.
    శ్రీ ఊకదంపుడు గారికి కృతజ్ఞతాభివందనములు. మీ సూచనను శిరసావహిస్తున్నాను

    రిప్లయితొలగించండి