9, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణ - 1783 (కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.
(ఈరోజు వేములవాడ, రేపు ధర్మపురి క్షేత్రాలకు వెళ్తున్నాను. ఈ రెండు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మిత్రులు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.)

35 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమః

    చింతాక్రాంతుండగుచున్
    వింతగ కరిరాజు నిన్ను వేడుచు దలచె
    న్నంతా నీవేనని శ్రీ
    కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.

    రిప్లయితొలగించండి
  2. పంతములు పట్టింపులు
    భ్రాంతులు, కామాదులు నను బట్టుటను మనః
    శాంతి బడయనిట, జనెదను
    కాంతార మ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.

    రిప్లయితొలగించండి
  3. యెంతో వేచితి నీకని
    కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్
    పంతము వీడుచు నామది
    చింతను దీర్పంగ వలయు శ్రేయ స్కరమౌ

    రిప్లయితొలగించండి
  4. అంతా నీవేననుచున్
    సంతసముగ నిను గొలిచితి శ్రద్ధా భక్తిన్
    చింతను బాపగ లక్ష్మీ
    కాంతా! రమ్మనెను మోక్ష కాముకుడు తమిన్!!!

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి ,కవిమిత్రులకు నమస్కారము
    (శ్రీకాళ హస్తిశ్వర శతకము స్ఫూర్తిగా పూరించినది)

    వింతల్మేన చరించగ
    కాంతా సంఘంబు రోయ కాయంబు జరా
    క్రాంతంబవ "జీవితమే
    కాంతారమ్మనెను" మోక్ష కామికుడు తమిన్ !!!

    ( జీవితమే కాంతారమ్మనెను = జీవితమునే ఒక పేరడవి గా భావించెను)

    రిప్లయితొలగించండి
  6. కాంతారమ్మును జేరుచు
    అంతర్ముఖుడై మహర్షి హరి ననవరతం
    బాత్మన్ ధ్యానించుచు భూ/సిరి
    కాంతా రమ్మనెను మోక్షకాముకుడు తమిన్.
    2.ఎంతో వేదన తోడను
    కాంతారంబున కరిని,మకరిబంధింపన్
    వంతను బాపగ నో,శ్రీ
    కాంతా రమ్మనెను మోక్షకాముకుడు తమిన్.

    రిప్లయితొలగించండి
  7. కాంతారమ్మును జేరుచు
    అంతర్ముఖుడై మహర్షి హరి ననవరతం
    బాత్మన్ ధ్యానించుచు భూ/సిరి
    కాంతా రమ్మనెను మోక్షకాముకుడు తమిన్.
    2.ఎంతో వేదన తోడను
    కాంతారంబున కరిని,మకరిబంధింపన్
    వంతను బాపగ నో,శ్రీ
    కాంతా రమ్మనెను మోక్షకాముకుడు తమిన్.

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు నమస్కారములతో..
    గురుమూర్తి ఆచారి..

    చింతాయుతమగు జీవన
    కాంతారమ్మున బ్రతుకను-కావుము; నాపై
    కాంతాళించకు మో శ్రీ
    కాంతా రమ్మనెను మోక్షకాముకుడు తమిన్


    (కాంతాళించకు = కోపించకు)

    రిప్లయితొలగించండి

  9. సాంతము వినునా మాటను
    కాంతా! రమ్మనెను మోక్ష కాముడు తమి
    న్యాం త్రిక జీవన పరిధిని
    మాం త్రికముగ దాటు కొఱకు మదినిం పలరన్

    రిప్లయితొలగించండి
  10. సంతత ఘన జప తపముల
    నంతే వాసులను గూడి యలసియు సొలసిన్
    సంతాప మనము నన్శ్రీ
    కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.

    రిప్లయితొలగించండి
  11. ప్రహ్లాదుని ప్రార్థన:
    అంతయు నీవని దెలిసిన
    పంతముతో స్తంభమందు వప్తయె కోరెన్
    చింతలు దీరంగ రమా
    కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!
    ( వప్త=తండ్రి)

    రిప్లయితొలగించండి
  12. శాంతముగానివసించుచు
    భ్రాంతిని వీడి కడునిష్ట భజియించగ, శ్రీ
    కాంతుని సతితోడను, నిజ
    కాంతారమ్మనెను, మోక్షకాముకుడు తమిన్

    రిప్లయితొలగించండి
  13. చెంతన జేరితిరా! దను
    జాంతక, నీదివ్య చరణ సన్నిధికై, శ్రీ
    కాంతా! ననుబ్రోవ రమా
    కాంతా, రమ్మనెను మోక్షకాముకుడు తమిన్

    రిప్లయితొలగించండి
  14. చెంతన జేరితిరా! శ్రీ
    కాంతా, నీదివ్య చరణ కమలాలనుపూ
    జింతును! ననుబ్రోవ రమా
    కాంతా, రమ్మనెను మోక్షకాముకుడు తమిన్

    రిప్లయితొలగించండి
  15. అంతా మిథ్యనుకున్నను
    కాంతయు లేనట్టి బ్రతుకు కల్మష మనుచున్
    చింతను మాన్పించెడి-శ్రీ
    కాంతా రమ్మనెను మోక్ష కామికుడు తమిన్.
    2.సంతానంబుకు,కీర్తికి
    పంతంబునుమాన్పి భక్తి పరవశ మందే
    చింతను మాన్పించెడిదౌ
    కాంతారమ్మనెను మోక్ష కాముకుడు తమి న్

    రిప్లయితొలగించండి
  16. బొట్టు శతకము రచనలో 11 మంది శంకరాభరణం నుండి పాల్గొన్నారు. "బొట్టు" శతకాన్ని"e-book" అమెరికాలోని కాలిఫోర్నియా మిల్పిటాస్ స్వాగత్ హోటల్ లో జరిగిన "వీక్షణం" వార్షికోత్సవ సభలలో ఆవిష్కరించారు. యిప్పుడు రావి రంగా రావు గారు "భూమి" అనే పేరుతో ఆటవెలదిలో మరొక శతకాన్ని తాయారు చేయాలని రచనలను ఆహ్వానించారు.
    " భూమి" ఆటవెలది శతకం
    "భూమి" అనే అంశం మీద ఆటవెలది శతకం కోసం ఐదేసి పద్యాలకు మించకుండా
    పోస్ట్ చేయాలని కోరుతున్నాను.
    "బొట్టు" గ్రూప్ పేరు "భూమి" గా మార్చబడిందని గమనిక.

    రిప్లయితొలగించండి
  17. పంతమ్మేలా నాతో
    చింతలు నాకేమి లేవు శ్రీలను స్త్రీలన్
    భ్రాంతియు లేదిక నిర్వృతి
    కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.

    రిప్లయితొలగించండి
  18. అంతామిథ్య యటంచును
    సంతతి నర్ధాంగి విడచి చయ్యనఁదన యే
    కాంతమునకు సరి దట్టపు
    కాంతారమ్మనెను మోక్షకాముకుడు తమిన్.

    రిప్లయితొలగించండి
  19. జంతుభయమేమి లేనిది
    కాంతారమ్మ;నెనుమోక్షఁగాముకుడు;తమిన్
    సుంతేని భీతివలదని
    సంతసమున సాగిపోతు సహచరు తోడన్

    రిప్లయితొలగించండి
  20. చింతన జేసెను భక్తుడు
    సంతతముగ,భుజగశయుని సన్నిధి జేర్చన్
    చెంతకు బిలిచెను నిర్వృతి
    కాంతా!రమ్మనెను మోక్షకాముకుడు తమిన్

    సెప్టెంబర్ 09, 2015 11:55 [AM] తొలగించు

    రిప్లయితొలగించండి
  21. నాపూరణలో నాల్గవ పాదములో"సాగిపోతు"అనే గ్రామ్యము దొర్లినది దానిని"
    సాగుచుఁదన" అని సవరించు కొనుచున్నాను

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    (భవబంధనము లిఁక వలదని యొక మోక్షకాముకుఁ డనంతుని యందు మనస్సును లగ్నము చేసినవాఁడై ముక్తికాంతనుఁ ద్వరగ రమ్మని పిలుచు సందర్భము)

    సుంతయుఁ దాళక భక్తి న
    నంతుని పద పద్మ సక్త నవ మానస స
    చ్చింత ’నపునర్భవద యను
    కాంతా! ర’మ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!!

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులందరికి అభివాదములు.
    ఈరోజు అందరి పూరణలు అన్వయశుద్ధితో అలరించినవి.

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. 'పంతమ్ములు' అంటే సరి!
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పద్యాన్ని యడాగమంతో మొదలుపెట్టారు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    'శ్రద్ధను భక్తిన్' అనండి.
    ******
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,

    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గరుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *******
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,;—
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    '.....యలసి సొలసియున్' అనండి.
    ******
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  25. (భవబంధనము లిఁక వలదని యొక మోక్షకాముకుఁ డనంతుని యందు మనస్సును లగ్నము చేసినవాఁడై ముక్తికాంతనుఁ ద్వరగ రమ్మని పిలుచు సందర్భము)

    సుంతయుఁ దాళక భక్తి న
    నంతుని పద పద్మ సక్త నవ మానస స
    చ్చింత ’నపునర్భవద యను
    కాంతా! ర’మ్మనెను మోక్షకాముకుఁడు తమిన్!!

    రిప్లయితొలగించండి
  26. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో 'మిథ్య+అనుకున్న' అన్నపుడు యడాగమం రాదు. 'మిథ్యగ దలచిన' అనండి.
    రెండవ పూరణలో 'సంతానంబుకు' అన్నారు. సంతానంబునకు అనాలి. అక్కడ 'సంతానమునకు' అంటే సరి!
    ******
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    దువ్వూరి సాంబమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *******
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.-

    రిప్లయితొలగించండి
  27. అంతా మిథ్యయను సత్యము
    కాంతారావుకు తెలిసిన క్షణమున వీడెన్
    భ్రాంతిని,తక్షణమే ముక్తి
    కాంతా రమ్మనె మోక్ష కాముకుడు తమిన్ .

    విద్వాన్,డాక్టర్ ,మూలేరామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి
  28. అంతా మిథ్యయను సత్యము
    కాంతారావుకు తెలిసిన క్షణమున వీడెన్
    భ్రాంతిని,తక్షణమే ముక్తి
    కాంతా రమ్మనె మోక్ష కాముకుడు తమిన్ .

    విద్వాన్,డాక్టర్ ,మూలేరామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549

    రిప్లయితొలగించండి
  29. డా. మూలే రామముని రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి, మూడవ పాదాలలో గణదోషం. సవరించండి.

    రిప్లయితొలగించండి
  30. "అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవ చ నైవ చ ।
    తస్మాత్ పుత్రముఖం దృష్ట్వా పశ్చాద్భవతి తాపసః"

    అంతము జేయుము నా యే
    కాంతమ్మును! తాళజాల! కంతుని తూపుల్,
    సంతానమె మోక్షమిడును
    కాంతా! రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్ :)

    రిప్లయితొలగించండి
  31. సుంతయు నార్జన లేకయె
    చింతించుచునప్పు దీర్చు చేవను గనకన్
    గంతుచు గంగా నదిలో
    కాంతా! రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్

    రిప్లయితొలగించండి