1, ఏప్రిల్ 2016, శుక్రవారం

సమస్య – 1990 (విధవ యననొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విధవ యననొప్పు భర్త జీవించియుండు. 
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. తాళి కట్టిన మొగుడిని తరిమి వేసి
    మారు పెండ్లిజేసుకొనెను చారుశీల
    ఇరుపతులలోన నొక్కండు మరణమొంద
    విధవ యననొప్పు భర్త జీవించియుండు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారు “ఇరుపతుల” సమాసము దోషము. “పతులిరువరు” అనవచ్చు. తదనుగుణముగ సవరణ చేయండి.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారికి నమస్కారములు,
      ఇరుపతులు అన్న సమాసము దోషము కాదనుకుంట.
      కేవల సంస్కృత పదము మీది తెలుగు పదము చేర్చుట దోషమగును. ఇక్కడ తెలుగు పదము మీద సంస్కృత సమమును చేర్చినాను. కాన ఇది మిశ్రమ సమాసము అవుతుంది కాని దోషము కాదు. "ఇరు వర్గములు", "ఇరు పక్షములు" మొదలగు ఉదాహరణలు చూడ వచ్చు.
      సమస్యా పూరణం -344 (బిడ్డఁ గన్న తల్లి) లో "డా.ఆచార్య ఫణీంద్ర" గారు "ఇరు సతులు" అని ప్రయోగించారు.

      డా.ఆచార్య ఫణీంద్రమే 22, 2011 9:45 [ఆం]
      "నా సుతు"డన, "కాదు - నా సుతుం" డని, ఇరు
      సతులు పోర; రాజు " సమ విభజన
      సలుపు" దనగ - తేలె సతుల నెవ్వ రెవరు
      ’బిడ్డ గన్న తల్లి’; ’గొడ్డురాలు’!

      తొలగించండి
    3. జిగురు సత్యనారాయణ గారు. మీరు చెప్పినది నిజమే. నేను పొరబడ్డాను. మన్నించండి.

      తొలగించండి
  2. గురువు గారికి కవిమిత్రులకు నమస్కారములు
    నేటి నా పూరణలు

    కలియుగమ్మున వింతల గాంచు మిదియె
    యలిగిన పతి యిల్లు విడిచి యాగ్రహమున
    బారి పుష్కరమ్ముయె దాట భార్యనపుడు
    విధవ యననొప్పు భర్త జీవించి యుండు

    విధవ రాండ్రకు సర్కారు విరివిగాను
    ధనము నిచ్చుననితెలిసి తరుణి యొకతె
    కుటిలతంత్రమ్ము లనెరిపి పటిమతొడ
    వలయు పత్రమ్ములనొసగి ప్రభువులకును
    పెన్షనందుకొనియె నెంత వింత యౌర
    విధవ యననొప్పు భర్తజీవించి యుండు

    రిప్లయితొలగించండి
  3. పతియె పరమపదించిన పడతి నికను
    విధవ యనగ నొప్పు, భర్త జీవించి యుండు
    స్త్రీలను సుమంగళు లని వచింతు రనుచు
    నెరుగ నట్టి వాడెవ్వడీ ధరణి యందు

    రిప్లయితొలగించండి

  4. ఓయి ! కవివర ! యిదియెట్లు ఒనరు? నెటుల
    విధవ యన నొప్పు భర్త జీవించి యుండు
    నపుడు? తప్పుకాయవలెను నన్ను యెగ్గు!
    పదము లనువేసి తిగదవె ప్రాస కొరకు :)

    రిప్లయితొలగించండి
  5. మొదట పరిణయ మాడిన మోద మనక
    వీడి పోవుట నేడది వేడు కనుచు
    మారు మనువాడి నంతనె మగడు జచ్చె
    విధవ యననొప్పు భర్త జీవించి యుండు

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    కనఁగ వీరేశలింగము ఘనతఁ బూన్కి
    స్త్రీపునర్వివాహంపు వర్తింపు కతన;
    ముసలి పెనిమిటి మృతిఁ, బెండ్లి పొసఁగ, బాల

    విధవ యననొప్పు! భర్త జీవించియుండు!!

    రిప్లయితొలగించండి

  7. సుతులనొసఁగిన నమరులున్ బతులు గాదె?
    పతిగఁ గుంతిని మనువాడి పాండురాజు
    శాపవశమున మరణించ శాస్త్రవిధిని
    విధవ యననొప్పు,భర్త జీవించియుండు.

    రిప్లయితొలగించండి
  8. భర్త జీవించియుండ...అని ఉంటే ఇంకా బాగుండేదేమో కదండీ.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారు పంపింది ‘జీవించియుండ’ అనే. నిన్న రాత్రి షెడ్యూల్ చేస్తున్నపుడు పొరపాటున ‘డ’ .. ‘డు’ అని టైపయింది. ఉదయం ఆ పొరపాటును గమనించేసరికే ఐదారు పూరణలు వచ్చాయి. అందుకని సవరించలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి

  9. భర్తమరణించినప్పుడుభార్యభువిని విధవయననొప్పు,భర్తజీవించియుండు
    శివునిగుడులకునేగుచుశివశివయని

    భక్తిశ్రధ్ధలబూజించపరమశివుని

    రిప్లయితొలగించండి
  10. ఇంటిపేరది చూడగా ' విశ్వనాథ '
    పరగ ' ధనలక్ష్మి వర్ధని ' వనిత పేరు
    మిత్రులైనట్టి వారలు మేలమాడ
    ' విధవ ' యననొప్పు భర్త జీవించియుండు.

    రిప్లయితొలగించండి

  11. గోలి వారు నమో నమః ! సూపర్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మాసాదిని నమంగళ మెందు కని యా మాటను రాజభావము తో ప్రతి హతము చేశాను.

    సాధ్వి సావిత్రి ప్రార్థింప శమను డంత
    భర్త ప్రాణముల నొసంగె పడతి కతని
    వరమునన్ సాళ్వ భావి ధవ యననొప్పు
    భర్త జీవించి యుండు సువర్తనమున

    రిప్లయితొలగించండి
  13. భర్త యాయు ముగియ వాని భార్య నిలను
    విధవ యననొప్పు;భర్త జీవించి యుండు
    నట్టి మహిళలముత్తైదు వంద్రు గాదె
    మహిని కాదన లేనట్టి మాట యిదియె/యిదియు.

    రిప్లయితొలగించండి
  14. మొదటి భర్తను విడిపించి ముదిత కపుడు
    మారు మనువును జరుపగన్ మగడు జచ్చె
    ఇతను పోయిన నేమయ్యెనతను యున్న
    విధవ యననొప్పు భర్తజీవించి యుండు.

    రిప్లయితొలగించండి
  15. నేటి అర్ధాంగి కంటికి కాటుకేది?
    పూలు,గాజులు,నుదిటికి బొట్టులేక
    తాళి,మెట్టెలు, కనరానితరుణి జూడ?
    విధవ యననొప్పు|”భర్తజీవించి యుండు”|

    రిప్లయితొలగించండి
  16. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ధవు డటన్న కనీస గౌరవము లేక ,

    సతము మానసికమ్ముగ చ౦పు చు౦డు ---

    నట్టి > పరమ సాధ్వీమణి < యవని లోన

    " విధవ " యన నొప్పు | భర్త జీవి౦చుచు౦డు -

    ఫలము లేకు౦డ , జీవఛ్ఛవ౦బు పగిది |

    పురుష రక్షణకై చట్టము లెవి లే వె ? ? ?

    [ ఎవి = ఎవ్వి , ఏవి ]

    రిప్లయితొలగించండి
  17. * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ఇ౦ట ధరియి౦చి , షూ టి౦గు నెదుట తీయ

    వలయు | నె౦దుకు వచ్చిన బాధ యనుచు

    టీ.వి. - చలనచిత్ర౦పు నటీ మణి " రమ "

    ప్రక్క విసిరె మా౦గళ్య సూత్ర౦బు నౌర !

    యామె బ౦దుగు లారసి యనుకొని రిటు ె

    " విధవ యన నొప్పు , భర్త జీవి౦చి యు౦డ "

    రిప్లయితొలగించండి
  18. * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ఇ౦ట ధరియి౦చి , షూ టి౦గు నెదుట తీయ

    వలయు | నె౦దుకు వచ్చిన బాధ యనుచు

    టీ.వి. - చలనచిత్ర౦పు నటీ మణి " రమ "

    ప్రక్క విసిరె మా౦గళ్య సూత్ర౦బు నౌర !

    యామె బ౦దుగు లారసి యనుకొని రిటు ె

    " విధవ యన నొప్పు , భర్త జీవి౦చి యు౦డ "

    రిప్లయితొలగించండి
  19. సంసరణమును జేయక సంతతమ్ము
    గడనకోసమె పతికిచ్చి గౌరవమును
    రాచిరంపాన బెట్టెడు లలన నెపుడు
    విధవ యన నొప్పు భర్త జీవించియుండు

    రిప్లయితొలగించండి
  20. భర్తకు విడాకులిచ్చి వివాహమాడ
    కాలవశమున నాతడు నేల రాల
    నామె నేమనవలెనార్య? యనగననియె
    విధవ యననొప్పు భర్త జీవించియుండ.

    నిన్నటి పూరణలు

    ఒరుల కంటబడక మరుగున నిడునదే
    దానగుణము; మిగుల హీనగుణము
    తృణము రాల్చ నదియె గణనీయమని జూప
    దూర దర్శనులను కోరు గుణము

    కూడు లేని వారు కోటాను కోట్లుండ
    తృణము నైన రాల్చు గుణము లేక
    లక్షలిచ్చి స్టార్ల లంచిలో పాల్గొను
    దానగుణము మిగుల హీనగుణము.

    రిప్లయితొలగించండి
  21. తలను పూలులేక మెడను తాళిలేక
    గాజులను తన సుందర కరము లందు
    దాల్చక తిరుగు చున్నట్టి తరుణిమణిని
    "విధవ"యననొప్పు :భర్త జీవించి యుండ.

    రిప్లయితొలగించండి
  22. గురుదేవులకు ప్రణామములు.మీ ఆరోగ్యం ఎలాయుందండీ?

    రిప్లయితొలగించండి
  23. మాస్టరు గారూ ! మీ ఆరోగ్యము లా ఉన్నది....అవసరమైతే తగిన విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  24. ప్రణామములు గురువుగారు..మీ ఆరోగ్యం ఎలావుంది?

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం మరింత దిగజారింది. నడుము, వెన్ను నొప్పితో పాటు నిన్నటినుండి జ్వరం ఉంది. మీ పూరణలపై స్పందించలేక పోతున్నందుకు మన్నించండి.
    నా ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందుతున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. గాంధి వంశపు భర్తలు కాటి కేగ
    చావు లేదుగ వారికి చక్క గాను
    రంగు రంగుల నేర్పోర్ట్లు రింగు రోడ్లు
    హెల్తు స్కీములు గృహములు హీనులకును
    పేరు పేరున వర్ధిల్లి మారు మ్రోగ
    నట్టి భర్తను కోల్పోవ నతని భార్య
    విధవ యననొప్పు,...భర్త జీవించియుండు!

    రిప్లయితొలగించండి