17, ఏప్రిల్ 2016, ఆదివారం

సమస్య - 2006 (పాల వలన వైర...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
పాల వలన వైరమే లభించు.

49 కామెంట్‌లు:

  1. పాల వలన పుష్టి వచ్చు జనులకు, దీ
    పాల వలన వెలుగు వచ్చును, మురి
    పాల వలన ప్రేమ బంధము హెచ్చు, కో
    పాల వలన వైరమే లభించు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      వాహ్! అద్భుతమైన పూరణతో శుభారంభం చేశారు. పూరణలోని శబ్దాలంకారం అలరించింది. అభినందనలు.

      తొలగించండి
  2. గురువు గారికీ నమస్కారములు

    సాటి జనుల పట్ల సఖ్యతనే కల్గి
    మసలు కొన్న వాడు మాన్యుడగును
    సహన మనుచు లేక అహముతో చూపుకో
    పాలవనన వైరమే లభించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      వలన->వనన... టైపాటు.

      తొలగించండి
  3. తప్పు జేయ నేమి దండించ
    బోవకు
    మృదువచనము తోడ కృపను కలిగి
    దిద్దవలెను గాని తీక్ష్ణత మరియు కో
    పాలవలన వైరమేలభించు

    రిప్లయితొలగించండి
  4. నోరుమంచిదైన నూరుమంచిదెయౌను
    మాటజారరెపుడు మంచివారు
    పరులపైన నెపుడు ప్రకటించునట్టి శా
    పాలవలన వైరమే లభించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. రాయబారంలో శ్రీకృష్ణుల వారు:
    మామా! సత్యవతీ పౌత్రా!

    పాండు సుతులు మిమ్ము పంచుమనిన సగ
    పాల వలన వైరమే లభించు
    ననిన నైదుగురకు నైదూళ్ల నిమ్మని
    విన్నవించి నారువినగ మీరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  6. పుష్టికలుగునార్య!తుష్టిగామనిషికి
    పాలవలన,వైరమేలభించు
    కారణమ్ములేకకాంతనుదూషించ భూరిశాంతమెపుడుభూషణమ్ము

    రిప్లయితొలగించండి
  7. కామముతో సంతత పర
    భామిని వలలోన జిక్కి వ్రయ్యుట కంటెన్
    క్షేమమగు నిజ గృ హిణిపై
    కామాతురుడైన నరుడె గాంచున్ ముక్తిన్
    Ninnati purana parisilimchamdi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ (నిన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. కాపురములు గూలు గార్చిచ్చు చెలరేగు
    శాంతి మృగ్యమవును సంతతమ్ము
    మమత లన్ని మాయు మనుజుల మధ్య కో
    పాల వలన వైరమే లభించు!!!

    రిప్లయితొలగించండి
  9. శాంత గుణము వలన శత్రువే హితుడౌను
    మాట కఱకు చేత మనసు విరుగు
    మిత్రు డొక్కడైన మిగులడు తుదకు కో
    పాల వలన వైరమే లభించు.

    రిప్లయితొలగించండి
  10. భాగవతుల కృష్ణరావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏల నీకు ప్రేమ యీశునిపై గౌరి
    బూదిపూత మేన బుస్సుమనుచు
    వేచియుండు కాటువేయుటకు సరీసృ
    పాల వలన వైరమే లభించు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ మిస్సన్న గారికి హేట్సాఫ్..అందరం కోప,తాప,శాపాల దగ్గర ఆగిపోతే మీరు సరీసృపాలను పట్టుకొచ్చారు..చాలాబాగుంది పద్యం..

      తొలగించండి
    2. మిస్సన్న గారూ,
      వైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  12. కోపము వలన కలుగు బహు దుఃఖమ్ములు
    చెరచు గార్యములను శ్రీఘ్రమనవ
    రతము వ్యర్ధములు నిరవథిక కోప తా
    పాల వలన వైరమే లభించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ పద్యంలోని విశేషం... ఎవరైనా పద్యం చదవడం ప్రారంభిస్తే కొద్దిగా వినగానే నేను అది ఏ పద్యమో చెప్పగలను. కాని ఈ పద్యాన్ని పూర్తిగా వినిపించినా ఇది ఆటవెలది అని గుర్తు పట్టలేను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీరు చెప్పే వరకు నేను గమనించ లేదు. బహుశ అక్షరములు ఎక్కువ గా నుండుట వలన, పదములు తదుపరి పాదమున కొనసాగుట వలన నయియుండ వచ్చు.

      తొలగించండి
    3. అదే కదా నేను చెప్పింది. చూసి చదివితే ఆటవెలది... వింటే మాత్రం అది ఏ ఛందస్సా అని తికమకపడడం ఖాయం!

      తొలగించండి
  13. ధనము కొరిగెడు దవఖానల నరక కూ
    పాల వలన క్షౌరమే లభించు
    చదువు" కొనగ" పాఠశాలల లోనిలో
    పాల వలన వైరమే లభించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మడిపల్లి రాజకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో ‘ప్రాసయతి’ తప్పింది. ప్రాసముందున్న అక్షరాలు గురులఘు సామ్యం కలిగి ఉండాలి. అంటే ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు రెండుచోట్ల ఉండాలి. అన్యదేశ్యమైనా అది ‘దవాఖానా’. దవఖానా అనడం గ్రామ్యం. నష్టాన్ని క్షౌరమనడం వ్యావహారిక జాతీయం. మీ పూరణలో మొదటి రెండు పాదాలను సవరించండి.

      తొలగించండి
    2. స్వాస్థ్యు కైన వైద్య శాలలు నరక కూ
      పాలు కాగ, చావు జోల పాడు
      చదువు" కొనగ" పాఠశాలల లోనిలో
      పాల వలన వైరమే లభించు

      తొలగించండి
    3. ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. చీపురందియోర్తు చెత్తను నూడ్చుచు
    దారి ప్రక్క దాని తగులబెట్టె
    పచ్చి చెత్త నుండి చిచ్చది రామి,ధూ
    పాల వలన వైరమే లభించు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      పొగ బెట్టి పోరు పుట్టించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. ఆవు పాలు తాగ నారోగ్య మొదవేను
    పెద్దవారి వల్ల ముద్దు తీరు
    కలతలెక్కు వైన కడలేని శాప,కో
    పాలవలన వైరమే లభించు.


    పాలు నీరు వోలె బాలురెల్లరు చేరి
    పాఠశాలకేగ బలము పెరుగు
    చిన్ని చిన్ని కలతె చెరుపుబంధ మిల కో
    పాలవలన వైరమే లభించు.

    అందరుకలిసున్న ఐక్యత పెరిగేను
    పోరు చున్న కొలది పుట్టు రగడ
    అర్థమెరుగ నట్టి యావేశమేల,కో
    పాలవల్ల వైరమే లభించు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘త్రాగ నారోగ్య మొదవును’ అనండి.
      మూడవ పూరణలో ‘కలసి+ఉన్న’ అన్నపుడు సంధి లేదు. ‘అంద రేకమైన..’ అనండి.

      తొలగించండి
  16. పాలనమ్ము వాడు పాలనీరుగలుప
    పాలనమ్ము చెడగ ప్రభుతకైన
    పాలుపంచకున్న మేలువారసులకు
    'పాల' వలన వైరమే లభించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పాలు నీరు, పాలుపంచు... సరే. కాని ప్రజా పాలమ్మునకు ‘పాల’కు సంబంధం?

      తొలగించండి
    2. అయితే వేరే పాలు పెడతానండీ...ధన్యవాదములు.



      పాలనమ్ము వాడు పాలనీరుగలుప
      పాలు సరిగనీక పంట రైతు
      పాలుపంచకున్న మేలువారసులకు
      'పాల' వలన వైరమే లభించు.

      తొలగించండి
    3. హనుమచ్ఛాస్త్రి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. పాలు జీర్ణ శక్తి,బలమును జేకూర్చు|
    కాలమహిమ వలన కల్తిబెరుగ?
    లేనిరోగాములను మానక బెంచుచు
    పాలవలన వైరమేలభించు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      రోగము... రోగాము అయింది.

      తొలగించండి
  18. నాది యీ బలపము-కాదు నా బలపమ్ము
    నీది కాదు నాది- కాదు నాది
    యనుచు వాదులాడు నాబాలురకు బల
    పాల వలన వైరమే లభించు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. విష్ణునందన్ గారూ,
      మీ ‘బలపాల వైరం’ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  19. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    (కొ౦ డ అ ద్ద మ ౦ దు కొ ౦ చె మై యు ౦ డ దా)
    ....... ......................... ......................


    " ఉత్సాహము "


    ఉనికి నీది కాని యెడల.
    నూరకు౦ట మేలగున్

    గనపడు గద ముకుర మ౦దు
    క్ష్మాధరమ్ము చిన్నదై

    వినుము నోరు మ౦చి దైన
    వేయి శుభము ల౦దు గా

    పనికి రాని పాల వలన
    వైరమే లభి౦చు రా


    ముకురము = దర్పణము • పాలు = రూపా౦తర౦ = ప్రాయి = పౌరుషము
    పనికిరాని పాల వలన = పనికి రాని పౌరుష౦ వలన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ ఉత్సాహం చక్కని నీతితో ఉరకలు వేసింది. కాని ‘పాల’కు పౌరుష మనే అర్థం?

      తొలగించండి
  20. శాంతము గల వారు సర్వజనాలితో
    కలసి మెలసి యుంద్రు కక్ష లేక
    ప్రేమ భావముడిగి పెంపెక్కినట్టి కో
    పాల వలన వైరమే లభించు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. పొగడితనను తానె పొంగిపోవు చు మది
    తెగడిపరులనెపుడు తృప్తిపడెడు
    మలిన హృదయుడైన మనుజుడు పల్కు గ
    ప్పాల వలన వైరమేలభించు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ ‘గప్పాల’ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. రసిక రాజుననుచు రచ్చబండల నెక్కి
    మెప్పు కోరు కొనగ ముప్పు తెచ్చు
    వక్ర బుద్ధి చెలగు వ్యంగ్యపు బ్లాగు ట
    పాల వలన వైరమే లభించు

    రిప్లయితొలగించండి