20, ఏప్రిల్ 2016, బుధవారం

సమస్య - 2009 (వ్యర్థ మొనరింపఁ దగును...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.

47 కామెంట్‌లు:

  1. నమస్కారములు
    నాలుగు రోజులగా జ్వరంగా ఉన్నందున బ్లాగుకు దూరమయ్యాను .ఇప్పుడు కొంచం నయం గాఉంది.
    ------------------------------
    కూడ బెట్టిన ధనమును కోరి కోరి
    దాన మొనరించ లేకను తాను తినక
    మరణ మాసన్న మగునంత మదిని రోసి
    వ్యర్ధ మొనరింపఁ దగును సంపదల నెల్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారు నమస్కారములు.మీయారోగ్యము జాగ్రత్త. స్వస్తి.

      తొలగించండి
    2. అక్కయ్య గారూ,
      ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుదుట పడిందా?
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. 'వేస్టు' ఖర్చనియంద్రుగా వేడ్కలకును
    కానియదిజేరు నిజముగా పేదలకును
    పాలు, సరుకులు,పూలకు మేలుగాను
    వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు అట్నుంచి నరుక్కొచ్చారన్న మాట! బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. భారమునఁ గ్రుంకు పడవఁ గాపాడు వేళఁ
    బ్రాణ రక్షణమె ప్రధాన పథము గాన
    అన్న! నా సరుకని వెనుకాడ రాదు
    వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరుకులు నీటిపాలైనా ప్రాణం దక్కితే చాలు, ప్రాణాలు సంపదలకన్న ముఖ్య మన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. సార్థకము జేయవలెను గాని యేల
    వ్యర్థమొనరింప దగును? సంపదలెల్ల
    మానవ సుఖజీవనంపు మహిత గతులు.
    ప్రాణి కోటికి నిత్యంపు పరమ నిధులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగుంది.
      మొదటి, రెండవ, మూడవ పాదాల్లో గణదోషం.....
      సమస్య ‘సంపదలనెల్ల’ అని ఉంటే మీరు ‘సంపదలెల్ల’ అని పూరించారు. సవరించండి.

      తొలగించండి
  5. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    తే**
    తండ్రి కూడబెట్టు ధనము,!తనయు డెపుడు,
    వ్యర్ధ మొనరింప దగును సం!పదల నెల్ల, !
    తండ్రి పేరది నిలుపగ !తపన గలుగ,
    నార్థి జెందిన జనులచె ! కీర్తి నొందు !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలో కొంత అన్వయలోపం ఉంది. అర్థి జనులకు ఇవ్వడం వ్యర్థ మెలా అవుతుంది? ‘జనులచె’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.

      తొలగించండి
  6. సర్వ భూతహితార్తియై సాగుచు నప
    రిమితమగు గాక వ్యయ మొనరింపగం, గృ
    పా రసము మది ప్రసరింప పాప ఫలము
    వ్యర్ధ మొనరింపఁ దగును సంపదల నెల్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాప ఫలాన్ని వ్యర్థం చేయడం అన్న భావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  7. సార్ధకమ్మునుజేయుమసంపదలను ననుచుచెప్పవలెనుగానినార్య!యిటుల వ్యర్ధమొనరింపదగునుసంపదలనెల్ల
    ననగనాయమె?మీవంటియార్యులకిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సంపదల న|టంచు చెప్ప...’ అనండి.

      తొలగించండి
  8. పారమార్థిక జీవన పయన మందు
    లౌకికమగుసంసారము లాగు చుండ
    మాన సిక భౌతి కంబుల మనుజు లెల్ల
    ద్వ్యర్థ మొనరింప దగును సంపదల నెల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యర్థాన్ని ద్వ్యర్థం చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. శర్మ గారు మీ పద్యము చాలా బాగుంది కాని యిచ్చిన సమస్యను వదలి యన్య సమస్య పూరించారు.ఏదైనా సంధి వలన "వ్య" "ద్వ్య" అయిన సమస్యకు భంగము రాదు. ఉ: మహత్ + వ్యర్థ. కనుక మీరు ఈ సమస్యను కూడ పూరిస్తే బాగుంటుందని నా అభిప్రాయము.

      తొలగించండి
  9. లంచ వంచన పంచన నుంచు సుఖము
    మించు మేఘాల వెలుగని నెంచకున్న?
    వ్యర్థ మొనరింప దగును సంపదల నెల్ల
    పట్టు బడగానె?ఆస్తులు పట్టుదప్పు| {మేఘాలమెరుపువెలుగుసహాయపడదు.వంచనలంతే}
    2.కలిమిబలిమిని నమ్మిన కలతలబ్బు|
    అంతకోపాన బుద్దియే సబ్బులాగ
    కరిగి పోవగ మనసున్నవిరిగిపోవ?
    వ్యర్థ మొనరింప దగును సంపదల నెల్ల|

    రిప్లయితొలగించండి
  10. తిరిగి రాదు కాలమ్మని యెరిగి నట్టి
    మానవుండిచ్చగింపడు తాను యెపుడు
    వ్యర్థమొనరింప, దగును సంపద లెల్ల
    ధర్మ కార్యనిర్వహణకై త్యాగ మిడిన

    రిప్లయితొలగించండి
  11. వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల
    దీన రక్షణ కిసుమంత పూన కున్న ;
    పాతరల నుంచి భూమిని పాతి పెట్టి
    కూల కోటీశ్వరుడొక కూళ యగుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కూల కోటీశ్వరుం డొక...’ అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  12. దేశ ప్రగతి నడ్డుకొను నే దేని నిలను
    వ్యర్ధ మొనరింప దగును! సంపదలనెల్ల
    సక్రమంబుగ వాడుచు, సాదరమున
    ప్రజల పాలింప వలయు నే ప్రభుత యేని!

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    నడ్డదారులఁ ద్రొక్కియు, నార్జనమును
    రెండు చేతులఁ బొందియుఁ, బ్రీతి నిడని,
    పేదలకుఁ దిండిఁ బెట్టని విత్త మేల?

    వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అడ్డదారులు... నడ్డదారు లయ్యాయి టైపాటువల్ల.

      తొలగించండి
    2. అవును శంకరయ్యగారూ! టైపాటే అది. ఎలా పడిందో...బహుశః పాదాలను సర్దుబాటు చేస్తున్నప్పుడు ఇలా జరిగి వుంటుంది. నేను చూసుకోకుండానే ప్రచురించాను.

      అడ్డదారులఁ ద్రొక్కియు, నార్జనమును
      రెండు చేతులఁ బొందియుఁ, బ్రీతి నిడని,
      పేదలకుఁ దిండిఁ బెట్టని విత్త మేల?

      వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల!

      తొలగించండి
  14. అర్ధములు నిత్యములుగావటంచు దెలిసి
    అర్ధయుతముగ.ఖర్చు సేయంగవలయు
    వ్యర్ధ మొనరింప దగును సంపదలనెల్ల
    దేశరక్షణ విధులకై ధీయుతముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగున్నది. కానీ దేశరక్షణకు వినియోగించడం వ్యర్థం చేయడ మెలా అవుతుంది?

      తొలగించండి
    2. గురుదేవులసందేహ నివృత్తీ గావించుట దుస్సాధ్యము మరియొక పద్యము
      ప్రస్తుతి
      అర్ధ రహితమౌ మత దురాహ౦కృతులను
      వ్యర్ధ మొనరింప దగును.సంపదలనెల్ల.
      నర్ధయుతముగ ఖర్చు చేయంగ వలయు
      ప్రజల సంక్షేమ సిధ్ధికై వ్యయ మొనర్చి

      తొలగించండి


  15. తండ్రి తాతలు దాచిన ధనము నేల
    వ్యర్థమొనరింపదగును?సంపదల నెల్ల
    ధర్మకార్యములకు వాడ ధరణి యందు
    పుణ్యమబ్బును గనరండు పూజ్యులార.
    2.కూడబెట్టిన యాస్తిని కుళ్ళబొడచి
    కన్నవారిని హింసించి కాసులేల
    వ్యర్థమొనరింపదగును,సంపదల నెల్ల
    సద్వినిమయము చేయంగ శాంతి గలుగు.

    రిప్లయితొలగించండి
  16. అంబటి భానుప్రకాశ్ గారి పూరణ.....

    చెప్పువారలు లేకను చెడిరి జనులు,
    చెడ్డదారుల బోయిరి చెడును గనుక,
    ధనము నెప్పుడు కూడగ దాచిపెట్టి
    వ్యర్థ మొనరింప దగును సంపదల నెల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ యీ తాజా పూరణలో పద్యం వరకు బాగున్నది. కాని భావమే సందిగ్ధంగా ఉంది.

      తొలగించండి
  17. మారణాయుధములసదా మనుజజాతి
    వ్యర్థ మొనరించదగును , సంపదలనెల్ల
    ప్రగతికోసము వె చ్చించ జగతిలోన
    కరువు కాటకములు వెస తరిగిపోవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్థకమ్మొనరింపుమ సాయి! యేల
      వ్యర్థ మొనరించదగును? సంపదలనెల్ల
      బహుళ రీతిని పేదల బాగు కొఱకు
      వాడుకొనినను దేశంబు భద్రమగును.
      ,,,,,,,,,,,

      పొరబాటునకు క్షంతవ్యుడను.

      తొలగించండి
    2. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (మీరు అన్నపరెడ్డి సామ్రాజ్యంలోకి చొచ్చుకొని వెళ్ళారు. వారి పూరణ క్రింద ఉన్న ‘ప్రత్యుత్తరాలు’ నొక్కి అక్కడ వ్రాశారు. మీరు మీ పూరణ క్రింద ఉన్న ప్రత్యుత్తరాలు అన్నచోట పోస్ట్ చేయండి.)

      తొలగించండి
  18. నల్లాన్ చక్రవర్తుల వేంకట నరసింహాచార్యులు గారి పూరణ...

    ఎలుక బొద్దింకయు మిడత లిట్టివన్ని
    నష్ట మొనరించుచుండును నరుల కెపుడు
    వ్యర్థ మొనరింపఁ దగును సంపదల; నెల్ల
    వేళల చెఱుపుఁ జేసెడి వేవియైన.

    రిప్లయితొలగించండి
  19. పన్ను రూపాన ‌‌‌‌రాబట్టి ప్రజల ధనము
    వారి సౌకర్యముల జూడ వాడవలయు.
    తిరిగి రాబడి లేనట్టి తీరు నేల
    వ్యర్థ మెునరింప దగును సంపదల నెల్ల?

    రిప్లయితొలగించండి
  20. అక్రమార్జన చేసిన అర్థములను

    నిండు పేదలక డుపులు నిమ్పుకొరకు

    పనికి రానట్టి పాపపు ధనము లన్ని

    వ్యర్థ మొనరింప దగును సంపదలనెల్ల.

    విద్వాన్, డాక్టర్, మూలె రామమునిరెడ్డి, ప్రొద్దుటూరు కడప జిల్లా 7396564549.

    రిప్లయితొలగించండి
  21. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పూరణ....


    శివము నొంద వాసనలను చేయ వలెను
    నిరతమంతర్మథనమెప్డు నియతి తోడ
    పరహితార్థమై వెచ్చింప దొరకు పదము
    వ్యర్థ మొనరింపదగును సంపదల నెల్ల.

    రిప్లయితొలగించండి
  22. కొంత బీడి నస్యములకు నింత దాచి
    కొంత పేకలు సినిమాల కింత దోచి
    యిల్లరికపు టత్తయ్యవి నింపు గాను
    వ్యర్థ మొనరింపఁ దగును సంపదల నెల్ల :)

    రిప్లయితొలగించండి