29, అక్టోబర్ 2016, శనివారం

సమస్య - 2184 (నాగేంద్రాభరణుండు చంపె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్"
లేదా...
"నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్"

82 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వేగము గలిగిన మదమున
భోగము లందున మునిగి భూభార ముగన్
రాగా తీతుని దనుజుని
నాగా భరణుండు కినిసి నరకునిఁ జంపెన్

Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు:

ఆగడకాడై జనులను
పాగుని గూడని విధమున పరిమార్చెడి యా
రేగాముని తీరు నరసి
నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్.

Zilebi చెప్పారు...




అందరికీ దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి చుట్టిన జాంగ్రీ కథ !

బాగుగ చదివెనొక జిలే
బీ గురువుల చెంత, చెప్పె బింబానన తా
పాగెము లేని కథనొకటి
"నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్" !

జిలేబి

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

ప్రాగ్జౌతిషపుర నాథుని
యాగడములుబాడబంబులైచెలరేగన్
వేగమె నాహరి, వందిత
నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

వందిత నాగ+ ఆభరణుండు : నమస్కరించు కరిని ఆభరణముగాగలవాడు

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

పదోతరగతి విద్యార్ధికి పీ. హెచ్. డీ. ప్రశ్నపత్రం ఇచ్చారు శంకరయ్య గారు:


ఆగ్రహమున భామామణి
భాగస్వామిగ రణమున భారము దాల్చన్;
ఏగుచు చూడంగ దివిని
నాగాభరణుండు, కినిసి నరకుని జంపెన్!

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

వేగమ్మున్ కుసుమాయుధుండు శరముల్ వేయంబ్రయత్నింపగా
యోగాగ్నిన్ తన ఫాలనేత్రమున సంయోగించి యుగ్రుండునై
నాగేంద్రాభరణుండు చంపె;నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్
నాగౌఘాశనవాహనుండు తునిమెన్ నాళీకనేత్రుండునై ||


శ్రీగణపతి తలఁద్రుంచెన్
నాగాభరణుండు కినిసి, నరకునిఁ జంపెన్
యోగీశ్వరుండు కృష్ణుడు
వేగరు కొడుకనుచునెంచి విశ్వేశ్వరులున్ ||

Zilebi చెప్పారు...




ఒక ప్రయత్నం !


భోగేంద్రుండగు రాక్షసుండతనికిన్ పోగాలముల్రాగ తా
భాగంబాయెను సత్యభామ ప్రసువై బాణాసనంబున్ మహా
యోగంబైగనుచున్ , శతఘ్ని విడిచెన్ యోగాత్మ, శ్రీకృష్ణు డే
నాగేంద్రా, భరణుండు, చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్!


జిలేబి

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
ప్రోగుల్ వేసి పురాణముల్ దెలిపెడిన్ బుట్టించు బ్రహ్మంబునున్
నాగేంద్రంబును గాచినట్టి హరినిన్ నా శంకరున్నైక్యతా
భాగంబుల్ యననొప్పు నంచు; శివమే భాస్వంతమై వెల్గగా
నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చగన్
భోగాలకు బరిరక్షణ
యాగాలకు హరియ కర్త యై శివ శక్తిన్
పాగా వేయగ ,హరు,డౌ
నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

గురువులకు నమస్సులు .

చేగొని హరి చక్రంబును
రేగుచు సతితో యసురుని రివ్వున చెండన్
కాగుచు నా సమరము గన
నాగా భరణుండు, కినిసి నరకునిఁ జంపెన్

sailaja చెప్పారు...

తీగవిలుకాని సరిగొనె
నాగాభరణుండు కినిసి, నరకుని జంపెన్
వేగమె హరిసతితోజని
రేగాముని యణచి ధరను లీలగ గాచెన్!!!

vsnmhari చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gurram.jana@gmail.com చెప్పారు...

నాగేశుడు తల పెట్టిన
యాగమెవడు భగ్న పరచె? నాలియె గూడ
న్నా గిరిధరు జంపె నెవరి?
నాగాభరణుండు కినిసి; నరకుని జంపెన్

మంజూషిక చెప్పారు...

ఆగడకాడై నరకుడు
వీగుతు ముల్లోకములను విసిగించంగన్
వేగమె సతితోనాపు
న్నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

vsnmhari చెప్పారు...

నీగమ్యంబగు సద్వివేకి వగుటల్, నిష్ఠాగరిష్ఠుండవై
రాగాత్మం బఠియించి సర్వజగతిన్ రాణించరా యన్న వా
డా గోపాలుడు బుద్ధిహీను డొకనా డాడెన్ స్వమిత్రాళితో
నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చగన్.

వేగంబుగ నా విషమును
త్రాగిన వాడెవ్వ డింక తా నా కృష్ణుం
డాగక చేసిన దేమన
నాగాభరణుండు, కినిసి నరకుని జంపెన్
హ.వేం.స.నా.మూర్తి

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

దీపము దృష్టబ్రహ్మము
దీపము తిమిరాంతకంబు, తేజోనిధియున్
దీపముఁ జ్ఞాననిధానము
దీపవ్రాతంబుమీకు దీవెనలిచ్చున్

దీప వ్రాతము : దీపావళి
నిధానము :నిధి

A.Satyanarayana Reddy చెప్పారు...

వేగముగ మరునిఁ దునిమెను
నాగాభరణుండు కినిసి, నరకుని జంపెన్
నాగశయనుండు మూర్ఛిల
సాగించి రథమురయమున సత్య యొరపుతో

Unknown చెప్పారు...

యాగము ధ్వంస మొనర్చెను
నాగాభరణుండు కినిసి,నరకుని జంపెన్
యోగేశ్వరుడౌ కృష్ణుడు
బాగుగ సతి సత్యభామ బాణము నేయన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

[1]
యోగీశులఁ పరసతులను
వేగమె చెఱఁబెట్టి భువినిఁ భీతిలఁ జేయన్
నాగధర మురారి నమిత

నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్!

[2]
యోగుల నతివలఁ జెఱలోఁ
దాఁ గదించి కాసిఁ బెట్టు తరిఁ బ్రార్థింపన్
వేగమె యా గోవర్ధన

నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్!

subbarao చెప్పారు...

ఆగణపతినిన్ జంపెను
నాగాభరణుండు కినిసి ,నరకుని జంపెన్
పోగాలము వచ్చుతరిని
నా దుర్గయె భామయగుచు నాజిని లోనన్

Bhagavatula Krishna Rao చెప్పారు...

భాగస్వామిని సత్యయె
రాగోరన్, హరి సరెయనె రణభూమికి నా
డోగిత మని, తిలకించగ
నాగాభరణుండు, కినిసి నరకునిఁ జంపెన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

రాగద్వేష పరీత చిత్త మయ నిర్మాణంబు లా వీడులే
వేగద్యుమ్న శరాళిఁ బట్టణములన్ విధ్వంసముం జేసె నా
నాగేంద్రాభరణుండు, చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్
నాగేంద్రాస్తర భూషితుండు హరియే నందాత్మజుం డుగ్రతన్

[ ద్యుమ్నము= బలము]


భాగవ తోత్తము లెల్లర
వే గాసిలి పలు విధముల వేధింప నిలన్
వేగమ కృష్ణుడు కీర్తిత
నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్

[ గాసిలి = కోపించి]

P.suryanarayana rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
P.suryanarayana rao చెప్పారు...

కవి పండిత మిత్రమండలికి నరక చతుర్దశి శుభాకాంక్షలు.

యోగానందాత్మభవుడు
నాగాభరణుండు-కినిసి నరకుని జంపెన్
భోగారూఢుడు వెన్నుడు
వేగంబుగ బ్రజలగావ విశ్వాత్ముండై.

P.suryanarayana rao చెప్పారు...

కవి పండిత మిత్రమండలికి నరక చతుర్దశి శుభాకాంక్షలు.

యోగానందాత్మభవుడు
నాగాభరణుండు-కినిసి నరకుని జంపెన్
భోగారూఢుడు వెన్నుడు
వేగంబుగ బ్రజలగావ విశ్వాత్ముండై.

Sistla Sharma చెప్పారు...

వీగెడి మదనుని యదిమెను
నాగాభరణుండు కినిసి; నరకుని జంపెన్
వేగం బందుచు సత్యయె
తూఁగుచు నా గృష్ణు జెంత తూపులయొఱపున్!

తూఁగు=నడచు
తూపు=బాణము
ఒఱపు=ప్రతాపము

P.suryanarayana rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. దీపావళి శుభాకాంక్షలు. మీ రెండు పూరణలు ప్రశస్తముగానున్నవి. కాసిఁ బెట్టు నా లేక గాసిఁ బెట్టు నా? తెలుపగలరు. నేను కూడా గాసిలి పదము వాడితిని.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...

ఆ గణనాధుని జంపెను

నాగాభరణుండు కినిసి; నరకుని జంపె

న్నా గోవిందుడు మూర్ఛిల

సాగించి బవరము' సత్య' శరముల తోడన్.

Sreedhara Rao Machavolu చెప్పారు...

యాగమున నడ్డె దక్షుని
నాగాభరణుండు కినిసి! నరకుని జంపెన్
వేగిరమె జక్రి తోడుగ
సాగిన సతి సత్యభామ సహకారమునన్!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అక్కయ్య గారు దీపావళి శుభాకాంక్షలు.రెండవ పాదములో గణదోషము."మునింగి" యనిన సరి పోవును. నాగా భరణుండు పదమునే విధముగా తలచితిరో వివరించలేదు. రాగాతీతుడని దనుజునికొక సద్గుణమును కూడ నాపాదించితిరి. బాగుంది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

రాజారావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ బాగుంది. పాగుని? సమస్య ముడి నెలా విప్పితిరి?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అందరికీ నరక చతుర్దశి పర్వదిన శుభాకాంక్షలు.

గురుదేవులు సత్వరమే కోలుకోవాలని భగవంతునికి మా ప్రార్థన.
రాగము వీడెను సత్యయె
పోఁగాలము దాపురించ పుత్రుని కంతన్
రేగుచుఁగూల్చెన్ గద? యే
నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్?

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

జిలేబి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ హాస్యరస భరితమై బాగున్నది. తాఁ బాగెము అనండి.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ బాగుంది. ప్రాగ్జ్యోతిషపురము. ప్రాస తప్పినది. రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చువచ్చు. మిగిలిన హల్లులతో సంయుక్త మయితే కుదరదు.
యాగడములు వేడబంబు అనండి. వందితనాగాభరణుండు అంటే నమస్కరింప బడినకరిని ఆభరణముగాగలవాడని రావచ్చు. నాగ వందిత ఆభరణుడు అని పద విభాగము చేసిన అన్వయము కుదురుట లేదు. శరణాగత నాగాభరణుడు అనవచ్చు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శాస్త్రి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ పట్టభద్రుని పూరణ వలెనే యున్నది. వాక్యాంతము పాదాంతము నయిన గాని పద్యములలో విసంధిగా వ్రాయ కూడదు. దాల్చ /న్నేగుచు అనండి.
ఎవరు చంపారో ప్రస్తావించ లేదు. దాల్చ / న్నాగోపాలుడు సూడగ అన వచ్చు. ఇక్కడ ప్రాస లో గ్ర వలదనుకొనిన వేగమ్ముగ అని వ్రాయ వచ్చు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

Respected Sir:

Greetings and profound thanks for your corrections. I will remember them. There is a folklore that it was Satyabhama who killed Narakasura...Happy Deepavali!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా. అనిల్ కుమార్ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ రెండు పూరణలు ప్రశస్తముగా నున్నవి. సహస్రకరుడని యా వేగరు యనగ. అనగా విష్ణుని కొడుకనియా? సందేహము తీర్ప గోర్తాను.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

జిలేబి గారు దీపావళి శుభాకాంక్షలు.నాగేంద్రా యని సంబోధనతో ఆభరణయుక్తుడైన కృష్ణుడు చంపె ననడము చాలా బాగుంది. మీ ప్రయత్నము దిగ్విజయమైనది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా.పిట్టా వారు దీపావళి శుభాకాంక్షలు.శివకేశవాభేదమును తెలుపు మీ పూరణ లద్భుతముగా నున్నవి.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శ్రీరామ శంకర ప్రసాద్ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ యుత్తమముగా నున్నది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

జనార్దన రావు గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ క్రమాలంకారము తో బాగుంది. నాగేశుడ న నెవరో యవగతము కాలేదు. వివరించ గోర్తాను.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సుకవి మిత్రులు కామేశ్వర రావుగారూ...నమస్సులు! మీ అభినందనకు ధన్యవాదములు.

నేను "గాసిఁబెట్టు" అనియే టైపు చేశాను. కాని, మొబైలులో స్పేస్ కొట్టగానే, ఎందుకో "గా" బదులు "కా" పడినది. నేను చూచుకొనకయే పోస్టుచేశాను. తెలిపినందులకు కృతజ్ఞతలు!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శ్రీరామా రావు గారు దీపావళి శుభాకాంక్షలు. పురుష శ్రేష్టుని (పురుషోత్తముడు) కర్తగా చేసిన మీ నైపుణ్యము ప్రశంసనీయము.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కలువల మాల నాభరణముగా కలవాడని కూడ అనుకోవచ్చు.

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

ఆర్య! కామేశ్వరావుగారూ! అనేక నమస్కారములు. మీకు కూడ దీపావళి శుభాకాంక్షలు. శివకేశవులిరువురు కూడ విశ్వేశ్వరులే. కృష్ణుని కుమారుడు నరకుడు. శివుని కుమారుడు గణపతి. ఆ విశ్వేశ్వరులు తమకు విసుగు తెప్పించిన కొడుకులతో వేగలేక (సహించలేక) పోయినారు. కొడుకులని కూడ చూడకుండా శిక్షించినారు అని నా భావన. ధన్యవాదములు. వేగుట = సహించుట.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


ఆగము చేయుచు నరకుడు
సాగించెను మునులహింస సంరంభముతో
వేగమె సతితో వచ్చిన
నాగాభరణండు కినిసి నరకుని చంపెన్.

రాగముతో సతితోడను
వేగముగా నాదనుజుని విక్రమమణచ
న్నాగరుడుని యెక్కిన యా
నాగాభరణుండు కినిసి నరకుని చంపెన్.

దాగిన కాముని గాంచును,
నాగరుడునిపైన నెక్కి హరుషము తోడన్
వేగముగా వచ్చి న హరి
నాగాభరణండు,కినిసి నరకుని చంపెన్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


ఆగము చేయుచు నరకుడు
సాగించెను మునులహింస సంరంభముతో
వేగమె సతితో వచ్చిన
నాగాభరణండు కినిసి నరకుని చంపెన్.

రాగముతో సతితోడను
వేగముగా నాదనుజుని విక్రమమణచ
న్నాగరుడుని యెక్కిన యా
నాగాభరణుండు కినిసి నరకుని చంపెన్.

దాగిన కాముని గాంచును,
నాగరుడునిపైన నెక్కి హరుషము తోడన్
వేగముగా వచ్చి న హరి
నాగాభరణండు,కినిసి నరకుని చంపెన్.

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సత్యనారాయణ మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు. వెర్రివాని మాటగా మొదటి పూరణ క్రమాలంకార మున రెండవ పూరణ బాగున్నవి. మీ శార్దూలాన్ని నాలుగైదు సార్లు చదివితే గాని విషయము బోధ పడలేదు. ఇప్పుడు కూడా యెంతవరకు కృతకృత్యుడ నయ్యానో తెలియదు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు. మీ దీప్తాశీస్సులకు ధన్యవాదములు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సత్యనారాయణ రెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపు తో మీ పూరణ చక్కగనున్నది. భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తిమ్మాజీ రావు గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది.

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

వేగు (vegu) to endure trouble. కష్ట సహనము.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అన్నయ్య దీపావళి శుభాకాంక్షలు. క్రమాలంకారము తో నీ పూరణ బాగుంది. నాల్గవ పాదములో ప్రాస తప్పింది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ధన్యవాదములండి.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కృష్ణా రావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీపూరణ చాలా బాగుంది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సూర్యనారాయణ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపు తో చాలా బాగుంది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శర్మ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపుతో బాగున్నది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నాగేశ్వర రావు గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీ పురాణ బాగున్నది. "సాగించి పవరము" అనండి. సరళాదేశము కాదు కదా.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శ్రీధర రావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపు తో బాగుంది.

Sistla Sharma చెప్పారు...

కవివరేణ్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. మీకును.....సుకవి గణమునకును దీపావళి శుభాకాంక్షలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సహదేవుడు గారు దీపావళి శుభాకాంక్షలు. మీపూరణ చాలా బాగుంది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా.ఉమాదేవి గారు దీపావళి శుభాకాంక్షలు. మీ మూడు పూరణలు బాగున్నవి. నాగాభరణుడు పదము నెట్లు సమర్థించు చున్నారో ప్రస్తావించ లేదు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ధన్యవాదములండీ.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ధన్యవాదములండి. వేగు (క్రియ) దిశలో ఆలోచించలేదు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శైలజ గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీపూరణ చాలా బాగుంది.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

శ్రీమదాంధ్ర మహా భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

Oh! I didn't know. Thank you sir for the clarification.

Regards
gps

కంది శంకరయ్య చెప్పారు...

కవిమిత్రులకు నమస్కృతులు.
నా ఆరోగ్యం దాదాపుగా మెరుగయింది. రేపటినుండి మీ పూరణలను సమీక్షించగలనని భావిస్తున్నాను.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన అందరికీ అభినందనలు.
ఈనాటి పూరణలను సహృదయంతో సమీక్షిస్తున్న పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
"రాగోన్మత్తుని వందిత। నాగాభరణుండు..." అంటే ఎలా ఉంటుంది?

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దీపావళి శుభాకాంక్షలు. సంతోషమండి.

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
విరుపుతో త్రిపురాంతకుని, నరకాంతకుని ప్రస్తావించిన మీ మొదటి పూరణ, కీర్తిత నాగాభరణుని చేత నరకుని చంపించిన మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సవరించిన గురువులకు [సోదరులిరువురకు } ధన్య వాదములు
సోదర సోదరీ మణు లందరికీ దీపావళి శుభాకాంక్షలు

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...

కామేశ్వరరావు గారూ!

ధన్యవాదములు మీ సూచనకు!

gurram.jana@gmail.com చెప్పారు...

కామెశ్వర రావు గారూ ! ధన్యవాదాలు!
నగము =పర్వతము ; నాగము = పర్వతము
నగేశుడు= పర్వత రాజు(దక్షుడు)
దక్షుఁడు సం.విణ.(అ.ఆ.అ.)
సమర్థుఁడు, నేర్పరి
అభిజ్ఞుఁడు, తెలిసినవాఁడు,
సోమరికాని వాఁడు , చుఱుకైన వాఁడు

దక్షుఁడు వి.అ.పుం.

ప్రజాపతులలో నొకఁడు (ఇతఁడు బ్రహ్మమానసపుత్రుఁడు, చంద్రుని భార్యలగు అశ్విన్యాదులకును కశ్యపుని భార్యలు పదుమువ్వురకును, శివుని భార్య యగు సతీదేవికిని తండ్రి.)
వహ్ని(విల్యమ్సు.) Source = తెలుగు నిఘంటువు (శంకరాభరణం బ్లాగు లోనిదే)

gurram.jana@gmail.com చెప్పారు...

నగేశుని నాగేశుడు అని కూడా అనవచ్చా? అన్నది నాకు కూడ సందేహమే.(సందేహిస్తూనే ప్రచురించాను)

gurram.jana@gmail.com చెప్పారు...

మాన్యశ్రీ శంకరయ్య గారికి వందనములు. దీపావళి శుభాకాంక్షలు. సంతోషమండి.

sailaja చెప్పారు...

ధన్యవాదములు సర్..మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు...

P.suryanarayana rao చెప్పారు...

కృతజ్ఞతలండి.