4, ఆగస్టు 2013, ఆదివారం

పద్య రచన – 423

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. మదమాతంగము పోవుచుండె పలు కొమ్మల్ మోయుచున్ చూడుమ
    య్యదె, యా కొమ్మలె దాని కోగిరమునౌ, నా ముఖ్య మార్గమ్ములో
    మది యుప్పొంగును జూచువారల కహో! మాంగళ్యముల్ చేకురున్
    గద! మాతంగవరేణ్య దర్శనము విఘ్నఘ్నంబగున్ సోదరా!

    రిప్లయితొలగించండి
  2. కొమ్ములు లేని గజమచట
    కొమ్మలు మోయుచు పురమున కొండగ వెడలెన్
    కొమ్మా ! చూడుము మరి పో
    కమ్మా దానెదురు కుమ్మ హానియె గలుగున్!

    రిప్లయితొలగించండి

  3. సైకిల్ పై సిలిండర్ బాబు శరవేగం
    అంబారీ పై టికాణీ లేని బికారి బాబు
    సిలిండర్ అయ్యింది గగన కుసుమం
    అందుకోడానికి న (గ)రం లో సర్కస్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. చిత్రములో ఏనుగే కాకుండా ఒక మనిషి సిలిండర్లను తీసుకొని పోతున్నాడు. ఏనుగు తన ఆహారముకై ప్రకృతికి హానిచేయకుండా బ్రతికితే, మానవుడు అత్యాశతో ప్రకృతిని కాల్చేస్తున్నాడు ( సిలిండర్లకొఱకు ). ఆభావనతో.........

    అటనాగంబు మదిందలంచి తనకాహారంబుకై కొమ్మలన్
    యటవీప్రాంతముకేగిదెచ్చె, మనుజుండత్యంత పేరాశతో
    పటుబాహాధరశక్తియుక్తమున విద్వంసంబొనర్చెన్ గదా!
    ఘటముల్ చేసెడి రక్షణంబు ప్రకృతిన్, కంటే మనుష్యోత్తమా!

    రిప్లయితొలగించండి
  5. అల్లనల్లన మెల్లగ నడుగు వేచి
    నడుచు చున్నది చూడుడు నగము నచట
    కట్టె మోపులు వీపుపై గట్టి వైచి
    నడుపు చుండెను గజమును నాయకుండు

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ మత్తేభము బాగుగా నున్నది. 2వ పాదము మొదట యడాగమము బాగులేదు. అత్యంత పేరాశ అనే సమాసము బాగులేదు. సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీరు కొమ్ములు లేని గజమచట అని చేసిన ప్రారంభము బాగులేదు. వ్యర్థ ప్రయోగము. గజదర్శనము మంచిది అంటారు ఆర్యులు అందుచేత ఎదురుబడితే కుమ్మును అనుట కూడా ప్రశ్నార్థకమే. మరొక ప్రయత్నము చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులకు పాదాభివందనములతో.....

    ఎంతవారలైన ఎచ్చోటనున్నను
    మత్తగజము యైన మనుజులైన
    కూటికోసమేగ కోటివిద్యలెల్ల
    పాట్లుతప్పలేద పరమపూజ్య

    రిప్లయితొలగించండి
  10. Sree nEmaanigaroo! namaskaaramulu.
    maroka kONamulO naa prayatnamu.

    vaMtacerakunu gaTTuka vaMTipaina
    noMti veDalenu rahadaari veMTa gajamu
    vaMTa kokkaDu saikilukaMTa gaTTi
    gyaasu baMDalu neTTenu gajamu gajamu ,

    రిప్లయితొలగించండి
  11. శ్రీనేమాని గురువర్యులకు నమస్సులు.

    మీ సూచన ప్రకారము ఈ క్రింది విధముగా సవరించుచున్నాను.

    అటనాగంబు మదిందలంచి తనకాహారంబుకై కొమ్మలం
    ద టవీప్రాంతముకేగిదెచ్చె, మనుజుండర్థంబునందాశచే
    పటుబాహాధరశక్తియుక్తమున విద్వంసంబొనర్చెన్ గదా!
    ఘటముల్ చేసెడి రక్షణంబు ప్రకృతిన్, కంటే మనుష్యోత్తమా!

    కొమ్మలు + అందు + అటవీ = కొమ్మలందటవీ

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమానిగారూ! నమస్కారములు.
    మరొక కోణములో నా ప్రయత్నము.

    వంటచెరకును గట్టుక వంటిపైన
    నొంటి వెడలెను రహదారి వెంట గజము
    వంట కొక్కడు సైకిలుకంట గట్టి
    గ్యాసు బండలు నెట్టెను గజము గజము.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో "వంటిపైన" అనే ప్రయోగము సాధువు కాదు. ఒడలు అంటే శరీరము. ఒంటిపైన అని సరిజేయాలి. చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. ఈమాతంగము మంగళప్రదముగా నీరాజమార్గంబునన్
    క్షేమం బారయు దేవదూత పగిదిన్ జేజేల కర్హంబుగా
    భూమిన్ హర్షము పంచుచున్ వెడలె నోపుణ్యాత్ములారా! పయిన్
    శ్రీమంతంబగు వృక్షశాఖములతో, చేయందగున్ సన్నుతుల్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ నేమానిగారూ! ధన్యవాదములు.
    సవరణతో నా పద్యము...

    వంటచెరకును గట్టుకు నొంటిపైన
    నొంటి వెడలెను రహదారి వెంట గజము
    వంట కొక్కడు సైకిలుకంట గట్టి
    గ్యాసు బండలు నెట్టెను గజము గజము ,

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ హరి వారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. కాని మత్తేభము పైకి శార్దూలమును పంపుట బాగుంటుందా? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    ఔచిత్యాన్ని పాటించి చిత్రానికి తగిన మత్తేభ వృత్తాన్ని సర్వోత్తమంగా రచించారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పద్యాలూ సలక్షణంగా ఉన్నాయి. అభినందనలు.
    నేమాని వ్యాఖ్య ననుసరించి మొదటి పద్యం లోని ఔచిత్యం పరిశీలించి సవరించదగినది.
    *
    జిలేబీ గారూ,
    మీరు మంచి భావాలను వెలుబుచ్చుతున్నారు. కొద్దిగా శ్రమపడి ఛందస్సు నేర్చుకొని పద్యాలను వ్రాస్తే బాగుంటుందని నా సలహా.
    అన్నట్టు మీ రాంపండు తెలుగు చదువు ఎంతవరకు వచ్చింది?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీరు కూడా నేమాని వారి వలె వృత్తౌచిత్యాన్ని పాటించారు. సంతోషం. అభినందనలు.
    నేమాని వారి అభ్యంతరమే కాక, మరికొన్ని లోపాలు... ‘ఆహారంబుకై → ఆహారంబునకై’, ‘ప్రాంతము కేగి → ప్రాంతమున కేగి’. నా సవరణలతో మీ పద్యం....
    అటనాగంబు మదిం దలంచి తనకాహారార్థమై కొమ్మలన్
    యటవీప్రాంతమునుండి దెచ్చె, మనుజుండత్యంత పేరాశతో
    పటుబాహాధరశక్తియుక్తుడయి విధ్వంసం బొనర్చెన్ గదా!
    ఘటముల్ చేసెడి రక్షణంబు ప్రకృతిన్, కంటే మనుష్యోత్తమా!
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీరు వరంగల్ చైత్యన్య కళాశాలలో పనిచేసిన శైలజ గారు (ఇంద్రగంటి వారి మనుమరాలు) కాదుకదా?
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మత్తగజము + ఐన' అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. మూడవ పాదంలో గణదోషం.. నా సవరణలతో మీ పద్యం....
    ఎంతవారలైన నెచ్చోట నున్నను
    మత్తగజమె యైన మనుజులైన
    కూటికోసమెగద కోటివిద్యలు చూడ
    పాట్లుతప్పలేద పరమపూజ్య
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ శార్దూలం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. కానలోన దిరుగు కరిరాజు యేలనో
    నగర వీథులందు నడచు చుండె
    నచ్చెనేమొ చాల నరుల సాంగత్యము
    అదర దేమి! సుంత బెదర దేమి !

    రిప్లయితొలగించండి
  19. రాజులు కవులే యైనను
    మోజుగ నీగజము పైన మురియుచు దిరుగన్ !
    ఈ జన్మకు మావటిగను
    రాజును కాకున్న నేమి రాజస మొప్పన్ !
    ---------------------------------
    తరువుల బరువులు మోయుచు
    కరిపైనను దిరుగు చుంటి గాసిల కుండన్ !
    వరమొందితి మావటిగను
    పరమాత్ముని కృపను గంటి పరమ ప్రీతిన్ !

    రిప్లయితొలగించండి
  20. వసతి, గాలి, వెలుగు, వాహనమ్ములు, తిండి
    వలయు నగరమైన, పల్లెయైన
    మత్త గజము కైన మనుజుని కైనను
    అరయ నిక్కమిదియె ఆర్యులార

    బరువు మోయంగను తొలుత కరులు వెలసె
    అరదముల్, అశ్వములు నొoటెలమరి యుండె
    నేడు టాక్సీలు, లారీలు బాడుగకును
    మూడు చక్రముల ఆటోలు మూరి బోయె

    నాగరికతాభివృద్ధితో నరుడు రైలు,
    ఓడలందున, గాలిలో, వ్యోమవీధి
    యానమొనరించి విశ్వ రహస్యములను
    తెలియ గోరుచు నున్నాడు తెలివి మీఱ

    రిప్లయితొలగించండి
  21. భవునితాదాల్చె గర్భమునందు పిదప గ
    ణేశుగా నుతినొందె ఏనుగొకటి
    కోమలముగనుండు కుంభస్థలముమీద
    కువలయమునుదాల్చె కుంజరములు
    యుద్ధంబులోతామేయుత్క్రుష్ట సైన్యంబు
    నిర్ణాయకములౌనునిభబలములు
    చక్రవర్తివినీవె జంతుశ్రేణులలోన
    మాన్యుడవీవెగా మందగమన

    రాజ్యములుబోయె పోయె నీ రాజటీవి
    పూర్వ ప్రాభవంబుతరిగి పోయెనెపుడొ
    కడుపునింపుకొనుటకయ్యొకడకుమోసె
    గడ్డి గజరాజ నీకెంత కష్టమొచ్చె

    రిప్లయితొలగించండి
  22. ముదమారం గను మేగుచుండె కరి మోపుల్ మోయుచున్ కూటికై,
    మది నింతేనియు చింత లేక వడిగా మాంధాత యై యోర్పునన్,
    యది నేర్వందగు మానవుల్ బ్రదుకునన్ హాయిన్ సుఖింపన్ సదా,
    మది, సంపాదన గోరి చేయు పనికిన్ మాన్యత్వమున్ బెంచుచున్.

    రిప్లయితొలగించండి
  23. నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘కరిరాజు + ఏలనో’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘కరివిభుం డేలనో’ అనండి. ‘సాంగత్యము +అదర’ అన్నప్పుడూ సంధి ఉంది. అక్కడ ‘నరులతో సాంగత్య మేలనో’ అందాం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ మూడు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘ఐనను + అరయ’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ ‘మానవునకు నైన/ నరయ...’ అనండి.
    రెండవ పద్యంలో ‘అరదముల్, అశ్వములు’ అని విసంధిగా వ్రాయరాదు. అక్కడ ‘అరదముల్, గుఱ్ఱములు..’ అందాం.
    *
    గుండా రఘురామ్ గారూ,
    మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ మత్తేభం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదం ప్రారంభంలో యడాగమం దోషం. అక్కడ ‘మాంధాతయై యోర్పుతో/ నది నేర్వం దగు...’ అందాం.

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ ! సూచనకు ధన్యవాదములు.

    కానలోన దిరుగు కరివిభుం డేలనో
    నగర వీథులందు నడచు చుండె
    నచ్చెనేమొ చాల నరులతో సంగతి ?
    అదర దేమి ! సుంత బెదర దేమి !

    రిప్లయితొలగించండి