నీ కైంకర్యము నిత్య సౌఖ్యకరమో నీరేజ పత్రేక్షణా! నీ కైంకర్యము భవ్య యోగమనుచున్ నీ సేవకుల్ పొంగరే?నీ కైంకర్యము దుర్లభం బగుగదా నిర్వాణ సంధాయకా! నీ కైంకర్య మనుగ్రహింపు మనుచున్ నిన్ వేడుదున్ సాదృతిన్
పండిత నేమాని వారూ, భగవత్కైంకర్య ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. అభినందనలు.
ప్రతి దినంబును జేతురు భక్తులు మఱి భక్తి శ్రద్ధలు గలుగుచు రక్తి తోడ శివుని కైంకర్య మత్యంత వైభవంబు కలుగు నట్లుగ శుభములు గలుగు కొఱకు
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో యతి తప్పింది. ‘శివుని’ అన్నచోట ‘భవుని’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కలడు కలండ నువాడు కలయని తలచికావలికాచి గుడిని కైంకర్యముకానిత్తురుగ జనమె కరుణ చూప కింకరులను తగదిది క్రృష్ణా రామా...
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతోశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు =======*======కైంకర్యమ్ము ఖలులకున్ పొంకమలర జేయ నరులు పొనుగుబడునుగా,( నాశనము)కైంకర్యము హరిహరులకు పొంకమలర జేయ నరులు పోసవమొందున్.(క్షీరము ) (కైంకర్యము=ఊడిగము, పొనుగుబడు=నాశనము,పోసవ= క్షీరము )
భవుని కైంకర్య మందున భక్తి గలిగి మనుజ లోకాన నడయాడి మంచి పెంచి సాటి వారలు గని మెచ్చ మేటి యనుచుముక్తి పొందిన చాలును రక్తి కలుగు
సంకటములఁ బాపెడు నెలవంకను ధరియించినట్టి వరముల నొసగేశంకరునికిఁ యను నిత్యముకైంకర్యముఁ జేయఁదగును గరముల తోడన్.
పండిత నేమాని గారికి, శంకరయ్య గురుదేవులకునమస్కారములు. దివిజులెల్లరు యేతెంచి తిరుమలగిరి ఉదయ మాదిగ రాతిరి ఊయలందుతిరుమలేశుడు నిదురను ఒరుగు వరకుఅన్ని కైంకర్యముల జూతురనుదినమ్మువరదలు వచ్చిన వేళలసరగున నాయకులు వచ్చిసాయము పేరన్వరములనిత్తురు ప్రజలకుకరముగ కైంకర్యమగును కాపురుషులకున్
నీ కైంకర్యము నిత్య సౌఖ్యకరమో నీరేజ పత్రేక్షణా!
రిప్లయితొలగించండినీ కైంకర్యము భవ్య యోగమనుచున్ నీ సేవకుల్ పొంగరే?
నీ కైంకర్యము దుర్లభం బగుగదా నిర్వాణ సంధాయకా!
నీ కైంకర్య మనుగ్రహింపు మనుచున్ నిన్ వేడుదున్ సాదృతిన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిభగవత్కైంకర్య ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. అభినందనలు.
ప్రతి దినంబును జేతురు భక్తులు మఱి
రిప్లయితొలగించండిభక్తి శ్రద్ధలు గలుగుచు రక్తి తోడ
శివుని కైంకర్య మత్యంత వైభవంబు
కలుగు నట్లుగ శుభములు గలుగు కొఱకు
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. ‘శివుని’ అన్నచోట ‘భవుని’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలడు కలండ నువాడు కలయని తలచి
రిప్లయితొలగించండికావలికాచి గుడిని కైంకర్యము
కానిత్తురుగ జనమె కరుణ చూప
కింకరులను తగదిది క్రృష్ణా రామా...
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
=======*======
కైంకర్యమ్ము ఖలులకున్
పొంకమలర జేయ నరులు పొనుగుబడునుగా,( నాశనము)
కైంకర్యము హరిహరులకు
పొంకమలర జేయ నరులు పోసవమొందున్.(క్షీరము )
(కైంకర్యము=ఊడిగము, పొనుగుబడు=నాశనము,పోసవ= క్షీరము )
భవుని కైంకర్య మందున భక్తి గలిగి
రిప్లయితొలగించండిమనుజ లోకాన నడయాడి మంచి పెంచి
సాటి వారలు గని మెచ్చ మేటి యనుచు
ముక్తి పొందిన చాలును రక్తి కలుగు
సంకటములఁ బాపెడు నెల
రిప్లయితొలగించండివంకను ధరియించినట్టి వరముల నొసగే
శంకరునికిఁ యను నిత్యము
కైంకర్యముఁ జేయఁదగును గరముల తోడన్.
పండిత నేమాని గారికి, శంకరయ్య గురుదేవులకు
రిప్లయితొలగించండినమస్కారములు.
దివిజులెల్లరు యేతెంచి తిరుమలగిరి
ఉదయ మాదిగ రాతిరి ఊయలందు
తిరుమలేశుడు నిదురను ఒరుగు వరకు
అన్ని కైంకర్యముల జూతురనుదినమ్ము
వరదలు వచ్చిన వేళల
సరగున నాయకులు వచ్చిసాయము పేరన్
వరములనిత్తురు ప్రజలకు
కరముగ కైంకర్యమగును కాపురుషులకున్