శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
పాకిస్తాన్ కవ్వింపులకు మన ప్రభుత్వము బదులు జెప్పకుండెను =====*======= కలహ మందు పుస్త కమ్ము జదువు వాడు ఖలుడు సుమ్ము, ప్రజల గౌరవమ్ము కుదువ బెట్ట వలదు కోమలి సుతునకు రాజ్య భారము నిడ రమ్యముగను.
పద్యరచన పూను కొనునప్పుడు వ్యాకరణము కూడా బాగుగ వచ్చి యుండవలెను. మీ పద్యములో వ్యాకరణ దోషములు కూడా కలవు. గ్రాంథిక భాషలో పద్యరచన బాగుగ వచ్చిన పిదప వ్యావహారిక భాషలోకి వెళ్ళినా ఫరవా లేదు.
కృష్ణ అనుటకు బదులుగా : మీరు క్రిష్ణ అన్నారు పక్షము అనుటకు : పక్షం అన్నారు
అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది - అభినందనలు. ఒక సూచన: 1వ పాదములో చోట + అనవరతము - అనుచోట యడాగమము కాదు .. నుగాగమము వచ్చును. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. =========*========== తే గీ :"భూత విద్య భూషణ" మను పుస్త కమ్ము జదువు వాడు ఖలుడు సుమ్ము,జనుల మంచి జెడులను గను సజ్జన తతి చెంత జేర, మంచి పుస్త కమ్ము జదువు మనుజు లెల్ల .
ఉత్సాహవృత్తము: =========*========= వాడ వాడల దిరుగుచును,పదము చివర దీర్ఘముల్ బాడుచు,ననుదినము వాడి పబ్బము గడుపు కొనుచున్, తోడి రాగమందు కొనుచు,దుష్ట జనులనెల్ల గా పాడు పుస్త కమ్ము జదువు వాడు ఖలుడు సుమ్ము. (తోడిరాగము = పదే పదే పాడిన పాట పాడుట)
మిత్రులకు శుభాశీస్సులు. ఈనాటి కొన్ని పూరణలను పరిశీలించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: వ్యావహారిక భాషలో వ్రాసేరు. మీ ఆనందము మీది.
తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి: ద్వేష బుద్ధితో రంధ్రాన్వేషణకై పుస్తకము చదువు వాడు ఖలుడు అనుట సమంజసముగనే యున్నది. పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ గుండు మధుసూదన్ గారు: మంచి ఉత్సాహ వృత్తమును వ్రాసేరు. ఉత్సాహముడిగి నటనతో గరుడ పురాణమును చదువలేక చదువు వాడు ఖలుడె కదా. పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ కందుల వర ప్ర్qఅసqఅద్ గారు: (1) రాజకీయములతో (2) భాషాభిమానqముతో వ్రాసిన 2 పద్యములు చాల బాగుగ నున్నవి.
శ్రీ మంద పీతాంబర్ గారు: మత్సరమును పెంచు విధముగ పుస్తకమును చదువు వాడు ఖలుడు అని సమర్థించేరు. బాగుగ నున్నది. త్రుంచి అనుటకు మీరు "దృంచి" అన్నారు - సరిచేయండి.
శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. పవిత్రమైన స్థలములలో బుద్ధిమంతుని వలె చేరి అపవిత్రమైన పుస్తకములను చదువువాడే ఖలుడు. అభినందనలు.
శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు. మీ పద్యములో అన్వయము మాకు అందుట లేదు. సమస్య ఏ విధముగా పరిష్కరింపబడినదో తెలియదు. లక్ష్మణ + అనుచు = లక్ష్మణ యనుచు అని యడాగమము వచ్చును. లక్ష్మణనుచు అనరాదు. మరొక ప్రయత్నము చెయ్యండి.
కవిమిత్రులకు నమస్కృతులు. ఉదయమే బంధువుల ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి వెళ్ళి వర్షంలో చిక్కుపడి ఇప్పుడే ఇల్లు చేరాము. రోజంతా బ్లాగు చూడడానికి అవకాశం దొరకలేదు. మిత్రులు మంచి మంచి పూరణలను, పద్యాలను అందించారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. * పండిత నేమాని వారు, గుండు మధుసూదన్ గారు మిత్రుల రచనల గుణదోష విచారం చేస్తూ, సవరణలను సూచించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మన పవిత్ర వేద మంత్ర సారమ్మును
రిప్లయితొలగించండిమాతృభాష కాని మరొక భాష
యందు చదువు వాని చందమ్ములో పుస్త
కమ్ము చదువు వాడు ఖలుడు సుమ్ము
కాల హరణ జేసి ' జాలీగ ' గడిపేసి
రిప్లయితొలగించండికన పరీక్షలపుడుకలత జెంది
జాలి చూపుజూచి చకచకా తా పుస్త
కమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము.
వక్ర బుధ్ధి తోడ ప్రబలిన గర్వమ్ము
రిప్లయితొలగించండిద్వేష భావ మూని దోష మనుచు
నింద సలుపుటకునె వందింపదగు పుస్త
కమ్ము చదువువాడు ఖలుడు సుమ్ము !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్సాహవృత్తము:
రిప్లయితొలగించండిమోహియు న్నిరక్షరాస్య మూఢుఁ డైనవాని, దు
స్సాహసిని, "గరుడ పురాణ సార మెఱుఁగు"మనఁగ; ను
త్సాహ ముడిగి, నటనతోడఁ జదువునట్టి, యా విరా
డ్వాహుఁ బుస్తకమ్ముఁ జదువు, "వాఁడు ఖలుఁడు సు"మ్మిలన్!
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
పాకిస్తాన్ కవ్వింపులకు మన ప్రభుత్వము బదులు జెప్పకుండెను
=====*=======
కలహ మందు పుస్త కమ్ము జదువు వాడు
ఖలుడు సుమ్ము, ప్రజల గౌరవమ్ము
కుదువ బెట్ట వలదు కోమలి సుతునకు
రాజ్య భారము నిడ రమ్యముగను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిప్రజల మస్తకముల పఠియింప వలెనన్న
రిప్లయితొలగించండిచదువుటొప్పు సకలశాస్త్రములను.
రహిని దృంచిమత్సరములబెంచెడుపుస్త
కమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము!!!
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
========*========
బాషకు మడి గట్ట బాని సత్వమనును
"చలము" పుస్త కమ్ము జదువు వాడు,
ఖలుడు సుమ్ము జాతి కుల మతములు ముఖ్య
మనుచు మద జలధిని మునుగు వాడు.
మిత్రులందరికి శుభాశీస్సులు. అందరి పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము 1వ పాదములో వేకి వైతో యతి వేసేరు. యతి మైత్రి చెల్లదు. సవరించండి.
క్రికెటు వచ్చినపుడు క్రిష్ణపక్షంచదువ
రిప్లయితొలగించండిటామ్ ఎండ్ జెర్రీ టక్కులు కనక
యున్నవారి నంద్రు యూరుకోకపుస్త
కమ్ము జదువు వాడు ఖలుడు సుమ్ము
అనువు గాని చోట యనవరతము పుస్త
రిప్లయితొలగించండికమ్ము చదువు వాడు ఖలుడు సుమ్ము
పుస్తకమ్ము జదువ పొలుపుగ మఱి వాని
సుజను డండ్రు లల్లి ! సుజన గణము
అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిపద్యరచన పూను కొనునప్పుడు వ్యాకరణము కూడా బాగుగ వచ్చి యుండవలెను. మీ పద్యములో వ్యాకరణ దోషములు కూడా కలవు. గ్రాంథిక భాషలో పద్యరచన బాగుగ వచ్చిన పిదప వ్యావహారిక భాషలోకి వెళ్ళినా ఫరవా లేదు.
కృష్ణ అనుటకు బదులుగా : మీరు క్రిష్ణ అన్నారు
పక్షము అనుటకు : పక్షం అన్నారు
అంద్రు + ఊరుకొనక : అనుచోట యడాగమము రాదు --
అందు రూరుకొనక ... అనవలెను.
2వ పాదములో గణములు సరిగా వేయలేదు.
మీరే మరొక ప్రయత్నము చెయ్యండి. స్వస్తి.
అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది - అభినందనలు. ఒక సూచన: 1వ పాదములో చోట + అనవరతము - అనుచోట యడాగమము కాదు .. నుగాగమము వచ్చును. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
=========*==========
తే గీ :"భూత విద్య భూషణ" మను పుస్త కమ్ము
జదువు వాడు ఖలుడు సుమ్ము,జనుల మంచి
జెడులను గను సజ్జన తతి చెంత జేర,
మంచి పుస్త కమ్ము జదువు మనుజు లెల్ల .
ఉత్సాహవృత్తము:
=========*=========
వాడ వాడల దిరుగుచును,పదము చివర దీర్ఘముల్
బాడుచు,ననుదినము వాడి పబ్బము గడుపు కొనుచున్,
తోడి రాగమందు కొనుచు,దుష్ట జనులనెల్ల గా
పాడు పుస్త కమ్ము జదువు వాడు ఖలుడు సుమ్ము.
(తోడిరాగము = పదే పదే పాడిన పాట పాడుట)
మిత్రులకు శుభాశీస్సులు. ఈనాటి కొన్ని పూరణలను పరిశీలించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: వ్యావహారిక భాషలో వ్రాసేరు. మీ ఆనందము మీది.
తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి: ద్వేష బుద్ధితో రంధ్రాన్వేషణకై పుస్తకము చదువు వాడు ఖలుడు అనుట సమంజసముగనే యున్నది. పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ గుండు మధుసూదన్ గారు: మంచి ఉత్సాహ వృత్తమును వ్రాసేరు. ఉత్సాహముడిగి నటనతో గరుడ పురాణమును చదువలేక చదువు వాడు ఖలుడె కదా. పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ కందుల వర ప్ర్qఅసqఅద్ గారు: (1) రాజకీయములతో (2) భాషాభిమానqముతో వ్రాసిన 2 పద్యములు చాల బాగుగ నున్నవి.
శ్రీ మంద పీతాంబర్ గారు: మత్సరమును పెంచు విధముగ పుస్తకమును చదువు వాడు ఖలుడు అని సమర్థించేరు. బాగుగ నున్నది. త్రుంచి అనుటకు మీరు "దృంచి" అన్నారు - సరిచేయండి.
శివుని యాలయ మున శేముషి వలెజేరి
రిప్లయితొలగించండిభక్తి గలిగె నేని ముక్తి యనుచు
కపట మౌని వలెను నపవిత్ర మగు పుస్త
కమ్ము జదువు వాడు ఖలుండు సుమ్ము
మాయలేడి యగుచు మారీచుడేరీతి
రిప్లయితొలగించండిరాముగొంతు వోలె లక్ష్మణనుచు
కేక వెట్టి మోసగించె తెలియ పుస్త
కమ్ము జదువువాడు ఖలుడు సుమ్ము
శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. పవిత్రమైన స్థలములలో బుద్ధిమంతుని వలె చేరి అపవిత్రమైన పుస్తకములను చదువువాడే ఖలుడు. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు. మీ పద్యములో అన్వయము మాకు అందుట లేదు. సమస్య ఏ విధముగా పరిష్కరింపబడినదో తెలియదు. లక్ష్మణ + అనుచు = లక్ష్మణ యనుచు అని యడాగమము వచ్చును. లక్ష్మణనుచు అనరాదు. మరొక ప్రయత్నము చెయ్యండి.
శ్రీ పండిత నేమాని గారికి నమస్కారం.తప్పును తెలియజెసిన మీకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసవరించిన పద్యం.
ప్రజల మస్తకముల పఠియింప వలెనన్న
చదువుటొప్పు సకలశాస్త్రములను.
రహిని త్రుంచి మత్సరములబెంచెడుపుస్త
కమ్ముఁ జదువువాఁడు ఖలుఁడు సుమ్ము!!!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఉదయమే బంధువుల ఇంట్లో వరలక్ష్మీ వ్రతానికి వెళ్ళి వర్షంలో చిక్కుపడి ఇప్పుడే ఇల్లు చేరాము. రోజంతా బ్లాగు చూడడానికి అవకాశం దొరకలేదు.
మిత్రులు మంచి మంచి పూరణలను, పద్యాలను అందించారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారు, గుండు మధుసూదన్ గారు మిత్రుల రచనల గుణదోష విచారం చేస్తూ, సవరణలను సూచించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మాయలేడియైన మారీచ రక్కసుడు,
రిప్లయితొలగించండిరావణుండు కలిసి రాము సతిని
అపహరించు విధము అభ్యసిoపగ పుస్త
కమ్ము జదువు వాడు ఖలుడు సుమ్ము
అన్నయ్య గారికి నమస్సులు, ధన్యవాదములు. మీ పద్యమే నాకు స్ఫూర్తి.
రిప్లయితొలగించండి