20, ఆగస్టు 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1149 (యమ మహిష ఘంటికానాదము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
యమ మహిష ఘంటికానాద మతి హితమ్ము.

28 కామెంట్‌లు:

 1. యమ! మహిష ఘంటికా నాద మతిహితమ్ము
  గా దలప నేల? వినుమయ్య కర్ణపేయ
  ముగ జగమ్ముల నలరించు ముద్దుకృష్ణు
  మధుర మురళీ నినాదమున్ మనము పొంగ

  రిప్లయితొలగించండి
 2. మాయ రోగాన తనువది మంచ మెక్క
  తనదు పనులను దాఁ జేసు కొనగ లేని
  చలన మించుక లేని జీవుల బ్రతుకున
  యమ మహిష ఘంటికా నాద మతి హితమ్ము!

  రిప్లయితొలగించండి
 3. మరణ కాల మాసన్నమౌ నరుల కపుడు
  కర్ణపేయ మ్మగును గాదె కాంచఁ గాల
  యమ మహిష ఘంటికానాద! మతి హితమ్ము!
  శుభము! భవ సాగర తరణ సూచితమ్ము!

  రిప్లయితొలగించండి
 4. ఎప్పుడరుదెంచొ మృత్యువు చెప్పలేము
  పుణ్యసంపాదనమ్మును ప్రోగు జేసి
  సర్ది పెట్టుకు సిద్ధమై సతతమున్న
  యమ మహిష ఘంటికానాద మతి హితమ్ము.

  రిప్లయితొలగించండి
 5. దీర్ఘ కాలిక రోగాన తెమలలేక
  పక్షవాతంబుచే తాను పనికి బోక
  నాలు బిడ్డలకొక భారమైననాడు
  యమ మహిషఘంటికానాద మతిహితమ్ము.

  రిప్లయితొలగించండి
 6. శ్రుతి జనని పాద మంజీర శుభరవమ్ము
  పరమహితమగు నాకు సంబరము తోడ
  నింపుగా వినుచుందు, నా కెట్టులగును
  యమ మహిష ఘంటికా నాద మతిహితమ్ము?

  రిప్లయితొలగించండి
 7. చేతు లాడక వినబడ్క చెవులు మఱియు
  నోరు పలుకక నడువక కాళ్ళు లేచి
  నిలబ డు టకును బలములే నినత నికిల
  యమ మహిష ఘంటికా నాద మతి హితమ్ము

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
  =======*======
  జనుల రక్త మాంసము దిని, జగతి నందు
  ముని జనులను భాదించెడి మూర్ఖ రాక్ష
  స తతుల మద మణుచుటకై సరగున జను
  యమ మహిష ఘంటి కానాద మతి హితమ్ము।

  రిప్లయితొలగించండి
 9. శ్రీ నేమాని గురుదేవుల "నా కెట్టులగును యమ మహిష ఘంటికా నాద మతిహితమ్ము?"
  అద్భుత మైన ప్రయోగము,పద్యము .

  రిప్లయితొలగించండి
 10. రామచంద్రుని ధర్మము రక్ష కాగ
  అర్జునుని గుణకీర్తి సాయంబు సేయ
  ఆత్మలను మేలుకొలిపెడి ఆగమమ్ము
  యమ మహిష ఘంటికానాద మతి హితమ్ము

  రిప్లయితొలగించండి
 11. విశ్వ మానవ కళ్యాణ విలువ దెలిసి
  ఉగ్రవాదుల చర్యల నిగ్రహించి
  తీవ్రవాదుల ప్రాణాలు తీయ ప్రజకు
  యమ మహిష ఘంటి కానాద మతి హితమ్ము।

  రిప్లయితొలగించండి
 12. రాయబారమునకు వెళ్ళు ముందు కృష్ణుడు కృష్ణతో పలికిన పలుకులు:

  ఊరడిల్లుము ద్రౌపదీ! యుద్ధమందు
  కౌరవుల నాశనమ్మగు కల్లగాదు
  చేటు కాలము డాసిన చెడ్డ వార్కి
  యమ! మహిష ఘంటికా నాద మతిహితమ్ము.

  రిప్లయితొలగించండి
 13. ధరలు, దౌష్ట్యమ్ము, యవినీతి పెరిగిపోయి
  జీవనమునరకమై పోయిచింతహెచ్చి
  దినదినముచచ్చుజీవుని దిగులుదీర్చు
  యమమహిష ఘంటికానాదమతి హితమ్ము!!!

  రిప్లయితొలగించండి
 14. ముసలి తనమున నటు నిటు మెసల లేక
  మమత మన్నన లన్నను మలిన మవగ
  బ్రతుకు భరమై నిలచిన వెతల నడుమ
  యమ మహిష ఘంట నాద మతి సుఖమ్ము

  రిప్లయితొలగించండి
 15. నా రెండవ పూరణము:

  ఉత్సాహవృత్తము:
  మోదమంది యాదిశక్తి పోరునందు రాక్షసుల్
  రోదనలతొ పాఱిపోవ ద్రుత విదమున గదలతో
  మోదె! మహిషు నెదను శూలము - యమ మహిష ఘంటికా
  నాద మతిహితమ్ము కాఁగ - నాటె రౌద్రమూర్తియై!

  రిప్లయితొలగించండి
 16. సంగరముజేసె స్వాతంత్ర్యసాధనార్ధు
  లై ధనము మానమనుగడలక్కఱనిడ
  క పరదాస్య మున మనుటకంటె వార్కి
  యమమహిషఘంటికానాదమతి సుఖమ్ము !

  రిప్లయితొలగించండి
 17. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి సమస్యకు వివిధ పూరణలు వచ్చినవి. ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీ సహదేవుడు గారు: మంచమును పట్టి జీవఛ్ఛవమైన దీర్ఘ రోగి గోడు తెలిపేరు. చాల బాగుగ నున్నది.

  శ్రీ గుండు మధుసూదన్ గారు: 2 పూరణలు:
  (1) సంప్రాప్తే సన్నిహితే కాలే -- అనే భజగోవిందము శ్లోకమును గుర్తు చేసేరు. చాల బాగుగ నున్నది.
  (2) ఆది శక్తి మహిషాసుర మర్దనము చేయునప్పుడు యమ మహిష ఘంటికా నాదము హితము గూర్చు అని సమర్థించేరు. ప్రశస్తముగా నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: నిత్యం సన్నిహితో మృత్యు అంటూ దానికి సిద్ధమైన రోగి గురించి తెలిపేరు. చాల బాగుగ నున్నది.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: దీర్ఘ కాలిక రోగి -- ఆలు బిడ్డల భారమైన వాని పరిస్థితిని చెప్పేరు. చాల బాగుగ నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు: అంగం గళితం పలితం ముండం - అనే శ్లోకమును గుర్తు చేసేరు. చాల బాగుగ నున్నది.

  శ్రీ వరప్రసాద్ గారు: దుష్ట రాక్షస సంహార సమయములో యముని మహిష ఘంటికా రవము హితము గూర్చు అని సమర్థించేరు. ప్రశస్తముగా నున్నది.

  శ్రీ ఆదిత్య గారు: ఆత్మలను మేలుకొలిపెడి ఆగమములను ప్రశంసించేరు. వినూత్నముగా నున్నది.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు: తీవ్రవాదులను మట్టుబెట్టే వేళ ఆ యమ మహిష ఘంటికా నాదము హితకారియే అన్నారు - ఇదొక ప్రత్యేక భావముతో నొప్పుచు నున్నది.

  శ్రీ మిస్సన్న గారు: భారతములో ఇతి వృత్తమును ఎన్నుకొనిరి - శ్రీకృష్ణుని స్మరింప చేసేరు. విశేషముగ నున్నది.

  శ్రీ మంద పీతాంబర్ గారు: ధరలు పెరిగి, ఆదా తరిగి మనుగడ కష్టమైన యెడ తనువు చాలించుటే నయమనినారు. చాల బాగుగ నున్నది.

  శ్రీమతి రాజేశ్వరి గారు: ముసలి తనములో కష్టాలను వల్లె వేసేరు. చాలా బాగుగ నున్నది.

  శ్రీ గూడ రఘురాం గారు: పర దాస్యము కంటే మరణమే శరణ్యము అన్నారు. బాగుగ నున్నది.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమాని వారూ,
  యముడిని సంబోధించి కృష్ణుని మురళీరవ మాధుర్యాన్ని గ్రోలుమన్న మొదటి పూరణ, స్వగతమై ప్రశ్నార్థకంగా ఉన్న రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  కాటికి కాళ్ళు చాచుకున్నవారి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  భవసాగర తరణ సూచకంగా చెప్పిన మొదటి పూరణ, మహిషాసుర మర్దన్నాన్ని ఉత్సాహంలో సూచించిన రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణలో ‘రోదనలతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు?
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పుణ్యఫలం వెంట వచ్చునన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘అరుదెంచునో’ అనే అర్థంలో ‘అరుదెంచొ’ అనడం దోషమే. అక్కడ ‘ఎప్పు డరుదెంచునో మిత్తి/ చావు చెప్పలేము’ అందామా?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  అందరికీ భారమై పరితపించేవాడి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  జీవచ్ఛవాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘వినబడ్క’ ప్రయోగం సాధువు కాదు. అక్కడ ‘వినలేని చెవులు’ అనవచ్చు కదా!
  *
  వరప్రసాద్ గారూ,
  దుష్టరాక్షస సంహారం జరుగుతున్నప్పుడు జనులకు ఆ ఘంటికానాదాలు హితకరములే. చక్కని పూరణ. అభినందనలు.
  *
  ఆదిత్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాకుంటే రామార్జునుల ప్రస్తావనకు సమస్యకు అన్వయం కుదరడం లేనట్టు తోస్తున్నది.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  తీవ్రవాదుల సంహారంలో ఆ ఘంటికానాదాలు జనహితములే. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ఈ సమస్యకు స్ఫూర్తి నాకెక్కడ లభించిందో కచ్చితంగా పట్టుకున్నారు. ధన్యవాదాలు.
  సముచితమైన పూరణ మీది. అభినందనలు.
  యమ తరువాత సంబోధనాచిహ్న మెందుకు?
  *
  మంద పీతాంబర్ గారూ,
  జీవన్మృతుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘దౌష్ట్యమ్ము + అవినీతి’ అన్నప్పుడు యడాగమం రాదు. కనుక అక్కడ ‘దౌష్ట్యమ్ము నవినీతి’ అనండి.
  రెండవ పాదంలో గణదోషం. ‘జీవనము నరక మయిన చింత హెచ్చి’ అందాం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  వృద్ధాప్యాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘భారమై’ అన్నది టైపాటు వల్ల ‘భరమై’ అయినట్టుంది.
  *
  గూడ రఘురామ్ గారూ,
  పారతంత్ర్యం కంటే యమమహిష ఘంటికా నాదమే మంచిదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. పండిత నేమాని వారూ,
  ఒక ముఖ్యమైన పని ఉండి రోజంతా బయట తిరిగి ఇంతకుముందే ఇల్లు చేరి మిత్రుల పూరణలపై స్పందిస్తుండగా నాకన్నా ముందే మీ స్పందనలు వచ్చాయి. నేను చూడలేదు. చూసి ఉంటే నేను వ్యాఖ్యానించక పోయి ఉండేవాడిని. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. పండిత నేమాని గారి కి, శంకరయ్య గురుదేవులకు
  నమస్కారములు

  సత్యవంతుడల్పాయువు సాధుజీవి
  గౌరి వరమున సావిత్రి కలిగే నీకు
  దుహితగా, రాజ్యహీనుని తోడ పరిణ
  యమ! మహిష ఘంటికానాదమతిహితమ్ము
  యనుచు పలికెను నారదుడమరమౌని

  రిప్లయితొలగించండి
 21. పూజ్యులు నేమానివారికి, శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు. పొరపాటు జరిగినది.మన్నింపగలరు. "రోదనలతొ" పదమును "రోదనమెయి"యని సవరించుచున్నాను. పరిశీలింపుడు...

  ఉత్సాహవృత్తము:
  మోదమంది యాదిశక్తి పోరునందు రాక్షసుల్
  రోదనమెయి పాఱిపోవ ద్రుత విధమున గదలతో
  మోదె! మహిషు నెదను శూలము - యమ మహిష ఘంటికా
  నాద మతిహితమ్ము కాఁగ - నాటె రౌద్రమూర్తియై!

  రిప్లయితొలగించండి
 22. శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము చాలా బాగుగ నున్నది. సాధారణముగా మీ పద్యములు మంచి ధారతో భావ గర్భితముగా అలరారుచుండును కదా. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. నేమాని పండితార్యా! ధన్యవాదములు.

  గురువుగారూ! ధన్యవాదములు. నేను హైస్కూల్లో చదువుకొనే రోజుల్లో మహాభారతంలోని ఈ ఘట్టం పాఠంగా ఉండేది. ,!, పొరపాటుగా పడింది.

  రిప్లయితొలగించండి