3, ఆగస్టు 2013, శనివారం

పద్య రచన – 422 (ఆత్మ వంచన)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ఆత్మ వంచన”

10 కామెంట్‌లు:

  1. ఆత్మ వంచనమే యగునని తలపక
    సమయమును బట్టి రాజకీయములలోన
    నేత లెల్లరు బలికెడు నీతు లెల్ల
    పెద్ద గోతుల త్రవ్వుటే ప్రేమ మీర

    రిప్లయితొలగించండి
  2. తనను కొఱ గాని వానిగ దలచి మదిని
    ఎవడు వర్తించు ననిశము నిహము నందు
    ఆత్మవంచన యగునది యార్యు లార !
    సంయ మనమున ముందుకు సాగ వలయు

    రిప్లయితొలగించండి
  3. శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు. మంచి పద్యమును వ్రాసేరు ఆత్మ వంచన గురించి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. చేయ రాదు నెపుడు చెలిమిన వంచన
    అంత కన్నా నీచం ఆత్మ వంచనమె
    కొంచెమైనా మంచి కొండంత ఆండరా
    ఆత్మ వంచనేల అవని ఏల

    రిప్లయితొలగించండి
  5. అమ్మా! శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
    మీరు ఆటవెలది మొదలిడినారు. కానీ లక్షణములన్నిటిని పాటించలేదు. మీ భావమును ఇలాగ పద్య రూపములో పెట్టేను.చూడండి. ఛందస్సును బాగుగా అలవరచుకొనండి:

    చేయరాదు వినుము చెలిమితో వంచన
    వలదురయ్య యాత్మ వంచనమ్ము
    కొంచెమేని మంచి కొండంత యండయౌ
    ప్రగతి గనుము ధర్మ వర్తనమున

    రిప్లయితొలగించండి
  6. వంచన జేయగ జనులను
    సంచిత మగు పాప కర్మ సరిగొను నిజమౌ
    వంచన చేయక నాత్మను
    పంచిన నిజమైన ప్రేమ పాప హరం బౌ !

    రిప్లయితొలగించండి
  7. అమ్మా! శ్రీమతి రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము మంచి విశ్లేషణతో చాలా బాగుగనున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అల ద్రౌపది పెండ్లాడగ
    అలవి పడక, దురిత కౌరవాదులు సభలో
    బలిమిని అవమాని౦చగ
    వలదన లేదెవ్వరాత్మవంచన పాలై


    ఘనుడౌ ద్రోణాచార్యుని
    తన గురువుగ నెంచు శిష్యు దక్షిణ గా నా
    తని బొటనవ్రేలు గాంక్షిo
    పను దారుణ కృత్యమాత్మ వంచన గాదే

    రిప్లయితొలగించండి
  9. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములను చూచితిని. బాగుగ నున్నవి. అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి