2, ఆగస్టు 2013, శుక్రవారం

పద్య రచన – 421 (ప్రకృతి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ప్రకృతి”

25 కామెంట్‌లు:

  1. ప్రకృతి లోనుండు లోకాలు ప్రాణి తతియు
    ప్రకృతి యొనగూర్చు దయతోడ ఫలము లెన్నొ
    ప్రకృతి మరచుచు దానిని వికృతి జేయ
    ప్రకృతి విలయమ్ము నాపగా వశమె మనకు.

    రిప్లయితొలగించండి
  2. ప్రకృతిలోనుండియే ప్రభవించె పంచ భూ
    ....తములు తన్మాత్రలు ప్రథమముగను
    సత్త్వ రజస్తమస్సంజ్ఞల గుణములు
    ....మూడు శక్తుల కదే మూలమగును
    అవని జలము నగ్ని యనిల మాకాశమున్
    ....దనరును పంచ భూతమ్ములనగ
    వాసన, రసము, రూపము, స్పర్స, నాదమ్ము
    ....వాని తన్మాత్రలై పరగుచుండు
    ప్రకృతి పురుషుల యోగ ప్రభావముననె
    జరుగు సృష్ట్యాదులగు క్రియల్ సక్రమముగ
    ఆదిశక్తి ప్రకృతి, పరమాత్మ పురుషు
    డనుచు వారికి భక్తితో నంజలింతు

    రిప్లయితొలగించండి
  3. మనకు కనబడు నంతయు మఱి ప్రకృతియ
    ప్రకృతి కోపించ మారును వికృతి గాను
    ఈ శ్వరా ధీ నమై చరిం చీ యది నిట
    కాన వేడు కొందము నిక కాలు మనము

    రిప్లయితొలగించండి
  4. ప్రబలుచుండు మాయ ప్రకృతి రూపాన
    పూజ్య దైవ మాయె పురుషుడనుచు
    మాయ మాసిపోవ మాధవుడెదురౌను
    మర్మమెరిగి నీవు మసలుకొనుమ

    రిప్లయితొలగించండి
  5. ప్రళయ మధు ధార ప్రవహించుచుండు
    ప్రణవనాదమందు పల్ల వించు
    పుట్టు గిట్టు లెల్ల పట్టుకు నడచును
    లేని దంటు లేదు ప్రకృతందు

    రిప్లయితొలగించండి
  6. అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు. మీ పద్యమును చూచేను. బాగుగనున్నది. అభినందనలు. ఒక సూచన:
    ప్రకృతి అనే పదములో కృ ముందునున్న ప్ర గురువు కాదు లఘువే. కృను సంయుక్తాక్షరముగా పొరబడవద్దు. క్ + ఋ = కృ (ఋ అచ్చే కాని హల్లు కాదు కదా) అందుచేత పలుకునపుడు తేల్చిపలుకవలెను. మీ పద్యము మొదటి పాదములో ప్రకృతి అనునది భగణము (ఇంద్ర గణము) అనుకొన్నారు. కాని అది నగణము (సూర్యగణము) కదా. గణభంగము సరిచేస్తూ ఈ క్రింది విధముగా మీ పాదమును మార్చుదాము:
    "ప్రబలుచుండు మాయ ప్రకృతి రూపమ్మున" అని.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. మీ భావమునకు చిన్న సవరణ. పురుషుడు అంటే పరమాత్మ(సద్వాచ్యుడు). పరమాత్మకి పుట్టుక లేదు. ఆ పరమాత్మ విశ్వమునకు ముందు నున్న వాడు - ఎల్లప్పుడు నుండువాడు. నాశనము లేని వాడు. ఆతని నుండియే ప్రకృతి ఉద్భవించినది. పాదోస్య విశ్వాభూతాని అని వేద వాక్కు. ఆ పరమాత్మలోని నాలుగవ వంతు విశ్వముగా పరిణమించినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. నా పద్యములోని తప్పిదమునకు క్షమించిన శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యయవాదములు

    సవరణలతో
    ========*=========
    ప్రణవ నాదము తోడను ప్రకృతి ప్రభల
    జెంది,పంచ భూతములకు జెలగు నిచ్చి,
    సకల జనులకు సంతోష సంపదనిడు
    ప్రకృతికి ప్రణతి యందును ప్రథమముగను

    రిప్లయితొలగించండి
  9. ప్రకృతి యలిగిన కలుగును
    వికృతములు జరుగు మెండు భీభ త్సముగన్
    సుకృతము కలిగి యుండిన
    ప్రకృతియే మనకు వరము భాగ్యము నొందన్ !

    రిప్లయితొలగించండి
  10. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీరు ప్రకృతి అను పదములో ప్ర గురువు అగును అని భావించేరు. ప్ర లఘువే. కృ అనే అక్షరము సంయుక్తాక్షరము కాదు.అందుచేత పద్యము 4 పాదములలోను ఒక్కొక్క లఘువును కలుపవలసి యున్నది. నేను మీ పద్యమును ఈ విధముగా సవరించేను:

    ప్రకృతికి నలుకలు కలిగిన
    వికృతమ్ములు జరుగు మెండు భీభత్సముగన్
    సుకృతమ్ము కలిగి యుండిన
    ప్రకృతి మనకు నొసగు వరము భాగ్యము లెల్లన్.

    రిప్లయితొలగించండి
  11. అమ్మా శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
    మీ 2వ ప్రయత్నము సరియగు పద్య లక్షణాలతో లేదు. 2, 3 పాదములు ఆటవెలదులైనా, 1, 4 పాదములు ఏ పద్యానికీ చెందవు. మీ భావము కూడా నాకు అర్థము కాలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా!శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! మీ పద్యమును ముందుగానే చూచేను గాని వ్యాఖ్య చేయుట మరిచేను. ముందుగా మీకు శుభాశీస్సులు. మీ పద్యము ప్రశస్తముగా నున్నది. అభినందనలు.

    అయ్యా! శ్రీ వర ప్రసాద్ గారు! శుభాశీస్సులు. మీ 2వ ప్రయత్నములో పద్యము చాలా బాగుగ నడిచినది. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత నేమాని గురువర్యులకు ప్రణామాలు,..
    మీ సూచన చూసేవరకూ ప్రకృతి ఇంద్రగణమే అనుకున్నాను,విశ్లేషణాత్మకంగా తమరు భోధించినందుకు ఛాలా కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి
  16. ప్రకృతి లోన జీవరాశి పరస్పర
    మైత్రి గలిగి యుండ మానవుండు
    మత్సరమ్ము, మదము కుత్సిత బుద్ధితో
    స్వార్ధపరుడగుట బాధ కలుగు

    రిప్లయితొలగించండి
  17. గిరులు, జలపాతములు, నదుల్, తరులు, విరులు
    పంచభూతముల్, జంతువుల్ పంచుచుండు
    మంచితనమును సర్వదా మనుజుడొకడు
    ప్రకృతి పర్యావరణమును వికృతముగను
    నాశనమ్మును జేసి తా నాశమయ్యె

    రిప్లయితొలగించండి
  18. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములను చూచేను. చాలా బాగుగ నున్నవి. అభినందనలు. 1వ పద్యములో 4వ పాదములో ఒక లఘువు తక్కువగా నున్నది. కొంచెము సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ పండిత నేమాని గారు మీరు సూచిoచినట్టుగా
    4 వ పాదమును సవరించితిని. ధన్యవాదములు.


    ప్రకృతి లోన జీవరాశి పరస్పర
    మైత్రి గలిగి యుండ మానవుండు
    మత్సరమ్ము, మదము కుత్సిత బుద్ధితో
    స్వార్ధపరుడు యగుట బాధ కలుగు

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీరు 4వ పాదమును సవరించేరు. సంతోషము. ఆ పాదములో కూడ ఒక పొరపాటును గమనించితిని. స్వార్థపరుడు + అగుట అనుచోట మీరు యడాగమము చేసేరు. ఉకారము తరువాత సంధి నిత్యము కాబట్టి యడాగమము చేయరాదు. అందుచేత ఆ పాదమును ఇలాగ సవరించుదాము:
    స్వార్థపరత నూన బాధ కలుగు
    స్వస్తి.

    రిప్లయితొలగించండి