పండిత నేమాని వారూ, ఉభయభ్రష్టుల నోటిమాటగా మీ మొదటి పూరణ బాగుంది. ఇక రెండవ పూరణ సీస పాదాలను చదువుతున్నప్పుడు మధ్యపాన ప్రయోజనాలను ఇంత బాగుగా చెపుతున్నారేమిటా అని సందేహించాను. ఎత్తుగీతి నా సందేహాన్ని పటాపంచలు చేసింది. అద్భుతమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు. * జిలేబీ గారూ, మీ భావానికి నా పద్యరూపం..... కాఫి త్రాగినచో కిక్కు గలుగు నంద్రు కాని యీ శుభోదయమునఁ గంటినయ్య బ్లాగులో నీ సమస్యను బాగుగాను మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట! * గుండు మధుసూదన్ గారూ, బాణుడి రచనను ప్రస్తావించిన మీ పూరణ సముచితంగా ఉంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, పద్యమే మీకు ‘చంద్రభాసురం’ అయిందన్నమాట! మీ పూరణలోని చమత్కారం అలరిస్తున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, ఒప్పైన మాట కాదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. * వరప్రసాద్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘విని యొక’ అనండి. రెండవ పూరణలో అన్వయం కుదిరినట్టు లేదు.. ‘కలియు గాధములకు..’ ?
వరప్రసాద్ గారూ, నిజమే... నేనే పొరబడ్డాను. మన్నించండి. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. ‘గ్రోలు డనునది’ మీ పూరణలో ‘గ్రోలు ననునది’ అయింది.
పూజ్యులు పండిత నేమానివారికి నమస్కారములు. తమరి రెండవ పూరణము చాల బాగుగ నున్నది. చాల సంతోషము కలిగినది. అటులనే నాకు రెండు సందేహములు గూడఁ గలిగినవి. దయతో నివృత్తి చేయఁగలరు.
1. "సకల జనానీక స్వాదు రస"మను పాదమందు..."స్వాదు" పదమునకు ముందక్షరమగు "క" గురు వగునని యనుకొనుచున్నాను. కాని తమరు లఘువుగనే ప్రయోగించితిరి. ఏక సమాసమందు సంయుక్తాక్షరమునకు ముందక్షరము గురువగును గదా యని నా సందేహము. 2. "సత్త్వశీలుర సంస్కృతి సరణులం"దను పాదమందు "సంస్కృతి"ని దీర్ఘాంతముగఁ బ్రయోగింపవలెను గదా, హ్రస్వాంతముగ నున్నదే యని నా సందేహము.
...నాకుఁ దెలిసినట్టి యీ భ్రమలో నుండి, యజ్ఞానముతో నడుగుచుంటిని. తా మన్యధా భావింపక దయతో నా సందేహములను దీర్చఁగలరు.
అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు. మీరు చేసిన సూచనలు చాల బాగుగ నున్నవి. సంతోషము.
1. సకల జనానీక స్వాదు రసము - అనుటలో గణ భంగము గలదు. నేను గమనించ లేదు. దానిని ఇలాగ మార్చుదాము: సకల జనప్రియ స్వాదు రసము.
2. సంస్కృతి సరణులు: నేను ఈ సందేహమును గూర్చి ఒక సంస్కృత పండితునికి చెప్పేను. వారు ఇచ్చిన సమాధానము: సంస్కృతి సరణులు అనుట సాధు ప్రయోగమే. సంస్కృతి అనునది ఇకారాంత స్త్రీలింగము కావున తీ అని ఈకారాంతము చేయరాదు. స్వస్తి.
అయ్యా! శ్రీ మధుసూదన్ గారు! శుభాశీస్సులు. సకల జనప్రియ స్వాదు రసము అను పాద భాగములో గణభంగము ఏమియును లేదు. చూడండి (సకలజ - నప్రియ 2 ఇంద్ర గణములు) స్వాదు రసము (2 సూర్య గణములు). జనప్రియ అనుచోట మన అవకాశమును బట్టి న ను గురువుగానైనను లేక లఘువుగానైనను వాడుకొనవచ్చును. ఇచ్చట గురువుగా వాడుకొన్నాను. స్వస్తి.
అయ్యా!మధుసూదన్ గారూ! శుభాశీస్సులు. నా చదువులు తెలుగులో పి.యు.సి. వరకు మాత్రమే (1967 - ప్రైవేటుగా). సంస్కృతము చదువుకొనలేదు. నాది శ్రుత పాండిత్యమే. మీ సందేహమును నేను వేరొక సంస్కృత పండితులను అడిగితిని కదా. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. మన్నించగలరు. స్వస్తి.
"కృతి", "సంస్కృతి" మొదలైనవన్నీ ఇకారాంత స్త్రీలింగ శబ్దాలు. సమాసంలో "కృతీపతి", "కృతీసమర్పణము" అని ఉండనట్లే "సంస్కృతీసంప్రదాయములు" అని ఉండదు. ఆధునికకాలంలో తఱచు వాడబడుతున్న ఆ సమాసప్రయోగం సరి కాదు. తెలుగు పదాలుగా వ్యస్తం చేసి, "సంస్కృతీ సంప్రదాయమున్నూ" అన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. సంస్కృతసమాసమైతే "సంస్కృతిసంప్రదాయములు" అనే ప్రయోక్తవ్యం. అదే తీరున "సంస్కృతిసరణులు" అనే ఉండాలి. "సంస్కృతీసరణులు" అసలు సాధ్యమే కాదు. అలాగే, "నిష్కృతీమార్గం", "చమత్కృతీవిలాసం" వంటివి ఉండవు.
ఈశ్వరుని వియోగదుఃఖాన్ని వహించి యమునా నది నల్లబడిందని వామనపురాణ కథనం. అందువల్ల ఆ పవిత్రవారి ఈశ్వరస్వరూపమని విశ్వాసం. నమద్ + యమునుఁడు = ఈశ్వరుఁడు. పిబరే ఈశ్వరరసం!
మిత్రులు ఏల్చూరి మురళీధరరావుగారికి నమస్కారములు. నా సందేహముతోఁ బూజ్యులు పండిత నేమానివారిని విసిగించితిని. తమరి చలువ వలన నా సందేహము తీరినది.నా తలపై నుండి పెద్ద బరువు దించినట్టులైనది.తమరి రాక నాకుఁ జాల సంతోషముఁ గలిగించినది. కృతజ్ఞుఁడను.
డా. ఏల్చూరి మురళీధర్ గారికి శుభాశీస్సులు. మీ పద్యములు అద్భుతములు - రసమయములు; శబ్దాలంకార శోభితములు. అభినందనలు. సంస్కృతి సరణులునకు సంబంధించిన వ్యాకరణ విశేషములను వివరించినందులకు చాలా సంతోషము. స్వస్తి.
అన్య దేశీయ సాంగత్య మబ్బినంత
రిప్లయితొలగించండినట్టి యలవాట్లె సంస్కృతి యని దలంచి
తిరుగు నుభయ భ్రష్టుల సహచరుల నోట
మద్యమును గ్రోలుడనునదే మంచి మాట
రిప్లయితొలగించండికాఫీ తాగిన కిక్కు వచ్చును అందురు
కానీ ఈ శుభోదయాన అయ్యవారి
బ్లాగ్ మాధురీ టపా సమస్యా పూరణ
మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఒకానొక రసికుఁడు "కాదంబరి”కున్న "మద్య”మను మఱొక యర్థమును గ్రహించి, చమత్కారమును సాధించుటకుఁ బలికిన సందర్భము...
రిప్లయితొలగించండిబాణు రచన "కాదంబరి" బాగుగాను
బండిత కవులందఱికిని బఠన యోగ్య!
మట్టి కావ్య రసమ్మను మధురమైన
"మద్యము"ను గ్రోలుఁ డనునదే మంచిమాట!!
గద్య రచనలు పఠియించి కాంచ లేను
రిప్లయితొలగించండిపద్య పఠనముచే వచ్చు మద్యమదము
గద్యతక్రము నాకేల ? పద్య మనెడి
మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట!!
తక్రము = మజ్జిగ
మద్యమే పన్ను సంపాదించు మెండుగా
రిప్లయితొలగించండి....నదె ప్రభుత్వమునకు నర్థబలము
మద్యమే ఓట్లు సంపాదించు నిండుగా
....నదె ఎన్నికలలోన నాయుధమ్ము
మద్యమే పెద్దల మధ్య పరిచయమ్ము
....పెంపొంద జేసెడి భేషజమ్ము
మద్యమే విందులు మర్యాదలందును
....సకల జనానీక స్వాదు రసము
స్వార్థ పూరిత విష పరిసరములందు
మద్యమును గ్రోలుడనునదే మంచి మాట
సత్త్వశీలుర సంస్కృతి సరణులందు
మద్యమును వీడుడనునదే మంచి మాట
మద్యమును గ్రోలు డనునదే మంచిమాట
రిప్లయితొలగించండియనుట నొప్పైన బ్రతివారు వెసులుబాటు
కాక నిత్యము ద్రాగుచు గంతు లేతు
రార్య ! నిజమిది నమ్ముడు మీ రు కూడ
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
=====*=======
మంచి బలుకులు వినినొక మంచి దినము,
మదుపు జేయగ నార్థిక మాంధ్య మనెడి
మంట గలువ పెట్టుబడులు,మదుపరులకు
మద్యమును గ్రోలు డనునదే మంచిమాట.
======*=====
పద్యములు గ్రోలు డనునదే పండితులకు
మోదము,ఖలులకు కలుషము,పసి వారి
కాట పాటలన్న,కలియు గాధములకు
మద్యమును గ్రోలు డనునదే మంచిమాట.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఉభయభ్రష్టుల నోటిమాటగా మీ మొదటి పూరణ బాగుంది.
ఇక రెండవ పూరణ సీస పాదాలను చదువుతున్నప్పుడు మధ్యపాన ప్రయోజనాలను ఇంత బాగుగా చెపుతున్నారేమిటా అని సందేహించాను. ఎత్తుగీతి నా సందేహాన్ని పటాపంచలు చేసింది. అద్భుతమైన పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
*
జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం.....
కాఫి త్రాగినచో కిక్కు గలుగు నంద్రు
కాని యీ శుభోదయమునఁ గంటినయ్య
బ్లాగులో నీ సమస్యను బాగుగాను
మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట!
*
గుండు మధుసూదన్ గారూ,
బాణుడి రచనను ప్రస్తావించిన మీ పూరణ సముచితంగా ఉంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
పద్యమే మీకు ‘చంద్రభాసురం’ అయిందన్నమాట! మీ పూరణలోని చమత్కారం అలరిస్తున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
ఒప్పైన మాట కాదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘విని యొక’ అనండి.
రెండవ పూరణలో అన్వయం కుదిరినట్టు లేదు.. ‘కలియు గాధములకు..’ ?
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండికలియు గాధములకు = కలియుగమున అధములకు
గురువు గారు పద్యమును మార్చెదను.
విద్య నేర్వంగ తగినట్టి వేది లేక
రిప్లయితొలగించండిసేద్యమును సేయ పoటల సిద్ధి లేక
పద్యములు వ్రాయ చదువగ వ్యవధి లేక
మద్యమును గ్రోలుననునది మంచి మాట
మద్యమును గ్రోలుననునది మంచి మాట
ఔను కాదని యనలేను అంతకన్న
అమ్మ మాటలు ప్రేమయు అమితముగను
కావ్యపానము సేయగ కల్గు కైపు
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండినిజమే... నేనే పొరబడ్డాను. మన్నించండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘గ్రోలు డనునది’ మీ పూరణలో ‘గ్రోలు ననునది’ అయింది.
పూజ్యులు పండిత నేమానివారికి నమస్కారములు. తమరి రెండవ పూరణము చాల బాగుగ నున్నది. చాల సంతోషము కలిగినది. అటులనే నాకు రెండు సందేహములు గూడఁ గలిగినవి. దయతో నివృత్తి చేయఁగలరు.
రిప్లయితొలగించండి1. "సకల జనానీక స్వాదు రస"మను పాదమందు..."స్వాదు" పదమునకు ముందక్షరమగు "క" గురు వగునని యనుకొనుచున్నాను. కాని తమరు లఘువుగనే ప్రయోగించితిరి. ఏక సమాసమందు సంయుక్తాక్షరమునకు ముందక్షరము గురువగును గదా యని నా సందేహము.
2. "సత్త్వశీలుర సంస్కృతి సరణులం"దను పాదమందు "సంస్కృతి"ని దీర్ఘాంతముగఁ బ్రయోగింపవలెను గదా, హ్రస్వాంతముగ నున్నదే యని నా సందేహము.
...నాకుఁ దెలిసినట్టి యీ భ్రమలో నుండి, యజ్ఞానముతో నడుగుచుంటిని. తా మన్యధా భావింపక దయతో నా సందేహములను దీర్చఁగలరు.
భవదీయ శిష్యతుల్యుఁడు,
గుండు మధుసూదన్.
మద్యమును గ్రోలు డనునదే మంచిమాట
రిప్లయితొలగించండియనుట నొప్పైన బ్రతివారు హాయి యనుచు
కైపు నెక్కగ ద్రాగు చు గంతు లేతు
రార్య ! నిజమిది నమ్ముడు మీ రు కూడ
అయ్యా! శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు చేసిన సూచనలు చాల బాగుగ నున్నవి. సంతోషము.
1. సకల జనానీక స్వాదు రసము - అనుటలో గణ భంగము గలదు. నేను గమనించ లేదు. దానిని ఇలాగ మార్చుదాము: సకల జనప్రియ స్వాదు రసము.
2. సంస్కృతి సరణులు:
నేను ఈ సందేహమును గూర్చి ఒక సంస్కృత పండితునికి చెప్పేను. వారు ఇచ్చిన సమాధానము: సంస్కృతి సరణులు అనుట సాధు ప్రయోగమే. సంస్కృతి అనునది ఇకారాంత స్త్రీలింగము కావున తీ అని ఈకారాంతము చేయరాదు.
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు నేమానివారికి నమస్కారములు. తమరు నాకుఁ గలిగిన సందేహములను దీర్చినందులకు ధన్యవాదములు. సందేహము లడుగక నట్లే యుండినచో మరిన్ని సందేహములకుఁ తావిచ్చి నట్లగు నని తలంచి యడిగితిని. తాముఁ దీర్చితిరి. ధన్యోస్మి.
రిప్లయితొలగించండిఅటులనే మఱొక్క సందేహము. తమరి సవరణమున "జనప్రియ" యనుచోట.. "న" గురువు కావలెను కదా యని నా సందేహము. విసుగుకొనక తెలుపఁగలరు.
అయ్యా! శ్రీ మధుసూదన్ గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిసకల జనప్రియ స్వాదు రసము అను పాద భాగములో గణభంగము ఏమియును లేదు. చూడండి (సకలజ - నప్రియ 2 ఇంద్ర గణములు) స్వాదు రసము (2 సూర్య గణములు). జనప్రియ అనుచోట మన అవకాశమును బట్టి న ను గురువుగానైనను లేక లఘువుగానైనను వాడుకొనవచ్చును. ఇచ్చట గురువుగా వాడుకొన్నాను. స్వస్తి.
పూజ్యులు నేమానివారికి...నేనే పొరపాటు పడితిని. మన్నింపఁగలరు.
రిప్లయితొలగించండికాని, "సంస్కృతి" పదముతో సమాసము చేసినపుడు...అనఁగా..."సంస్కృతీ సంప్రదాయములు" అనుచోట " "సంస్కృతి సంప్రదాయములు" అని యనలేము కాఁబట్టి... "సంస్కృతీ సరణు" లనవలసి యుండునను నా సందేహ మింకను దీరకున్నది. తెలుపఁగలరు.
ధన్యవాదములతో....
భవదీయుఁడు...
గుండు మధుసూదన్.
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినయమండిత విన్నపము
రిప్లయితొలగించండిమన్నించండి అని మాత్రము అన వద్దు. నేను మీ శిష్యుడను.
సవరణతో మరొక్కసారి
రిప్లయితొలగించండి=======*========
పద్యములు గ్రోలు డనునదే పండితులకు
మంచి పనస తేనెల కన్న మంచిమాట,
మాంథ్య మందున్న ప్రభుతకు మనుజు లెల్ల
మద్యమును గ్రోలు డనునదే మంచిమాట.
అయ్యా!మధుసూదన్ గారూ! శుభాశీస్సులు. నా చదువులు తెలుగులో పి.యు.సి. వరకు మాత్రమే (1967 - ప్రైవేటుగా). సంస్కృతము చదువుకొనలేదు. నాది శ్రుత పాండిత్యమే. మీ సందేహమును నేను వేరొక సంస్కృత పండితులను అడిగితిని కదా. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. మన్నించగలరు. స్వస్తి.
రిప్లయితొలగించండిపూజ్యులు నేమానివారికి...నేను మిమ్మడిగిన మాటే యడిగి యడిగి విసిగించితిని. అజ్ఞానిని. తాము పెద్ద మనసుతో క్షమించఁగలరు.
రిప్లయితొలగించండిచల్మి కందువ వసించు జనులకైన
రిప్లయితొలగించండిప్రసవ మందున శ్రమపడు పడతికైన
ఉష్ణ శక్తినినందించునొక్కమందు
మద్య ముగ్రోలు డనునదె మంచిమాట
రామ చరితము రసరమ్య రాగ మనెడి
రిప్లయితొలగించండిమద్యమును గ్రోలుఁ డనునదే మంచి మాట
నితర దేశమ్ము లందున శీత లమ్ము
మెండు గావున జనులంత మోద మలరు
లేదు మనజాతి కీరీతి లేదనంగ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎన్నికల నోట్ల వేటకై పన్ను వలయె
రిప్లయితొలగించండిమద్యమును ద్రావు డన్నది! మద్య మునకు
నోట్ల నమ్మెడు భ్రష్టుల నోట వచ్చు
'మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట'.
ప్రియమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి,
రిప్లయితొలగించండి"కృతి", "సంస్కృతి" మొదలైనవన్నీ ఇకారాంత స్త్రీలింగ శబ్దాలు. సమాసంలో "కృతీపతి", "కృతీసమర్పణము" అని ఉండనట్లే "సంస్కృతీసంప్రదాయములు" అని ఉండదు. ఆధునికకాలంలో తఱచు వాడబడుతున్న ఆ సమాసప్రయోగం సరి కాదు. తెలుగు పదాలుగా వ్యస్తం చేసి, "సంస్కృతీ సంప్రదాయమున్నూ" అన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. సంస్కృతసమాసమైతే "సంస్కృతిసంప్రదాయములు" అనే ప్రయోక్తవ్యం. అదే తీరున "సంస్కృతిసరణులు" అనే ఉండాలి. "సంస్కృతీసరణులు" అసలు సాధ్యమే కాదు. అలాగే, "నిష్కృతీమార్గం", "చమత్కృతీవిలాసం" వంటివి ఉండవు.
ప్రేమతో,
ఏల్చూరి మురళీధరరావు
మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
దక్షపుత్త్రీ వియోగవ్యథా దురంత
దుఃఖుఁ డగు నీశ్వరుని స్పర్శతోఁ బునీత
యయ్యెఁ గాళింది; తద్వారి యంద యా న
మద్యమును గ్రోలుఁ డనునదే మంచిమాట!
ఈశ్వరుని వియోగదుఃఖాన్ని వహించి యమునా నది నల్లబడిందని వామనపురాణ కథనం. అందువల్ల ఆ పవిత్రవారి ఈశ్వరస్వరూపమని విశ్వాసం. నమద్ + యమునుఁడు = ఈశ్వరుఁడు. పిబరే ఈశ్వరరసం!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
మిత్రులు ఏల్చూరి మురళీధరరావుగారికి నమస్కారములు. నా సందేహముతోఁ బూజ్యులు పండిత నేమానివారిని విసిగించితిని. తమరి చలువ వలన నా సందేహము తీరినది.నా తలపై నుండి పెద్ద బరువు దించినట్టులైనది.తమరి రాక నాకుఁ జాల సంతోషముఁ గలిగించినది. కృతజ్ఞుఁడను.
రిప్లయితొలగించండిధన్యవాదములతో....
భవదీయ మిత్రుఁడు,
గుండు మధుసూదన్.
(దయతోఁ దమరి ఇ-మెయిలు చిరునామా తెలుపఁగలరు.)
డా. ఏల్చూరి మురళీధర్ గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములు అద్భుతములు - రసమయములు; శబ్దాలంకార శోభితములు. అభినందనలు.
సంస్కృతి సరణులునకు సంబంధించిన వ్యాకరణ విశేషములను వివరించినందులకు చాలా సంతోషము. స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యశ్రీ గురుదేవుల శుభాశీర్వాదమునకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండి