29, ఆగస్టు 2013, గురువారం

పద్య రచన – 448 (ఆకాశవాణి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఆకాశవాణి”
పై అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

  1. పాట పెట్టెగ నానాడు బాగ నిలిచె
    పాత పెట్టెగ మారెగా ' రాత ' జూడు
    రొదలు లేవయ్య ' రేడియో ' సొదలు లేవు
    రోదసీలోన ' నాకాశ ' రోదనాయె.

    రిప్లయితొలగించండి
  2. అకట! ఆకాశవాణియెనంతరించె
    కొత్త పోకడరూపమై కోరిపిలిచె
    మంచిమాటలు పాటలు మాయమయ్యె
    మిర్చిరేడియోగోలలు మింటికెగసె

    రిప్లయితొలగించండి
  3. పలికె ఆకాశవాణి యా ప్రభుని గూర్చి
    యీ శకుంతల భార్యయే యీశ ! నీకు
    అనగ దుష్యంతు డ య్యెడ యనుమ తించ
    పూల వర్షము గురిసెను మురిపెముగను

    రిప్లయితొలగించండి
  4. ఆకాశవాణి పలికెను
    సంకోచము లేక నీవు సాదరముంగాన్
    శాకుంతల యను నీమెను
    స్వీ కారము చేయుమార్య ! చెఱు గని బుద్ధిన్

    రిప్లయితొలగించండి
  5. ఆకాశవాణి :

    మృదుమయ సంగీత మేటిపాటల వీణ
    కావ్య నాటికల రంగస్థలమ్ము
    ప్రాచ్య సంస్కృతభాష పాఠశాలగ వెల్గు
    పాడి పంటలటంచు పరవసించు
    హరికథా శ్రవణంబునందు భక్తిని నిల్పు
    హాస్యనాటకములందంద గూర్చు
    నలరింపదేశవార్తలను చేరగవేయు
    దేశభక్తుల సరణి తెలియఁజెప్పు

    సకలవార్తలకును సాకారమై నిల్చి
    పెద్దదిక్కువోలె పెరిగె నాడు
    కాని నేడు చూడు కానగరాదయ్యె
    నెంతవారికైన నిదియె నిజము.




    రిప్లయితొలగించండి
  6. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు మంచి సీసపద్యమునే ఎత్తుకొన్నారు. అభినందనలు. ఒకే బాణిని చక్కగా పద్యము నిండుగా ప్రకాశింప చేయవలెను కదా. వారి పద్యమును ఈ విధముగా సరిదిద్దుచున్నాను:

    మృదుమయ సంగీత హృద్య గీతుల వీణ
    ....కావ్య నాటికల రంగస్థలమ్ము
    ప్రాచ్య సంస్కృత ముఖ భాషా ప్రవర్ధిని
    ....పాడి పెంటల పెంచు భద్రమూర్తి
    హరికథా గానమ్ము లలరారు నిలయమ్ము
    ....హాస్య నాటకముల కాశ్రయమ్ము
    సకల వార్తలకు ప్రసార కేంద్రమ్మును
    ....దేశభక్తుల యశోదీప కళిక
    ................................
    ................................
    ................................
    ................................
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. అడుగు బెట్టగ నాకాశ వాణి యందు
    దేవ దూతలు దిగి వచ్చి రవని పైన
    ఇంద్ర లోకాలు మర పించు మంద్ర కమున
    చల్ల దన మంత మది నిండ యల్లు కొనగ

    రిప్లయితొలగించండి
  8. శ్రీనేమాని గురువర్యులకు నమస్సులు.

    నేననుకున్న భావానికి సరియైన అక్షరరూపాన్ని ప్రసాదించినందుకు శతథా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులకు నమస్కారం.
    హదరాబాదునుండి ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల విడివిడిగా అందరి పూరణలను, పద్యలను ప్రస్తుతం సమీక్షిం;చలేకపోతున్నాను. మన్నించండి.
    చక్కని పద్యాలను చెప్పిన మిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    సుబ్బారావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు పండిత నేమాని గారి కి నమస్కారములు

    ఆకాశవాణి పల్కులు
    ఆ కంసుని కాలమందు నక్షరసత్య
    మ్మై కనిపించెను నేడో
    ప్రాకటముగ తెల్పు వార్తలన్ ప్రతిదినమున్

    ప్రాభాతమ్ము శుభమ్మటంచు భజనల్ భక్తాళి విన్పించి ఆ
    పై భాష్యమ్ములు, సూక్తులున్, వచనముల్,వార్తల్ సుసంగీతమున్
    శోభాయమ్ముగ నందజేసి, కవికిన్ సుస్వాగతంబెక్కటిన్
    నే భావించెద నిత్యమున్ గగనవాణిన్ మెచ్చి కీర్తించుచున్

    రిప్లయితొలగించండి