26, ఆగస్టు 2013, సోమవారం

పద్య రచన – 445 (ప్రాతఃకాలము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"ప్రాతఃకాలము"

37 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలము పురాణీ దేవీ
    రాతల కి యువతి చేతలకి వాజిని
    భూతలానికి నవ దిన ప్రవాహిని
    కోతలకి సుమూహుర్త ప్రదాయిని !


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. కాకినాడ శతావధానంలో తిరుపతి వేంకట కవుల పద్యం.....

    కమలమ్ముల్ వికసింపఁ గోకవితతుల్ కాంతిన్ జెలంగన్ దగన్
    విమలాకాశ మహాంతరాళమున దీప్తిజ్వాల లింపారఁగా
    గమలాప్తుం డుదయింపఁ దూర్పుమలపైఁ గాంతిచ్ఛటల్ తారకా
    సముదాయమ్ముల జాఱెఁ దెల్వి గనియెవ్ సర్వప్రపంచమ్ములున్.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మాకు వారూ వీరూ ఇచ్చిన పూరణలు వ్రాయుట కంటే - మీ పూరణలు ఇచ్చి మమ్ము ఆనందింపజేయ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. మంచు పొగలేమొ సాంబ్రాణి మించి యుండె
    ముఖము పసుపాయె సూరీడు ముద్దు బొట్టు
    తెల్ల వస్త్రము తలజుట్టి తీరు గాను
    తూర్పు కన్నియ యుదయమ్ము దోచెనాకు

    రిప్లయితొలగించండి
  5. ఈ ఏడు శివరాత్రికి కాశి లో ఉండే అదృష్టం కలిగింది. అప్పుడు కలిగిన అనుభూతి ఇది. (చంద్రోదయం అయ్యిన గంటలోనే
    సూర్యోదయం అయ్యింది ! )
    శివరాత్రి తుదిజాము శివజటాజూటిగా
    నెలవంక పొదిగిన నింగి దోచె
    వెనువెంటనే సూర్య బింబమ్ము ఉదయించి
    నిటలాక్షు ఫాలాన నేత్రమయ్యె
    చెక్కిళ్ళ రుద్రాక్ష చుక్కలేవోజారి
    చెట్టు పుట్టను మంచు బొట్టులయ్యె
    శ్రీరామ మంత్రమో జీవచైతన్యమో
    కలరవమ్ములు మ్రోగె గగనమందు

    నిగళగళఛాయగానింగి నీలమయ్యె
    శిరమునెత్తెనొ యేమొ విచిత్రముగను
    ప్రకృతిలోభాగమైనట్టి పార్వతీశు
    కంటి నారీతి కాశిలో గంగసాక్షి

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ప్రాతఃకాలమునలేచిప్రాస,యతిగనగ
    బ్లాగుశంకరాభరణం బాగజూసి
    పద్యరచనచేయగ పనులుమాని
    పూరణనుపూర్తిసేయగమూనువచ్చె

    రిప్లయితొలగించండి
  8. శ్రీ ఆదిత్య గారు మధురమైన కాశిలోని ప్రాతః కాలమును బహు సుందరముగా వర్ణించేరు.శ్రీ ఆదిత్య గారికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  9. ప్రాతః కాలమె లేచుచు
    చేతో మోదంబు గలుగ చిన్మయ మూర్తి
    న్నాత్రత నారాధించిన
    ఆతడె మనకిచ్చు నెపుడు నమితపు సిరులన్

    రిప్లయితొలగించండి
  10. మలయమారుతగానాలుమనసుదోచు
    బాల భానునికిరణాలుభాగ్యమిచ్చు
    ఆకుచాటునపూలుఅణకువనునేర్పు
    ప్రాతఃకాలమ్మునప్రకృతిపరవశించు

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! ఆదిత్య గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. ఈ పాదమును చూడండి:

    "నిగళ గళఛాయగా నింగి నీలమయ్యె"

    నిగళ గళఛ్ఛాయ అనే సమాసము సాధువు. అందులో చ్చాకి ముందున్న ళ గురువు అగును అందుచేత గణ భంగము అగును. సరిజేయండి.
    సంస్కృతములో సమాసములో ఉత్తరపదము ఛ తో మొదలగునపుడు అక్కడ తప్పనిసరిగా ఛ్ఛ (ద్విత్త్వ రూపము) వచ్చును. గుర్తు ఉంచుకొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. ముద్దు లొలికెడు శైశవమ్మును తదుపరి
    ఆటపాటలతో చాల హాయి గూర్చు
    బాల్యమును జీవితమ్ములో స్వర్ణ దశలు
    పరగు నవియె ప్రాతః కాల వైభవముగ

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. ప్రాత:కాలపు సూర్యుడు
    జ్యోతిర్మయుడై వెలుగగ శుభ వేళాయెన్
    చేతన నిండగ లేచిరి
    ప్రాత:కాలమున జనులు పనులను జేయన్

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు

    ప్రాతఃకాలము స్వచ్ఛ వాయువుల స్పర్శన్ మేనికిన్ హాయిగా
    ప్రాతస్నానము ,సంధ్యవార్చి ,సవితన్ ప్రార్థించి సత్కర్మలన్
    చాతుర్యమ్మున జేయుచున్ ప్రజలకై సాహాయమున్ కల్గ నీ
    జాతమ్మున్ సఫలమ్ము జేసికొనుమా సర్వేజనః శాంతి కై

    ఉదయాద్రి శిఖరమ్ము ఉత్సుకతన్ నీకు
    పద్మినీ బాంధవ ప్రాంజలిడగ
    తరులన్ని తమశాఖ విరులన్ని వికసింప
    తమిని మ్రొక్కుచు స్వాగతమ్ముచేయ
    కొలనులో కమలములలలపై తేలి ఆ
    హ్లాదమ్ము కలిగింప సాదరముగ
    వైదికుల్ పూజలు వేదోక్తముగ జేసి
    కలియుగ దైవమ్ము కొలుచు కొనగ
    వేచియున్నారు హే ప్రభూ విధులు తీర
    ప్రాగ్దిశను ఏక చక్రపు రథము పైన
    దర్శనమునిచ్చి విను వీధి తరలుమయ్య
    కాలమానమ్ము సతతమ్ము క్రమమొనర్ప

    రిప్లయితొలగించండి
  17. ప్రణయ సుందరి సందిట బంది యైన
    మత్తు వీడని సూరీడు బద్ధ కముగ
    మంచు తెరలను తొలగించి మౌని వలెను
    నేగు దెంచెను నొయ్యార మెసగ మెసగ

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    శ్రీ పండిత నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    ======*==========
    అరుణ కాంతికి మెరయును నద్భుతముగ
    నింగి, పుష్ప జాతులు గని పొంగి పోయె
    కోయిలల గానమున లేచి కోడి పుంజు
    తెల్ల వారెనని మనకు దెల్పు చుండె.
    ======*=========
    అరుణ కాంతికద్భుతముగ నలలు మెరయ
    ముదమున గనిన చంద్రుడు మునిగి పోయె
    కాకులేల్ల భానుని కావు కావు మనుచు
    తెల్ల వారెనని మనకు దెల్పు చుండె.
    =======*==========
    అరుణ కాంతికద్భుతముగ నలలు మెరయ
    ముదమున రవి కదలు చుండె పుడమి పైకి
    పురమునను గుడి గంటలు మ్రోగు చుండు
    తెల్ల వారెనని మనకు దెల్పు చుండె.
    =======*=========
    అరుణ కాంతికద్భుతముగ నవని మెరయ
    శంకరాభారణం బ్లాగు వంక జూడ
    సుకవివర్యుల పద్యపు సొగసు లెల్ల
    తెల్ల వారెనని మనకు దెల్పు చుండె.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ పండిత నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    ======*==========
    నగర జీవన మనుచును నలుగు చున్న
    యెనిమిది ఘడిలవరకును యెనుముల వలె
    మత్తు వీడక దిరిగెది మనుజు లుండ
    వట్టి బోయె ప్రాతః కాల వైభవములు

    రిప్లయితొలగించండి
  20. శ్రీమతి శైలజ గారి భావమును శార్దూల రూపములో:

    ప్రాతఃకాలమునందు మేలుకొనుచున్ ప్రాసల్ యతుల్ చూచి యం
    దే తీరున్నదొ శంకరాభరణ మందేమున్నదో యెంచుచున్
    చేతోమోదము గూర్చు పద్య రచనన్ చేబూని నేనందులో
    నే తాత్పర్యము నొంద పూర్తియగు నెంతే రాత్రి కా పద్యమున్

    రిప్లయితొలగించండి
  21. శ్రీమతి శైలజ గారి 2వ పద్యమునకు 3, 4 పాదములను ఈ విధముగా మార్చుదాము:

    ఆకు చాటు పూవులు నేర్పు నణకువ నిల
    పులకలొందు ప్రాతఃకాలముననె ప్రకృతి

    రిప్లయితొలగించండి
  22. తప్పు తెలిపినందుకు నేమాని వారికి ధన్యవాదములు. ఒక సందేహం ఆ పదాలను తత్సమాలు చేసినా కూడా ద్విత్వం వస్తుందా? 'నిగళగళుచాయ' అన్నది సాధువా తెలుపగలరు. ఆ పాదమును 'నిగళగళుకంఠమై నింగి నీలమయ్యె' అని మార్చిన సరిపోతున్నదా చెప్పగలరు.
    నమస్సులతో
    ఆదిత్య

    రిప్లయితొలగించండి
  23. శ్రీ పండిత నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    ======*=======
    సీరియళ్ళపై మగువలు చిత్త ముంచి
    యర్థ రాత్రి వరకు జూడ వ్యర్థ ముగను
    బద్దకపు సిరి తోడను మిద్దె లందు
    వట్టి బోయె ప్రాతఃకాల వైభవములు.

    రిప్లయితొలగించండి
  24. ధన వనము నందు దిరిగెడి ఘనులు నేడు
    రాక్షసులవలె సతులతో రాత్రులందు
    నాట్యమాడి పగటి పూట నభము గనక
    వట్టి బోయె ప్రాతః కాల వైభవములు

    రిప్లయితొలగించండి
  25. శ్రీ ఆదిత్య గారు! శుభాశీస్సులు.

    నిగళము అంటే "సంకెల" అనే అర్థము ఉన్నది. మీరు ఏ అర్థములో నిగళ గళుడు అన్నారు?

    రిప్లయితొలగించండి
  26. ఆదిత్య గారి పద్యము, తిమ్మాజీ రావుగారి పద్యములు మధుర మనోజ్ఞంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  27. ఈనాడు శ్రీ మిస్సన్న గారి కలము మిస్సయిందేమిటో?

    రిప్లయితొలగించండి
  28. గుడి గంట మేల్కొల్పు, కోడి కూతల పిల్పు
    .......... లెండు లెండని ప్రజన్ లేపు వేళ!
    మలయ మారుత వీచి, మంచు బిందువు రోచి
    .......... ప్రాభాత సంధ్యను పలుకరింప!
    భక్తి రంజని పాట, పక్షి కూనల యాట
    .......... నిదుర మత్తును లేపి నిలువరింప!
    వెలుగుల యెకిమీడు వేయి చేతుల ఱేడు
    .......... చీకటి రాత్రికి సెలవు జెప్ప!

    తూర్పు కొండల చూడుడీ తోచె నెఱుపు
    దిద్దె నుదుట నుషఃకాంత తిలక మదియె!
    కర్మ సాక్షికి నందరు ఘనము గాను
    స్వాగతము పల్కి చేతము వందనముల.

    రిప్లయితొలగించండి
  29. నేమాని పండితార్యా! మా కోడి ఆలస్యంగా కూసింది.

    రిప్లయితొలగించండి
  30. మిస్సన్న గారి పద్యము చాల అందముగా వచ్చినది అభినందనలు. ఆఖరి పాదములో "చేతము" పదము బాగులేదు. మార్చితే మంచిదని మా సూచన. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. శ్రీ నేమాని గురువుగారికి ప్రణమిల్లుతూ ,..
    మీరు శార్దూలరూపములో నాభావాన్ని పద్యంగా మలచినందుకు చాలా సంతోషిస్తున్నాను,.ఎంతో హృద్యంగా వ్రాసారు...అలాగే మీరు బాల్యముగురించి వ్రాసిన పద్యముఎంతో బాగుంది..అనేక కృతజ్ఞతలతో..

    రిప్లయితొలగించండి
  33. కవిమిత్రులకు వందనములు.
    ఈనాటి పద్యరచన శీర్షిక ‘ప్రాతఃకాలము’పై మనోహరంగా పద్యాలు చెప్పిన మిత్రులు...
    జిలేబీ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    ఆదిత్య గారికి,
    శైలజ గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వరప్రసాద్ గారికి
    మిస్సన్న గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. మిత్రులారా: శుభాశీస్సులు.ఈనాటి పద్య రచన అంశము "ప్రాతఃకాలము" నకు చక్కని రచనలౌ ఎన్నో వచ్చినవి. సమీక్షించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు మంచి ఉపమానములతో తూరుపు టుదయపు కన్నియను వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీ ఆదిత్య గారు శివరాత్రినాడు కాశీలో నున్న పుణ్యపు టనుభవముతో విపులముగా చక్కని భావములతో ప్రాతః కాలమును వర్ణించిన విధము అనన్య సామాన్యము.

    శ్రీమతి శైలజ గారు 2 పద్యములతో వారి భావమును వ్యక్తము చేసిరి. వానిని నేను ఒక శార్దూలము ఒక తేటగీతిలో రూప కల్పన/సవరణ జేసితిని. చాల బాగుగ నున్నవి వారి భావములు.

    శ్రీ సుబ్బా రావు గారు చిన్మయ మూర్తిని ఆరాధించినచో సిరులు లభించునన్నారు - ఆత్రత అను ప్రయోగము సరికాదు - ఆత్రము అనవలెను; అటులనైనను ప్రాస భంగము అగుచున్నది.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు ప్రాతః కాలపు సూర్యుడు జ్యోతిర్మయుడు చేతనత్వము నిచ్చును అన్నారు. మంచి భావము. చాల బాగుగనున్నది.

    శ్రీ తిమ్మాజీ రావు ఆరు: ఒక శార్దూలము ఒక సీసములో మంచి మంచి హృద్యములైన భావములతో ప్రాతఃకాల వైభవములను వర్ణించేరు. మిక్కిలి ప్రశంసనీయము.

    శ్రీమతి రాజేశ్వరి గారు సూరీడు మత్తు వీడక మౌనివలె నున్నాడనినారు. పద్యము బాగుగనున్నది.

    శ్రీ వరప్రసాద్ గారు 7 పద్యములలో వివిధములైన భావములను విపులముగా తెలియజేసేరు - చాల బాగుగ నున్నవి వారి భావములు మరియు పద్యములు.

    శ్రీ మిస్సన్నగారు పవిత్రమైన భావములతో అలతి అలతి పదములతో అందముగా ప్రకృతి శోభలను వర్ణించేరు. ప్రశంశనీయము గా నున్నవి. స్వస్తి.


    రిప్లయితొలగించండి
  35. నేమాని వారికి... నిగళగళుడు అన్నది ఎక్కడా ఉన్నట్లు లేదు! నేను శివుని పేరుగా విన్నట్లు గుర్తు. (బహుశా శంకరాభరణం పాట వల్ల కవచ్చు). స్పష్టత లేదు కనుక ఆ విధంగా నేను వెయ్యడం దోషమే. ఆ పాదాన్ని మార్చేస్తాను. మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  36. నేమాని పండితార్యా! ధన్యవాదములు. చేతము బదులుగా చేయుడు అనే పదాన్ని ఉంచుతున్నాను.

    రిప్లయితొలగించండి