6, ఆగస్టు 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1135 (అప్పిచ్చెడువాఁడు వైద్యుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
అప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.

31 కామెంట్‌లు:

  1. అప్పా! పరమాప్తులు కద
    అప్పిచ్చెడు వాడు వైద్యుడగు ననిరి బుధుల్
    తప్పక నివాసయోగ్యం
    బెప్పుడు నీరుండునట్టి యీ పురవరమే

    రిప్లయితొలగించండి
  2. చెప్పగ దారిద్ర్యంబును
    ముప్పగురోగమ్ములన్ని ముసిరిన వేళన్
    చప్పున బాధలు దీర్చగ
    నప్పిచ్చెడువాఁడు, వైద్యుఁ డగు ననిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  3. చెప్పగ దారిద్ర్యంబును
    ముప్పగురోగమ్ములన్ని ముసిరిన వేళన్
    చప్పున నుపశమనముగా
    నప్పిచ్చెడువాఁడు, వైద్యుఁ డగు ననిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  4. ఒప్పు గ్రహించక పొరపడి
    యప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డను పద్యమునన్
    దప్పును గొనియుం జనులకు
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగుననిరి బుధుల్! (1)

    అప్పనఁగను నీరముగద!
    తప్పక వైద్యుండు హరియ తానై యెపుడా
    యప్పులనిటఁ గురిపించఁగ
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగుననిరి బుధుల్! (2)
    ఒప్పు గ్రహించక పొరపడి
    యప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డను పద్యమునన్
    దప్పును గొనియుం జనులకు
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగుననిరి బుధుల్! (1)

    అప్పనఁగను నీరముగద!
    తప్పక వైద్యుండు హరియ తానై యెపుడా
    యప్పులనిటఁ గురిపించఁగ
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగుననిరి బుధుల్! (2)

    రిప్లయితొలగించండి
  5. అబ్బో ! మా వైద్యులు అంత పిచ్చోళ్ళా !

    కప్పము గట్టని సొమ్ముల
    ముప్పుల పడువాని యొక్క మూల ధనంబుల్
    మెప్పుగ గైకొని, కొంతయు
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  6. మూర్తి గారూ ! చక్కగా చెప్పారు..

    వైద్యుడు రోగాలను తగ్గిస్తూ ఆ రోగాలను తనకు అంటకుండా చేస్కుంటాడు.
    ( సరదాగా.....)


    అప్పిచ్చు పిచ్చి యొకనికి
    అప్పిచ్చినిదీర్చి బిల్లు నప్పిచ్చెనుగా
    అప్పిచ్చి తనకునంటక
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్.

    రిప్లయితొలగించండి
  7. తప్పులు మన్నించు శివుడు
    నొప్పగు మార్గమును జూపు నొజ్జయు నీతిన్
    దప్పక పాలించు నృపుడు
    నప్పిచ్చెడువాఁడు, వైద్యుఁ డగు ననిరి బుధుల్!!!

    రిప్లయితొలగించండి
  8. ధన్యవాదాలండీ హనుమఛ్ఛాస్త్రి గారూ ! మాకో సుఖ ముంది. చక్కగా అంకుల్ శాం కి పన్నులు కట్టేస్తే అధికారుల చుట్టూ తిరగడము మామూళ్ళు సమర్పించుకోవడ ముండదు. ముక్కుకి సూటిగా పోవచ్చును.

    రిప్లయితొలగించండి
  9. ఎప్పుడు సుఖముగ నుండుత !
    అప్పిచ్చెడు వాడు, వైద్యు డగు ననిరి బుధుల్
    ఒప్పుగను వైద్య శాస్త్రము
    తప్పగ మఱి జదువు వాడు ధరణిని వింటే ?

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులకు నమస్సుమాంజలులు.. మా ఊరు విజయనగరం. దూరదర్శన్ సీరియళ్ళకు గతంలో కొన్ని పాటలు రాసిఉన్నాను..వృత్తిరీత్యా న్యాయవాదిని, ప్రవృత్తిరీత్యా పాటలు రాయడం హాబీ.. మీ బ్లాగు పరిచయం అయినప్పటినుండీ పద్యరచన చదోబద్దంగా తమ వంటి పెద్దలవద్ద నేర్చుకునే భాగ్యం కలిగింది.

    అప్పుకైవచ్చుయందరిన్
    నొప్పింపగతగదు వారు నొచ్చునటుల్
    ఒప్పుగసాయముచేసిన
    అప్పిచ్చెడు వాడు, వైద్యు డగు ననిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  11. ఎప్పుడు వలసిన నలయక
    ముప్పొద్దుల చెంతజేరి ముదమలరంగా
    గొప్పదగు భావజాలము
    నప్పిచ్చెడువాడు వైద్యుడగుననిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
    =====*======
    తప్పులపై దప్పులు,పై
    తిప్పలు బడు చున్న నేత తిప్పుడు మహిలో
    గొప్పలు బలుకుచు దిరిగెచు
    నప్పిచ్చెడువాడు వైద్యుడగుననిరి బుధుల్.
    (తిప్పుడు= మన్మోహన్ సింగ్ )

    రిప్లయితొలగించండి
  13. అప్పిచ్చి బీదరికమను
    నొప్పుల దూరంబుజేసి నొగిలించక మా
    కొప్పిదములనొనరించగ
    నప్పిచ్చెడువాఁడు వైద్యుఁడగుననిరి బుధుల్.

    నొగిలించక = కష్టపెట్టక

    రిప్లయితొలగించండి
  14. నిప్పులు గురిసెడి కాలము
    దప్పికగొని బాటసార్లు తల్లడమొందే
    టప్పుడు దాహార్తులకున్
    అప్పిచ్చెడు వాడు వైద్యుడగు ననిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  15. ముప్పగు తిప్పలు పడినను
    అప్పిచ్చెడి వాఁ డు వైద్యుఁ డగు ననిరి బుధుల్
    తప్పదు వాసుని కైనను
    అప్పును జేయంగ పెండ్లి యాదర మొప్పన్

    రిప్లయితొలగించండి
  16. ముప్పను మాటయెఱుంగక
    యొప్పెడు జీవనపయనము నుర్విని గలదే?
    తిప్పల పొద్దున దైవం
    బప్పిచ్చెడువాఁడు, వైద్యుఁ డ;గు ననిరి బుధుల్.

    ఎంతటి వారికైనా ఆపత్సమయంలో డబ్బిచ్చి ఆదుకొనేవాడు, రోగాన్ని నయం చేసేవాడు దేవుడే కదా!

    రిప్లయితొలగించండి
  17. అమ్మా లక్ష్మీ దేవి గారూ! మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. మీ పద్యములో "జీవన పయనము" అనే సమాసము సాధువు కాదు. జీవన యానము అంటే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శంకరయ్య గురుదేవులకు ప్రణతులు.

    తప్పుగ సూక్తులు పలుకకు
    అప్పిచ్చెడు వాడు వైద్యుడగు ననిరి బుధుల్
    చెప్పిరనుచు, వైద్యుండును
    అప్పిచ్చెడు వాడు యూర నవసర మనియెన్

    చెప్పు మెవడవసరమునకు
    ఎప్పుడు ధనమిచ్చు వాడు? ఎవ్వడు రుజకున్
    తప్పక మందిచ్చును? యన
    అప్పిచ్చెడు వాడు,వైద్యుడ,గు ననిరి బుధుల్

    రిప్లయితొలగించండి
  19. అయ్యా, ధన్యవాదాలు. గణభంగము కాకుండా

    యొప్పెడు జీవనమనునది యుర్విని గలదే?

    అయితే బాగుంటుందని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులారా,
    నమస్కృతులు.
    ఉదయంనుండి దగ్గు, జ్వరం. మొన్నటి యాత్రలో మూడు రోజులు శిరిడీ, బాసర క్షాత్రాల్లో వర్షంలో తడనడం వల్ల కాబోలు.
    ఈరోజు మీ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  23. గురువు గారూ త్వరగా కోలుకొండి. త్వరగా ఉపశమనము కలుగకపోతే ఒక వైదుడిని తప్పక చూడండి.

    రిప్లయితొలగించండి
  24. వైద్య గురువు శిష్యునితో :

    విప్పారిన పరిశీలన
    దప్పునుగా గొన్ని చిత్ర తనుశోధనలున్
    'నొప్పి 'యన వినుము ! వీనుల
    నప్పిచ్చెడు వాడు వైద్యుడగు ననిరి బుధుల్

    చిత్ర తను శోధనలు =ఎక్సరేలు, అల్ట్రాసౌండులు, కేట్ స్కానులు, ఎం అర్ ఐ స్కానులు.

    రిప్లయితొలగించండి
  25. ఇప్పుడె డబ్బిమ్మనకనె
    గొప్పగ ముక్కలను గీకి గోముగ జనులన్
    మెప్పులు పొందుచు సతత
    మ్మప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్

    ముక్క = card (credit, debit, health etc)

    రిప్లయితొలగించండి


  26. గొప్పలకు గాను వైద్యం
    బప్పా వలయునని బోవ భారము గాన
    న్నప్పటి కప్పుడు, సుదతీ
    యప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. తప్పుడు వైద్యము నందున
    పప్పునతా కాలువేసి పంపుచు ముంబై
    గొప్పగు వైద్యము కొరకై
    యప్పిచ్చెడువాఁడు వైద్యుఁ డగు ననిరి బుధుల్

    రిప్లయితొలగించండి