31, ఆగస్టు 2013, శనివారం

సమస్యాపూరణం – 1160 (కొడుకు పుట్టె సన్యాసికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.

16 కామెంట్‌లు:

 1. పేరు సన్యాసి యయ్యు సంసారి యతడు
  సంఘమున పేరు గన్న సౌజన్య మూర్తి
  ఉచ్చమగు రాశిలో గురుడున్న వేళ
  కోడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను

  రిప్లయితొలగించండి
 2. చెలులు సంసారి, సన్యాసి తొలి వయసునఁ;
  బెండ్లి యాయెను సంసారి, పిదప యేఁటఁ
  గొడుకు పుట్టె! సన్యాసికి గురువు కృపను
  జేరె మదిని బ్రహ్మజ్ఞాన సారమెల్ల!!

  రిప్లయితొలగించండి

 3. జగద్గురువు శ్రీ కృష్ణ మాయ
  బ్రహ్మచారి నారదుడు చిక్కెను
  సంసార భవ సాగరమున
  కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. పండిత నేమాని వారూ,
  గురుమహర్దశలో కొడుకును గన్న సన్యాసయ్యను గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.....

  హరి జగద్గురు వాతని యనుపమమగు
  మాయలో నారదుఁడు చిక్కి మౌని యయ్యు
  భవసముద్రములోఁ బడి భంగపడెను
  కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.

  రిప్లయితొలగించండి
 5. పుత్రసంతానమే గోరి పూజ జేసె
  గురువు చెప్పిన విధముగా గొప్ప నిష్ఠ
  గలిగి సతితోడ నేడాది గడచినంత
  కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.

  రిప్లయితొలగించండి
 6. హరిని నిందించు రాజునకవని మెచ్చు
  కొడుకు పుట్టె ;సన్యాసికి గురువు కృపను
  భక్తిమార్గమ్ము జూపించు శక్తిబుట్టు,
  పుచ్చునేతల కెపుడుసద్బుద్ధి పుట్టు?

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ఇంతకీ పుత్రసంతానం కలిగింది సన్యాసికా? సన్యాసి అన్న పేరున్న వ్యక్తికా?
  *
  మంద పీతాంబర్ గారూ,
  విరుపుతో మూడు పుట్టుకల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారికి ధన్యవాదములు."లోభి" రాజకీయ నాయకులపై మంచి పద్యములు వ్రాసితిరి.
  శ్రీ మంద పీతాంబర్ గారు "పుచ్చునేతల" పై మంచి పద్యము వ్రాసితిరి. నా వంతు మిగిలినది, నేనొక ప్రయత్నము జేసెదను

  రిప్లయితొలగించండి
 9. నాదు సోదరి గిరిజకు నల్ల గాను
  కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను
  ముక్తి గలుగగ జేరెను మోక్ష పధము
  గురువు దయలుండ సాధించు కొనగ గలము

  రిప్లయితొలగించండి
 10. శ్రీ మంద పీతాంబర్ గారు "పుచ్చునేతల" పద్య స్పూర్తితో
  మధ్యాక్కర
  =======*======
  కన్య మానము దోచి యుండ కాలుడగు కొడుకు పుట్టె,
  సన్యాసికి గురువు కృపను సంఘ మొకటి జిక్కె,వలచి
  వన్య మృగము జెంత జేర వాత బెట్టెను వింత గాను,
  మాన్యుడని దిరుగ,వారి మానము మంటను గలిపె!

  ( సన్యాసి= సినిమా ప్రపంచమును వదలి రాజకీయము జేబట్టిన వాడు)

  రిప్లయితొలగించండి
 11. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు

  ప్రస్తుత బాబాలలో యొకడు "కల్కి" యను వానిపై
  ( సిగ్గు విడచిన వాడు = సన్యాసి )
  =====*======
  తారక రాముని గొలువ తాపము నశియించి పార్థ
  సారథికి కొడుకు పుట్టె,సన్యాసికి గురువు కృపను
  దూరమాయె దురిత మెల్ల, తోరణముగ నవినీతి,
  "వేరు"గ బంధు వర్గమును పెంచి దిరుగుచుండ,జిక్కె
  వైరితతికి వింత గాను,వైభవమ్ము తునియలాయె.

  రిప్లయితొలగించండి
 13. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు

  ఆమ్రఫలమును శిష్యు సన్యాసి చేత
  గురువు పంపగ తినె రాణి కోర్కె దీరె
  కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను
  ముక్తికాంత లభించను భక్తుడాయె

  రిప్లయితొలగించండి
 14. మాస్టరుగారూ ! ధన్యవాదములు. గొప్ప నిష్ఠ
  గలిగి సతితోడ పూజ చేసిన సన్యాసే..

  రిప్లయితొలగించండి
 15. ఆలు మగలకు గల ప్రేమ మతిశయింప
  యవ్వనమ్మున వారికి నందమైన
  కొడుకు పుట్టె; సన్యాసికి గురువు కృపను
  మోక్ష పథము లభియించి ముక్తి కలిగె.

  రిప్లయితొలగించండి
 16. నరప్రసాద్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి