పకోడీ దండకము
ఆహా పకోడీ! పసందౌ పకోడీ! ప్రియంబైన విందౌ పకోడీ! నినున్ గూర్చి వర్ణింప లేరెంత వారేని, నీ యింపు, నీ సొంపు, నీ వేడి, నీ వాడి, నిన్ మెచ్చి సేవింప మోదమ్మునున్ గూర్చి, యుత్సాహమున్ నింపి, యుల్లాసమున్ బెంచి, సమ్మోహమున్ గూర్తు గాదే? ఉపాహార వర్యంబులందీవె ముఖ్యంబుగా చాల ప్రఖ్యాతినిన్ గాంచితో, ఏమి నీ కర్కరల్, బల్బలే నీ రుచుల్, స్వాంతముల్ పొంగగా, నెంతయున్ దీటుగా, సాటిలేనట్టి నీవాట మేమందునో, మందుతో బాటు గైకొన్న నా చందమే మందుమో? విందులో నీవు లేకున్న నానందమేముండు? నిన్ వీడి మేముండ లేమెన్నడున్ గాదె, మా ప్రేమపాత్రంబ! మా మంచి మిత్రంబ! వేవేల జోహార్లు నీ వందుమా, సద్గతుల్ పొందుమా, సద్రసానందమూర్తీ!, సదా భవ్య కీర్తీ! నమస్తే నమస్తే, నమః
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
శ్రీ పండితనేమాని గురుదేవుల పకోడీ దండకము చాలా పసందు గానున్నది ఈ ప్రాతః కాలము నందు.
రిప్లయితొలగించండిపకోడి తిన్నట్లు గానే వున్నదండి..
రిప్లయితొలగించండిపూజ్యులు నేమానివారికి నమస్కారములు. తమరి పకోడీ దండకము బహు పసందుగా నున్నది. చవులూరించుచున్నది! ఇందు నొక చోటున టైపాటు దొరలినది. "మోదమ్మునున్ గూర్చి..."యని యుండవలసినది,"..మోదమ్మున్ గూర్చి.."యని టైపాటు...ప్రమాదపతితము...కాఁబోలును! గమనించఁగలరు. ధన్యవాదములతో....
రిప్లయితొలగించండిభవదీయ విధేయుఁడు,
గుండు మధుసూదన్
పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు
రిప్లయితొలగించండి“ కోడి కూరను తినవయ్య బోడి బాప
నయ్య” యనగ “నిషేధమ్ము నాకు” యనిన
వేది వేడిగ వేయించి విండుసేతు
కోడి కానిది నీకు పకోడీ నిత్తు
(చిలకమర్తి వారి సౌజన్యము తో )
సెనగ పిండి లో కొద్ది రవ్వను విదిల్చి
ఉల్లి చెక్కు పచ్చి మిరిచి అల్లపు తురు
మును తగిన పాలు కారపు పొడి లవణము
కొలది నీరము పోసి ముద్దలుగ జేసి
బాణలిని నూనె మరగించి భద్రముగను
వేరు వేరుగ ముక్కలు వేసి ఎరుపు
కూర్చు వరకు వేయించ పకోడీ యగును
స్వాదు రుచులు కరకరలు మోదముగను
వీని సెవింప గావలయు వాన కారు
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండినిజమే. అది టైపాటే. సవరిస్తున్నాను.
ధన్యవాదాలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిశ్రీ పండితుల వారి పకోడి దండకం ఘుమ ఘుమ లాడు తోంది