శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో శ్రీ నేమాని గురుదేవులకు శతకోటి ధన్యవాదములు.
మా తల్లిగారు పాడెడి పాట ఆధారముగా వ్రాసితిని. నిన్న భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జిల్లా చిక్కబళ్లాపుర పెండ్లికి వెళ్లి రాత్రి 10. 45 ని కు ఇంటికి జేరితిని. మాన్యగురువులు శ్రీ నేమానివారి కృష్ణ స్తుతి రెండు పర్యాయములు చదువుకొంటిని తనివి తీర లేదు . ఆ వృత్తములో నేను వ్రాయునట్లు దీవించగలరు. సోదరి శైలజ గారికి, శ్రీ మిస్సన్న గారికి, శ్రీ హనుమచ్చాస్త్రి గారికి శ్రీ నరసింహ మూర్తి గారికి మరియు సాహిత్యాభీమానులకు ధన్యవాదములు. =======*===== సకల సిరి సంపదల తోడ స్వర్గ మయ్యె భాగ్యనగరము,హైదరాబాదు,కాదు లేదనక దీర్చు చుండెను బీద జనుల బాధలను తల్లి వలె నేడు వసుధ పైన !
కవిమిత్రులకు నమస్కృతులు. ఈనాటి సమస్య, పద్యరచన శీర్షిక గతంలో ఇచ్చినవే అన్న విషయం గుర్తులేదు. ఉదయమే హైదరాబాద్ చెరుకున్నాను. అందువల్ల మార్చే అవకాశం లేకపోయింది. మిత్రులు మన్నించాలి.
మిత్రులకు నమస్కారం. హదరాబాదునుండి ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల విడివిడిగా అందరి పూరణలను, పద్యలను ప్రస్తుతం సమీక్షిం;చలేకపోతున్నాను. మన్నించండి. గతంలో ఇచ్చిన సమసే అయినా అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. చక్కని పూరణలు చెప్పిన మిత్రులు.... గుండు మధుసూదన్ గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, శైలజ గారికి, వరప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి, పండిత నేమాని వారికి, బొడ్డు శంకరయ్య గారికి, కెంబాయి తిమ్మాజీరావు గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, మంద పీతాంబర్ గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
మాస్టరు గారూ ! ఈ సమస్య మరియు పద్య రచన గతంలో ఇచ్చినవే...చూడగలరు...
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. మిత్రులు గోలివారన్న ట్లిది గతమునందు వారు పంపిన (సంఖ్య 228/16-02-2011) సమస్యయే!
రిప్లయితొలగించండిభిన్న సంస్కృతి ప్రాశస్త్య విలసనమ్ము;
నురుదు తెలుఁగు భాషల బాణి నొప్పు వాణి;
నిత్య నూతన మగు వెల్గు! నిజముఁ గన, న
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు!!
సకల సౌకర్యవంత విస్ఫారభూమి
రిప్లయితొలగించండిజీవనోపాధిఁ గలిగించు సిరులతల్లి
భాగ్యనగరమ్ము హైదరాబాదు, కాదు
మేటి నగరంబులైనను సాటి రావు.
నా ఇప్పటి మరియొక పూరణ ....
రిప్లయితొలగించండిభాగమతిపేర వెలసిన భాగ్య నగరి
కాలగతి మారె పేరేమొ కాదననకు
రెండు పేర్లును దానివే - మొండి ? యేల
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు?
భాగమతిపేరవెలసిన భాగ్యసీమ
రిప్లయితొలగించండిభావ రంజితసత్కళాభాసురమ్ము
భాగ్యనగరముహైదరాబాదు!కాదు!
కాదనియన్నపాడియా!కనులజూడ
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు శతకోటి ధన్యవాదములు.
మా తల్లిగారు పాడెడి పాట ఆధారముగా వ్రాసితిని. నిన్న భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జిల్లా చిక్కబళ్లాపుర పెండ్లికి వెళ్లి రాత్రి 10. 45 ని కు ఇంటికి జేరితిని. మాన్యగురువులు శ్రీ నేమానివారి కృష్ణ స్తుతి రెండు పర్యాయములు చదువుకొంటిని తనివి తీర లేదు . ఆ వృత్తములో నేను వ్రాయునట్లు దీవించగలరు.
సోదరి శైలజ గారికి, శ్రీ మిస్సన్న గారికి, శ్రీ హనుమచ్చాస్త్రి గారికి శ్రీ నరసింహ మూర్తి గారికి మరియు సాహిత్యాభీమానులకు ధన్యవాదములు.
=======*=====
సకల సిరి సంపదల తోడ స్వర్గ మయ్యె
భాగ్యనగరము,హైదరాబాదు,కాదు
లేదనక దీర్చు చుండెను బీద జనుల
బాధలను తల్లి వలె నేడు వసుధ పైన !
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్య, పద్యరచన శీర్షిక గతంలో ఇచ్చినవే అన్న విషయం గుర్తులేదు. ఉదయమే హైదరాబాద్ చెరుకున్నాను. అందువల్ల మార్చే అవకాశం లేకపోయింది. మిత్రులు మన్నించాలి.
ఇందు సందేహ మేలనో నిదియ నిజము
రిప్లయితొలగించండిభాగ్య నగరమ్ము హైదరాబాదు, కాదు
అనిన నొప్పదు ముమ్మాటి కదియ సుమ్ము
కంది శంకర ! నమ్ముడు కల్ల కాదు .
శ్రీ వరప్రసాద్ గారికి పాదప వృత్తము వ్రాయవలెనను కోరిక కల్గుట ముదావహము. తథాస్తు.
రిప్లయితొలగించండిబాగుగ కందుల వారి ప్రసాదున్
రాగమయున్ కవిరాయు నుతింతున్
వాగధిదేవి కృపన్ కని సిద్ధిన్
వేగమె పొంద వివేక రసాప్తిన్
స్వస్తి.
పల్లె టూరి జనమున కుపాధి యిచ్చి
రిప్లయితొలగించండివివిధ వర్గాల ప్రజలకు వేదికయ్యి
భాగ్య మందించి భోగాలు పంచు నట్టి
భాగ్యనగరము హైదరాబాదు. కాదు?
శ్రీ నేమాని గురుదేవులకు శతకోటి ధన్యవాదములు.ధన్యడను,మీ దీవెనలతో నాపద్యము ముందుకు కదలినది. నా పద్య రచనకు విఘ్నములు కలుగజేయ వలదని విఘ్నగణ పతిని వేడుకొనుచుంటిని.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న మహాశయుల వారి నిన్నటి పద్యములు అద్భుతముగా నున్నవి.
=====*======
పాదప వృత్తము బాగుగ వ్రాయన్
పాదము బట్టగ, పండిత వర్యుల్
మోదము దెల్పిరి ముందుకు బోవన్
రాధకు మాలగ వ్రాయగ కృష్ణా!
=====*=====
రాధకు మాలగ రంగుల తోడన్
వేదము జెప్పిన వీరుడ వీవే
పాదము బట్టితి పావన మూర్తీ!
మోదము దెల్పుము ముందుగ కృష్ణా!
శ్రీ శంకరయ్య గురుదేవులకు పండిత నేమాని గారి కి నమస్కారములు
రిప్లయితొలగించండివివిధమతములు జాతులు వేషభాష
లన్నివింత యాచారమ్ములమరియుండు
భాగ్యనగరము హైదరాబాదు కాదు
భావ్యము విభేదముల్ సృజింపంగనిచట
శ్రీ వరప్రసాద్ గారి పద్యములు చిన్న చిన్న సవరణలతో:
రిప్లయితొలగించండిపాదపవృత్తము బాగుగ వ్రాయన్
పాదము బట్టగ పండిత వర్యున్
మోదము దెల్పిరి ముందున కేగన్
హ్లాదముతో గొనియాడగ రాధన్
ఆదృతి గూర్చుచు నద్భుత మాలన్
వేదము నేర్పిన విజ్ఞుడ వీవే
పాదము బట్టితి పావనమూర్తీ!
మోదము తెల్పుము మోహన కృష్ణా!
భాగ్య నగరపు శోభలు భగ్గు మనగ
రిప్లయితొలగించండిపోరు బాటను జనులంత హోరు మనిరి
సంత రించిన భోగము లంత రించె
భాగ్య నగరమ్ము హైదరా బాదు కాదు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగతప్రాభవమునకు ప్రతిరూపమైనట్టి
రిప్లయితొలగించండిపలుకట్టడమ్ముల ప్రభలుతగ్గె
నిజమైన ప్రేమకునిలువెత్తుసాక్ష్యమౌ
భాగ్యనగర సీమ పరువు తరిగె
విజ్ఞానగంధమ్మువిశ్వానికందించు
విద్యాలయమ్ములు వికలమయ్యె
వాసిగాంచినయట్టి మూసీసుజలధార
మురికి కాల్వగమారి పరుగు లాపె
భిన్న జాతుల మద్య బిగిసిన బంధమ్ము
లన్నదమ్ములమద్య నతుకులూడె
తెలుగు నగరాన నాంగ్లమ్ము వెలుగు చుండె
బలము గలిగిన వారికే భద్రతుండె
మేటి నగరాల కెల్లను సాటి, నాటి
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు !!!
మిత్రులకు నమస్కారం.
రిప్లయితొలగించండిహదరాబాదునుండి ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల విడివిడిగా అందరి పూరణలను, పద్యలను ప్రస్తుతం సమీక్షిం;చలేకపోతున్నాను. మన్నించండి.
గతంలో ఇచ్చిన సమసే అయినా అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది.
చక్కని పూరణలు చెప్పిన మిత్రులు....
గుండు మధుసూదన్ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
శైలజ గారికి,
వరప్రసాద్ గారికి,
సుబ్బారావు గారికి,
పండిత నేమాని వారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
కెంబాయి తిమ్మాజీరావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మంద పీతాంబర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.