ఈ జనారణ్యమున పులి ఇచ్చకమ్ము లాడి రాజుయై పాలించు ,అంతులేని సంపదల పొందు మేకల చంపి తినుచు ఆ విపినమందునన్ పులి ఆకలవగ చంపి భక్షించు మృగముల చాలినన్ని అచట పులులకు మేకల అండ లేదు ఆచటనున్నది ఒక న్యాయ మడవి నీతి భగవదిచ్చను పాటించి మృగములన్ని శాంతి సుఖములు పొంది ప్రసన్నులగును
పెరుగు చున్నవి బాగుగ పురములెల్ల
రిప్లయితొలగించండిబహు మహానగరములౌచు ప్రస్తుతమ్ము
తగు ప్రణాళిక లేక సౌధములు చాల
యెక్కువై జనారణ్యము లివి యనంగ
కరి, కపి, పులి సింహములు మ
రిప్లయితొలగించండికరి , పాములు, తేళ్ళు, జెర్లు, గ్రద్దలు, నెమళుల్
సరిజూడ కానుపించును
నరరూపమ్మున మసలు జనారణ్యములో.
రా ష్ట్ర సమైక్య కొఱకునై రాష్ట్ర మం త
రిప్లయితొలగించండిచేయు చుండిన సీ మాంధ్ర నాయకు ల ట
బందు లాం దో ళ నంబుల చంద మరయ
కాను పించెజ నారణ్య మౌ నను న టు
అడవులన్ని నేడు నంతరించుచుండె
రిప్లయితొలగించండికడకు పట్టణాలు కాన లాయె
మేకవన్నెపులులు మెసలేజగంబు
జనారణ్యమందు జాగృతేది
పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు .
రిప్లయితొలగించండిఈ జనారణ్యమున పులి ఇచ్చకమ్ము
లాడి రాజుయై పాలించు ,అంతులేని
సంపదల పొందు మేకల చంపి తినుచు
ఆ విపినమందునన్ పులి ఆకలవగ
చంపి భక్షించు మృగముల చాలినన్ని
అచట పులులకు మేకల అండ లేదు
ఆచటనున్నది ఒక న్యాయ మడవి నీతి
భగవదిచ్చను పాటించి మృగములన్ని
శాంతి సుఖములు పొంది ప్రసన్నులగును
ఈ జనారణ్యముల వేధ కింక లేద ?
అడ్డు ఆపును వసుమతి కార్తి దీర్చ
నడుము కట్టుడు వనముల నాశనమ్ము
తొలగ ద్రోయుచు ప్రజలకు కలుగ సుఖము .
విపిన మందున దిరిగెడు కపి వరుండు
రిప్లయితొలగించండిగోముఖ వ్యాఘ్ర సింగముల్ పాము లనగ
రాజ కీయపు రాబందు రాజ్య మేలి
మెలగు చుండె జనారణ్య వలయ మందు
మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి పద్య రచనలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.
1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: కరి, కపి,పులి వంటి వివిధ జంతువులను మించిన మన నేతలతో నిండిన నేటి జనారణ్యములను వర్ణించేరు. చాల బాగుగ నున్నది.
2. శ్రీ సుబ్బా రావు గారు: నేటి బందులు, నిరసనలతో పట్టణములు జనారణ్యములుగ మారుటను వర్ణించేరు. చాల బాగుగ నున్నది.
3. శ్రీమతి శైలజ గారు: మీ పద్యములో 3, 4 పద్యములను ఈ విధముగ మార్చుదాము:
మేక వన్నె పులల కాకరమైనట్టి
జన విపినములను గనుడు నేడు
మీ భావము బాగుగ నున్నది.
4. శ్రీ తిమ్మాజీ రావు గారు: విపులమైన భావముతో పద్యమును వ్రాసేరు - ప్రస్తుత రాజకీయములలోని అనేక జంతు ప్రాయులైన నేతలను వర్ణించేరు. చాల ప్రశంసనీయము.
శ్రీమతి రాజేశ్వరి గారు: మంచి పద్యములో నేటి రాజకీయములలో రాబందులను వర్ణించేరు. చాల బాగుగ నున్నది.
స్వస్తి.
శ్రీమతి రాజేశ్వరి గారికి
రిప్లయితొలగించండిచక్కని వ్యాఖ్యనందించి నారు ,అభినందనలు.
నమస్కారములు
రిప్లయితొలగించండిపూజ్య గురువులు శ్రీ పండిత నేమాని వారికి , సో దరులు శ్రీ తిమ్మాజీ రావు గారికీ ధన్య వాదములు