8, ఆగస్టు 2013, గురువారం

పద్య రచన – 427 (ఆటవిడుపు)

కవిమిత్రులారా,
ఈరోజు పద్యరచనకు అంశము....
"ఆటవిడుపు"
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:


  1. ఆటవిడుపులో నైనను పద్యమును
    మరువ అనుమతి ఈయరే అయ్యవారు !
    ఆటవిడుపుపద్యము నిచ్చి ఆ పైన
    ఒప్పింప ఆన ఇచ్చిన నేనేమి చేతు మరి ?

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ఆటవిడుపు కొరకు మేటియై వెలుగొందు
    పద్యరచన చేసి హృద్యముగను
    చదువువారి కెంతొ సంతోషమునుబంచు
    పండితాళి కెల్ల వందనంబు

    రిప్లయితొలగించండి
  3. ఆటలాడుచుండు నాదిదేవుడు సదా
    విశ్వపాలనమను విధము లోన
    అలసి సొలసి యున్న యట్టి నా కెన్నడో
    ఆట విడుపు తెలియదయ్యె నకట!

    రిప్లయితొలగించండి
  4. మాస్టరుగారూ ! మీకు ఆరోగ్యము త్వరగా కుదుటబడాలని కోరుకొనుచున్నాను.

    మొదట "ఆటవిడుపును" చూడగానే నాలో కలిగిన భావము...జిలేబిగారు ముందుగా వెలిబుచ్చిన భావము ఒకటే...
    జిలేబిగారి భావానికి నా పద్య రూపము..

    ఆటవిడుపుగనైననీ యయ్యవారు
    పద్యమీయగ మరువరు బ్లాగునందు
    ఆటవిడుపును వర్ణించ నాన వెట్టె
    ఇదియెయాటగ దలతునింకేమిజేతు.

    రిప్లయితొలగించండి
  5. ఆటవిడుపు గ విడుచును నయ్య వారు
    పా ఠ ములువిని విసిగిన బాల బాలి
    కలను నా డుకొనుటకు నై కలసిమెలసి
    వారి మనసులు హాయిగ మారు కొఱకు

    రిప్లయితొలగించండి
  6. నిత్యమొక్క పనిని నెరవేర్చుచుండిన
    విసుగుబుట్టునపుడు వింతగాను
    ఆటవిడుపు యున్న అలసట తీరును
    సరళమగును పనులు సుఖముగాను

    రిప్లయితొలగించండి
  7. అమ్మా! శైలజ గారూ! మంచి పద్యము వ్రాసేరు. అంతా బాగుగనున్నది. అభినందనలు.కొన్ని సూచనలు:
    1. 3వ పాదములో యడాగమము వేసేరు - అక్కడ యడాగమము రాదు. అందుచేత మార్చ వలెను.
    2. ఆఖరి పాదములో యతి మైత్రి లేదు. ఆ పాదములను ఇలాగ మార్చుదాము:
    "ఆటవిడుపు వలన నలసట తీరును
    సరళమగును పనులు సౌఖ్య మలర"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. ఆర్యా!
    అందరికీ నమస్కారం.
    సరదాగా మరియొక ప్రయత్నము:

    రసవంతమై యొప్పు రమ్యభోజనమందు
    ..........అప్పడంబులు జూడ నాటవిడుపు,
    విజ్ఞానమును గూర్చు విద్యనేర్పుటలోన
    ..........హాస్యోక్తు లవిగాదె యాటవిడుపు
    సాగరతుల్యమౌ సంసారమందున
    ..........నభ్యాగతులరాక యాటవిడుపు,
    అత్యంత భారమౌ నిత్యజీవనములో
    ..........నాత్మజసంప్రాప్తి యాటవిడుపు
    నిష్ఠతో గూడి సతతంబు నిర్మలాత్మ
    నఘము బాపంగ నుతియించి హరిని గాంచి
    మ్రొక్కు చుండుచు పొందెడు మోక్ష మరయ
    నాటవిడుపుల కెల్లయు నాటవిడుపు.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ హరి....మూర్తి గారూ! శుభాశీస్సులు.
    ఆటవిడుపు మీద మీరు వ్రాసిన పద్యము ఆటవిడుపులోనే వ్రాసి యుంటారు. చాలా బాగుగా నున్నది. కొన్ని మార్పులను నేను సూచించుచున్నాను. పరిశీలించండి:

    1. సీసము: 3వ పాదములో -- అభ్యాగతుల రాకకి బదులుగా : ఆప్త బంధుల రాక అందాము
    2. అత్యంత భారమౌ నిత్య జీవనములో కి బదులుగా: సుఖ దుఃఖ మిళితమై చొక్కు జీవితములో అందాము.
    3. తేటగీతి 3వ పాదము కి బదులుగా: భక్తి పొంగార మ్రొక్కిడి ముక్తి గనుట అందాము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. జగతి నేలు నట్టి భగ వంతుడే యైన
    సంజ రాగ మంచు సౌరు లందు
    వంట యిల్లు వీడ వనితల కేనాడు
    ఆట విడుపు లేక యలసి సొలసి

    రిప్లయితొలగించండి
  11. జగతి నేలునట్టి భగవంతుడేయైన
    విశ్రమించు, పొందు వేడుకలను
    వనిత వీడ గలదె వంటిల్లు నెపుడేని?
    ఆట విడుపు సౌఖ్య మందగలదె?

    రిప్లయితొలగించండి
  12. అమ్మా రాజేశ్వరి గారూ! మీ పద్యమును సరిజేస్తూ (అన్వయ సౌలభ్యము కొరకు) నేను వేరొక పద్యమును వ్రాసేను -- జగతినేలు నట్టి భగవంతుడేయైన అని మొదలిడి -- చూడండి. ఆ పద్యముతో బాటు ఈ వివరణను వ్రాయనందులకు చింతించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    తుంటరి ప్రయత్నము
    ======*======
    ఆట విడుపు కోరి పాట పాడుచు నందు
    పాత పాడు చుందు జంట కోరి
    జంట కోరి నేను వెంట దిరుగు చుందు
    వెంట దిరుగు చుందు తుంటరినయి .

    రిప్లయితొలగించండి
  14. సృష్టిజేయు బ్రహ్మ జీవకోటిని నితము
    అతనికెపుడు లేదు ఆటవిడుపు
    అర్కచంద్ర తారకాది గ్రహములన్ని
    వారి వారి గతుల వరలుచుండు

    ఆటవిడుపు లేదు అన్నిదేహులకును
    అవయవమ్ములకును, ఆగకుండ
    పనులు చేయవలయు ప్రాణమ్ము నిలుపంగ
    ఆటవిడుపునీయ అంతమగును

    అన్ని పనులు జేసి ఆటవిడుపు లేక
    మందబుద్ధి యగును మానవుండు
    అనుచు దొరలు పల్కిరాoగ్లమ్ము నందున
    ఆట పాట కొరకు ఆటవిడుపు

    రిప్లయితొలగించండి
  15. అయ్యా! వర ప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము తుంటరిగా కాదు - బాగుగనే యున్నది. అభినందనలు. 2వ పాదములో యతి మైత్రి లేదని మీరు గమనించలేదు.

    శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు.
    చాల మంచి భావములతో చక్కని పద్యములను వెలువరించినారు. సంతోషము. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    టై పాటు నా అశ్రద్దకు క్షమించగలరు
    =====*========
    ఆట విడుపు కోరి పాట పాడుచు నుందు
    పాట పాడు చుందు జంట కోరి
    జంట కోరి నేను వెంట దిరుగు చుందు
    వెంట దిరుగు చుందు తుంటరినయి.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ వరప్రసాద్ గారికి నమస్కారములు,..
    మీరు పంపిన యతి ప్రాసల వివరణ నాకు ఎంతగానో ఉపకరిస్తుంది,..వివరంగా తెలియ జేస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలాచాలా కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారు! శుభాశీస్సులు.
    మీరు సవరించిన పాదములో కూడా ప్రాసయతి నియమము పాటింపబడ లేదు. "పాట పాడుచుందు జంట కోరి" --
    పాట అని ప్రారంబించేరు కాబట్టి ప్రాస యతి స్థానములో దీర్ఘాక్షరము మరియు ట కలిసి రావలెను. జంట అనునప్పుడు బిందుపూర్వక "ట"ను వాడేరు. అందుచేత యతి మైత్రి చెల్లదు. యతి స్థానములో "ప్రాస నియమమును పాటించుటే ప్రాస యతి కదా!". స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీపండిత నేమాని గురువులకు శ్రీ శంకరార్యులకు
    శంకరాభరణ కవిమిత్రులకు బ్లాగువీక్షకులకు నమస్సులతో
    సుమారు నాల్గు మాసముల పంచాయితీ ఎన్నికల అజ్ఞాతవాస దీక్షానంతరం ఒక ప్రయత్నము.
    సామరస్యపు భావాల సాగు చుండి
    అరమరికలు లేకుండగ హాయి నుండ
    ఆట విడుపుగ దలచుచు నాడు కొనుట
    దేవ! నీకిది చోద్యమా! తెలుగునేల
    ఇటుల దగులబడంజేయ నెటుల నోర్తు?

    రిప్లయితొలగించండి
  21. Sri T.B.S.Sarma garu!
    అయ్యా! శుభాశీస్సులు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది - మంచి భావమును ప్రకటించేరు. అభినందనలు.

    రిప్లయితొలగించండి