5, ఆగస్టు 2013, సోమవారం

పద్య రచన – 424

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. మిత్రులారా! చిత్రములో "సమిష్టి" అని ఇచ్చిన పదము సరికాదు -- సమష్టి అనుట సాధు ప్రయోగము.

    చిత్రము గూర్చి ఒక చిన్న వివరణ:

    ఒక చిన్న దున్నపై నురికె సింహంబులు
    ....నాలుగా స్థితిజూచి చాల చాల
    అడవి దున్నలు చేరి యా సింహముల పైకి
    ....దాడిచేసెను మహాత్వరిత గతిని
    సింహంబులను ద్రొక్కి చీకాకు పరచుచు
    ....వాడి కొమ్ములతోడ బాధ గూర్ప
    ప్రాణ భయమ్ముతో పారిపోయెను వడి
    ....సింహంబు లన్నియు చెదరిపోయి
    అటుల దున్నలెల్ల నైకమత్యంబుతో
    బోరు సలిపి సింహములను ద్రోలి
    యాత్మ రక్షణమున కానందపడె చాల
    ఐకమత్యమే మహాబలమ్ము

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    చిత్ర కథనాన్ని మనోహరమైన సీసపద్యంగా మలచి అలరింపజేసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  3. తెలుగు పద్య పరిమళ సుగంధం
    అంతర్జాల పురవీధుల లో వైభవం
    వ్యక్త పండితుల సాధనా సహిత
    సమష్టి ఆచార్యుల 'శంకరాభరణం' !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. అడవి దున్నల దాడికి నాగ లేక
    పారి పోవుట జూచితె ? మీ రలార్య !
    అడవి యం తటి కిని రాజు నయ్యి సింహ
    మకట !, సమష్టి యనగను నదియ సుమ్ము

    రిప్లయితొలగించండి
  5. జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    చిత్రానికి తగినట్లుగా చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    'రాజు నయ్యి' ని 'రాజు నయ్యు' అంటే బాగుంటుందేమో?
    నాల్గవ పాదంలో గణదోషం. 'అక్కట' అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  6. పోతులన్నియు నేకమై పోరుసల్ప
    సింగమైనను తప్పక భంగపడును
    వ్యక్టి యొక్కడే సాధింప వలను పడని
    పని సమిష్టిగ సాధ్యమౌ నని తెలియము

    రిప్లయితొలగించండి
  7. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. సమిష్టి అనే పదము లేదు - సమష్టి అని వాడవలెను అని ముందుగానే నేను సూచించేను. మీరు గమనించ నట్లున్నారు. కొంచెము మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. శక్తిహీనులేని యుక్తిగనొకటైన
    నధికులైన వారి నణచగలరు
    వడివడి మృగరాజు నడవిదున్నలుగూడి
    తరుముచుండు దృశ్య మరయదగును.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    గురుదేవులకు ధన్యవాదములు
    శ్రీ నేమాని గురుదేవులు మనోహరమైన సీసపద్యము వ్రాసారు.
    నాదో చిన్న ప్రయత్నము
    =====*======
    కరమున జిక్కని సింహము
    కరముల జిక్కి యమపురిని గాంచి వడివడిన్
    పరుగు లిడెను బరికింపుడు
    పరవశ మొం దైకమత్య బలమును మనసా ।

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మృగ రాజుకు నాహారము
    మృగ మొక్కటి ప్రతి దినమ్ము మ్రొక్కుచు వెడలన్
    మృగములు నైక్యత నొందుచు
    మృగ రాజును సుడియ బెట్టి మోదము నొందన్ !

    రిప్లయితొలగించండి
  12. గడ్డి పరకలు వెంటి యై కరిని గట్టె
    వలను జిక్కిన గువ్వలు చెలిమి నెగిరె
    ఐక మత్యము నుండిన నేక మవగ
    సింగ మైనను బెదరును భంగ పడగ

    రిప్లయితొలగించండి
  13. సింహబునైన విచ్చిన్నంబు జేయంగ
    పోరుసల్పెను దున్నపోతులచట
    ఐకమత్యముఁజూపి యష్టకష్టంబులఁ
    తొలగజేయగఁజూడ వలయుఁగాదె
    ప్రాణహానిగనెంచి భయదవర్తినులుగా
    పయనించనెంచ పాపామ్ముగాదె
    ప్రాప్తముండెడిచోట ఫలముదప్పకఁగల్గు
    ననెడు నార్యోకి నిత్యంబుగాదె

    జంతుజాలంబునకు పక్షి సంతతులకు
    జలచరంబులకన్యలోకులకునైన
    ఐకమత్యంబె బలముగా నధివసించు
    మనుజులందున కనలేము! మార్గమెద్ది.

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి