11, ఆగస్టు 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1140 (ప్రత్యర్థిని జూచి వడఁకె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

26 కామెంట్‌లు:

  1. అర్జునుడు మోహావేశముతో యుద్ధమునకు ముందు దైన్యము నొందెను కదా!:

    ప్రత్యర్థు లారుగురు మది
    నత్యంతము బాధ లిడగ నట మోహంబే
    యత్యధికమయ్యె నని యా
    ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్

    రిప్లయితొలగించండి
  2. అత్యవసర స్థితి గావున
    ప్రత్య ర్ద్ధిని జూచివడఁ కెఁ బార్ధుండనిలోన్
    నిత్యము వీడక జయమిడు
    సత్యమె మన మూల ధనము సాధిత మొందన్ !

    రిప్లయితొలగించండి
  3. సత్య వచనుఁ డగ్రజుకై,
    గత్యంతర మేమిలేక, గయుఁ గావ, క్షణం
    బత్యం తాప్తునిఁ గృష్ణునిఁ
    బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

    రిప్లయితొలగించండి
  4. ప్రత్యర్ధి నదీ సుతుడిని
    నత్యంతము శోకకరము ననిలో ద్రుంపన్
    గత్యంతము గన నేరక
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

    రిప్లయితొలగించండి
  5. తమ్ముడు చి. డా. నరసింహ మూర్తి పద్యమును కొంచెము సవరించుచూ:

    ప్రత్యర్థి నదీనందను
    నత్యంతము శోచనీయమని ద్రుంచుటయౌ
    గత్యంతర మరయక యా
    ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా! శుభాశీస్సులు. అందరికీ అభినందనలు.

    శ్రీమతి రాజేశ్వరి గారు: 1వ పాదములో గణములు సరిగా లేవు. ఇలాగ మార్చుదాము:అత్యవసరము స్థితిలో -- పద్యము బాగుగ నున్నది.

    శ్రీ మధుసూదన్ గారు: మొదటి పాదములో అగ్రజుకై అనుట సాధువు కాదు. అగ్రజునకై అనుట సాధువు. అందుచేత సత్యవచను డన్నకునై -- అని మార్చుదాము. పద్యము చాల బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  7. ప్రత్యర్థి గురువుమరియొక
    ప్రత్యర్థియె తాత, కాద పాపంబనుచున్
    హత్యలు జేయుట తగదని
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు నేమానివారికి ధన్యవాదములు. "అగ్రజుకై"యను పదమును, "అన్న పనుప"యని సవరించితిని. నా సవరించిన పూరణము...

    సత్య వచనుఁ డన్న పనుప,
    గత్యంతర మేమిలేక గయుఁ గావ, క్షణం
    బత్యం తాప్తునిఁ గృష్ణునిఁ
    బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీకృష్ణ నిర్యాణానంతరము ఎరుకలతో యుద్ధములో ఓడినట్లుగానున్న ఒక కథ యాధారముగా...........

    స్మృత్యంతరములనెంచక
    నత్యంతావేశమొందెనా ఎరుకలతో
    భీత్యాభిఘాతుఁడయె తాఁ
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ పార్థుండనిలోన్.

    రిప్లయితొలగించండి
  10. సత్యము తప్పని వాడ న
    కృత్యములెట్లు సలుపవలె ? కృష్ణా యనుచున్
    హత్యా పాతక భీతిన్
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

    రిప్లయితొలగించండి
  11. ప్రత్యర్ధులు సోదరులే
    సత్యము , మఱి వారి జంప సముచితమేనా ?
    హత్యలు దాజేయ ననుచు
    ప్రత్యర్ధిని జూచి వడకె బార్థుం డని లోన్

    రిప్లయితొలగించండి
  12. మిత్రులకు శుభాశీస్సులు.
    మరికొన్ని పూరణలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: గురువు, తాత ప్రత్యర్థులుగా నుండుటను జూచిన పార్థుని స్థితిని వర్ణించేరు. పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: ఎరుకలచేత పరాజయమును పొందే అర్జునుని స్థితిని వర్ణించేరు. చాల బాగుగ నున్నది పద్యము.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: సవరించిన మీ పద్యము ఎంతో బాగుగనున్నది.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: అర్జునుని మానసిక స్థితిని వర్ణించేరు పద్యము చాల బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  13. నా రెండవ పూరణము:
    పాశుపతమునకై యర్జునుఁడు చేయు తపముం బరీక్షింపఁ గిరాతుఁడై బలప్రదర్శనము చేసిన శివు నెదుర్కొను శక్తిఁ గోల్పోయిన యర్జునుని దుఃస్థితి వర్ణనము.


    అత్యంత బలుఁ, గిరాతునిఁ,
    బ్రత్యర్థినిఁ జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్;
    బ్రత్యక్షమాయె శివుఁడున్
    నిత్య విజయ పాశుపతము నిచ్చె నరునకున్!

    రిప్లయితొలగించండి
  14. సత్యమ్ముత్తర కొమరుడు
    ప్రత్యర్థిని జూచి వడికె , బార్థుండనిలో
    నత్యాభీలముతో నౌ
    ద్ధత్యపు కురు సేన నడచె ధర్మము గెలిచెన్ .

    రిప్లయితొలగించండి
  15. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    సైంధవ వధను గూర్చి చెప్పుచూ సంజయుడు ధృతరాష్ట్రునితో అర్జునుని ప్రతాపమును తెల్పుచూ

    సత్యము కౌరవ సేనలు
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ, బార్థుం డనిలోన్
    ప్రత్యాసార శరంబుల
    మృత్యుంజయు వోలె సెలయ మిత్తిగ దలపన్౤

    రిప్లయితొలగించండి
  16. సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    శిరో వేధనతో నిన్నటి నుండి బాధ పడుచున్నాను.
    జరిగిన కథ
    ====*====
    నిత్యము కరవాలముతో
    సత్యము జంపు జననేత సహచర గణముల్
    ప్రత్యక్ష పోరున గనిన,
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ పార్థుండనిలోన్.
    (పార్థుండు= పార్థసారథి రెడ్డి)

    రిప్లయితొలగించండి
  17. మృత్యుభయంబునఁ తన అ
    కృత్యమునున్ దాచి గయుడు క్రీడిని జేరెన్
    అత్యంతోగ్రత నటఁ గల
    ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్

    రిప్లయితొలగించండి
  18. మిత్రులారా! మరికొన్ని పూరణలను సమీక్షించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: మీ 2వ పూరణ కిరాతార్జునీయము కథతో చక్కగ నడచినది. మంచి పద్యము.

    శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు: ఉత్తగోగ్రహణమును ఉట్టంకించుచు మీరు చెప్పిన పద్యము మంచి పద బంధముతో అలరారుచున్నది.

    శ్రీ తోపెల్ల శర్మ గారు: మీ పద్యము చక్కని విరుపుతో సరళ పదజాలముతో నొప్పుచున్నది.

    శ్రీ వర ప్రసాద్ గారు: ఈ మధ్య మీరు ఎక్కువ పద్యములను వ్రాయుచున్నారు. దాని వలన మెదడునకు ఒత్తిడి పెరిగి తలనొప్పి రావచ్చును. పద్యములను ఆటవిడుపు వేళలలోనే వ్రాయండి. మీ పద్యములో ప్రత్యక్ష పోరు అనే సమాసము సాధువు కాదు. ప్రత్యక్ష సమరమందా అని అక్కడ మార్చండి.

    శ్రీ రామకృష్ణ గారు! అకృత్యము అను పదములో కృ ముందుననున్న అ గురువు కాదు - లఘువే. కృ అనునది (క్ హల్లు + ఋ అచ్చు) మాత్రమే - సంయుక్తాక్షరము కాదు; క్రు అంటే సంయుక్తాక్షరమగును. ఋ అచ్చు -- రు హల్లు అగును కదా. అందుచేత ఆ పాదములో "తనదు నకృత్యము" అని మార్చుదాము.

    రిప్లయితొలగించండి
  19. అత్యంత క్రోధగర్విత
    ప్రత్యర్ధిని జూచి వడకె, బార్థుoడనిలోన్
    అత్యాదరమున రాముడు
    ప్రత్యర్ధిని జామదగ్నిరౌద్రమ్మణచెన్

    పార్థుడు=రాజు (దశరథుడు)

    రిప్లయితొలగించండి
  20. సత్యమిది ఉత్తరుండే
    ప్రత్యర్ధిని జూచి వడకె, బార్థుoడనిలోన్
    అత్యంతోగ్రత, సమరము
    నత్యయమొనరించె శత్రు లపజయమందన్

    రిప్లయితొలగించండి
  21. సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచనలను తప్పక పాటించెదను.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ 2 పద్యములు చాల బాగుగ నున్నవి. మొదటి పద్యము 4వ పాదములో అన్వయ సౌలభ్యము కొరకు ఆ పాదమును ఇలాగ మార్చండి:
    "ప్రత్యర్థికి భార్గవునకు రౌద్రమ్మణచెన్"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని వారికి నమస్సులు. ధన్యవాదములు

    మీరు చెప్పినట్లుగనే గణదోషాన్ని సవరిస్తున్నాను:
    మృత్యుభయంబునఁ తనదు న
    కృత్యమునున్ దాచి గయుడు క్రీడిని జేరెన్
    అత్యంతోగ్రత నటఁ గల
    ప్రత్యర్థిని జూచి వడకె బార్థుండనిలోన్



    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  24. అత్యాచారము భయమని
    ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్
    గత్యంతరమ్ము లేదను
    సత్యము బోధించె చక్రి
    సమరమునందున్

    రిప్లయితొలగించండి