పండిత నేమాని వారూ, రక్షాసూత్రాన్ని కడుతున్న సోదరి పలుకులుగా మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, భగినీ అనురాగాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, రక్షాబంధన ప్రాశస్త్యాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, శుభకామనలను తెలిపిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * జిలేబీ గారూ, మంచి భావం. అభినందనలు.
సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ రెండవ పద్యం కూడా మనోహరంగా ఉంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీరావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘దేశముకున్’ అనరాదు, ‘దేశమునకున్’ అనవలసి ఉంటుంది. * శైలజ గారూ, మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు. చివరి పాదంలో గణదోషం. ‘రక్షా’ను ‘రక్షించు’ అంటే సరి.
కుసుమ సుదర్శన్ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు ఏ ఫాంటు వినియోగిస్తున్నారో అర్థం కాలేదు. ‘లేఖిని’లో టైప్ చేసి దానిని కాపీ చేసి, ఇక్కడ పేస్ట్ చెస్తే బాగుంటుందని నా సలహా.
....... శుభోదయం........
రిప్లయితొలగించు......అందరికీ రక్షాబంధన్ శభాకాంక్షలు.....
అన్నా! యియ్యదె ప్రేమబంధము సుమీ ఆనంద సంధాయకం
రిప్లయితొలగించుబెన్నన్ రక్షను గట్టుచుంటి నిదియే యిచ్చున్ మహోత్సాహమున్
నన్నున్ గంటికి రెప్పవోలె కను నిన్ మాన్యున్ గుణైశ్వర్య సం
పన్నున్ నెమ్మది ప్రస్తుతింతు బహుధా భద్రప్రియా! సర్వదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించురక్షా బంధన మనగను
రిప్లయితొలగించుఅక్షయ మగు భ్రాత్రు ప్రేమ యానంద మిడన్ !
లక్షణ ముగ దీవెన లిడి
రక్షణ జేయంగ భగిని రాగము విరియన్
పూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవి పండిత మిత్రులందఱికి రక్షాబంధనదినోత్సవ శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించుసాక్షాత్తు సోదరియె తమ
కక్షయముగ రక్షణ నిడు కాంక్ష బలిమిచే
రక్షా సూత్రముఁ గట్టెడి
రక్షాబంధనదిన మనురాగ దినమ్మే!!
మన భగినీ బృందాంచిత
రిప్లయితొలగించువనితా రత్నముల కెల్ల పలికెద శుభకా
మనలను నే రక్షాబం
ధన పర్వము నాడు ప్రేమ తద్దయు పొంగన్
రిప్లయితొలగించుఅదిగో అల్లదిగో 'బుడుగు' జీవి
ఆతనికి కట్టె సోదరి రక్షా బంధన్
ఆ రక్షా బంధనమే తోడై బుడుగు
ప్రకాశించు గాక తెలుగు 'నాణ్య' మై !
శుభాకామ్క్షల తో
జిలేబి
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించురక్షాసూత్రాన్ని కడుతున్న సోదరి పలుకులుగా మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
భగినీ అనురాగాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
రక్షాబంధన ప్రాశస్త్యాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
శుభకామనలను తెలిపిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
మంచి భావం. అభినందనలు.
బంధ మయ్యది బలముగ బట్టు కొఱకు
రిప్లయితొలగించుకట్టు చుండెను రాకీని బిట్టు గాను
అరయ శ్రావణ పూర్ణిమ యగుట వలన
నేడు ,చిత్ర పు చిత్రము చూడు డార్య !
అక్షయమగు బంధమ్మిది
రిప్లయితొలగించువీక్షించుము నన్ను నీవు వీడకుమెపుడున్
రక్షా బంధనమిదిగో
అక్షములన్ ప్రేమనింపి, అన్నా! కడుదున్.
రక్షాబంధన పర్వరాజమిది సౌభ్రాత్రంబు రాజిల్లగా
రిప్లయితొలగించునక్షీణంబగు ప్రేమభావమున నా కాశీస్సులన్ గూర్పుమా
సాక్షాద్రాముని బోలె సంతతము భాస్వన్ మానసాబ్జుండవై
రక్షన్ గూర్పుము సోదరా! శుభకరా! ప్రజ్ఞాన తేజోనిధీ!
పండిత నేమానిగారికి శంకర య్య గురుదేవులకు
రిప్లయితొలగించునమస్సులు
రక్షాబంధన సూత్రము
అన్నకు చెల్లెలుగట్టిన
మన్నన నేతలకు గట్ట మనదేశము కున్
ఉన్నత రక్ష ణ నీయగ
చెన్నుగ ప్రజలెల్ల గట్ట చెలిమిని బ్రతుకన్
చేయి మెరియగ కట్టును చెల్లి రాఖి
రిప్లయితొలగించుఅన్నదమ్ముల అండయె అగును కాన్క
తోడబుట్టిన బంధమ్ము తోడునీడ
భాగ్య మయినది రక్షా బంధనమ్ము
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ రెండవ పద్యం కూడా మనోహరంగా ఉంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘దేశముకున్’ అనరాదు, ‘దేశమునకున్’ అనవలసి ఉంటుంది.
*
శైలజ గారూ,
మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. ‘రక్షా’ను ‘రక్షించు’ అంటే సరి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుకుసుమ సుదర్శన్ గారూ,
రిప్లయితొలగించుశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీరు ఏ ఫాంటు వినియోగిస్తున్నారో అర్థం కాలేదు.
‘లేఖిని’లో టైప్ చేసి దానిని కాపీ చేసి, ఇక్కడ పేస్ట్ చెస్తే బాగుంటుందని నా సలహా.
రక్త బంధము రాగాల శక్తి నిచ్చి
రిప్లయితొలగించుఅన్న చెల్లె లాప్యాయత నలర జేయు
వీరి మమ తానురాగాల వేరు జేయ
యెవరి కైన శక్తి గలదె యిహపరమున?
ఏన బద్నొ బలీరాజా ధానవెంద్రో మహాబలహ
రిప్లయితొలగించుతేనె త్వామబి బధ్నామి రక్ష మాచల మాచల
దీని భావాన్ని చెప్పండి ఎవరన్నా ?