20, ఆగస్టు 2013, మంగళవారం

పద్య రచన – 439 (తెలుఁగు జాతి మనది)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"తెలుఁగు జాతి మనది"

26 కామెంట్‌లు:

 1. ఉత్సాహ:
  తెలుగు జాతి మనది దివ్య తేజ మలరు జాతిరా!
  తెలుగు జాతి మనది విపుల ధీనిధాన జాతిరా!
  తెలుగు జాతి మనది పలుకు తీయనైన జాతిరా!
  తెలుగు జాతి మనది భరత దేశమునకె వెలుగురా!

  రిప్లయితొలగించండి

 2. ఒకప్పుడు తెలుగు జాతి 'మనది'
  ఇప్పుడు మీది మాది వారిది వీరిది
  రేపటికి ఎవరిదో మరి తెలియనిది
  ఎందుకో మరి ఈ మనదన్న ఆశావాదం ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. శ్రీమతి జిలేబీ గారికి నా పద్యానువాద ప్రయత్నము............

  అటనొకకాలమందు తెలుగన్నది యందరిదై వెలింగె నే
  డిటగన మాది మీదియనుటెంచుట గాంచుచునుంటిమింక రే
  పటికిది పెక్కుభంగుల విపర్యయ భావములై చెలుంగు న
  క్కటకట! యాశలందు మరి గాంచరు మీరు యదార్థ భావముల్.

  రిప్లయితొలగించండి
 4. తెలివి గలజాతి మనజాతి తెలుగు జాతి
  తెగువ గల జాతి మనజాతి తెలుగు జాతి
  తేనె భాషను గలజాతి తెలుగుజాతి
  తేజమున్నట్టి దీ జాతి తెలుగు జాతి.

  రిప్లయితొలగించండి
 5. తెగువ గలిగిన జాతిరా తెలుగు జాతి
  మనది నిస్స్వార్ధ మయమునై దనరు చుండు
  వేడు కొందును శంభుని వినయముగను
  తెలుగు వాడిగ బుట్టుక గలుగు కతన

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు

  ఉత్సాహ గర్భిత మధ్యాక్కర చిన్న ప్రయత్నము
  =======*=========
  తెలుగు బలుగు వారి కీర్తి దెలుప వశము గాదు రా(మ)
  తెలుగు జాతి మనది నేడు దెలుప సమయ మయ్యె రామ
  తెలుగు వారి వెలుగు నేడు తెలుగు బల్క పెరుగు రామ
  తెలుగు రుచిని గన్న వారు తెలుపు మరువ కుండె రామ
  తెలుగు మరచి మీరు దిరుగ తీపి నొదలి నట్టు రామ
  తెలుగు భాష జగతినందు తేజ మలరు భాష రామ
  తెలుగు జాతి మనది భరత దేశమునకె వెల్గు రామ।
  తెలుగు జాతి వెలుగు నేడు తేజ మలరు చుండె రామ।

  రిప్లయితొలగించండి
 7. శ్రీ వరప్రసాద్ గారి ప్రయోగములు ప్రశంసనీయములు. ఈ నాటి ఉత్సాహ గర్భిత మధ్యాక్కర చాల బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. తెలుగు జాతి మనది తెలివి కలది
  తెలుగు భాష మనది తేనె లొలుకు
  తెలుగు నేల మనది తేజమై నలరగ
  తెలుగు వీర నీవు తెలుసు కొనుమ

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శైలజ గారి మొదటి పాదమునకు నా సవరణ
  "తెలుగు జాతి మనది తెలివి కలదిలలో"
  తెలుగు భాష మనది తేనె లొలుకు
  తెలుగు నేల మనది తేజమై నలరగ
  తెలుగు వీర నీవు దెలుసు కొనుము.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ నేమాని గురుదేవులకు చాలచాలా ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 11. కలసి మెలసి మిగుల విలసిల్లె మన జాతి!
  జగతి నందు మనకు సాటి లేదు!
  మీరు మేమనుచును వేరు పడగ లేని
  ధీర వరుల గన్న వీర జాతి!

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని గురువుగారికి,ప్రణమిల్లుతూ,...మీరు వ్రాసిన ఉత్సాహం చందస్సులో పద్యం,వరప్రసాద్ గారి పద్యం చూసాక నాకు ప్రయత్నించాలనిపించింది,వ్యాకరణం బుక్ లో గణాలు, వివరాలు చదివి ఇలా వ్రాసాను...తప్పులెల్ల సరిదిద్ది,మన్నించ మనవి....


  తెలుగుదనము చాటనీవుతెలుగు పాటె పాడరా
  రాలుచున్నఅగ్నిరజము రాగజలముతొనార్పరా
  తెలుగుజాతి మనది యంటుదేహదేహం మీటరా
  తెలుగుతల్లి కనులు తుడిచి తెల్లమల్లెలివ్వరా

  రిప్లయితొలగించండి
 15. శ్రీమతి శైలజ గారి భావమునకు కొద్ది కొద్ది మార్పులతో ఈ పద్యము:

  ఉత్సాహ:
  తెలుగుదనము చాట నీవు తెలుగు పాట పాడరా!
  జ్వలన విషమ భావ శిఖలు సంయమమున నార్పరా!
  తెలుగు జాతి మనది యని మదిన్ విపంచి మీటరా!
  తెలుగు తల్లి కనులు తుడిచి తిలక మొప్ప దిద్దరా!

  శ్రీమతి శైలజ గారూ!
  ప్రాస నియమమును చదివి తెలుసుకొనండి. మీరు వ్రాసిన పద్యములో 2వ పాదములో ప్రాస నియమము పాటింపబడ లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. తీయ తేనియ మాటల తెలుగు జాతి
  వెలుగు చుండెను విద్యతో తెలుగు జాతి
  విలువ నొందెను శ్రమజేసి తెలుగు జాతి
  నలు దిశల నిండి యుండెను తెలుగు జాతి
  జ్ఞానమును పంచెడి తెలుగు జాతి మనది

  రిప్లయితొలగించండి
 17. వేద నాదము వినిపించు నదుల ఘోష
  పుణ్య తీర్ధములను గన్న పుడమి మనది
  తేట తెలుగులు విరజిమ్ము తెలుగు జాతి
  సాటి లేదిల మనకేది మేటి యనగ

  రిప్లయితొలగించండి
 18. గురుదేవులు మన్నించగలరు. మరియొక ప్రయత్నము ఉత్సాహ గర్భిత మధ్యాక్కర.
  పద్యము పూర్తి కావడంలేదు,తప్పులెల్ల సరిదిద్ద మనుచు మనవి జేయుచుంటిని
  =====*======
  తేట తేట తెలుగు,కవుల దేనె తెలుగు,దేశ పూ(ల)
  దోట తెలుగు,దివ్య కాంతి తోడ వెలుగు మల్లె మా(ల)
  బాట తెలుగు,వారి జాక్షి పలుకు తెలుగు,లాలి జో(ల)
  పాట తెలుగు,నన్నమయ్య పాట తెలుగు పాలతో(డ).

  రిప్లయితొలగించండి
 19. ఆఖరి పాదము గురుదేవుల సవరణతో
  పాట తెలుగు,పైడి తెలుగు వారి వైభవము కవీ(శ)!

  రిప్లయితొలగించండి
 20. మిత్రులారా!
  ఈనాటి పద్య రచన అంశమునకు అనేకములైన పద్య రచనలు వచ్చినవి. తెలుగు బాసను, జాతిని, సంస్కృతిని, తెలుగు తల్లిని వివిధ రీతులలో ప్రశంసించుచూ మిత్రులు

  1. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు
  2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు
  3. శ్రీ సుబ్బా రావు గారు
  4. శ్రీ వరప్రసాద్ గారు
  5. శ్రీమతి శైలజ గారు
  6. శ్రీ సహదేవుడు గారు
  7. శ్రీ బొడ్డు శంకరయ్య గారు, మరియు
  8. శ్రీమతి రాజేశ్వరి గారు;

  చేసిన రచనలన్నియునూ బహుధా ప్రశంస నీయములే. అందరికీ అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. “తెలుగు జాతి మనది” అంటూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  జిలేబీ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  వరప్రసాద్ గారికి,
  శైలజ గారికి,
  సహదేవుడు గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ఇది జిలేబీ భావానికి పద్యరూపమే అయినా ప్రశస్తంగా ఉంది.
  ‘మీది యను టెంచుట’ను ‘మీది యని యెంచుట’ అంటే బాగుంటుంది.
  *
  వరప్రసాద్ గారూ,
  ‘తీపి నొదిలి’ని ‘తీపి వదిలి’ అనండి.
  మీ ప్రయోగాలు బహుధా ప్రశంసనీయాలు. కొనసాగించండి. శుభమస్తు!
  *
  శైలజ గారూ,
  మీ మొదటి పద్యం మొదటి పాదాన్ని ‘తెలుగుజాతి మనది తెలివికలది సుమ్ము’ అని మారుద్దాం.
  *
  వరప్రసాద్ గారూ,
  శైలజగారి పద్యపాదాన్ని సవరించే ప్రయత్నానికి అభినందనలు.
  కాని ‘కలది + ఇలలో’ అన్నప్పుడు సంధిలేదు, యడాగమం వస్తుంది.
  *
  సహదేవుడు గారూ,
  ‘జగతి నందు’ను ‘జగతి యందు’ అందాం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. ‘వేద నాదము వినిపించు వివిధ నదులు’ అందాం.

  రిప్లయితొలగించండి
 22. పండిత శ్రీ నేమాని గారికి,గురుదేవులు శ్రీ శంకరయ్య గారికి అభివాదములు.

  అది ఒకనాటి మాట మన ఆంధ్రుల మల్లులు భారతమ్మునన్
  పిదప యశోకుకాలమున పేరు వహించిన బౌద్ధభిక్షువున్
  చెదరని ధైర్యమున్ గల విజేతగ నిల్చిన పుష్యమిత్రుడున్
  బెదరగ జేసినట్టి ఘన విక్రమశీలుడు శాలివాహనుం
  డదరగ జేసినారు మన ఆంధ్రుల విశ్రుతి విశ్వమందునన్

  తెలుగు భాష మాది, తెలుగుజాతి మాది
  జిలుగు వెలుగు జాతి చెలిమి జాతి
  సాహితీ పరులును శ్రామికజీవులు
  విప్లవమ్ము దెచ్చు వీరవరులు
  తెలుగు నాట కాదు దేశదేశాలకు
  వెలుగు జూపినారు తెలుగువారు

  తెలుగువారు నేడు కలహములను బెంచ
  ఇంటిగుట్టును రట్టుగ మంట గలిపె
  ఇతర భాషల వారిని ఎంత యేని
  మెచ్చు కొందురు మనలను మెచ్చుకోరు

  తెలుగువారలు ఆవేశపరులు యగుచు
  హితము ఏదియొ తమకు తామెరుగరెపుడు
  కోస్త, రాయలసీమలు కుటిలమనుచు
  ఇతర భాషల వారలు హితులనంగ
  వేరుపాటును కోరిరి విభజనడిగి

  ముగురు తెలుగువారలు కలియ మురిపెముగను
  ఆంగ్లమందున భాషించి ఆంధ్రమాత
  తమను కన్నది గాదన్న భ్రమ జనింప
  అమెరికా గొప్పతనమును అభిలషిoత్రు

  తెలుగులెస్స యనుచు తెలిపెను కన్నడ
  రాయలొకడు బ్రౌను లాటిననెను
  కానితెలుగువాడు గనలేదు మధురిమ
  యింతకన్న ఘోరమేమి కలదు

  తెనుగుబాస గొప్పతనము తెలుప నేడు
  ప్రజలు ప్రభుత కార్య బద్ధులగుచు
  తెనుగు తల్లి శోభ ఇనుమడించునటుల
  కలసి కృషిని చేయ వలయునిపుడు

  రిప్లయితొలగించండి
 23. శ్రీ తిమ్మాజీరావు గారికి శుభాశీస్సులు.
  ఒక విపులమైన ఖండికను వ్రాసేరు తెలుగు తల్లికి ముద్దు బిడ్డగా. శాలివాహనుని మొదలుకొని ఎందరో మన పూర్వులు మన తెలుగు ఖ్యాతిని దేశదేశాలలో వెలిగింపజేసిరని. కృష్ణదేవరాయలు, సి.పి. బ్రౌన్ దొరలు వంటి మహనీయులు తెలుగు తల్లికి ఎంతో సేవ చేసేరని అన్నారు. తెలుగు తల్లి శోభను అందరు కలిసికట్టుగా కృషిజేసి యినుమడింప జేయాలని అన్నారు. మంచి భావములు - పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి