జిలేబీ గారూ, ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, చక్కని భావంతో మీ సీసపద్యం అలరిస్తున్నది. ‘భరతాంబ చిరునగవును మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార!’ అనడం చాలా బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు. * పండిత నేమాని వారూ, జయమును కోరుతూ మీరు వ్రాసిన సీసం ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * శైలజ గారూ, నేమాని వారి సవరణతో మీ పద్యం శోభిస్తున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. మధ్యలో ‘సారా’ ఎందుకు వచ్చిందో బోధపడలేదు. * గుండు మధుసూదన్ గారూ, మీ పద్యాలు అనుసృజనగా కాక స్వతంత్ర రచనగా శోభిస్తున్నవి. చక్కని శబ్దసంపదతో మనోహరమైన భావాలతో ధారాళంగా సాగింది మీ ఖండిక. అభినందనలు.
అయ్యా! శ్రీ తిమ్మాజీ రావుగారు! శుభాశీస్సులు. మీరొక మంచి ప్రయత్నముతో మేలైన భావములతో ఉత్పలమాలను వ్రాసినారు. అభినందనలు. కొన్ని సవరణలను నేను చేసి ఈ విధముగా మరల వ్రాసితిని. చూడండి:
ఎందరొ దేశ భక్తవరు లెందరొ విక్ర వీర సింహముల్ ఎందరొ క్రాంతదర్శనులు నెందరొ త్యాగ రతుల్ మహాత్ములున్ అందరు బంధ ముక్తి భరతాంబకు గూర్చినయట్టి యీ దినం బందు నుతించి వారి పథమందు మహోన్నతి పొందు టొప్పగున్
రిప్లయితొలగించండిజండాల పండగ వచ్చేసింది వచ్చేసింది
ఈ నాటికి అందరం జేజేలు చెప్పేస్తాం
రేపటికి బజ్జో మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ
ఆ పై మరో రోజు మేల్కొందాం మేల్కొందాం
జిలేబి
శుభోదయం..
రిప్లయితొలగించండి....అందరికీ స్వాతంత్యదినోత్యవ శుభాకాంక్షలు...
గురువులకు, పెద్దలకు, కవి మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిజాలరి వలనుండి జారి జలమ్మున
........స్వేఛ్ఛగా నీదెడి చేప రీతి!
పంజరమ్మును వీడి బయటి ప్రపంచాన
........చెట్టుపై వాలిన చిలుక రీతి!
పులిపట్టు జార తోపుల జేరి గెంతుతో
........చెంగున నాడెడి జింక రీతి!
హరి చక్రమున వేయ హతమయి మకరమ్ము
........గండము గడచిన గజము రీతి!
ఏండ్ల తరబడి మ్రగ్గుచు నితర జాతి
పాలనమ్మున కడగండ్ల పరితపించి
స్వేఛ్ఛ పొందిన భరతాంబ చిరునగవును
మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార!
పులిచేత చిక్కి దీక్షా
రిప్లయితొలగించండిఫలితమ్మున ప్రాణములను బడసిన గోవై
యలనాంగ్లేయుల విష కో
రల చెర వీడినది భరత రాజ్యము మహిలో.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిబలియై రెందరొ స్వేచ్చా
ఫలితములన్ మనకునీయ - ఫలమందెగదా!
ఫలముల జేయకుమా ని
ష్ఫలముగ - బలముగ నిలుపుము భారత మాతన్.
స్వాతంత్ర్య దివస భాస్వత్ పర్వ రాజమా!
రిప్లయితొలగించండి....భారత మాతృ వైభవ వరమ్మ!
ఏడాది కొకసారి వేడుక మీరగా
....దలచుచుందుము నిన్ను తన్మయమున
బహు శతాబ్దంబులు పరుల పాలనములో
....పలు బాధలొందెను భరత మాత
ప్రముఖ నేతల మహోద్యమముల ధాటికి
....ప్రాప్తించితివి త్యాగ ఫలమ వీవు
జయము స్వాతంత్ర్య పర్వమా! జయము జయము
జయము భారత శ్రీమాత! జయము జయము
జయము జాతినాయకులార! జయము జయము
జయము భరత సోదరులార! జయము జయము
స్వాగతించె జగతి స్వాతంత్య దినమున్
రిప్లయితొలగించండిస్వార్ద చలిత సంఘ సమరమందు
శాంతిపూలునింపి సమైక్యతేనిల్పి
ఎగుర వేయు జెండా ఎపుడు వత్తు.
అమ్మా! శైలజ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ ప్రయత్నమునకు సరిచేయబడిన పద్యమును చూడండి:
స్వాగతించె జగతి స్వాతంత్ర్య దివసమున్
స్వార్థ చలిత సంఘ సమరమందు
నింపి శాంతి పూలు నిలుప సమైక్యత
గల పతాక ఎగురగలుగు నెపుడొ?
ఈ రోజు మనకు పండుగ
రిప్లయితొలగించండిసారా యీ దేశమునకు స్వా తంత్ర్యం బున్
మా రణ హోమము పిమ్మట
వైరుడు దా బోవు గతన వచ్చెను నరుడా !
శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు..
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందఱికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించండి(స్వర్గీయ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రిగారి గేయమునకుఁ బద్యానువాదము)
ఉ.
ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్మునే;
యెత్తఁగదోయి స్వీయగళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా;
నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్యమే;
యెత్తఁగదోయి నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!(1)
శా.
కేలున్ శీర్శములుం గదల్చుచును సుక్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట నీయ మన జెండే యాకసమ్మందునన్
లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిం దగ న్నిండఁగన్
వ్రాలంజేసి విరోధులన్, గొనుఁడు సద్భ్రాజత్పతాకమ్మునే!(2)
మత్త.
అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులును న్నియంతలు భారతమ్మున లేనిచో,
స్వార్థ బుద్ధికి స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్ష మ
న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!(3)
మ.
కులముం దాటి, మతమ్ము దాటి,కొలఁదుల్ గొప్పల్ విచారింపకే,
కల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములు న్నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపింపంగ, నీ భారతిన్
విలువల్ వెంచఁగ నెత్తు మన్న భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!(4)
*శుభం భూయాత్*
శ్రీ గుండు మధుసూదన్ గారికి హార్దిక శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిచాల మంచి శైలిలో 4 పద్యములను సందర్భోచితముగ వ్రాసినారు. అభినందనలు. 2వ పద్యములో "మన జెండే యాకసంబందునన్" .... ను సవరించవలసి యున్నది. జెండాయే అనుట సాధువు. మరికొంచెము శ్రమించి సరిచేయండి. శుభం భూయాత్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు నేమానివారికి ధన్యవాదములు. తమరు సూచించిన "జెండే"యను నసాధు ప్రయోగమును,"జయంతిశ్రేష్ఠమే"యని సవరించితిని. దయతోఁ బరిశీలించఁగలరు.
రిప్లయితొలగించండి(స్వర్గీయ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రిగారి గేయమునకుఁ బద్యానువాదము)
ఉ.
ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్మునే;
యెత్తఁగదోయి స్వీయగళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా;
నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్యమే;
యెత్తఁగదోయి నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!(1)
శా.
కేలున్ శీర్శములుం గదల్చుచును సుక్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట నీన్ మన జయంతిశ్రేష్ఠమే రోదసిన్
లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిం దగ న్నిండఁగన్,
వ్రాలంజేసి విరోధులన్, గొనుఁడు తద్భ్రాజత్పతాకమ్మునే!(2)
మత్త.
అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులును న్నియంతలు భారతమ్మున లేనిచో,
స్వార్థ బుద్ధికి స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్ష మ
న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!(3)
మ.
కులముం దాటి, మతమ్ము దాటి,కొలఁదుల్ గొప్పల్ విచారింపకే,
కల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములు న్నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపింపంగ, నీ భారతిన్
విలువల్ వెంచఁగ నెత్తు మన్న భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!(4)
*శుభం భూయాత్*
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
చక్కని భావంతో మీ సీసపద్యం అలరిస్తున్నది. ‘భరతాంబ చిరునగవును మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార!’ అనడం చాలా బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
జయమును కోరుతూ మీరు వ్రాసిన సీసం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
శైలజ గారూ,
నేమాని వారి సవరణతో మీ పద్యం శోభిస్తున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
మధ్యలో ‘సారా’ ఎందుకు వచ్చిందో బోధపడలేదు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు అనుసృజనగా కాక స్వతంత్ర రచనగా శోభిస్తున్నవి. చక్కని శబ్దసంపదతో మనోహరమైన భావాలతో ధారాళంగా సాగింది మీ ఖండిక. అభినందనలు.
గురువుగారూ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమధుసూదన్ గారూ! అద్భుతమైన పద్యాల నిచ్చారు.
అభినన్దనలు.
కంది శంకరయ్య గురుదేవులకు , పండిత నేమాని గారికి నమస్సులు
రిప్లయితొలగించండిస్వతంత్ర దిన శుభాకాంక్షలు
ఎందరొ దేశప్రేమికులు , ఎందరొ వీరులహింసవాదులున్
ఎందరొ క్రాంతికారకులు , ఎందరొ విప్లవవీరు త్యాగముల్
బంధవిముక్తి జేసినవి భారతమాతను నాడు ఈదిన
మ్మందు నుతించి వారి పథమందున యున్నతి పొందగావలేన్
అయ్యా! శ్రీ తిమ్మాజీ రావుగారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరొక మంచి ప్రయత్నముతో మేలైన భావములతో ఉత్పలమాలను వ్రాసినారు. అభినందనలు. కొన్ని సవరణలను నేను చేసి ఈ విధముగా మరల వ్రాసితిని. చూడండి:
ఎందరొ దేశ భక్తవరు లెందరొ విక్ర వీర సింహముల్
ఎందరొ క్రాంతదర్శనులు నెందరొ త్యాగ రతుల్ మహాత్ములున్
అందరు బంధ ముక్తి భరతాంబకు గూర్చినయట్టి యీ దినం
బందు నుతించి వారి పథమందు మహోన్నతి పొందు టొప్పగున్
రిప్లయితొలగించండిమిత్రులు మిస్సన్నగారికి ధన్యవాదములు. భరతమాత స్వేచ్ఛపొందిన రీతిని వివరించిన తమరి సీసపద్యము రమణీయముగ నున్నది. అభినందనలు!
రిప్లయితొలగించండిమిత్రులు మిస్సన్నగారికి ధన్యవాదములు. భరతమాత స్వేచ్ఛపొందిన రీతిని వివరించిన తమరి సీసపద్యము రమణీయముగ నున్నది. అభినందనలు!
మిత్రులందరికీ స్వాతంత్ర్యోత్సవ దిన శుభాకాంక్షలు:
రిప్లయితొలగించండిమన శంకరాభరణ వే
దిని గల మిత్రులకు నేడు తెలుపుదు శుభ కా
మనలను స్వాతంత్ర్య దిన
మ్మని యానందమ్ము పొంగి యాత్మ చెలంగన్
వందన ములు మనజెండా
రిప్లయితొలగించండికొందనములు జాతి పితకు కోటి శతమ్ముల్
వందనములు భరత మాత
కొందనములు భగతు సింగు కొందనము లివే
మందమతిన్ చరించు అభిమానులు ద్వేషముప్రాంతభేదముల్
రిప్లయితొలగించండిముందుగ రెచ్చ గొట్టి మతముల్ కలిగించెడి ధ్వంసకాండయున్ బందులు నిర్వహించెదరు స్వార్థము తోడను వారి నీతినిన్ దుందుడుకున్ గ్రహింపుమిక దుర్మతులన్ దరి జేరనీకుమా
పండిత శ్రీ నేమాని గారికి,
రిప్లయితొలగించండిచక్కని చిక్కని పదములతో,
న భావమును పద్యరచన చేసేరు,
కృతజ్ఞుడ్ని