13, ఆగస్టు 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1142 (కవిత్వ మధములకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కవిత్వ మధములకు గదా! 
(ఛందో గోపనము)

20 కామెంట్‌లు:

  1. కం.
    మదిలో జ్ఞానముఁ బెంచియు
    ముద మొనఁగూర్చు సుకవిత్వము సుజనులకుఁ; దా
    నదియే జ్ఞానముఁ ద్రుంచియు
    మద మొనఁగూర్చుఁ గుకవిత్వ మధములకుఁ గదా!!

    రిప్లయితొలగించండి
  2. మనపోతన తా జెప్పెను
    మనమున బుట్టిన కృతులవి మాధవుకేలే
    మనుటకు నాకటికొరకై
    మనుజుల కమ్మెడు కవిత్వ మధములకు గదా!

    రిప్లయితొలగించండి
  3. రయముగ రండిటు చదువుదు
    జయమెవరిదొ దెలియునిపుడు సంపూ ర్ణముగన్
    భయ మనుచు మిన్నకుండి రి
    అయిష్ట మగునుగ కవిత్వ మధముల కు గదా !

    రిప్లయితొలగించండి
  4. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు వచ్చిన కొన్ని పూరణలను చూద్దాము:
    ముందుగా అందరికీ అభినందనలు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: సుకవిత్వ కుకవిత్వముల ఫలితములను చెప్పేరు. మీ పద్యము చాలా బాగుగనున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: పోతన గారి పద్యము బాల రసాల సాల........ను జ్ఞాపకము చేసేరు మీ పూరణతో. పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:మీ ప్రయోగము అయిష్టము అనుట సాధువు కాదు. న + ఇష్టము = అనిష్టము అగును మరొక విధముగా గుణ సంధిలో నేష్టము అగును. పరిశీలించండి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారూ,
    అధములకు కుకవిత్వ మన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అమ్ముడు పోయే కవిత్వాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మాధవుకే’ అనడం దోషం. ‘మాధవునకే’ అని ఉండాలి. అక్కడ ‘మాధవున కగున్’ అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    అధములు కవిత్వాన్ని ఇష్టపడరన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అయిష్టము’ కాదు, అది ’అనిష్టము’
    ‘భయ మనుచు విడుతు రది యిం
    పయినను ఖలుల కువిత్వ మధములకు...’ అందామా?

    రిప్లయితొలగించండి
  6. మన కానందము కలిగిం
    చును మధురమ్మగు కవిత్వశోభ నెరుగుచో,
    వినగా నర్థము తెలియక
    ననిరో, యేమో,కవిత్వ మధములకుఁ గదా!!

    రిప్లయితొలగించండి
  7. ముదముగ రాముని నామము
    మదిలో మార్మ్రోగు నటుల మలచిన కావ్యం
    బది కావ్యమగును కవివర
    మదమున వ్రాసెడి కవిత్వ మధములకుఁ గదా!!

    రిప్లయితొలగించండి
  8. జనరంజకమై సుకవి
    త్వనిధానంబైన సరణి తజ్ఞుల కొరకౌ
    ననఘా! రసహీనం బిది
    యను దూషితమగు కవిత్వ మధములకు గదా!

    రిప్లయితొలగించండి
  9. నా రెండవ పూరణము:

    పొట్ట నింపు కొఱకుఁ బుట్టించెడు కవిత్వ
    మధములకుఁ గదా సమాశ్రయమ్ము!
    భక్తి భావ విలసితోక్తుల విలసిల్లు
    సత్కవిత్వ మెసఁగు సత్కవులకు!!

    రిప్లయితొలగించండి
  10. కలమును బట్టిన పోతన
    హలమును తాబట్టి దున్నె హరినా మమునే
    వెల గట్టి భోగము లకని
    మలినపు వెగటు కవిత్వ మధములకు గదా !

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    బాలలను నేరగాళ్ళను జేయు కవిత్వముపై
    =======*==========
    కలదు గలదు స్వర్గ మనుచు
    కలహములకు కాలు దువ్వి కాఠిన్యమునన్,
    కలుషమ్ము తోడ మహిలో
    నలతి యలతి పద కవిత్వ మధములకు గదా!

    రిప్లయితొలగించండి
  12. నా మూఁడవ పూరణము:

    తే.గీ.
    అరసికుని జేరియు ధనమ్ము లడుగు సత్క
    విత్వ మధములకుఁ గదా నివేశనమ్ము!
    బ్రహ్మ కైనను వర్ణింప వలనుగా ద
    రసిక కావ్య నైవేద్య దౌర్భాగ్య మిలను!!

    రిప్లయితొలగించండి
  13. శ్రీమతి రాజేశ్వరిగారికి నమస్కారములు. వెల కమ్ముడుపోయే కవిత్వము గురించిన మీ పూరణము బాగుగ నున్నది. నాలుగవ పాదమున ఒక మాత్ర తక్కువైనది. దానిని "మలినంపు వెగటు కవిత్వ మధములకు గదా!"యని సవరించినచో సరిపోగలదు. అన్యధా భావించవలదని వినతి.

    రిప్లయితొలగించండి
  14. అవివేక రచనచే వి
    ప్లవమేర్పడి ముక్కలయ్యె భారతభువి మా
    నవులకు మత్సరమేర్పడు
    కవిత్వ మధములకు గదా క్రాంతిని గూర్చెన్

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీదేవి గారూ,
    కవితారసమాధుర్యము నెఱుగని మాటగా మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మదమున వ్రాసిన కావ్యము అధములకు నచ్చుతుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    రసలుప్తమై దూషితమైన కావ్యం అధములకోస మన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ఛందో గోపనంపై సంపూర్ణమైన అవగాహన కలిగి మూడు వైవిధ్యమైన పూరణల నిచ్చి మీ ప్రతిభను చాటుకున్నారు. అభినందనలు,
    రాజేశ్వరి అక్కయ్య పద్యానికి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మలినమై, వెగటు పుట్టించే కవిత్వాన్ని అధము లిష్టపడతారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మానవుల మధ్య కలహములను రేకెత్తించే కవిత్వం అధములకే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సమస్యను పాదాదిని నిలిపి వైవిధ్యంగా పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమానిగారికి ధన్యవాదములు.
    మాస్టరు గారూ ! నిజమే...చక్కనిసవరణకు ధన్యవాదములు.
    సవరణతో...

    మనపోతన తా జెప్పెను
    మనమున బుట్టిన కృతులవి మాధవునకగున్
    మనుటకు నాకటికొరకై
    మనుజుల కమ్మెడు కవిత్వ మధములకు గదా!

    రిప్లయితొలగించండి
  17. ముదమును మురిపెము ముచ్చట
    మదనుని క్రీడలు మదనపు మకరందమ్మున్
    మదిరల మాధుర్యమ్మును
    మదవతి లేనిదె కవిత్వ
    మధములకు గదా!

    రిప్లయితొలగించండి