19, ఆగస్టు 2013, సోమవారం

సమస్యాపూరణం – 1148 (వలదు వలదనుకొన్న)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వలదు వల దనుకొన్న సంప్రాప్త మగును.

26 కామెంట్‌లు:

 1. పూర్వ జన్మల కర్మల పుణ్య పాప
  ఫలములను బట్టి జనులకు కలుగుచుండు
  యోగములును భోగములు నొక్కొక్కటిగను
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

  రిప్లయితొలగించండి
 2. కోరికలు గణియింప నపారములయ;
  వనరులో మఱి గణియింపఁ బరిమితమయ!
  కోరికయె తీఱ, మఱియొక్క కోర్కి యెపుడు
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!!

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  కర్మఫలం తప్పదన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  అంతులేని కోరికలను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. మీ భావమును మరొక్క మీరు పరిశీలించండి. కోరికలు "సంప్రాప్తములగునా"? మనస్సు కోరికల పుట్ట -- మనస్సులోనే కోరికలు ఎప్పటికప్పుడు పుట్టుచునే యుండును - అంతే కానీ సంప్రాప్తించవని నా భావన. సంప్రాప్తించునవి యోగములు, సుఖ దుఃఖములు, ఆదాయ వ్యయములు వంటివి మాత్రమే కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. కష్టసుఖములు బండిచక్రములవోలె
  భావనముజేయవలె గాదె జీవనమున
  రయముగాదరిజేరు ప్రారబ్ధ ఫలము
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

  రిప్లయితొలగించండి
 6. రాతలేకుండిన దరికిరావు సిరులు
  ఎంతకష్టపడిన పుణ్యమెంతయున్న
  భాగ్యమందుండినపుడుసంపదలు నీకు
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును ||

  రిప్లయితొలగించండి
 7. పూజ్యులు నేమానివారికి నమస్కారములు. "ప్రాప్తించు" పదమునకు శబ్దరత్నాకరమందు .. లభించు, కలుగు..నను నర్థములున్నవి. "ఫుట్టు" పదమునకుఁ బర్యాయపద నిఘంటువునందు...కలుగు..నను నర్థమున్నది.
  దీని వలన నేమి తేలుచున్నది? ప్రాప్తించు=పుట్టు..అనియే కదా.
  నేను పుట్టునను నర్థముననే ప్రయోగించితిని. తమరి కామోదము కానందున...నిట్లు సవరింతును.


  కోరికలు గణియింప నపారములయ;
  వనరులో మఱి గణియింపఁ బరిమితమయ!
  కోరికయె తీఱ, మఱియొక్క కోర్కిబాము
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!!

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
  మనము వాడుకలో ఏ అర్థమును సులభముగా గ్రహింతుమో దాని కనుగుణముగానే పద్యమును వ్రాయుటతో అన్వయము సులభమగును. మీరు వాడిన పదమునకు నిఘంటువులో సరియైన అర్థమే ఉండవచ్చు గాక. కాని చదువరులకు ఏమి అర్థమగును? మీరు సహృదయముతో స్పందించినందులకు మా సంతోషము - అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ప్రారబ్ధవశాన కష్టసుఖాలు సంప్రాప్తమౌతాయన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గూడ రఘురామ్ గారూ,
  భాగ్యవశాన సంపదలు సంప్రాప్తమౌతాయన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు. ఇటువంటి చర్చలు ఔత్సాహికులకు పాఠాలవుతాయి.

  రిప్లయితొలగించండి
 10. రఘురామ్ గారూ,
  ‘రాత’ అన్నారు. దానిని ‘వ్రాత’ అనండి.

  రిప్లయితొలగించండి
 11. పూర్వ జన్మల పుణ్యంబు పొందు కతన
  భోగ భాగ్యముల్జనులకు భూరిగాను
  వలదు వలదనుకొన్నసం ప్రాప్త మగును
  సందియం బిసుమంతయు నిం దు లేదు

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
  ======*=======
  బేకరీల పై బడి దిన మేకల వలె,
  ప్రిజ్ రిమోట్లను బట్టిన ప్రీతితోడ,
  వలదు వల దను కొన్న సంప్రాప్తమగును
  రోగ తతులు జనుల కెల్ల లోక మందు.

  రాజకీయములపై
  ========*========
  పాలు పంచు కొనుచుండ పాల కుండ
  ధర్మ మార్గమునను, తర తరములకును
  కుంభ కోణములందున్న కుళ్ళి కంపు
  వలదు వల దను కొన్న సంప్రాప్తమగును
  ======*=======
  విలువల వలువలను వీడి విపణి యందు
  బలము జూపి దిరుగు వాడు ఫలము నొందు
  వలదు వల దను కొన్న, సంప్రాప్తమగును
  ఖలుల జెలిమి పుడమి యందు ఘనము గాను .

  రిప్లయితొలగించండి
 13. సుబ్బారావు గారూ,
  అంత స్పష్టంగా చెప్పినతర్వాత ఇక సందేహమెక్కడిది? మంచి పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కావలయునన్న పుట్టునే కరుణ లోన
  పోవలయునన్న పోవునే పొగరు పూర్తి
  కొపతాపముల్ మనిషిలో కొలువు దీర
  వలదు వలదనుకొన్నసంప్రాప్తమగును!!!

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. ధర్మయుతముగ విధ్యుక్తకర్మలన్ని
  భక్తిశ్రద్ధల గావించి ఫలము శివున
  కర్పణము జేయ చివరకు ఆయనమ్ము
  వలదు వలదనుకొన్న సంప్రాప్త మగును

  రిప్లయితొలగించండి
 17. చేయు కర్మము నరునకు చెడని ఫలము
  గోవు వెంటను దగిలెడు కోడె భంగి
  వెంబడించును జన్మజన్మంబులకును
  వలదు వలదనుకొన్న సంప్రాప్త మగును.

  రిప్లయితొలగించండి
 18. భాగ్యవంతులకు సుఖము బహు విధములు,
  భాగ్యహీనులకు వివిధ బాధ లుండు,
  కర్మ ఫలమునె కష్ట సుఖంబులన్ని
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

  రిప్లయితొలగించండి
 19. జన్మ జన్మల పుణ్యాలు జాత కములు
  కలిమి లేములు లభియిం చు కాల గతిని
  ఆశ లడియాశ లనునవి క్లేశ మనగ
  వలదు వలదను కొన్న సంప్రాప్త మగును

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. భాగ్యవంతులకు సుఖము బహు విధములు,
  భాగ్యహీనులకు వివిధ బాధ లుండు,
  కర్మ ఫలమున కష్ట సుఖంబులన్ని
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

  రిప్లయితొలగించండి
 22. సంచితములవలన సామీప్య జన్మలు
  సంక్రమించుచుండు సుదతి నందు
  జీవితములనడుమనన్నిచిక్కుముడులె
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును

  రిప్లయితొలగించండి
 23. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మనిషి’ అనడం సాధువు కాదు. అక్కడ ‘మనుజులో/ నరునిలో’ అందాం.
  *
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  వెంబడించే కర్మఫలాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
  కాని మొదటి రెండు పాదాలు ఆటవెలదిలో ఉన్నాయి. ఆ పాదాలకు నా సవరణ...
  సంచితములచే సామీప్య జన్మలన్ని
  సంక్రమించుచు నుండును సతుల కెపుడు.

  రిప్లయితొలగించండి
 24. నా రెండవ పూరణము:

  కాల మహిమచేఁ బనిఁ గొని కష్టము లవి
  వలదు వలదనుకొన్న సంప్రాప్తమగును!
  చంద్రమతి, సీత, ద్రౌపది సరసఁ జేరి,
  కష్టములు కాల మహిమచేఁ గాల్ప లేదె?

  రిప్లయితొలగించండి
 25. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి