2, ఆగస్టు 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1131 (మోఁకాలికి బోడిగుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్.

31 కామెంట్‌లు:

 1. ఇంద్రునితో మన్మథుఁడు పలికిన సందర్భము.....

  "హే కౌశిక! శివుఁడు సతీ
  శోకాగ్ని జ్వలిత తాపసుం! డద్రిజయో?
  రాకొమరిత, బేల! యెటులు
  మోఁకాలికి బోడిగుండు ముడివెట్టఁ దగున్?"

  రిప్లయితొలగించండి
 2. శ్రీకరుడౌ యదు సింహుని
  సూకరమనుకొని కిరాతశూరుడు గూల్చన్
  రోకలియే కారణమట
  మోఁకాలికిబోడిగుండు ముడివెట్టఁ దగున్!!!

  రిప్లయితొలగించండి
 3. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి సమస్యను ఎలాగ పరిష్కరిస్తారో (ముడి విప్పుతారో) మన మిత్రులు అని చూచేను. శ్రీ మధుసూదన్ గారు మరియు శ్రీ పీతాంబర్ గారు కూడా మంచి మంచి భావములతో చక్కగా నిర్వహించేరు. వారికి శుభాభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 4. ఈకాలపు కుర్రాళ్ళే
  మాకిది గావలెననగను మాచిత్రాల్లో
  సోకులు నింపెదమందురు
  మోఁకాలికిబోడిగుండు ముడివెట్టఁ దగున్

  రిప్లయితొలగించండి
 5. గురువుగారూ,
  అన్యదేశ్యపదప్రయోగానికి క్షమించాలి.

  ఈ కల్లోలస్థితినం
  దేకాభిప్రాయమనుచునెంచుంట కద్దే
  ఈ కాంగ్రెసునకునెట్టుల
  మోకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్ ??

  రిప్లయితొలగించండి
 6. మేకన్ గని తోడేలనె
  నీకిది తగునొక్కొ చేయ నీరెంగిలిగా
  మేకా యని పై బడె గద
  మోకాలికి బోడిగుండు ముడివెట్ట దగున్

  రిప్లయితొలగించండి
 7. ఏకారణముననైనప
  రాకున నమెరికనొబామ రాగముమారన్
  వ్యాకులమౌ విపణివిలువ
  మోకాలికి బోడిగుండు ముడివెట్ట దగున్!!!

  రిప్లయితొలగించండి


 8. రాకలఁ బోకల నాపెడి
  మూకల మీ తీర్థయాత్ర మూలన బడుచో
  రాకాచంద్రుని దూరిన
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్!!!

  రాకాచంద్రుఁడు = పున్నమి చంద్రుఁడు ; దూరు = నిందించు

  రాజకీయ నాయకుల పాశాలలో పడి మన జీవితాలను మనము స్తంభింప జేసుకోవడములో గడుసుదనమున్నదా ?

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  గురుదేవుల శిరిడీ యాత్ర శుభ ప్రధము కావాలని భగవంతుని ప్రార్థిస్తూ

  శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యయవాదములు

  అవునండి పులిని జూచి నక్క వాతలు బెట్టు కొన్నట్టు, ఈ కాలపు యువకులు తిరుగుచున్నారు.

  కొందరు లోహమును,మరి కొందరు పచ్చిక,కారము, వేపాకులు,మేకులు కీటకములు మొదలగు చెత్తను దినుట టివీలలో జుపియున్నారు.
  ======*=====
  ఆకలి రోకలి పోటుకు
  నాకొను(పచ్చిక) జనులకు నమృతమ్ము వలెన్
  లోకువ జిక్కగ దప్పక
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్!
  ( లోహము, కారము, మేకులు, గాజులు)

  దొంగలు దొరలని, దొరలు దొంగలని, అందరూ దొంగలని మోసములకు పాల్పడు చున్నారు
  ======*=====
  కాకికి కేకియు,కేకికి
  కాకియు చుట్టమనుచుండె కలియుగ మందున్
  లోకులు గాకుల వలెనే
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్!

  పిచ్చి ముదరగ రాక్షసులను పూజించు చున్నారు.
  ======*=====
  రాకాసి రూపములు దన
  వాకిట నుండిన గలుగును వైరితతులకున్
  శోకమనుచు నమ్మి దిరుగ,
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్!

  రిప్లయితొలగించండి

 10. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి బాటలో
  =======*======
  ఈ కాంగ్రెసు బలుకులు మన
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్,
  రాకాసి మూకలను గని
  మేకులు గొట్టిన దిరుగును మిత్తికి దరియై.

  రిప్లయితొలగించండి
 11. మిత్రులారా! శుభాశీస్సులు.
  మరి కొందరి పూరణలను పరిశీలించుదాము. అందరి పూరణలు బాగుగ నున్నవి. అభినందనలు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ: మీ పద్యపు పోకడ బాగున్నది - ఈ కాలపు కుర్రాళ్ళు - సినిమా సోకులు వలె రాణించుచున్నది.

  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ: మీది రాజకీయ పద్యము. నేటి కల్లోలము - కాంగ్రెస్సోళ్ళు - చాల బాగుగనున్నది.

  శ్రీ పీతాంబర్ గారి 2వ పద్యము: మీ విశ్లేషణ బాగుగ నున్నది. అమెరికా ప్రెసిడెంట్ గారి మాటల మీదనే ప్రపంచ ఆర్థిక పరిస్థితి మారుతూ ఉంటున్నది.

  తమ్ముడు డా. నరసింహమూర్తి : బాగున్నది నీ భావము. తీర్థ యాత్ర మూలబడితే పున్నమి చంద్రుని దూషించి నట్లు ఉంటుంది ఈనాటి సమస్య కదా.

  శ్రీ వరప్రసాద్ గారివి 4 పద్యములు: 1. ఆకలికై అన్నిటినీ తినే వారు.
  2. దొంగలు - దొరలు - తారతమ్యములు - మోసములు.
  3. పిచ్చి ముదురుట తోడనే రాక్షసులను సేవించుట.
  4. కాంగ్రెస్ పలుకులు - రాకాసి మూకల ప్రభావములు.
  భావ వైవిధ్యముతో వ్రాసిన ఈ పద్యములన్నియు బాగుగనే యున్నవి.

  స్వస్తి.


  రిప్లయితొలగించండి
 12. పోకిరి వలె దిరుగకు మఱి
  యో కామేశా ! యనంగ నూరికి బోదున్
  నాకో తొంబది యిమ్మనె
  మోకాలికి బోడి గుండు ముడి వెట్ట దగున్ ?

  రిప్లయితొలగించండి
 13. కోకిలము కాకి రూప
  మ్మేకంబుగ నున్నబలుకు లేకంబౌనా?
  ఆకారము గని యెట్టుల
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్!

  రిప్లయితొలగించండి
 14. ఏకాకిగ నుండు వాడు
  రాకాశశి వెన్నెలందు రతనపు విల్లున్
  సాకారము నొందు ననుట
  మోఁ కాలికి బోడి గుండు ముడి వెట్టఁ దగున్ !

  రతనపు విల్లు = ఇంద్ర ధనస్సు

  రిప్లయితొలగించండి
 15. ఏకాంధ్ర కై ఎప్పుడో
  ఏకం కావాల్సిన మూకలు , రాజీనామాలతో
  ఏకమైన నాయకులారా
  మోకాలికి బోడిగుండు ముడిపెట్ట దగునా...

  రిప్లయితొలగించండి
 16. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి మరికొన్ని పూరణలని పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీ సుబ్బా రావు గారూ. మీ పద్యము బాగుగ నున్నది. అయ్యో ఆ కామేశము గారికి మీరు 90 రూపయలు ఇచ్చేసేరా? తొందరగా వసూలు చేసుకొనండి. మీ పద్యము బాగుగ నున్నది.

  శ్రీ లక్ష్మీనారాయణ గారూ: కాకి కోకిలముల వర్ణములో సామ్యము పలుకులలో వైషమ్యము చూపించిన మీ పద్యము బాగుగ నున్నది.

  అమ్మా! రాజేశ్వరి గారూ! మీ పద్యములో కొన్ని దోషములు కనుపట్టినవి. సవరించేను ఈ విధముగా:
  ఏకాకియైన యొక్కడు
  రాకాశశి కాంతులందు రతనపు విల్లున్
  సాకారము నొందు ననుట
  మోకాలికి బోడిగుండు ముడి వెట్ట దగున్
  మీ భావము క్రొత్తగా నున్నది.

  శ్రీ శంకర బాబు గారూ:
  మీరు తొందరలో పద్యములను వ్రాయుటను (సరియైన లక్షణములతో) అభ్యసించండి. మా సహకారము ఎల్లప్పుడు ఉంటుంది. ముందుగా చాల కంద పద్యములు, ఆటవెలదులు, తేటగీతులు ఎక్కువగా చదవండి. వానిలో లయను బట్టి మీరు పద్యములను వ్రాయ గలుగుతారు. మీ భావమును ఒక కంద పద్యములో నేను ఈ విధముగా వ్రాసేను:

  ఏకాంధ్ర కొరకు నెపుడో
  ఏకముగా నుండవలయు నిపుడీ నేతల్
  ఏకమగుట లలుకలతో
  మోకాలికి బోడిగుండు ముడి వెట్ట దగున్

  రిప్లయితొలగించండి
 17. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు

  తప్పులు జేసి వాటినుండి తప్పించు కొనుటకు శతవిధముల ప్రయత్నించు వారు ఏమైనా జేయవచ్చు.
  =====*======
  మీకింత మాకు యెంతని,
  జీకటి గని దిరుగు వారి జెంతకు జేరన్,
  పైకము తోడను గొర్రెలు
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్.
  ======*=======
  పీకల లోతున పాపము
  వాకిట నిలచి ననిశమ్ము పాశము వలెనే
  దూకుడు బెంచగ వడిగా
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్.

  రిప్లయితొలగించండి
 18. ఆకలి యనుట నెరుగ నవి
  వేకులతో డొక్కలెండు పేదల బాధల్
  యేకము జేసిన,నెట్టుల
  మోకాలికి బోడిగుండు ముడి వెట్టదగున్.

  రిప్లయితొలగించండి
 19. ఆ కనకాద్రిని విల్లుగ
  శ్రీకాంతుని బాణముగను త్రిపురాసురునిన్
  నీకే చంపగనౌ శివ
  మోకాలిని బోడిగుండు ముడివేయ దగున్

  రిప్లయితొలగించండి
 20. మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి మరికొన్ని పూరణలను చూద్దాము. అందరికీ అభినందనలు.

  1. శ్రీ వరప్రసాద్ గారు:
  మీ చివరి 2 పద్యములను చూచితిని. 1వ పద్యము 1వ పాదములో యడాగమము చేసేరు. నుగాగమముగా మార్చండి. ఈ 2 పద్యములు బాగుగ నున్నవి.

  2. శ్రీ బొడ్డు శంకరయ్య గారు!
  మీ పద్యములో మంచి భావము - డొక్కలెండు పేదలను గూర్చి ఉట్టంకించేరు. చాల బాగుగ నున్నది.

  3. శ్రీ తిమ్మాజీ రావు గారు:
  మీ పద్యములో అన్వయ సౌలభ్యము కొరకు ఈ క్రింది విధముగా సవరించితిని:

  ఆ కనకాద్రిని విల్లుగ
  శ్రీకాంతుని శరము జేసి త్రిపురాసురులన్
  నీకే చంపగనౌ శివ!
  మోకాలికి బోడిగుండు ముడివెట్ట దగున్

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ పండిత నేమాని గారు
  మీరు చేసిన సవరణలు చక్కగా నున్నవి.
  కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 22. ఓ కాశ్యప సగోత్రీ యుడు
  ఈ కాశ్యపిని చుట్టి తీర్ధం కరుడై
  కాకోలపు కలికి సహచరి
  మోఁ కాలికి బోడి గుండు ముడి వెట్టఁ దగున్ !

  రిప్లయితొలగించండి
 23. అమ్మా! శ్రీమతి రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము నాకు అర్థము కాలేదు. అయినా కొన్ని మార్పులు చేసి ఈ రీతిగా పద్యపు రూపమునిచ్చేను.

  ఆ కాశ్యపసేయుండిట
  తేకువ కాశ్యపిని జుట్టె తీర్థంకరుడై
  కాకోలపు సహచరితో
  మోకాలికి బోడిగుండు ముడివెట్ట దగున్

  రిప్లయితొలగించండి
 24. నమస్కారములు
  సవరణ జేసి నందులకు గురువులకు ధన్య వాదములు
  అంతటి నిష్టా గరిష్టునకు ఇటువంటి భార్య లబిం చింది అని నా ఉద్దేస్యము .పొరబడిన క్షమించ గలరు

  రిప్లయితొలగించండి
 25. సవరణతో.............
  ఆకలి భాధ తెలియ నవి
  వేకులతోఁ డొక్కలెండు పేదల బాధల్
  యేకము జేసిన,యనదగు
  మోకాలికి బోడిగుండు ముడివెట్టదగున్.

  రిప్లయితొలగించండి
 26. "చీకాకు వానవరదలు
  మాకేల కలిగె?" ననగనె మా తాతనియెన్:
  "రాకేందుగ్రహణమ్ముర!"
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్?

  రిప్లయితొలగించండి
 27. "చిదంబర" రహస్యం:

  భీకరమౌ వ్యాజ్యమ్మున
  రూకలు లాయరులు లాగి రోతగు రీతిన్
  కేకలు వేయుచు కోర్టున
  మోఁకాలికి బోడిగుండు ముడి వెట్టఁ దగున్

  రిప్లయితొలగించండి