28, ఆగస్టు 2013, బుధవారం

సమస్యాపూరణం – 1157 (ఒడ్డాణ మలంకరించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్.

28 కామెంట్‌లు:

  1. ఒడ్డోల గమ్ము నందున
    నడ్డముగా వచ్చి నిలచె నగవులు విరియన్
    గడ్డము మీసపు వేషము
    ఒడ్డాణ మలం కరించె నువిద శిరమ్మున్ !

    రిప్లయితొలగించండి
  2. గురుదేవులకు,సత్కవులకు,బ్లాగు వీక్షకులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ శ్రీకృష్ట జన్మాష్టమి శుభాకాంక్షలు....

    రిప్లయితొలగించండి
  4. సోదర సోదరీ మణు లకు పూజ్య గురువులకు అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. విడ్డూరము గంటే యీ
    యొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్
    గ్రుడ్డదిగో యొక చక్కని
    బిడ్డ కిచట పురుడు పోసె వేడుక మీరన్

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి,పూజ్యులు నేమానివారికి, కవిపండిత మిత్రు లందఱకును శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలతో...

    అడ్డాల నాఁటి కానుక
    నొడ్డాణము యౌవనమున నొప్పి ధరించన్
    దొడ్డయిన కారణమ్మున
    నొడ్డాణ మలంకరించె నువిద శిరమునన్!

    రిప్లయితొలగించండి
  7. అడ్డాల బిడ్డకిచ్చిన
    యొడ్డాణపు బహుమతి నట నొద్దికగానే
    బిడ్డకు జూపుచు నవ్వుచు
    నొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్.

    రిప్లయితొలగించండి
  8. విడ్డూర మిదియ చూడుడు
    ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్
    వడ్డాది వా రి యింటను
    విడ్డూ రము కాద యిదియ ? వీ క్షిం పం గన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీకృష్ణ స్తుతి:

    పాదపము:

    శ్రీమధురాధిప! శ్రీధర! కృష్ణా!
    శ్రీమురళీధర! చిన్మయ! కృష్ణా!
    ప్రేమ రసాకర! శ్రీకర! కృష్ణా!
    కామిత దాయక! కల్పక! కృష్ణా!

    జ్ఞాన ధనాఢ్య! జగద్గురు! కృష్ణా!
    దీనజనావన! ధీనిధి! కృష్ణా!
    మౌనిజన స్తుత! మాధవ! కృష్ణా!
    శ్రీనయనోత్సవ! చిద్ఘన! కృష్ణా!

    నందకులాఖిల నాయక! కృష్ణా!
    సుందర రూప సుశోభిత!కృష్ణా!
    విందగు నీ శుభవీక్షణ! కృష్ణా!
    వందనమో శ్రితవత్సల! కృష్ణా!

    వారిరుహాసన వందిత! కృష్ణా!
    వారిజ లోచన! భాగ్యద! కృష్ణా!
    భూరి గుణోజ్జ్వల భూషణ! కృష్ణా!
    వీరవరేణ్య! త్రివిక్రమ! కృష్ణా!

    పావన నామ! శుభప్రద! కృష్ణా!
    దేవనుతా! కులదీపక! కృష్ణా!
    రావె జగత్త్రయ రంజన! కృష్ణా!
    ప్రోవవె మమ్ము ప్రభూ! హరి! కృష్ణా!

    శ్రేయోభిలాషులందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో:

    నేమాని రామజోగి సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  10. గురువులు శ్రీకంది శంకరయ్య గారికి, శ్రీ నేమాని పండితవర్యులకు మరియునితర కవిమిత్రులకు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు.

    శ్రీ కృష్ణా మము గావుమయ్య దయతో శ్రీచిద్విలాసప్రభో!
    మాకృత్యంబులకండనిల్చి జగతీ మాధుర్యమున్ జూపి చి
    త్తైకాగ్రంబున నిల్వగోరెదను మోక్షేచ్చా ప్రవృత్తిన్ సదా
    నీకృత్యంబుల పాడి వేడెదను నిన్ నే గొల్చెదన్ నిత్యమున్.

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులైన గురువులకు ప్రణామములతో , కవిమిత్రులకు శుభాకాంక్షలతో --

    బిడ్డకు ముచ్చటగా తన
    యొడ్డాణ మలంకరించె నువిద ; శిరమున్
    గడ్డమును తాకి ముద్దిడి
    బిడ్డను దీవించె తల్లి వేడుక మీరన్

    రిప్లయితొలగించండి
  12. విడ్డొరమంచునెంచక
    దొడ్డగు దుర్గాప్రతిమకు తుల్యమ రీతిన్
    యడ్డాలనాటి మణిమయ
    వడ్డాణమలంకరించె నువిద శిరమ్మున్.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. విడ్డూరము విను ముకుంద
    ఒడ్డాణమలంకరించెనువిదశిరమ్మున్
    బొడ్డూడనివారనెనిది
    విడ్డూరంబనుచువెడలిరివీక్షింపంగన్

    రిప్లయితొలగించండి
  15. శైలజగారూ,

    కందపద్యములో బేసి గణము "జ" గణము కాకూడదు.

    "విడ్డూరము విను కృష్ణా" ( ముకుంద )

    చివరి పాదములో ఒక లఘువు ఎక్కువగా ఉన్నది.

    "విడ్డూరంబనుచుఁ జనిరి వీక్షింపంగన్" అని వ్రాస్తే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

    ప్రస్తుత ఆహార బిల్లు పై
    =======*=======
    ఒడ్డున బడవలె ననుచును
    గడ్డు సమయ మందు దెచ్చె గమ్మని బిల్లున్
    అడ్డ బడి విరోధు లనెరి
    యొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్!

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సంపత్ కుమార్ శాస్రిగారికి,
    ధన్యవాదములు...

    రిప్లయితొలగించండి
  18. విడ్డూరము విను కృష్ణా
    ఒడ్డాణమలంకరించెనువిదశిరమ్మున్
    బొడ్డూడనివారనెనిది
    విడ్డూరంబనుచుజనిరివీక్షింపంగన్

    రిప్లయితొలగించండి
  19. దుడ్డును గోరిన నoబిని
    దొడ్డ నగలు సానికిచ్చె ద్రుహినుడు, కటిపై
    నొడ్డుకు సరిపడకున్నన్
    ఒడ్డాణమలంకరించె నువిద శిరమ్మున్

    దుడ్డు=ధనము, ఒడ్డు=వైశాల్యము)
    ఆధారము : విప్రనారాయణ కథ)

    రిప్లయితొలగించండి
  20. దొడ్డడు గయ్యాలి సతికి
    నడ్డేమియుఁ జెప్ప కుండ నాణ్యత గలదౌ
    యొడ్డాణ మీయఁ మెచ్చక
    నొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్!

    రిప్లయితొలగించండి
  21. రెడ్డీలయింతి బంతిన
    లడ్డూలనుచేతబట్టి లావణ్యమునన్
    వడ్డనజేయగ తగిలిన
    వొడ్డాణమలంకరించెనువిదశిరమ్మున్!!!

    రిప్లయితొలగించండి
  22. అడ్డాల వారి పేటను
    విడ్డూరము గనుడు కృష్ణ వేషము కొఱకై
    బిడ్డకు కిరీట మిదియని
    యొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్!

    రిప్లయితొలగించండి
  23. అడ్డాల నాటి బిడ్డలు
    గెడ్డాలను పెంచి వినక గెలుపుల కొఱకై
    బిడ్డా తగదని జెప్పిన
    నొడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్

    రిప్లయితొలగించండి
  24. అడ్డాల నాటి బిడ్డకు
    దొడ్డ మనసుతోడ మదిని తోచిన విధమున్
    బిడ్డకు వేషము గట్టుచు
    నొడ్డాణ మలం కరించె నువిద శిరమ్మున్ !

    రిప్లయితొలగించండి
  25. బిడ్డడు రాహులు వాగగ
    దొడ్డగ తలనొప్పి వచ్చి దొరలుచు ధరణిన్
    బొడ్డుకు చుట్టిన గుడ్డల
    ఒడ్డాణ మలంకరించె నువిద శిరమ్మున్

    రిప్లయితొలగించండి