పండిత నేమాని వారూ, నిజమే.. ఈ సమస్య నేను విద్యార్థి దశనుండి వింటున్నదే. దీనికి మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవ పూరణలో రాకాసి బల్లుల ప్రస్తావన ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. ‘వచ్చెను’ అన్నదానిని ‘వచ్చెనట’ అంటే సరి. పూరణ సమర్థంగా లేనట్టుంది. మరో ప్రయత్నం చేయండి.
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * శైలజ గారూ, మీ ప్రయత్నము ప్రశంసింపదగినదే. 2,3 పాదాల్లో గణదోషం. పూరణకు అన్వయం కుదిరినట్టు లేదు. * వరప్రసాద్ గారూ, మీ ప్రకటన పూరణ బాగుంది. అభినందనలు. ‘ప్రకటన’ను ‘ప్రకటణ’ అన్నారు? * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, బకాసుర సంహారం విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, ఈ పద్యం నిర్దోషంగా ఉంది. కాని సమస్య సమర్థంగా పూరింపబడినట్లు లేదు.
(మిత్రులారా! శుభాశీస్సులు - ఇందులో నా నేర్పేమియును లేదు. ఈ సమస్య మా పాఠ్యాంశముగా వచ్చినదే)
రిప్లయితొలగించండిసుకవివర! శంకరార్యా!
చకచక పర్విడుచు బోయి సంబరమున దా
నకట యొక మక్షికా శా
బకమున్ వడి మ్రింగుచున్న బల్లిన్ గనుమా
పక పక వగవుచు మిత్రమ
రిప్లయితొలగించండిశకునము వచ్చెను గౌళి సంతసమున తా
నిక నెటు బోవక చిక్కిన
బకము న్వడి మ్రింగు చున్న బల్లిన్ గనుమా !
కాకినాడ శతావధానములో తిరుపతి వేంకట కవుల పూరణము..... (సమస్య నిచ్చింది ఎవరో ‘కప్పగంతుల’ ఇంటిపేరు గలవారు)
రిప్లయితొలగించండిప్రకటతర కప్పగంతుల
సుకులోదధి పూర్ణచంద్ర! సూరిజనేంద్రా!
సుకరముగ మక్షికా శా
బకమున్ వడి మ్రింగుచున్న బల్లిన్ గనుమా
అకటా రక్కసి బల్లులు
రిప్లయితొలగించండిచకచక కబళించుచుండు జంతుల నెల్లన్
సుకరముగా నా వనమున
బకమున్ వడి మ్రింగుచున్న బల్లింగనుమా
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండినిజమే.. ఈ సమస్య నేను విద్యార్థి దశనుండి వింటున్నదే.
దీనికి మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండవ పూరణలో రాకాసి బల్లుల ప్రస్తావన ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. ‘వచ్చెను’ అన్నదానిని ‘వచ్చెనట’ అంటే సరి.
పూరణ సమర్థంగా లేనట్టుంది. మరో ప్రయత్నం చేయండి.
సుకరముగఁ గీటకముల శ
రిప్లయితొలగించండిలక మొక్కటి పట్టఁగను వల నునుప; నా జా
లిక తెరఁ జిక్కు మశక శా
బకము న్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా!
నకనకలాడే యాకలి
రిప్లయితొలగించండితికమక పెట్టగ తనువును, తీర్చగ క్షుత్తున్
పికము కడగల మశక శా
బకము న్వడి మ్రింగు చున్న బల్లిన్ గనుమా !
నకనక లాడుచు మఱి యా
రిప్లయితొలగించండిశకటంబున దిరుగుచుండ శలభము గానన్
వికశించిన ముఖమున శా
బకమున్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా
ఒకగడియైననులోకము
రిప్లయితొలగించండిసకలము క్షుధ్భాధ నెరుగక సౌఖ్యమలరునే
నకట యాకలికేకలకా
బకమున్వడి మ్రింగుచున్న బల్లిన్ గనుమా
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినయమండిత ప్రణతులతో
రిప్లయితొలగించండిబకమును మ్రింగుచున్న బల్లి, ప్రకటణ జూచిన కవి తన మిత్రునితో ఈ రీతిని బలికెను
========*=======
ప్రకటణ గనుడు సుకవి వర!
బకమున్ వడి మ్రింగుచున్న బల్లిన్ గనుమా,
చక చక బరుగిడు జగతిని
సకలము వింతలుగ మారి సవ్వడి జేయున్!
పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు .
రిప్లయితొలగించండిబకదనుజుడు మ్రింగగ బా
లకృష్ణు నొక బల్లివోలె రయమున వచ్చెన్
అకటా విధినేమందును
బకమున్వడి మ్రింగుచున్న బల్లింగనుమా
ఒకపరి కఱచుచు విడచుచు
రిప్లయితొలగించండినొకపరి నుద్యుక్తరీతినుత్సాహముతో
నకటా! చూడగ మశకాం
బకమును వ్రడి మ్రింగబోవు బల్లిం గనుమా.
మశక + అంబకము ( కన్ను )
శకునము మంచిది గాదని
రిప్లయితొలగించండిశుక పికములు గాంచి పలికె సోద్దె మనంగా
చకితము నొందుచు నిలచిన
బకము న్వడి మ్రింగు చున్న బల్లిం గనుమా
గురువులకు ధన్య వాదములు మరి ఈ పద్యం ఎలా ఉంటుందో ప్చ్ ! తెలియదు
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ ప్రయత్నము ప్రశంసింపదగినదే.
2,3 పాదాల్లో గణదోషం. పూరణకు అన్వయం కుదిరినట్టు లేదు.
*
వరప్రసాద్ గారూ,
మీ ప్రకటన పూరణ బాగుంది. అభినందనలు.
‘ప్రకటన’ను ‘ప్రకటణ’ అన్నారు?
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బకాసుర సంహారం విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
ఈ పద్యం నిర్దోషంగా ఉంది. కాని సమస్య సమర్థంగా పూరింపబడినట్లు లేదు.
చకచక దీసితి " వీడియొ "
రిప్లయితొలగించండినొకచెరువును, గట్టునున్న నొక బండ నటన్
యొకకాలిపైన నిలచిన
బకము న్వడి మ్రింగు చున్న బల్లిన్ గనుమా !
చకచక ఛాయా చిత్రము
రిప్లయితొలగించండిలిక జూడుము నచ్చె నాకు నీరెండు సఖా !
యొకకాలిపైన నిలచిన
బకము న్వడి మ్రింగు చున్న బల్లిన్ గనుమా !
కంప్యూటర్ సమస్యవలన సకాలంలో పోస్ట్ చేయలేదు .
రిప్లయితొలగించండిశుకమునకు పికమునకు మ
క్షికమునకు మశకమునకును జెప్పెద నేనే
శకునమ్మన,చూపులతో
బకమున్వడి మ్రింగుచున్నబల్లింగనుమా!!!
రకరకములు వింత లిచట:
రిప్లయితొలగించండిబకమున్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా!
డొకలానున చీనీయుల
బకముల దిగమ్రింగుచుండె
భారత గౌళుల్!
సకలము నిధులను మ్రింగుచు
రిప్లయితొలగించండిమకరమ్మై రాజ్యమందు మాతంగమ్మై
వికటముగా బలిసి బలిసి
బకము న్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా!