కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"పకోడీ"
ఏలూరు శతావధానంలో తిరుపతి వేంకట కవుల పద్యం.....
కరకరలాడు కొంచెమగు కారము గల్గుఁ బలాండు వాసనా
హర మగుఁ గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చటన్
ధరను బకోడిఁ బోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
దరమునఁ బల్కుచుందు రది తాదృశమే యగు నంచుఁ దోఁచెడిన్.
రిప్లయితొలగించండిక్వార్టరు క్వార్టరు కొక్క మారు
పకోడీ ని పూరణము లో తలచి
రసజ్ఞు ల పకోడీ ఘుఘుమల్ ఆస్వాదించి
సంతోష పడుటయే కదా అయ్యవారి 'టీ పార్టీ'!!
సే ఒన్స్ అగైన్ చీర్స్ టు పకోడీ
జిలేబి
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిగతంలో పద్యరచనాంశంగా పకోడీ ఇచ్చానా? నాకైతే గుర్తు లేదు.
పద్యరచనమున సమస్యా(పూరణము)...హాస్యమునకు...
రిప్లయితొలగించండివేఁడిగఁ దినఁగా భార్యను
వేడఁగఁ దా వల్లె యనియుఁ బిండి మసాలల్
గాడముగ వేసి చేసెఁ; బ
కోడిని దిన బాపనయ్య కోరిక తీరెన్!
దండకము:
రిప్లయితొలగించండిఆహా పకోడీ! పసందౌ పకోడీ! ప్రియంబైన విందౌ పకోడీ! నినున్ గూర్చి వర్ణింప లేరెంత వారేని, నీ యింపు, నీ సొంపు, నీ వేడి, నీ వాడి, నిన్ మెచ్చి సేవింప మోదమ్మున్ గూర్చి, యుత్సాహమున్ నింపి, యుల్లాసమున్ బెంచి, సమ్మోహమున్ గూర్తు గాదే? ఉపాహార వర్యంబులందీవె ముఖ్యంబుగా చాల ప్రఖ్యాతినిన్ గాంచితో, ఏమి నీ కర్కరల్, బల్బలే నీ రుచుల్, స్వాంతముల్ పొంగగా, నెంతయున్ దీటుగా, సాటిలేనట్టి నీవాట మేమందునో, మందుతో బాటు గైకొన్న నా చందమే మందుమో? విందులో నీవు లేకున్న నానందమేముండు? నిన్ వీడి మేముండ లేమెన్నడున్, మా ప్రేమపాత్రంబ! మా మంచి మిత్రంబ! వేవేల జోహార్లు నీ వందుమా, సద్గతుల్ పొందుమా, సద్రసానందమూర్తీ!, సదా భవ్య కీర్తీ! నమస్తే నమస్తే, నమః
శ్రీ నేమాని వారు చేసి పెట్టిన పకోడి "దండ" కమ్మ(మ్ము) గా నున్నది.
రిప్లయితొలగించండిగురువుగారూ ప్రణామములు,..
రిప్లయితొలగించండిమీ పదముల పకోడీ దండకం భలే పసందుగావున్నది...చదివిన వారందరికి చవులూరించేటట్లువున్నది.....
మిత్రులారా!
రిప్లయితొలగించండిమా దండకములో చిన్న సవరణ:
ఆఖరి పాదములలో -- నిన్ వీడి మేముండ లేమెన్నడున్ -- తరువాత -- "గాదె" అను 2 అక్షరములను చేర్చుదాము. స్వస్తి.
కరకరలాడుచు కమ్మగ
రిప్లయితొలగించండికరములనందముగనమరికన్నులబడగన్
హరుడైనను కరుగును
ఎరుగడుతనుదైవమనుచు ఏమ్మాయ పకోడీ
చిరుజల్లుగచినుకులు
కురియగనెదురుగ కరకరఘుమ్మననినుగనిన్
నరులయినసురవరులైన
వురకకనుందురేనమలగనుల్లిపకోడీన్
ఎందుకు పిజ్జాబర్గర్లు కను
విందుగ నూడుల్సురకములు వీధులయున్నన్
అందముకమ్మదనమ్ముల నీ
ముందవి తీసికట్టునిజముగబుల్లిపకోడీ
శ్రీ శైలజ గారు మీ పద్యములు బాగుగా నున్నవి మరొక్క సారి గణములను సరి జూచుకొనగలరు.
రిప్లయితొలగించండికళ్ళు దె ఱవ గ నె ప కో డి కాని పించె
రిప్లయితొలగించండిఏమి భా గ్య ము ? మనకిక యీ దిన మ్ము
వేడి వే డి గ ది ను దము వే గ ము గను
ఆలసించిన విషమగు నమృత ము గ ద !
శ్రీమతి శైలజ గారి పద్యములను సవరించుచూ:
రిప్లయితొలగించండికరకర లాడుచు కమ్మగ
కరముల నందముగ నమరి కన్నుల బడుచో
హరుడైన కరగిపోవును
మరచుచు నిజతత్త్వము కద మంచి పకోడీ!
చిరు చిరు జల్లులు చినుకులు
కురియు నెడల నెదుట నీవు ఘుమ్మనుచుండన్
నరులయినను సురలయినను
నురకలనే వేయరొక్కొ? యుల్లిపకోడీ!
ఎందుకు పిజ్జా బర్గరు
లెందుకు నూడుల్సు నీవె యెదురగు నెడ నీ
ముందెల్ల తీసికట్టే
విందగుదువు నీవెకాదె? వేడి పకోడీ!
గురువు గార్లకు నమస్సులు
రిప్లయితొలగించండిఅన్ని రుచులమించు యానందమొసగుచూ
కమ్మనైన విందు కానుకిడును
యుల్లమందు నిలిచె యుల్లి పకోడి! నీ
రుచినిమించిఁగలదె లోకమునను.
పూజ్యులు నేమానివారికి నమస్కారములు. తమరి పకోడీ దండకము బహు పసందుగా నున్నది. చవులూరించుచున్నది! ఇందు నొక చోటున టైపాటు దొరలినది. "మోదమ్మునున్ గూర్చి..."యని యుండవలసినది,"..మోదమ్మున్ గూర్చి.."యని టైపాటు...ప్రమాదపతితము...కాఁబోలును! గమనించఁగలరు. ధన్యవాదములతో....
రిప్లయితొలగించండిభవదీయ విధేయుఁడు,
గుండు మధుసూదన్
కంది వారి వంట కను విందు జేయ
రిప్లయితొలగించండినుల్ల మందున కోరిక ఝల్లు మనగ
భార్య చేయంగ రుస రుస వర మటంచు
నాక మగుపించు పకోడి లోక మందు
కీ.శే. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పకోడీ పై చెప్పిన పద్యాలు 'హాస్యవల్లరి' బ్లాగు సౌజన్యంతో:
రిప్లయితొలగించండిఒకసారి హనుమంతరావు నాయుడుగారు మిత్రుల కాలక్షేపానికి పకోడీలు తెప్పిస్తున్నానని ప్రకటించారు. ఆనంద పడ్డ మిత్రులలో ఒకరు చిలకమర్తి వారిని “మీరు పకోడీ మీద పద్యం చెప్పవచ్చుగా”అన్నారు. “అలా మీరు పద్యం చెప్తే పద్యానికి ఒక పకోడీ ఇస్తా”మని భూరి విరాళం ప్రకటించారు మరో వదాన్యులు. “హతవిధీ! పద్యములోని అక్షరమునకు లక్షలిచ్చు కాలము గతించి, పద్యమునకు పకోడీలిచ్చు కాలము దాపరించినది” అని చమత్కరిస్తూ, చిలకమర్తి వారు పకోడీపై కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.
*******************************
వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !
ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !
ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !
నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!
ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !
హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!
అయ్యా! శ్రీ గుండు మధుసూదన్ గారూ శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమా దండకములో దొరలిన టైపు పొరపాటు తెలియ జేసినందులకు ధన్యవాదములు. సంతోషము. అలాగే సరిజేద్దాము.
సెనగ పిండి దెచ్చి జేరిచి వరిపిండి
రిప్లయితొలగించండినీళ్ళు పోసి కలిపి నేర్పుగాను
మిర్చి యుల్లి తరిగి జేర్చిన పిమ్మట
వేడి నూనె లోన వేచ వలయు.
కరకర లాడు పకోడీ
తరమే నిను సన్నుతింప ధాతకు నైనన్
మెరయును కన్నులు, జిహ్వను
వరదౌను జలమ్ము చూడ, బ్రహ్మకు, నిన్నున్.
వాన కాలము చల్లని వాన కురియ
రిప్లయితొలగించండియింటి లోనున్న సభ్యుల కిష్టమైన
వేడి వేడి పకోడీలు విందు చేయ
నిల పకోడీల దినుచుందు రిష్టపడుచు
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిపద్యరచనా శీర్షికలో సమస్యా పూరణం! ‘కోడిఁ దిని పండుకున్నాడు కోమటయ్య’ అన్న ప్రసిద్ధమైన సమస్యకు అనుకరణం లాంటి మీ పూరణ పద్యం భలే బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
పసందైన పకోడి దండకాన్ని మా హృదయోల్లాసంగా ప్రసాదించారు. ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
పండిత నేమాని సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
గురువు గారు ఎక్కడెక్కడ సవరణలు చేసారో గమనిస్తే మీరు చేసిన పొరపాట్లు అవగాహనకు వస్తాయి.
*
సుబ్బారావు గారూ,
చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
*
శ్రీ యెరాజి జయసారథిగారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కాని కొన్ని దోషాలు. నా సవరణను పరిశీలిస్తే ఆ దోషాలేవో తెలుస్తాయి.
గురువు గార్లకు నమస్సులు
అన్ని రుచులమించు నానందమొసగుచున్
కమ్మనైన విందు కానుక యిడు
నుల్లమందు నిలిచె నుల్లి పకోడి! నీ
రుచినిమించిఁగలదె లోకమునను.
*
మిస్సన్న గారూ,
ఎంతో ప్రసిధమైన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.
మీ రెండు పద్యాలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
*
కవి మిత్రులకు నమస్కృతులు.
ఈమధ్య నా ఇంటర్ నెట్ కనెక్షన్ ఇబ్బంది పెడుతున్నది. మిత్రుల రచనలపై నా స్పందనలను తెలియజేస్తూ వ్యాఖ్యను టైప్ చేసి ప్రచురింపబోతే పైన చక్రం గిరగిరా తిరగడమే కాని ఎంతసేపు చూసినా ఓపెన్ కావడం లేదు. ఈ రోజు ఇప్పటికి ఎన్ని సార్లు ప్రయత్నించానో లెక్కలేదు. అసౌకర్యానికి మన్నించండి.
ఉల్లిని పచ్చని మిర్చిని
రిప్లయితొలగించండిమెల్లగ ముక్కలుగ గలిపి మీదట జేయన్
జిల్లున నోరూరును తిన
నుల్లమునకు గలుగు శాంతి యోహొ పకోడీ !