చి. తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు. నేను కూడా ఒక మారు దేవాడ గ్రామమునకు వెళ్ళేను - ఆ యూరిలో మా అన్నగారు డా. (ప్రొ.) వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటిలో ప్రస్తుతము శ్రీ వృద్ధుల కళ్యాణ రామా రావు గారు కాపురము ఉంటున్నారు. ఆ ప్రాంతము చాల బాగుగ నున్నది. నీ పద్యము - చిన్నప్పటి జ్ఞాపకములు గుర్తునకు రావడము చాల బాగుగ నున్నవి. స్వస్తి.
అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు. మీ ప్రయత్నము బాగుగ నున్నది. పెంకు - ప్రమద : యతి చెల్లదు చిన్న - చూపె : యతి చెల్లదు 2వ పద్యము 1వ పాదము చివరలో గణములు సరిగా పడలేదు. మీ పద్యములను సవరించిన నా యీ విధమును చూడండి:
అందమైన గ్రామ మందగ్రహారమ్ము పెంకుటిల్లు మాది ప్రేమమయము మంచి నీటి నూయి పంచుకొనెడి రేక చిన్ననాటి గురుతు చిత్తమలరు
కోరినంత పాడి కొబ్బరి చెట్లును పచ్చనైన తోట పలుకు లొలుక నంద రొక్క రీతి నానంద మొందగా లిఫ్టు బ్రతుకు నేటి లీల లాయె
గణ యతి ప్రాస లక్షణములను క్షుణ్ణముగా అధ్యయనము చేయండి. నిత్యము ప్రాచీన కవుల గ్రంథములు, ముఖ్యముగా భారతము, భాగవతములను చదవండి -- అప్పుడు మీ అభిలాష నెరవేరును. మా సహాయము ఎల్లప్పుడునూ ఉంటుంది. మా నివాసము:
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ====*====== మాన్య రామ జోగి కవుల మంచి గంధ రచన మన బ్లాగు నందున రమ్యమైన పెంకుటిల్లు,మాపల్లెకు ప్రియ మగునది, పద్య హారములిడు మహాపండితులకు. (మాపల్లెకు=కవులకు)
మా పల్లె - మా యిల్లు:
రిప్లయితొలగించండిపెంకుటిల్లు కన్ను విందు గొల్పుచునుండు
ప్రాత కట్టడంబు తాతగారి
వాసమందు నేను ప్రభవంబు నొందితి
నందుచేత నిష్టమైన దదియు
అన్ని ఋతువులందు హాయి గూర్చెడు రీతి
వాస్తు సంప్రదాయ పద్ధతి మెయి
నలరు కట్టడంబు విలువైన సంపద
యందుచేత నిష్టమైన దదియు
కలదు నుయ్యి యొకటి కమ్మని నీటితో
నిండి యుండి చాల నిర్మలముగ
నిచ్చుచుండు నీటి నింటికి దోటకు
నందుచేత నిష్టమైన దదియు
ముచ్చటలను గూర్చు పచ్చని చెట్లతో
పాడి పంటలలరు పల్లె మాది
కలసి మెలసి జనులు వాసమొనర్చెద
రందుచేత నిష్టమైన దదియు
అతి విశాలమైన యట్టి ప్రదేశాన
అందమైన ప్రకృతి విందు గూర్చు
పల్లెటూరు మాది చల్లని సీమయౌ
నందుచేత నిష్టమైన దదియు
మరియొక ప్రయత్నము:
రిప్లయితొలగించండితాత ముత్తాతల ప్రాత కట్టడమది
....యఖిల శుభమ్ముల కాటపట్టు
అందు వివాహమ్ము లెందరికో నయ్యె
....పలు పుణ్య కార్యాలు సలిపిరందు
వేదవేదాంతాది విద్యల నిలయమ్ము
....నిత్యమందు జరుగు నిగమ గోష్టి
అగ్నిహోత్రత్రితయము నతి నిష్ఠతో
....నచట వేల్చుచునుందు రనుదినమ్ము
అన్నపూర్ణకు నిలయమౌ నచట నిత్య
మన్న దానంబు గావింతు రార్తితతికి
ధర్మ నిరతులౌ మా తాత తండ్రులచట
పేరు గాంచిరి పల్లెకు బెద్దలనగ
అన్నయ్య గారి పద్యా లద్భుతము. మా దేవాడ అగ్రహారములో మా తాత గారి యింట నేను గడిపిన దినాలు గుర్తుకి వస్తున్నాయి.
రిప్లయితొలగించండిఆదిభట్ల నాడు నాడి పాడిన యిల్లు
విశ్వనాథ గరిమ వెలయు నిల్లు
కృష్ణశాస్త్రి విమల కీర్తి జాటెడి యిల్లు
పెంకుటిల్లె, మసల పేదతనమె!
చి. తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు. నేను కూడా ఒక మారు దేవాడ గ్రామమునకు వెళ్ళేను - ఆ యూరిలో మా అన్నగారు డా. (ప్రొ.) వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇంటిలో ప్రస్తుతము శ్రీ వృద్ధుల కళ్యాణ రామా రావు గారు కాపురము ఉంటున్నారు. ఆ ప్రాంతము చాల బాగుగ నున్నది.
రిప్లయితొలగించండినీ పద్యము - చిన్నప్పటి జ్ఞాపకములు గుర్తునకు రావడము చాల బాగుగ నున్నవి. స్వస్తి.
అందమైన ఊరు అందగ్రహారము
రిప్లయితొలగించండిపెంకుటిల్లు మాది ప్రమద మలర
మంచినీటి బావి పంచుకున్న రేక
చిన్న నాటి గురుతు చూపె పటము
కొబ్బరాకు చెట్లు కోరినంతపాడి
పచ్చనైన తోట పలుపలుకులొలుక
అందరొక్క రీతి ఆనందమొందగా
లిప్టు బతుకు నేటి లీలలాయె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రయత్నము బాగుగ నున్నది.
పెంకు - ప్రమద : యతి చెల్లదు
చిన్న - చూపె : యతి చెల్లదు
2వ పద్యము 1వ పాదము చివరలో గణములు సరిగా పడలేదు. మీ పద్యములను సవరించిన నా యీ విధమును చూడండి:
అందమైన గ్రామ మందగ్రహారమ్ము
పెంకుటిల్లు మాది ప్రేమమయము
మంచి నీటి నూయి పంచుకొనెడి రేక
చిన్ననాటి గురుతు చిత్తమలరు
కోరినంత పాడి కొబ్బరి చెట్లును
పచ్చనైన తోట పలుకు లొలుక
నంద రొక్క రీతి నానంద మొందగా
లిఫ్టు బ్రతుకు నేటి లీల లాయె
గణ యతి ప్రాస లక్షణములను క్షుణ్ణముగా అధ్యయనము చేయండి. నిత్యము ప్రాచీన కవుల గ్రంథములు, ముఖ్యముగా భారతము, భాగవతములను చదవండి -- అప్పుడు మీ అభిలాష నెరవేరును. మా సహాయము ఎల్లప్పుడునూ ఉంటుంది. మా నివాసము:
విశాఖపట్నము : ఫోను: 0891 - 2565944 : మొ: 94402 33175 స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండి====*======
మాన్య రామ జోగి కవుల మంచి గంధ
రచన మన బ్లాగు నందున రమ్యమైన
పెంకుటిల్లు,మాపల్లెకు ప్రియ మగునది,
పద్య హారములిడు మహాపండితులకు.
(మాపల్లెకు=కవులకు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇల దొడ్డ వరము నందున
రిప్లయితొలగించండిఅలయా చిత్రమును బోలి యైదు గదుల తోన్
వెలసిన యిల్లే మాయది
చలువకునై బెంకు పైన చ ఱచితి మార్యా !
శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమన బ్లాగు గురించి చక్కగ సెలవిచ్చేరు. సంతోషము
శ్రీ సుబ్బా రావు గారు: శుభాశీస్సులు.
మీ గ్రామము దొడ్డవరములో 5 గదుల మీ యింటిని గుర్తుకు తెచ్చుకొన్నారు - చక్కని పద్యము. అభినందనలు.
ఆది దంపతు లనబడు నయ్యు మా మ
రిప్లయితొలగించండిహేశు లీ శంక రార్యుల కా శి సులను
నిచ్చు గావుత ! రుగ్మము చచ్చు వడగ,
వడి గ కోలుకొన రోగపు బారి నుండి
అందనంత యెత్తు నాకాశ హర్మ్యాలు
రిప్లయితొలగించండిపట్టణాల లోన వరలుచుండె
నెంత మంది కెరుక యీనాటి యుగమున
పెంకు టిల్లు మహిమ పెరటి మహిమ
పరమ కళ్యాణ భావములనెన్నగఁ గల్గి
రిప్లయితొలగించండిప్రేమ పంచెడు ప్రాత పెంకుటిల్లు
అభ్యాగతాఝరులధివసించిన యట్టి
ధవళాచలనివాస ధామమద్ది
భక్తిభావంబునిర్భయము నేర్పినయట్టి
వంకపెట్టగ లేని పెంకుటిల్లు
సరసాభిభాషణా సాహిత్యములవెల్గు
పండితోత్తముల సంప్రాప్తగృహము
ప్రాతదైనను నున్నత భావములకు,
ధర్మరక్షణ గావీంచు కర్మయోగ
పుంగవులకును నెలవైన భూరి గృహము
ప్రేమ మందార పూదోట పెంకుటిల్లు.
చక్కటి పద్యములని అందించిన కవివర్యులందరికీ ధన్యవాదములు
రిప్లయితొలగించండితాత గారి యింట తరలి వేసవి కేగ
రిప్లయితొలగించండివెన్నె లందు రాత్రి వన్నె లనగ
తనువు పులక రించ తరువు నారి కెడము
సురల గాన మేమొ సురటి వీచె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపేద, పెద్ద మధ్య వెలుగొందునీ యిల్లు
రిప్లయితొలగించండిపెరడు, బావి తోడ పెంకుటిల్లు
తాత కాలమందు ప్రీతిగొలిపినిల్లు
నేడు పల్లె జూడ జాడ ' నిల్లు '
పసగల పెంకుటిల్లు తలవాకిలి ముంగిట బావి,తోపుయున్
రిప్లయితొలగించండిఇసుకను సున్నమున్ కలిపి ఏర్పడు భిత్తిక ఇంటిచుట్టునన్
కిసలయమూను మ్రాకు,ఫలకేశరముల్ గలదొడ్డి ముచ్చటౌ వసతిని జూడ కన్నులకు పండుగయేకద ఎల్లవారికిన్
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాతి మరికొన్ని పద్యములను తిలకించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ బొడ్డు శంకరయ్య గారు: పెంకుటింటి మహిమను ప్రశంసించేరు. చాలా బాగుగనున్నది.
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: చక్కని సీసపద్యములో విపులముగా తాతలనాటి పెంకుటింటి శోభలను, వైభవములను అభివర్ణించేరు. చాల ప్రశంసనీయము.
శ్రీమతి ఋఆజేశ్వరి గారు:తాత గారింటికి వేళ్ళితే తనువు పులకరించును అని కితాబు నిచ్చేరు. చాల బాగుగనున్నది.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: ఒకప్పటి పెంకుటిల్లు పల్లెలలో కూడ నేదు కానరాదు అని విచారించేరు. పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ తిమ్మాజీరావు గారు: పటములోని చిత్ర విశేషాలన్నిటిని చక్కగా వర్ణించేరు ఒక మంచి పద్యములో. సంతోషము.
స్వస్తి.
పెంకు టిల్లు గాదు పీయూష ధామమ్ము
రిప్లయితొలగించండితాత గారు పంచు తనరు ప్రేమ
బందు తతిని గలిపి బంధ నమ్ములు పెంచు
దుర్గ మనగ నిలను స్వర్గ సీమ
సహృదయులు, సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండినాడు
పెంకు టిల్లుగలదు పెద్ద గదులతోడ
పెద్ద గదుల యందు పెద్దలుండె
పెద్ద లుండె నాడు పెద్ద మనముతోడ
పెద్దమనము తోడ బుద్ది జెప్పె
నేడు
పెద్ద గదుల తొడ మిద్దె గలదు నేడు
మిద్దె లందు నేడు బుద్దులుండె
బుద్దు లుండిజాల మొద్దులు గను మారె
మొద్దులు గను మారి సుద్ది జెప్పు.
శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీ తాజా పద్యముకూడా చాలా బాగుగ వచ్చినది. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ వరప్రసాద్ గాఊ! శుభాశీస్సులు.
మీ 2 పద్యములు మంచి పద శోభతో రాణించుచున్నవి. అభినందనలు.
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండివేసవిని వేడి గాడ్పులు వీగి పోవ
చల్ల బరచుచు నుండును చాల వరకు
పల్లె సీమల యందున పరచు కొన్న
నారికేళ వృక్షతతులు నాట్య మాడ
గాలి వెలుతురు పొందగ ఘనము గాను
చల్లదనము నిచ్చును పెంకుటిల్లు యెపుడు
తాత తండ్రుల నాటివి తరగి పోయి
భవన సౌధాల నిండును భావి యందు
Sri T.B.S.Sarma garoo!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ 2 పద్యములు గుండెను చల్లగా తాకుచున్నవి. అభినందనలు.
2వ పద్యము 3వ పాదములో యడాగమము రాదు. సరిజేయండి.