జిలేబీ గారూ, మీ భావాన్ని ఎవరైనా మిత్రులు ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం. * గుండు మధుసూదన్ గారూ, ‘లోభిధనం మూడు లాభాలకే’ అన్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘దాత కన్నా లోభియే ధన్యుడు’ అని నిరూపించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
పండిత నేమాని వారూ, గుండు వారు లోభివలన మూడు లాభాలంటే మీరేమో లాభమే లేదన్నారు. ప్రఖ్యతమైన పద్యానికి నాలుగో పాదం చేర్చి పేరడీని చేసారు. బాగుంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో శ్రీ నేమాని గురుదేవులకు శతకోటి ధన్యవాదములు. మీ సవరణలతో పద్యము బహు సుందరమైనది.
అతి అనర్థదాయకం ( too much is too bad ) పై నా పద్యము లోభి తనము వాడుచుంటిని,తప్పులకు గురుదేవులు మన్నించగలరు =====*====== రోగులకు మేలు జేయును లోభి దనము ( ఎక్కువ దినుట మానిన ) చోదకులకు లోభి దనము సుందర మగు (వేగము తగ్గించిన ) జీవ నదుల లోభి దనము సిరుల నిచ్చు ( వరదలు లేకున్న ) ప్రకృతి లోభి దనము మంచి రాగ మగును ( ప్రళయ గర్జనలు లేకున్న )
శైలజ గారూ, జిలేబీ గారి భావానికి పద్యరూప మిచ్చినందుకు ధన్యవాదాలు. మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘కాపాడి దాతవ్వు’ అన్నదాన్ని ‘కాచి దాతయు నగు’ అనండి. ‘పుష్టిగున్నగల్లా’ అన్నచో గణదోషం. అక్కడ ‘పుష్టి గలుగు గల్ల’ అనండి. ‘దాత + అగు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘దాతయు’ అందాం. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘మఱిని’ అన్నదాన్ని ‘మఱియు’ అంటే బాగుంటుందేమో. * వరప్రసాద్ గారూ, మీ ప్రయోగం చాలా బాగుంది. అభినందనలు. ‘లోభితనము’ కంటే ‘లోభగుణము’ అనడం బాగుంటుందని నా సలహా. * మంద పీతాంబర్ గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * శ్రీ యెర్రాజి జయ సారథిగారూ, మీ సరదా పద్యం చాలా బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండికత్తి చలువ రాజు దాత
బుద్ధి చలువ మేధ దాత
గల్లా పుష్టి శ్రేష్టి దాత
లోభీ పరమో దాత !
శుభోదయం
జిలేబి
తాను దినక, పరులకైనను బెట్టక,
రిప్లయితొలగించండికూడఁబెట్టి; నిదురఁ గూడఁ బోక
రే వగళ్ళుఁ గాచి, ప్రియమారఁ గాంచెడు
లోభి ధనము మూఁడు లాభములకె?!
(మూఁడు లాభములు=దొంగలపాలు, రాజులపాలు, భూమిపాలు)
దాత యిచ్చు కొంత ధనమున్నదానిలో
రిప్లయితొలగించండితాను కొంత తినగ దాచుకొనును
తాను తినకదాచి ధారబోయును గాదె
దాతకన్న లోభి ధన్యుడగును.
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిమీ భావాన్ని ఎవరైనా మిత్రులు ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
*
గుండు మధుసూదన్ గారూ,
‘లోభిధనం మూడు లాభాలకే’ అన్న మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘దాత కన్నా లోభియే ధన్యుడు’ అని నిరూపించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
ధనము యున్న నేమి దాతృత్వమేలేక
రిప్లయితొలగించండిధర్మచింతలేకతానుతినక
లోభియైనవాడు లోకానికేచేటు
దాచుకున్నచాలు ధర్మమొకటి
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చక్కని ధారతో చాలా బాగుంది. అభినందనలు.
‘ధనము + ఉన్న’ అన్నప్పుడు సంధి జరిగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘ధనము గలిగ నేమి’ అందాం.
పెద్దల పద్యములలో పాదములను స్వేఛ్ఛగా వాడుకొనుచూ:
రిప్లయితొలగించండితివిరి యిసుమున తైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రాగ వచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
లాభ మేమియు గొనలేము లోభినుండి
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిగుండు వారు లోభివలన మూడు లాభాలంటే మీరేమో లాభమే లేదన్నారు. ప్రఖ్యతమైన పద్యానికి నాలుగో పాదం చేర్చి పేరడీని చేసారు. బాగుంది. అభినందనలు.
శ్రీ జిలేబిగారి భావమునకు..నాప్రయత్నం...
రిప్లయితొలగించండికత్తి పట్టు రాజు కాపాడి దాతవ్వు
బుద్దినొసగు మేధ బూర్తిదాత
పుష్టిగున్నగల్లాబుణ్యంబుదాతగు
లోభియగునుతానులోకదాత
తాను దినడు మఱి ని దాచు సంపద మొత్త
రిప్లయితొలగించండిమంత , పెట్ట డితర మనుజు లకును
లోభి గుణ మదియ లాభ మేమియు లేదు
వ్యర్ధ మతని బ్రదుకు వసుధ లోన
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు శతకోటి ధన్యవాదములు. మీ సవరణలతో పద్యము బహు సుందరమైనది.
అతి అనర్థదాయకం ( too much is too bad ) పై నా పద్యము
లోభి తనము వాడుచుంటిని,తప్పులకు గురుదేవులు మన్నించగలరు
=====*======
రోగులకు మేలు జేయును లోభి దనము ( ఎక్కువ దినుట మానిన )
చోదకులకు లోభి దనము సుందర మగు (వేగము తగ్గించిన )
జీవ నదుల లోభి దనము సిరుల నిచ్చు ( వరదలు లేకున్న )
ప్రకృతి లోభి దనము మంచి రాగ మగును ( ప్రళయ గర్జనలు లేకున్న )
ధనమునకు మూడు గతులని
రిప్లయితొలగించండివినయముగాజెప్ప లోభి వినడెవ్వారిన్
దిననీయడు తానుదినడు
మనుచుండును బంధుగణపు మాటలుబడుచున్ !!!
బ్రతుకు దెరువు లేని వారి కష్టములెన్నొ
రిప్లయితొలగించండితిండి లేని వారి తిప్పలెన్నొ
లోభి కెంత యున్న లూటీలు చేయును
వెళ్ళి పోవు నాడు వెంట గొనడు
గురుదేవులకు పాదాభివందనాలు.....
రిప్లయితొలగించండి...............................
సరదాకి...........
ధరల పెరుగుదలను తట్టుకోజాలక
మాడిపోవుచుండ్రు మహిని జనులు
లోభియైనవాడు లోకమునకు మేలు
లోభి తనమె మనకు లాభమగును.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిజిలేబీ గారి భావానికి పద్యరూప మిచ్చినందుకు ధన్యవాదాలు. మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కాపాడి దాతవ్వు’ అన్నదాన్ని ‘కాచి దాతయు నగు’ అనండి. ‘పుష్టిగున్నగల్లా’ అన్నచో గణదోషం. అక్కడ ‘పుష్టి గలుగు గల్ల’ అనండి. ‘దాత + అగు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘దాతయు’ అందాం.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘మఱిని’ అన్నదాన్ని ‘మఱియు’ అంటే బాగుంటుందేమో.
*
వరప్రసాద్ గారూ,
మీ ప్రయోగం చాలా బాగుంది. అభినందనలు.
‘లోభితనము’ కంటే ‘లోభగుణము’ అనడం బాగుంటుందని నా సలహా.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
శ్రీ యెర్రాజి జయ సారథిగారూ,
మీ సరదా పద్యం చాలా బాగుంది. అభినందనలు.
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు
రిప్లయితొలగించండిలోభ మోహములను లుప్తమ్ము జేయంగ
కామ క్రోధ ములకు గర్వమణుచు
లోభి గాక తాను ఆ భగవంతుని
చరణ సేవ ముక్తి పరుని సేయు
నేత లోభియైన పాతర వేయును
కొల్లగొట్టినట్టి నల్ల ధనము
దేశ హితవుపేర తెచ్చు ఋణము ప్ర
పంచ బ్యాంకు నుండి లంచమిచ్చి
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిsir, i live your poetry, my gratitude to you, and to all participants.
తొలగించండిశివసుబ్రహ్మణ్యం గారూ,
తొలగించండి'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీకు బ్లాగు నచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు!