21, ఆగస్టు 2013, బుధవారం

సమస్యాపూరణం – 1150 (సానీ నీసాటి గలరె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్.

30 కామెంట్‌లు:

 1. గాన ప్రియు డొక్క డనెను
  వీనుల విందైన రీతి ప్రేముడి సతితో
  నీనీ దానీ సాసా
  సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్

  రిప్లయితొలగించండి

 2. ఒక షాహజహన్ కి ప్రేమ ని పంచి
  కాలగతిన రాలిపోయిన నూర్జహాన్
  'మెహర్ కీ తాజ్ మహల్' ఐన మెహరున్నీ
  సా,నీ ,నీ సాటి గలరె సాధ్వుల లోనన్!!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. వానల తడిసిన సొగసులు
  పోనీ యని గాంచ కుండ పోలేను సఖీ
  నాయీ వన్నెల కిన్నెర
  సానీ నీసాటి గలరె సాధ్వుల లోనన్ !

  రిప్లయితొలగించండి
 4. జ్ఞాన ప్రదాత్రి! మాతా!
  గానము సాహిత్యము నిడి, కాచెడి తల్లీ!
  యో నుడువుల చదువుల దొర
  సానీ! నీ సాటి కలరె సాధ్వుల లోనన్?

  రిప్లయితొలగించండి
 5. సోదరి రాజేశ్వరిగారికి నమస్కారములు. మీ పూరణము బాగుగ నున్నది. అభినందనలు. కాని, మూఁడవ పాదమందు ప్రాస భంగమైనది. "నా యీ వన్నెల కిన్నెర" యను దానిని "యో నా వన్నెల కిన్నెర" యని సవరించినచో సరిపోవును.

  రిప్లయితొలగించండి
 6. నమస్కారములు
  అవును అలాగే టైప్ చేయ బోయి పొరబడ్డాను సవరణ చేసి నందులకు ధన్య వాదములు సోదరు లందరికీ రక్షా బంధన శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  సప్తస్వరాల గారడితో మీ పూరన మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  చక్కని విరుపుతో, మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
  మిత్రులెవరైనా ఛందోబద్ధం చేస్తారేమో చూద్దాం.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  కిన్నెరసాన సోయగాలను వర్ణించిన మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.
  గుండు వారు సవరించిన ప్రాస దోషాన్ని గమనించారు కదా!
  *
  గుండు మధుసూదన్ గారూ,
  చదువుల దొరసానిపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  రాజేశ్వరి అక్కయ్య పూరణను సవరించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు నేమానివారికి, శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు. నిన్నటి పూరణమున పొరపాటు జరిగినది. గమనించకపోయితిని. మన్నింపఁగలరు. "రోదనలతొ" పదమును "రోదనమెయి"యని సవరించితిని. పరిశీలింపుడు...

  ఉత్సాహవృత్తము:
  మోదమంది యాదిశక్తి పోరునందు రాక్షసుల్
  రోదనమెయి పాఱిపోవ ద్రుత విధమున గదలతో
  మోదె! మహిషు నెదను శూలము - యమ మహిష ఘంటికా
  నాద మతిహితమ్ము కాఁగ - నాటె రౌద్రమూర్తియై!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ నేమాని వారి పూరణ స్ఫూర్తి తో...

  సానీ సససా మగసా
  పానీ దదనీని పాప పామా గరిసా
  మానిని నిగమమముల దొర
  సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశెస్సులు.
  మీ పద విన్యాసము బాగుగ నున్నది. కానీ 3వ పాదమును ఒకమారు చూడండి. నిగమములు అనే ఉండాలి నిగమమములు కాదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. పోనీలే యని యుండగ
  మేనంతయు నిండునట్లు మెక చర్మంబా !
  కానీ నీయీ పని , దొర
  సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్

  రిప్లయితొలగించండి
 12. ఆనాటికినీనాటికి
  కోనలలోబ్రతుకుకోయ కూనలకెల్లన్
  ప్రాణముపోసెడు కిన్నెర
  సానీ! నీ సాటి గలరె సాధ్వుల లోనన్!!!

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గారికి , పండిత నేమాని గారికి నమస్కారములు.

  కానల కేగితి పతితో
  దానవ చెర నుండి శీలతార్కణము కై
  తానగ్ని జొచ్చె రాముని
  సానీ నీసాటి గలరె సాధ్వుల లోనన్

  రిప్లయితొలగించండి
 14. తేనెలు కురిసెడి గానము
  వీనుల విందుగను వింటి విను వీధు లలో
  రాణీ పసిడి వన్నెల దొర
  సానీ నీ సాటి గలరె సాధ్వుల లోనన్

  రిప్లయితొలగించండి
 15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సరిగమలను సరిగా వినియోగించుకుని నిగమాల సానిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదాన్ని ‘మానిని నిగమమ్ముల దొర..’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘మెక చర్మము’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘మెకపు త్వచంబా’ అందాం.
  *
  మంద పీతాంబర్ గారూ,
  కిన్నెరసానిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘శీల తార్కాణమునకై’ అని మీ అభిప్రాయం అయి ఉంటుంది. తార్కాణముకై అనరాదు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవ పాదంలో రాణి అని హ్రస్వంచేస్తే గణదోషం ఉండదు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  వేలుపు సానిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  రెండవ పాదంలో ‘మేను సమర్పించి’ అనండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. పాదాబివందనములు.
   నేను శ్రీ యెర్రాజి జయసారథి.(వ॥27)(ప్రభుత్వోపాధ్యాయుడు)
   పద్యాలు వ్రాయలనే ఆసక్తితో కొన్ని పద్యాలను వ్రాసితీని.ఈ
   మద్యనే 'సులక్షణసారమ'ను గ్రంథము చదివితిని.
   దానిలో పద్యరచనకు గల
   వివిధ నియమాలు
   1.॥అ క చ ట ప య శ॥లను పద్య మొదటి పాదంలో ,3,6,7,11 స్థానాల్లో వేస్తే కీడు.
   గోకర్ణ ఛందముి
   2.పద్యమొదటి అక్షరం-స ర చ ఛ జ - అక్షరాలు నిలుపరాదని,
   ఈవిదంగా
   గణాలు -గ్రహణాలు
   గణాలు-నక్షత్రాలు
   మొ॥ చదువగా వణుకు పుట్టుతుంది.
   దయచేసి దిశానిర్దేశం చేయగలరు

   తొలగించండి
 16. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  మదర్ దేరీసా గారిపై
  ======*======
  పరదేశ వనిత వైనను
  పరితో షమునను జనులకు బంచగ ప్రేమన్
  దొర సానీ నీసాటి గ
  లరె సాధ్వులలోనను నిజ రమణులయందున్?

  రిప్లయితొలగించండి
 17. వరప్రసాద్ గారూ,
  మదర్ థెరిస్సాను గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. పోనీ నాథా తమ్ముని,
  తోనుండును రాముడాజిఁ, తుడువకు తిలక-
  మ్మీనుదుట నన్న కపిదొర-
  సానీ! నీసాటి గలరె సాధ్వుల లోనన్?
  ************
  దానా దీనా చెప్పెద
  నేనొక్కటె మధురవాణి! నీతికి నిలచే-
  దానవు నీవే నేడో
  సానీ! నీసాటి గలరె సాధ్వుల లోనన్

  రిప్లయితొలగించండి
 19. Sree jayasarathi yerraji garu! శుభాశీస్సులు.
  మీకు పద్యరచన యందు ఆసక్తి కలుగుట ముదావహము. శుభస్య శీఘ్రం అని మొదలు పెట్టండి. సులక్షణసారమును మీరు గణములు, యతులు, ప్రాసల నియమములు తెలుసుకొనుట కొరకే ఉపయోగించండి. ముఖ్యముగా యతి మైత్రి ప్రాసనియమములు బాగుగ రావలెను. పద్యములను రచించుటకు ఏ గణములతో మొదలిడ రాదో అనే విషయములను పట్టించుకొన వద్దు. ముందుగా కంద పద్యము, ఆటవెలది మరియు తేటగీతి పద్యములను వ్రాయుటకు మొదలు పెట్టండి. పుస్తకములలోని పద్యములను ఎక్కువగా చదువుచున్నచో మీకు ఆ పద్యములలోని గమనము (నడక లేక లయ) అలవడును. దాని ప్రకారము మీరు పద్యములను వ్రాయుటకు ప్రయత్నించండి. భారత భాగవతములలోని పద్యములను ఎక్కువగా చదువుచున్నచో మీకు ఆ ధార, సమాసములు మొదలైనవి అలవడును. శుభం భూయాత్. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. శ్రీ కంది శంకరయ్య గురుదేవుల గారికి నమస్కారములు, మీ సూచనతో పద్య సవరణ చేస్తూ.........

  మేనక వలె నర్తించుచు
  మేను సమర్పించి ప్రేమ మీరగ సుఖమున్
  మానవుల కిడుచు క్షయమగు
  సానీ నీ సాటి గలరె సాధ్వులలోనన్.

  రిప్లయితొలగించండి
 21. యెర్రాజి జయసారథి గారూ,
  చాలా సంతోషం. మీరు ఎటునంటి సందేహాలు పెట్టుకోకుండా పద్యరచనను కొనసాగించండి.
  సాధనతో వాక్కును స్వాధీనం చేసుకొన్న ఋషులకు, ఋషితుల్యులకు మాత్రమే శాపానుగ్రహ శక్తి అలవడుతుంది. సామాన్యులకా శక్తి లేదు. అక్షర, గణాల ప్రయోగం మేలు చేయాలన్నా, కీడు చేయాలన్న అంతటి శక్తిని సాధించి ఉండాలి. ఎవరు పడితే వారు ‘ఆరింట తా’ పెట్టి శత్రువుకు నష్టం కలగాలనో, చావు మూడాలనో కోరి పద్యం వ్రాసినంత మాత్రాన జరిగితే, ఈలోకంలో ఇప్పటికి కొన్ని వేలమంది అలా నాశనం అయ్యేవారు. అంతెందుకు నేను చదువుకునే రోజుల్లో ఒకడు మూడు రోజుల్లో చావాలని కోరుకుంటూ వేములవాడ భీమకవి లెవెల్లో ఆరింట తకారం పెట్టి పద్యాన్ని వ్రాసాను. ఎప్పుడో 1969 నాటి ముచ్చట. ఆ వ్యక్తి ఇప్పటికీ దుక్కలా ఉండడమే కాదు, నా కాప్త మిత్రుడయ్యాడు కూడా. (అలా పద్యం వ్రాసిన విషయం అప్పుడప్పుడు చెప్పుకొని నవ్వుకుంటాం). అందుకని ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పద్యాలను రచించండి. శుభమ్!
  *
  మిస్సన్న గారూ,
  తారను, మధురవాణిని ప్రస్తావించిన మీ రెండు పూరణలూ చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  జయసారథి గారికి మీరిచ్చిన సందేశానికి ధన్యవాదాలు.
  ఈ విషయమై ఒక చర్చ జరిగితే బాగుంటుందేమో!

  రిప్లయితొలగించండి
 22. మ్రానుసమానుని కవికుల
  భానునిగాదీర్చినట్టి వాణీ! పదగీ
  ర్వాణీ!! పంకజభవు దొర
  సానీ!!! నీసాటి గలరె సాధ్వులలోనన్!!!!

  రిప్లయితొలగించండి
 23. మంద పీతాంబర్ గారూ,
  వాణీస్తుతి రూపమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ నేమానిగారూ ! ధన్యవాదములు.
  మాస్టరుగారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో..

  సానీ సససా మగసా
  పానీ దదనీని పాప పామా గరిసా
  మానిని నిగమమ్ముల దొర
  సానీ నీసాటి గలరె సాధ్వులలోనన్.

  రిప్లయితొలగించండి
 25. మానావమాన మెంచక
  మానవులకు జన్మ మిచ్చి మాన్యత తోడన్
  గౌనులు తొడిగెడి మంతర
  సానీ నీసాటి గలరె
  సాధ్వులలోనన్!


  "మంతరసాని : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  వై. వి.
  మంత్రసానికి మొదటిరూపము."

  రిప్లయితొలగించండి


 26. మానావతిగన్ పద్యము
  లే నా ప్రాణంబనుచు జిలేబుల దొరలిం
  చే నాట్యసుందరీ! దొర
  సానీ! నీసాటి గలరె సాధ్వులలోనన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి