28, ఆగస్టు 2013, బుధవారం

పద్య రచన – 447 (పచ్చి మిరపకాయ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"పచ్చి మిరపకాయ"

19 కామెంట్‌లు:

  1. సోదర సోదరీ మణు లకు పూజ్య గురువులకు అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి

  3. కంది వారి సమస్యా పటా కాయ
    అంది వచ్చిన పచ్చి మిరపకాయ
    పొంగి వచ్చిన కంది పప్పు చారు రుచి
    పొగడ తరమగునే ఎవరికైనన్ జిలేబి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పచ్చిమిర్చిచూడపచ్చగానుండును
    పంటపెట్టిచూడమంటరేగు
    కంటికింపుగల్గుకలికాలప్రేమ
    కోరిచేరబోతేకొంపముంచు

    రిప్లయితొలగించండి
  5. మిర్చీ గన పచ్చనిదిది
    కార్చిచ్చుగ మారు నోట కాయను కొరుకన్
    చేర్చుచు నుప్పూ పులుపూ
    గూర్చిన రుచి పచ్చడౌను కోరుచు తినగా.

    రిప్లయితొలగించండి
  6. పచ్చిమిర్చిరేటుమంటపుట్టిస్తుంటె
    ఉల్లిఘాటుచూడఉర్విదాటె
    పచ్చకాగితాలపరుగుపందెమ్మున్
    మద్యతరగతివారుపచ్చడాయె

    రిప్లయితొలగించండి
  7. నా పకోడి వంట...

    ఉల్లిని పచ్చని మిర్చిని
    మెల్లగ ముక్కలుగ గలిపి మీదట జేయన్
    జిల్లున నోరూరును తిన
    నుల్లమునకు గలుగు శాంతి యోహొ పకోడీ !

    రిప్లయితొలగించండి
  8. బందరు శతావధానంలో తిరుపతి వేంకట కవుల పద్యం.....
    సీ.
    ఎద్దాని సంబంధ మెలమిఁ గల్గిన మాత్రఁ
    గూర లెల్లను మంచి గుణము గనునొ
    కొత్తిమిరిని నూరుకొని తిన్న నెయ్యది
    కంచె డన్నముఁ దినఁ గలుగఁజేయు
    నెద్దాని శిశుజాల మెఱుఁగకఁ జేపట్టి
    కనులు నల్పఁగ మంట గలుగఁజేయు
    నెద్ది తాఁ గ్రమమున నెదిగి పండినమీఁద
    బోటి కెమ్మోవితో సాటియగునొ
    తే.గీ.
    నూరి దేనిని పుల్లనై మీఱు మెంతి
    పెరుగులోఁ గూర్ప స్వర్గమ్ము నెఱుఁగఁజేయు
    నరుల కెల్లను, నా పచ్చి మిరపకాయ
    మహిత భక్తిని నేను నమస్కరింతు.
    (‘శతావధాన సారము’ గ్రంథమునుండి)

    రిప్లయితొలగించండి
  9. పచ్చి మిరప కాయ పచ్చగ నలరెను
    గూబ గుయ్య మనును గొప్ప కొఱకు
    కఱ కఱ మని తినిన కార మ గుచును
    కాన శ్రద్ధ మేలు దాని పట్ల

    రిప్లయితొలగించండి
  10. మిరప కాయఁ గూరి మేల్మి మసాలను
    శనగ పిండి లోన మునగ జేసి
    నూనె లోన గాల్చి నోటికి నందించ
    రుద్రు డైన దిగడె రుచికి మెచ్చి!

    రిప్లయితొలగించండి
  11. మిరప కాయఁ గూరి మేల్మి మసాలను
    శనగ పిండి లోన మునగ జేసి
    నూనె లోన గాల్చి నోటికి నందించ
    రుద్రు డైన దిగడె రుచికి మెచ్చి!

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు పాదాభివందనాలు

    .................................................
    పచ్చిమిరపకాయ పరమౌషధియగును
    "సీ" విటమినులొసగి చేవబెంచు
    గుణముగల్గజేయుకూరలకునింపుగా
    మిరప లేని కూర మేలుయగునె?

    రిప్లయితొలగించండి
  13. శ్రీకృష్ణ స్తుతి:

    పాదపము:

    శ్రీమధురాధిప! శ్రీధర! కృష్ణా!
    శ్రీమురళీధర! చిన్మయ! కృష్ణా!
    ప్రేమ రసాకర! శ్రీకర! కృష్ణా!
    కామిత దాయక! కల్పక! కృష్ణా!

    జ్ఞాన ధనాఢ్య! జగద్గురు! కృష్ణా!
    దీనజనావన! ధీనిధి! కృష్ణా!
    మౌనిజన స్తుత! మాధవ! కృష్ణా!
    శ్రీనయనోత్సవ! చిద్ఘన! కృష్ణా!

    నందకులాఖిల నాయక! కృష్ణా!
    సుందర రూప సుశోభిత!కృష్ణా!
    విందగు నీ శుభవీక్షణ! కృష్ణా!
    వందనమో శ్రితవత్సల! కృష్ణా!

    వారిరుహాసన వందిత! కృష్ణా!
    వారిజ లోచన! భాగ్యద! కృష్ణా!
    భూరి గుణోజ్జ్వల భూషణ! కృష్ణా!
    వీరవరేణ్య! త్రివిక్రమ! కృష్ణా!

    పావన నామ! శుభప్రద! కృష్ణా!
    దేవనుతా! కులదీపక! కృష్ణా!
    రావె జగత్త్రయ రంజన! కృష్ణా!
    ప్రోవవె మమ్ము ప్రభూ! హరి! కృష్ణా!

    శ్రేయోభిలాషులందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో:

    నేమాని రామజోగి సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులకు, కవిమిత్రులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  15. ఏకాయలేకున్న నిచ్చగించదు భోజ
    నాదికంబులయందునరసి చూడఁ
    నేకాయ కారంబు నెంత తిన్ననుగాని
    వెగటు పుట్టదు దాని వింతఁగనుఁడు
    నేకాయఁ తాక కళ్ళెరుపురంగున మారి
    కన్నీరు ద్రవియించు కాల్వవోలె
    నేకాయ ధరలోన భీకరంబుగ నిల్చి
    భయకంపితులఁ జేయు ప్రజలనిపుడు

    నట్టి కాయదేది యవనిలో ననిచూడ
    పచ్చిమిరప దోచుఁ, ప్రస్తుతింప
    తగునుఁ గాదె యిట్టి వగలాడి మిరపకై
    ధనముఁ ఖర్చుచేయ తప్పు గాదు.

    ధరలోన = భూమిలో, వెలలో

    రిప్లయితొలగించండి
  16. పచ్చని వన్నెతో కనుల పండువు గొల్పుచు ఘాటు ఘాటుగా
    ముచ్చట నింపుచుందువట పొల్పగునో మిరియంపుకాయ! బల్
    మచ్చిక తోడ గైకొనిన మంచి రుచుల్ చిలికించు చుందువే
    మెచ్చితి నీదు లక్షణము మేదినిపై వెలుగొందు మొప్పుగా

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని గారికి, శంకరయ్య గురుదేవులకు నమస్కారములు

    పప్పుధప్పళమున పచ్చిమిరపకాయ
    కొత్తిమీర చింతపొత్తు కలిపి
    తినగ స్వర్గమదిగొ కనిపించు బెత్తెడు
    దూరమందు నిజము ధీరులార

    పచ్చిమిరపకాయ బజ్జీలు తినగను
    ఆంధ్రులందరకును అతి ప్రియమ్ము
    పెరుగు మిరపకాయ వేయించి నంజిన
    జివ్హకెంత రుచియో చెప్పలేము

    మిరప చిన్నదైన ఎరుగక నమిలిన
    అమ్మ, అవ్వ, తాత, బొమ్మ యనగ
    లేరు మరల, మరల నీరమ్ము త్రాగినా
    కుదుట బడదు గొంతు కొంచమైన

    (పచ్చి మిరపకాయ కి జయ హో)

    రిప్లయితొలగించండి
  18. వాన పడి నంత చలి గాలి మేను సోక
    వేడి వేడంచు ఘాటగు వేడి మిర్చి
    కోర్కె మీరగ తిని నంత కొసరి కొసరి
    వేలు పైనను దిగిరాడ వేడ్క మీర
    ----------------------------------
    కుర్చీల నాక్ర మించుచు
    మిర్చీ వలె మండి బడుచు మీరిన స్వేచ్చన్
    అర్చనలు దీక్ష లనుచును
    ఖర్చులకే కొదవ లేదు ఘాటగు ప్రభుతన్

    రిప్లయితొలగించండి
  19. పచ్చి మిర్చి జూడ పచ్చగా నుండును
    పిండి రుద్ది బజ్జి వేయ వచ్చు
    పచ్చి మిర్చి వేసి వండిన వంటలు
    మంచి మంచి రుచుల పంచుచుండు.

    రిప్లయితొలగించండి