18, ఆగస్టు 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1147 (భీమసేనుండు దేవకీ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు.

25 కామెంట్‌లు:

  1. అని జరాసంధు తోడ బోరాడుచుండి
    భీమసేనుండు దేవకీ ప్రియసుతుండు
    చేయు సూచనలన్ గాంచి చీల్చి రిపుని
    రెండు ముక్కలు నతుకని రీతి విసిరె

    రిప్లయితొలగించండి
  2. లక్కయింటిలో తనవారలందరనతి
    ధైర్యముగనగ్నియనయము దాటవైచె
    భీమసేనుండు; దేవకీప్రియసుతుండు
    చల్లగాజూడ తొలగవే సంకటములు ॥

    రిప్లయితొలగించండి
  3. శ్రీ నేమాని వారు చక్కగా పూరించారు.
    నేనూ అదే సందర్భాన్ని తీసుకుని పూరిస్తున్నాను.
    రఘురాం గారూ బాగుంది.

    అల జరాసంధు జంపగా నరిగె నపుడు
    పుణ్యపురుషులు మువ్వురు భూసురులుగ
    కపట వేషమ్ము లనుదాల్చి కవ్వడియును
    భీమసేనుండు, దేవకీ ప్రియసుతుండు. .

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు నేమానివారికి నమస్కారములు. నాకును మీరు స్పృశించిన సంఘటనయే తోచినది. మీ పూరణము చాల బాగుగ నున్నది. నే నిటులఁ బూరించెదను...


    అని సమాప్తినిఁ బాండవు లాంబికేయుఁ
    జేర, నాలింగనముఁ గోరెఁ; జేరఁ బోయె
    భీమసేనుండు; దేవకీ ప్రియ సుతుండు
    లోహ మూర్తిఁ గౌఁగిలిఁ జేర్చి, ప్రోచె నపుడు!

    రిప్లయితొలగించండి
  5. పాండవుల యందు నరయగ బాహుబలుడు
    భీ మసేనుండు, దేవకీ ప్రియ సుతుండు
    మనకు నారాధ్య దేవుడు కృష్ణుడె కద
    వందనంబు బృం దావన వాసి కార్య !

    రిప్లయితొలగించండి
  6. నా రెండవ పూరణము:

    హ్రదము దాఁగిన రారాజు ననికిఁ బిలిచి
    భీమసేనుండు, దేవకీ ప్రియ సుతుండు
    నూరువునుఁ జూప, విఱిచి, మనోగతార్థ
    ముం గనం, బొందె సంతోషముం ద్రుపదజ!

    రిప్లయితొలగించండి
  7. భీమసేనుడు, దేవకీ ప్రియసుతుండు
    జూచుచుండగ గదబూని చాచికొట్టి
    మడుగులోనున్న కురురాజు తొడలపైన
    పూర్తి జేసెను రణమును పుడమి మెచ్చ!!!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

    పూజ్య గురుదేవుల పద్యము అద్భుతం|
    అదే భావముతో నాపూరణ
    =======*=======
    సింహ బలుడు భీమ సేనుండు,దేవకీ
    ప్రియసుతుండు గలసి బిలచె రాత్రి
    పూటను దమ పైన పోరాటమునకును
    సమరమందు నిలువ సమ బలులయి

    భీమ సేనుండు,దేవకీ ప్రియసుతుండు
    జేయు సంజ్ఞను గనెనంత జీల్చె రాక్ష
    సుడగు జరాసంధు సుడులు ద్రిప్పి
    మునిజనుల కభయమునిచ్చె ముందునిలచి.

    రిప్లయితొలగించండి
  9. ద్వంద్వయుద్ధంబునందు నిర్ద్వంద్వ రీతి
    బహుపరాక్రమయుక్తుడై ప్రబలి చెలగి
    భీమసేనుండు, దేవకీ ప్రియసుతుండు
    సంజ్ఞచే జరా సంధుని సంహరించె.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి గురుదేవులు
    శంకరయ్య గారికి నమస్కృతులు

    బకుని కీచకు జంపినవాడెవండు?
    కంస మామను హతమార్చగల్గె నెవడు?
    క్రమము తప్పక తెలుపుమా విమలచరిత
    భీమసేనుడు దేవకీప్రియసుతుండు

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా! ఈనాటి సమస్య భారతములోని వివిధ సంఘటనలకు సంబంధించిన వర్ణనలతో పరిష్కరింపబడినది. అందరి పూరణలు చాల బాగుగ నున్నవి. అందరికీ అభినందనలు.

    శ్రీ రఘురాం గారు: లక్క యింటినుండి కృష్ణుని సహాయముతో పాండవులు రక్షింపబడుటను వర్ణించేరు.

    శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు: జరాసంధుని వధను గూర్చి చక్కగా వర్ణించేరు.

    శ్రీ మధుసూదన్ గారు: 2 మంచి పద్యములు వ్రాసేరు : (1) ధృతరాష్ట్రుని బారినుండి భీముని కృష్ణుడు రక్షించుట; (2) హ్రదములో దిగిన దుర్యోధనుని భీముడు సంహరించుట.

    శ్రీ సుబ్బా రావు గారు: మంచి విరుపుతో శ్రీ కృష్ణుని మరియు భీముని గురించి వర్ణించేరు.

    శ్రీ పీతాంబర్ గారు: మడుగులో దాగిన దుర్యోధనుని భీముడు చంపుటను చక్కగా వర్ణించేరు.

    శ్రీ వరప్రసాద్ గారు: 2 మంచి పద్యములలో జరాసంధుని వధను గూర్చి వర్ణించేరు.

    శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు: జరాసంధుని వధ గూర్చి ఒక మంచి పద్యములో వర్ణించేరు.

    శ్రీ తిమ్మాజీ రావు గారు: క్రమాలంకారమును ఆశ్రయించి సమస్యను చక్కని పద్యములో పూరించేరు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు నేమానివారికి నమస్కారములు.
    క్రమాలంకారమున నా మొదటి పూరణ
    =====*=======
    కౌరవుల గర్వ మణచిన వీరు డెవరు?
    యమునను నడిరేయి దాటిన విమల చరితు
    డెవరు?యని యడుగగ,దెల్పె పవనుడిటుల
    భీమసేనుడు,దేవకీప్రియసుతుండు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ వరప్రసాద్ గార్: శుభాశీస్సులు.
    మీరు క్రమాలంకారములో చేసిన ప్రయత్నము బాగున్నది. మంచి పద్యము. మా గురువు గారు కీ.శే. రావూరి వేంకటేశ్వరులు గారు, శతావధాని (కొవ్వూరు) గారి సూచన ప్రకారము క్రమాలంకారములో పూరణ ప్రశంసనీయము కాదు. మరి యే ఇతర పద్ధతులు లేని సందర్భములలో మాత్రమే క్రమాలంకారమును ఆశ్రయించవలెను. గ్రహించ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు, నా మొదటి పూరణ ఒక చిన్న ప్రయత్నమిది.ఇప్పటి వరకు క్రమాలంకారమును ఆశ్రయించలేదు.ఇకపై కూడా ఆశ్రయించను.

    రిప్లయితొలగించండి
  15. కీచ కుని చంపి కసిదీర కీర్తి నొంది
    కొండ లను పిండి జేసెను కూన వయసు
    రక్కసిని పెండ్లి యాడెను నిక్క ముగను
    భీమ సేనుండు దేవకీ ప్రియ సుతుండు

    రిప్లయితొలగించండి
  16. అమ్మా! రాజేశ్వరి గారూ!
    శుభాశీస్సులు.
    సమస్యా పూరణలో -- (1) ఇచ్చిన సమస్యను అర్థము చేసుకొనవలెను (2) అందులోని సమస్య ఏమిటి అని చూడవలెను; (3) ఆ సమస్యను ఎట్లు పరిష్కరించ వలెను అని భావించాలి -- ఆ విధముగా పద్యమును వ్రాయవలెను. మీ పద్యములో భీమసేనుని గూర్చి వ్రాసేరు కానీ కృష్ణుని గూర్చి ఏమియునూ వ్రాయ లేదు. సమస్య సమస్యగానే మిగిలినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. పూజ్య గురువులు శ్రీ పండితుల వారికి ప్రణా మములు .
    నిజంగానే నాకు సమస్య అర్ధం కాలేదు.ఎందు కంటే ....భీమ సేనునీ ....శ్రీ కృష్ణునీ ....కలిపిన పూరణలు చూచి నాకు సరిగా అర్ధం కాలేదు అందుకని క్షమిం చ గలరు మరియొక ప్రయత్నము జేసితిని దయ చేసి పరిశీ లించ గలరు


    కీచకుని జంపి కసిదీర కీర్తి నొంది
    కొండ లను పిండి జేసెను కూన వయసు
    దానవిని జంపె బాలుడై త్రాగి పాలు
    భీమ సేనుండు దేవకీ ప్రియ సుతుండు

    రిప్లయితొలగించండి
  18. అమ్మా! రాజేశ్వరి గారూ! మీ భావమునకు సరియగు రీతిలో మీ పద్యములో కొన్ని మార్పులు చేసితిని.

    కీచకుని జంపె కసిదీర, కీర్తి నొందె,
    కొండలను శైశవమ్మున పిండి చేసె;
    దనుజ ప్రాణమ్ములను బీల్చె త్రాగి పాలు;
    భీమ సేనుడు, దేవకీ ప్రియ సుతుండు

    రిప్లయితొలగించండి
  19. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా మిత్రుని తల్లి మరణించడంతో అటువెళ్ళి రాత్రికి ఇల్లు చేరడంతో మిత్రుల పూరణలను, పద్యాలను పరిశీలించే అవకాశం లభించలేదు. మన్నించండి.
    *
    చక్కని పూరణలను వ్రాసిన మిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గూడ రఘురామ్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    సుబ్బారావు గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    వరప్రసాద్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    ...... అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పూరణల, పద్యాలను విశ్లేషిస్తూ తగిన సూచనలను, సవరణలను ఇస్తున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి