16, ఆగస్టు 2013, శుక్రవారం

పద్య రచన – 435 (పిడికిట సూర్యుఁడు)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
ఈ చిత్రమును పంపిన పరుచూరి వంశీ గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. ఉదయ జగచ్చక్షుని గన
    పదిలముగా వ్రేళ్ళ మధ్య భాగమ్మునె తా
    కుదురుగ నేర్పరిచి గనెడు
    సదుపాసకు డతడు వాని నభినందింతున్

    రిప్లయితొలగించండి

  2. కవి మిత్రుడైతే
    పిడికిట సూరీడు
    కవి శత్రువైతే
    పిడికిటి బిగించిన సూరీడు !

    రిప్లయితొలగించండి
  3. పిడికిట సూర్యుని జూడుము
    పిడికిలి లో వెలుగు చుండె పేరిమి రశ్మిన్
    పిడికిలి యది వంశిగారిది
    అడకువతో ,నీ కునతులు నారని జో తీ !

    రిప్లయితొలగించండి
  4. పుడిసిలి పట్టెనగస్త్యుడు
    కడగుచు సంద్రమును నాడు, కపివర శ్రేష్ఠుం
    డడరెను సూర్యుని మ్రింగగ,
    పిడికిట బంధించె నేడు పీథుని వంశీ

    రిప్లయితొలగించండి
  5. చిత్రంబనిపించును గద
    మిత్రుడు పిడికిట నిముడుట - మేలుగ చాయా
    చిత్రంబున సాధ్యంబయె
    సీత్రూ దీ ఫోటొ ఫ్రెండ్సు - సెంట్ బై వంశీ !

    రిప్లయితొలగించండి
  6. పరుచూరి వంశిగారిని
    సరసుం డొకఁ డనె, "పిడికిట సవితృని బంధిం
    తురె?"; దానికి వంశియుఁ జి
    త్తరు వీ రీతిగనుఁ జూపెఁ ద త్సరసునకున్!

    రిప్లయితొలగించండి
  7. నా పద్యము ఆఖరి పాదములో యతిని గమనించ లేదు. ఆ పాదమును ఈవిధముగా మార్చుదాము:

    "సదుపాసకు డతడు వాని సరణి నుతింతున్"

    రిప్లయితొలగించండి
  8. దుఢుకుగ పండని భానుని
    వడిగా మ్రింగగ నెగసెను వాయుపుత్రుడున్
    పిడికిటసూర్యుని బట్టగ
    గడుసుగ చిత్రముగాతీయుఘనుడీనరుడున్

    రిప్లయితొలగించండి
  9. సాహితీ మిత్రులు శైలజగారికి...తమ పద్యమునఁ గొన్ని సవరణము లవసరము...పరిశీలింపుఁడు...

    తమ పద్యము...
    దుఢుకుగ పండని భానుని
    వడిగా మ్రింగగ నెగసెను వాయుపుత్రుడున్
    పిడికిటసూర్యుని బట్టగ
    గడుసుగ చిత్రముగాతీయుఘనుడీనరుడున్

    సవరణముతో...
    దుఢుకుగ పండని భానుని
    వడిగా మ్రింగగ నెగసెను వాయు సుతుండున్
    పిడికిట సూర్యుని బట్టగ
    గడుసుగ చిత్రముగ తీయు ఘను డీ నరుడున్

    రిప్లయితొలగించండి
  10. చక్కటి పద్యాలు అందించిన కవి మిత్రులందరికీ ధన్యవాదములు
    చెన్నపట్నం లో ఒక బీచ్ లో ఈ ఫోటో తీశాను..
    పండిత నేమాని గారికి , జిలేబీ గారికి ,హనుమచ్చాస్త్రి గారికి ,సుబ్బారావు గారికి ,తిమ్మాజీ గారికి,మధు గారికి, శైలజ గార్లకు ధన్యవాదములు .

    శంకరయ్య గారు "పిడికిట సూర్యుడు " ఈ పేరు బాగుందండీ ..ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందరికి శుభాశీస్సులు. అందరి పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.

    శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము 3వ పాదములో 1 లఘువు ఎక్కువగా నున్నది. సవరించండి.

    శ్రీ తిమ్మాజీ రావు గారు: కపి వర శ్రేష్ఠుండు అన్నారు - వర శ్రేష్ఠ శబ్దములు సమానార్థకములు అగును కదా! - పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ మధుశూదన్ గారికి నమస్సులు,..
    ఇప్పుడు భాగుందండీ పద్యం, పుత్రుడా, నందనుడాఅనుకున్నానే గానీ సుతుడు తట్టలేదు,.. చాలా,చాలా కృతజ్ఞతలు..

    రిప్లయితొలగించండి
  13. పండితనేమానిగారికివందనములు
    కపివర అనుటకు బదులు కపికుల
    అని మార్చినచో సరిపోవును అని
    భావించుచున్నాను .

    రిప్లయితొలగించండి
  14. పుడిసిలి పట్టెనగస్త్యుడు
    కడగుచు సంద్రమును నాడు, కపికుల శ్రేష్ఠుం
    డడరెను సూర్యుని మ్రింగగ,
    పిడికిట బంధించె నేడు పీథుని వంశీ

    రిప్లయితొలగించండి
  15. పిడికెడు హృదయము నందున
    కడివెడు సంద్రంబు లుండు కాదన గలరే ?
    పిడికిలి బంధము బానుడు
    నెడ తెగక భువిని ద్రిప్పు నెంతటి ఘనుడౌ !

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    ముందుగా శ్రీ పరుచూరి వంశీ గారికి ధన్యవాదములు.
    =======*======
    అడిగిన వరముల నిచ్చు నాదిత్యుడు కడలి దరిని
    పిడికిట సూర్యుడయ్యెనుగ "పింగళుని " సుతున కిపుడు
    తడబాటు జూపని గవులు తగు రీతిని గొలిచె నేడు
    విడువక బ్లాగు ననిశము వీక్షించునుల్లాసమునను

    ( "పింగళుని " సుతుడు=పరుచూరి వంశీ )

    రిప్లయితొలగించండి
  17. పద్యములన్నియును అలరారుచున్నవి. అందరికీ శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి