10, ఆగస్టు 2013, శనివారం

పద్య రచన – 429 (కోయదొర)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. ఓ బాబు! చూడుమా ఒప్పుగా నీ మందు
  ....మీ కోసమే చాల మేలుచేయు
  ఓ యమ్మ! చూడుమా ఒక చుక్క నీ నూనె
  ....అన్ని నొప్పులకిదే ఔషధమ్ము
  ఈ మూలికను చూడుడిదె యపరాజిత
  ....తేజంబునే ప్రసాదించు మీకు
  ఈ చూర్ణమును చూడుడిదె సర్వ రోగాల
  ....నాశనమ్మొనరించు నమ్మకముగ
  భద్ర గిరినుండి వచ్చితి వనములందు
  గలుగు మూలికలివి యెల్ల కలుగజేయు
  బలము నుత్సాహములనంచు పలుకుచుండు
  కోయదొర మందు వేగ గైకొనుడు ముందు

  రిప్లయితొలగించండి
 2. ఏలికల కునైన నీయగ
  మూలికలను గలిపి మందు ముచ్చట దీర్చన్
  రాలిన వయసుకు పదవికి
  పోలిక లేనంత ముదము పొందగ దివిజుల్ !

  రిప్లయితొలగించండి
 3. పొందిక కోయడు మూలిక
  మందుల నమ్మిన నరులకు మాటల తోడన్
  మందులనమ్మును వాటిని
  పొందిక వాడగను వ్యాధి పోతుందనుగా !

  రిప్లయితొలగించండి
 4. దేనికైనమందు దెయ్యమైనవదలు
  దైవమాన యనుచు ధైర్యమిచ్చు
  పొట్ట కోసమెకద పోరాడునందరు
  కోయదొరల మాయ కొత్తగాదె

  రిప్లయితొలగించండి
 5. సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు, శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములు.
  ======*======
  కోయ దొరలు దెచ్చె జూడు గొప్ప గొప్ప మూలికల్
  గాయములను మాన్పు దివ్య కరకకాయమూలికల్
  మాయ మైన కేశములను మరలదెచ్చు మూలికల్
  రాయినైన పగుల గొట్టు రావి చెట్టు మూలికల్
  హాయి నిచ్చు రోగులకును నమ్మ వంటి మూలికల్.

  రిప్లయితొలగించండి
 6. వేరు మందులు ముందర వేసి కొనుచు
  సెల్లు ఫోనును జూచుచు శీ ఘ్రముగను
  కూరు చుండెను హాయిగ కోయ దొరయ
  చూడు డార్యులు మఱి మీ రు చోద్య మిదియ

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి కోయ దొర గురించి మిత్రుల పద్యములను చూద్దాము:
  ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీమతి రాజేశ్వరి గారు: మంచి పద్యము వ్రాసేరు - మూలికల మందుతో దివిజులు కూడా ముదము నొందెద రని సెలవిచ్చేరు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: చాల బాగుగ నున్నది పద్యము. పద్యము చివరలో వ్యాధి పోతుందనుగా అన్నారు -- పోవునుగాదే? అన వచ్చునేమో.

  శ్రీమతి శైలజ గారు: అన్ని వ్యాధులు పోగొట్టగల మందని కోయవాళ్ళు నమ్మించి మాయలు చేస్తుంటారన్నారు. మంచి పద్యము.

  శ్రీ వర ప్రసాద్ గారు: ఉత్సాహము ఉరకలు వేస్తుంటె వ్రాసిన పద్యము ఇది. గొప్ప గొప్ప మాలికల గురించి పొగిడేరు. పద్యము చక్కగా నున్నది. 2వ పాదములో దివ్య కరక కాయ అన్నారు - సమాసము సరికాదు; మంచి కరక కాయ అంటే సరి.

  శ్రీ సుబ్బా రావు గారు: మూలికల నమ్ముకుంటూ, చోద్యముగా సెల్ ఫొను చూస్తున్న కోయ దొరను చక్కగా వర్ణించేరు. చాల బాగుగ నున్నది పద్యము.

  రిప్లయితొలగించండి
 8. పట్టణమందుఁ జేరి నిజవాసము వీడి నిశాచ వేళలన్
  పుట్టల గుట్టలన్ వెదకి మూలికవైద్యమటంచు జెప్పి మా
  కెట్టివి వ్యాధులైన శమియింపగజేయువిధంబు జూపు మీ
  కిట్టి దశల్ జెలంగె విధికేమని మ్రొక్కెద నిశ్చయింపుమా.

  రిప్లయితొలగించండి
 9. కుర్రో కుర్రో యనుచును
  తుర్రున యేతెంచు కోయదొర ఫాలమునన్
  ఎఱ్ఱని తిలకము, భుజమున
  కఱ్ఱను మూలికల సంచి కరమున ఫోనున్

  తలచుట్టున నెమిలీక వి
  రులు, పులిగోరుల పతకము, రుద్రాక్షలు, పూ
  సల పేరులు మెడ దాల్చుచు
  గలగలమని తెల్పుచుండు గతమాగమమున్

  ముందుగ చేతిని జూచుచు
  కొందలపడు గతిని తెల్పి కోరును ధనముల్
  తొందరజేయును యిమ్మని
  సందడిగా దీవెనలిడు జై జై యనుచున్

  కరమున సెల్ఫోనులలో
  కరముగ నయభాషణములు గావించును, దు
  ష్కరమగు దరిసెన భాగ్యము
  వరముగ పొందంగ నేర్చు ప్రముఖుల తోడన్

  రిప్లయితొలగించండి
 10. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. నిశాచ వేళన్ కి బదులుగా నిశీధ వేళన్ అందాము. అభినందనలు.

  శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
  కమ్మని కంద పద్యములు 4 వ్రాసేరు. అభినందనలు. కొన్ని సూచనలు:
  1వ పద్యము: 2వ పాదము: తుర్రున నేతెంచు అందాము.
  3వ పద్యము: 3వ పాదము: తొందర జేయు నొసగమని అందాము.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి